mallika sherawat
-
'ది రోషన్స్' సిరీస్ పార్టీ వేడుకలో బాలీవుడ్ తారలు సందడి (ఫొటోలు)
-
ప్రియుడితో బ్రేకప్ నిజమే.. సింగిల్‌గా ఉన్నా: బాలీవుడ్ బ్యూటీ
ఈ రోజుల్లో మనకు సరైన వ్యక్తిని కనుగొనడం కష్టమే అంటోంది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. ప్రియుడు క్రిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రిలేషన్షిప్స్ గురించి మాట్లాడింది. మనకు సరిగ్గా సెట్టవుతాడు అనిపించే వ్యక్తిని కనుగొనడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. నేను నిజం చెప్తున్నా.. ఇప్పుడు నేను సింగిల్‌గా ఉన్నాను.అతడి(క్రిల్)తో బ్రేకప్ అయింది. దాని గురించి అస్సలు మాట్లాడాలనుకోవడం లేదు అంది. పెళ్లి గురించి అడగ్గా.. దానిపై నాకు ఆసక్తి లేదు, అలా అని వివాహానికి నేను వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది.కాగా మల్లికా షెరావత్.. క్వాశిష్, మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్స్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఎక్కువగా ఐటం సాంగ్స్‌తోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.చదవండి: సినిమాలు మానేద్దామనుకున్నా.. తనవల్లే..: ఆమిర్ ఖాన్ -
ఆడపిల్ల పుట్టిందని అమ్మ డిప్రెషన్లో.. ఏ పాపం చేశాం?
ఆడపిల్ల ఇంటికి భారం అనుకునే తల్లిదండ్రులు ఎంతోమంది. ఆ జాబితాలో తన పేరెంట్స్ కూడా ఉన్నారంటోంది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. తన సోదరుడికి ప్రేమను పంచి తనపై మాత్రం వివక్ష చూపించారని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా పేరెంట్స్ ఎప్పుడూ నా సోదరుడిని ముద్దు చేసేవారు, అతి గారాబం చేసేవారు. నాపై మాత్రం వివక్ష చూపించేవారు. కొడుకుపై పెట్టుబడివాళ్లు ఎందుకలా చేస్తున్నారో అసలు అర్థమయ్యేది కాదు. కొడుకును బాగా చదివించాలి, విదేశాలకు పంపాలి, అతడికోసం ఎంతైనా ఖర్చు చేయాలి.. ఇలా ఉండేవి వాళ్ల ఆలోచనలు, మాటలు. కుటుంబ ఆస్తి మొత్తం కుమారుడికి, వాడికి పుట్టే కొడుక్కి వెళ్తుంది.. మరి అమ్మాయిలేం పాపం చేశారు? ఓహ్.. వాళ్లకు పెళ్లి చేయాలి, భారం తగ్గించేసుకోవాలి.. అంతేనా?గేమ్స్ ఆడినా తప్పే..పేరెంట్స్ ప్రవర్తన, మాటలు నన్నెంతో బాధించేవి. కానీ ఇలాంటి పరిస్థితి నా ఒక్కదానికే రాలేదని, గ్రామంలోని ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల పరిస్థితి కూడా ఇంతేనని తర్వాత తెలుసుకున్నాను. నా పేరెంట్స్ నాకు అన్నీ ఇచ్చారు.. ఒక్క స్వాతంత్య్రం తప్ప! వాళ్లకు తెలీకుండా స్పోర్ట్స్ ఆడేదాన్ని. ఎందుకంటే నీకు కండలు వస్తున్నాయి.. ఇలా మగాడిలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అని అరిచేవారు.అమ్మ డిప్రెషన్లో..అలా ఎన్నో నిబంధనలు పెట్టారు. నేను పుట్టినప్పుడు నా కుటుంబం అంతా విచారం వ్యక్తం చేసింది. మా అమ్మ అయితే కచ్చితంగా డిప్రెషన్లోకి వెళ్లి ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా మల్లికా షెరావత్.. క్వాశిష్, మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి పలు చిత్రాల్లో నటించింది. ఐటం సాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్ అయింది.చదవండి: రాజకీయాల్లోకి నటుడు 'సాయాజీ షిండే' ఎంట్రీ -
నటి మల్లికా శెరావత్ ప్రధాన పాత్రలో పాంబాట్టం
బాలీవుడ్ భామ మల్లిక శెరావత్ ప్రధాన పాత్రలో నటింన చిత్రం పాంబాట్టం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా రపొందుతున్న ఈ చిత్రాన్ని వైద్యనాథన్ ఫిలిం గార్డెన్ పతాకంపై వంశీ పళనివేల్ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఓర్పుతో, వాద్ధియార్, 6.2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా వీసీ వడివుడయాన్ కథా, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు జీవన్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. నటి రితికాసేన్, యాషీక ఆనంద్, సాయి ప్రియ, సుమన్, క్రికెట్ క్రీడాకారుడు సలీల్ అంగోలా, శరవణన్, రమేష్ ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇనియన్ జే.హరీష్ చాయగ్రహణంను, అమ్రీష్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ నిర్వహించారు. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శక, నటుడు ఏ.వెంకటేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. చిత్ర దర్శకుడు వడివుడయాన్ మాట్లాడుతూ ఇది క్రీస్తు పూర్వం 1000, 1500, 1980 కాలం ఘట్టాల్లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. 126 అడుగుల పొడవైన పాము చేసే అట్టహాసం ఇంతవరకు ఏ చిత్రంలోనూ చూసి ఉండరన్నారు. సరికొత్త కాన్సెప్ట్, అద్భుతమైన గ్రాఫిక్స్, సాంకేతిక పరిజ్ఞానం హైలైట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రం కోసం ఎలాంటి రాజీ పడలేదని చెప్పారు. పాంబాట్టం చిత్రానికి అమ్రిష్ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, హాలీవుడ్ చిత్రాల తరహాలో రూపొందిన చిత్రమని దర్శకుడు తెలిపారు. -
నన్ను మానసికంగా టార్చర్ చేశారు: హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ మల్లికా శెరావత్ నటించిన తాజా చిత్రం ఆర్కే. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం నాడు ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మల్లిక ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'దీపికా పదుకొణె గెహ్రియాన్‌లో ఏం చేసిందో 15 ఏళ్ల క్రితం మర్డర్‌లో నేనూ అదే చేశాను. కానీ అప్పుడు జనాల ఆలోచనా స్వభావం ఎంతో సంకుచితంగా ఉండేది. ముద్దు పెట్టడాన్ని, బికినీ వేసుకోవడాన్ని చాలా తప్పుపట్టారు. ఇండస్ట్రీలోని కొంతమంది వ్యక్తులు నన్ను మానసికంగా వేధించారు. కేవలం గ్లామర్ ఒలకబోయడం తప్ప నటన రాదని తిట్టిపోశారు. దశావతారం, ప్యార్‌కి సైడ్ ఎఫెక్ట్స్, వెల్కమ్ వంటి సినిమాలు చేసినా కూడా ఎవరూ నా నటనను పట్టించుకోలేదు' అని మల్లికా శెరావత్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు బీటౌన్‌లో వైరల్‌గా మారాయి. కాగా ఆర్కే సినిమాలో మల్లికా శెరావత్‌తో పాటు కుబ్ర సైత్, రణ్వీర్ షోరే, మను రిషి చద్ద, చంద్రచూర్ రాయ్, అభిజీత్ దేశ్‌పాండే, అభిషేక్ శర్మ, గ్రేస్ గిరిధర్, వైశాలి మల్హారా తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 22న విడుదల కానుంది. చదవండి: దాని కోసం నేను ప్రెగ్నెంట్ అని చెప్పాల్సి వచ్చింది నెలకు రూ. 25 లక్షలు ఇస్తాను, భార్యగా ఉండమన్నాడు -
నెపోటిజంపై బోల్డ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
Mallika Sherawat On Bollywood Nepotism: దివంగత నటుడు సుశాంత్ సింగ్ మృతి అనంతరం బాలీవుడ్ నెపోటిజంపై జరిగిన రచ్చ అంతఇంత కాదు. దీనిపై బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నిర్మాత కరణ్ జోహర్‌తో పాటు పలువురు బాలీవుడ్ పెద్దలపై, నటీనటులపై విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో దర్శకడు మహేశ్ భట్ కూతురు పూజా భట్, కంగనాకు మధ్య మాటల యుద్ధమే జరిగింది. అనంతరం క్రమంగా ఈ వివాదం కాస్తా సద్దుమనుగుతూ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా బోల్డ్ బ్యూటీ, నటి మల్లిక షెరావత్ వ్యాఖ్యలతో నెపోటిజం(బంధుప్రీతి) మరోసారి తెరపైకి వచ్చింది. ఇటీవల బాలీవుడ్ లైఫ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెపోటిజంపై మల్లిక ఆసక్తికర సంచలన వ్యాఖ్యలు చేసింది. చదవండి: చివరి రోజుల్లో సిద్ధార్థ్‌తో లేనందుకు బాధగా ఉంది: నటి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హీరోల గర్ల్‌ఫ్రెండ్స్, చెల్లెల్లు, బంధువుల కారణంగా చివరి క్షణాల్లో నన్ను సినిమాల నుంచి తప్పించారని వాపోయింది. ‘నెపోటిజం కారణంగా నాకు వచ్చిన ఎన్నో సినిమా అవకాశాలు చేజారిపోయాయి. కొన్నిసార్లు నా స్థానంలో హీరోల గర్ల్‌ఫ్రెండ్, మరికొందరి ప్రియురాళ్లు, నటుల చెల్లెల్లు, బంధువులను తీసుకున్నారు. ఇది పరిశ్రమలో సాంప్రదాయంగా కొనసాగుతుంది. పరిశ్రమలో ఎన్నటికీ ఇది మారదు. అందుకే ఇవేవి నన్ను బాధించలేదు. అసలు వీటిని నేను అంతగా పట్టించుకొనేదాన్ని కూడా కాదు. నా స్వయం శక్తిని నమ్ముకున్నాను. నా పని ఏంటి, ఆ రోజు నా షూటింగ్ ఏంటీ దానిపైనే శ్రద్ధ పెట్టాను’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. చదవండి: షెర్లిన్ వల్లే రాజ్‌కుంద్రాకు ఈ గతి పట్టింది: నటి సంచలన వ్యాఖ్యలు అలాగే బోల్డ్ సీన్స్‌లో నటించడం వల్ల తను ఎదుర్కొన్న ట్రోల్స్‌పై స్పందించింది. ‘ప్రారంభంలో ట్రోలర్స్ నన్ను టార్గెట్ చేసేవారు. కానీ అదే బోల్డ్ సన్నివేశాల్లో నటించిన పరుషులు మాత్రం బాగానే ఉండేవారు. వారికి అందరిలాగే సమాజంలో గౌరవం ఉండేది. వారి మీద ఎలాంటి కామెంట్స్ చేసేవారు కాదు. కానీ మహిళలను మాత్రం విపరీతంగా ట్రోల్ చేసేవారు. అదే నాకు చాలా ఆశ్చర్యం వేసేది. సమాజం ఎందుకు ఇలా ఆలోచిస్తుంది. ఈ సమస్య కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచ దేశాలలోనూ ఉంది. ఎక్కడ చూసిన మహిళలనే టార్గెట్ చేస్తారు. కానీ ఇది ఇండియాలో కాస్తా ఎక్కువగా ఉంది. కొన్ని మీడియా చానల్స్ అయితే నటీమణులు బోల్డ్ సీన్స్ చేస్తే అది పెద్ద నేరంగా చూసేవి. అసలు సపోర్ట్ ఇచ్చేవి కాదు. కానీ ఇప్పుడు కాస్తా మారియి. ఇలాంటి విషయాల్లో మహిళలకే మద్దుతుగా నిలుస్తున్నాయి. బోల్డ్ సీన్స్‌ను అంగీకరిస్తున్నారు. ఎలాంటి అశ్లీల పాత్రలు చేసిన దానిని నటనగానే చూస్తున్నాయి’ అని ఆమె పేర్కొంది. -
హీరోల కోరికలు తీర్చలేదని, సినిమా చాన్స్ ఇవ్వలేదు: బోల్డ్ బ్యూటీ
Mallika Sherawat: హాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ పలువురు తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్ బ్యూటీ మల్లిక షెరావత్. ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’(2004) సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే తెరవెనుక హీరోలతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల చాలా సినిమాలకు దూరమయ్యానని, తన టాలెంట్ తగిన అవకాశం ఇండస్ట్రీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక. కోరికలు తీర్చలేదని కొందరు హీరోలు తనకు అవకాశాలు రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అప్పట్లో నటిగా నిలదొక్కుకోవాలంటే.. హీరోలతో గడపడం తప్పనిసరి అన్నట్లుగా ఉండేదని చెప్పింది. ‘కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించి, ముద్దులు ఇచ్చే నువ్వు.. నిజ జీవితంలో ఎందుకు కుదరని చెబుతున్నావ్’ అని చాలా మంది అడిగేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఇప్పటికి అక్కడక్కడ మహిళా నటులు వేధింపులకు గురవుతూనే ఉన్నారని మల్లిక పేర్కొంది. -
అమెరికాలో సందడి చేస్తున్న నటి మల్లిక శరావత్, వీడియో వైరల్
లాక్డౌన్లో సెలబ్రీటీలంతా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. ఎప్పుడు సినిమాలు, షూటింగ్‌లంటూ బిజీగా ఉండే తారలంతా వ్యాయమాలు, ఇంటి పనుల్లో బిజీగా ఉంటున్న వీడియోలు, ఫొటోలను పంచుకుంటున్నారు. ఇక బాలీవుడ్ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంతమంది ఇంట్లోనే ఉండగా.. మరికొందరూ లాక్డౌన్ ప్రకటించడానికి ముందే తమకు నచ్చిన ప్రదేశాల్లో వాలిపోయారు. ఇదిలా ఉండగా కొంతకాలంగా అమెరికాలోనే ఉంటున్న బాలీవుడ్ నటి మల్లిక శరావత్ లాస్ ఏంజెల్స్‌లోని తన లావిష్ విల్లాలో సందడి చేస్తున్న వీడియోను తాజాగా అభిమానులతో పంచుకుంది. తన పెంపుడు కుక్కతో ఆడుకుంటూ స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఎంజాయ్ చేస్తున్న వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇందులో మల్లిక మల్టీకలర్ మ్యాక్స్ టాప్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. చివరిగా 2019లో వచ్చిన బూ సబ్కీ ఫటేగీ వెబ్‌సిరీస్‌లో కనిపించిన మల్లిక ఆ తర్వాత ఏ ప్రాజెక్ట్‌కు సంతకం చేయలేదు. అలా మూడు సంవత్సరాలుగా వెండితెరకు దూరంగా ఉన్న మల్లికను ఇలా చూసి ఆమె అభిమానులు మురిసిపోతున్నారు. లాక్డౌన్, కరోనా కాలంలో ఆమె ఎలా ఉన్నారంటూ అభిమానులు కామెంట్స్ పెడుతూ ఆమె యోగక్షేమాలపై ఆరా తీస్తున్నారు. View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) -
ఆ సీన్లు చేసేటప్పుడు నైతికంగా చచ్చిపోయా: నటి
ముంబై: బాలీవుడ్ సినిమా ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’ సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందారు. ఈ రెండు చిత్రాల్లోనూ మితిమీరిన గ్లామరస్ షో చేశారనే విమర్శలు మూటగట్టుకున్నారు. కెరీర్ ఆరంభంలోనే ఇంతకు దిగజారావా అనే కామెంట్లు కూడా ఆమె చెవిన పడ్డాయి. ఈ విషయాల గురించి తాజాగా బాంబే టైమ్స్‌తో మాట్లాడిన మల్లికా శెరావత్ తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. ‘‘మర్డర్ సినిమాలో బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు నైతికంగా నేను చచ్చిపోయినట్లు అనిపించింది. దిగజారుడు మనస్తత్వం గల మహిళగా చిత్రీకరించే సన్నివేశాల్లో హత్యకు గురైనట్లుగా భావించాను. అందుకు తగ్గట్లే విమర్శలు కూడా. అయితే, నేను అప్పట్లో చేసిన ఈ సీన్లు ఇప్పుడు సినిమాల్లో సర్వసాధారణమైపోయాయి. ప్రేక్షకులు సినిమాను చూసే విధానం మారింది. చాలా మార్పులు వచ్చాయి. కానీ, నాకు మాత్రం 50, 60వ దశకాల నాటి సినిమాలే ఇష్టం. వాటిని ఎవరూ బీట్ చేయలేరు. అప్పట్లో స్త్రీల కోసం అద్భుతమైన పాత్రలు సృష్టించేవారు. అయితే, రానురాను ఆ సున్నితత్వం, అందులోని అందం మసకబారిపోయింది. ఒక్క మంచి పాత్ర కోసం ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది’’ అని మల్లిక తన మనసులోని భావాలు వెల్లడించారు. నాకు బాయ్‌ఫ్రెండ్ లేడు ఇక తన సినిమాల విడుదలలో జాప్యం జరగడం గురించి చెబుతూ..‘‘సినిమాలతో పాటు వెబ్ షోస్ కూడా చేస్తున్నా. ట్రావెలింగ్‌ను ఆస్వాదిస్తున్నా. నిజానికి.. ఇలాంటి పాత్రలు కావాలి, ఇదే చేయాలి, ఇప్పుడు విడుదల కావాలి అని అడిగేందుకు, నాకు మద్దతుగా నిలిచేందుకు బాయ్‌ఫ్రెండ్ లేడు. నా బతుకు నేను బతుకుతున్నా. ప్రశాంతంగా ఉన్నా. సమయం వచ్చినపుడు అన్నీ అవే జరుగుతాయి. సినిమాల్లో భాగం కావడం అదృష్టంగా భావిస్తాను’’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కాగా మల్లికా శెరావత్ తాజాగా నటించిన ఆర్కే/ఆర్కేఏఓ చిత్రం అమెరికా, కెనడా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. రజత్ కపూర్ దర్శకత్వం వహించారు. రజత్, మల్లికతో పాటు రణ్వీర్ షోరే, కుబ్రా సైత్, మను రిషి చద్దా తదితరులు కీలక పాత్రలు పోషించారు. చదవండి: ప్రేమను పంచుతానంటోన్న నిధి అగర్వాల్ -
తిట్టిన మల్లికా... సారీ చెప్పిన షాలిని పాండే
♦ ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన పూజా హెగ్డే ♦ సారీ.. నా దృష్టిని ఏదో దారి మళ్లిస్తోందంటున్న షాలిని పాండే ♦ చీరకట్టులో బుట్టబొమ్మలా రెడీ అయిన అరియానా గ్లోరీ ♦ వెళ్లిపోవే అంటూ కోవిడ్‌ను తిట్టిపోస్తున్న మల్లికా శెరావత్ ♦ ఇంటి భోజనం అని లొట్టలు వేస్తున్న శ్రద్దా కపూర్ ♦ ఏదో ఆలోచిస్తున్న లావణ్య త్రిపాఠి View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Shalini (@shalzp) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Lavanya T (@itsmelavanya) View this post on Instagram A post shared by Mallika Sherawat (@mallikasherawat) View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Sakshi Agarwal|Actress (@iamsakshiagarwal) View this post on Instagram A post shared by Swathi deekshith✨ (@swathideekshith) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Geetha Madhuri (@singergeethamadhuri) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Aarti Singh (@aartisinghhhh) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) -
మల్లికకు కమలాహ్యారిస్ ఎలా తెలుసు?
ముంబై: భారత సంతతి మహిళ కమలా హ్యారిస్.. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కమలా హ్యారిస్‌తో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌తో కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మల్లికకు కమలాహ్యారిస్ ఎలా తెలుసు? వీళ్లు బంధువులవుతారా? ఇది ఫేక్ ఫోటోనా లేక రియల్ ఫోటోనా అంటూ రకరకాల ప్రశ్నలతో గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. అయితే ఈ ఫోటో పదకొండేళ్ల క్రితం నాటిది. 2011లో విలియం డియర్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ చిత్రం 'పాలిటిక్స్ ఆఫ్ లవ్'. ఈ సినిమాలో డెమెక్రటిక్ పార్టీ తరపున శాన్ ఫ్రాన్సిస్క్ అటార్నీ జనరల్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించిన కమలా పాత్రలో మల్లికా నటించారు. (చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్) అలా సినిమా ప్రారంభానికి ముందే 2009లో శాన్ ఫ్రాన్సిస్క్లో జరిగిన ఓ పార్టీలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు తీసిందే లేటెస్ట్గా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పాత్ర కోసం మరింత లోతుగా పరిశోధన చేయడానికి మల్లికా అమెరికా పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మల్లికా ట్వీట్ చేస్తూ.. భవిష్యత్‌లో యూఎస్ ప్రెసిడెంట్ అవుతారని భావిస్తున్న కమలా హ్యారిస్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తనకు ప్రేరణ అంటూ హ్యారిస్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేశారు. ఇక ఖాలీహిష్, మర్డర్, ప్యార్ కే సైడ్ ఎఫెక్ట్స్ , వెల్కమ్ వంటి చిత్రాలతో మల్లికా షెరావత్ మంచి గుర్తింపు పొందారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్న సమయంలో కమలా హ్యారిస్.. బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్రటిక్ పార్టీలో చేరి కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో అమెరికా ఉపాధ్యక్షురాలిగా గెలుపొంది 2021 జనవరి 20న జో బైడెన్‌తో కలిసి పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. (నువ్వు కూడా ప్రెసిడెంట్ కావొచ్చు: కమల) Having fun at a fancy event with a woman who they say could be US President, Kamala Harris. Chicks rule! — Mallika Sherawat (@mallikasherawat) June 23, 2009 -
అయితే, నా సినిమాలు చూడకు: మల్లికా
సినిమాల ప్రభావం సమాజంపై గట్టిగానే ఉన్న విషయం తెలిసిందే. హీరో హెయిర్ కట్, హీరోయిన్ వేషధారణ, వాళ్ల మధ్య లవ్‌ట్రాక్.. ఇలా ఎన్నింటినో యువత అనుసరిస్తూ ఉంటారు. అక్కడితో ఆగకుండా హీరో చేసే స్టంట్లు ప్రయత్నించి బొక్కబోర్లా పడ్డవారూ ఉన్నారు. నేరాలు- మోసాలు చేస్తూ తప్పుదోవ సైతం పడుతున్నారు. అలా అని ప్రతిదానికి సినిమాను నిందించలేం. దాన్ని వినోదం కోసం చూడాలే తప్ప అందులో ప్రతిదాన్ని ఆచరించాలనుకోకూడదు. కాగా ఈ మధ్యే జరిగిన హథ్రాస్ దుర్ఘటన పట్ల బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. 'మహిళల పట్ల ధోరణి మారేందుకు దేశంలో సంస్కరణ తీసుకువచ్చేవరకు ఇలాంటి ఘటనలు ఆగవు' అని అభిప్రాయపడ్డారు. (చదవండి: అదో బోగస్ ప్రచారం.. సిగ్గుతో ఉరేసుకోండి!) ఈ ట్వీట్‌పై స్పందించిన ఓ నెటిజన్.. "మీరు చెప్పే మాటలు, బాలీవుడ్లో మీరు చేసే పాత్రలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. ఇలాంటి సందేశాలను ప్రధానంగా సినిమాల ద్వారా కూడా పంపించవచ్చని తెలియదా? నీతి వాక్యాలు వల్లించేముందు వాటిని మీరు అనుసరించి, ఆ తర్వాత మిగతావాళ్లకు చెప్పండి" అని కామెంట్ చేశాడు. దీనిపై కాస్త కటువుగానే స్పందించిన మల్లికా.. "అంటే, నేను నటించిన సినిమాలు అత్యాచారాలను ప్రేరేపిస్తున్నాయా? మీలాంటి వాళ్లే మహిళలను కించపరుస్తూ బాధపెట్టేది. నా సినిమాలు వల్ల నీకు అంత ఇబ్బంది అనిపిస్తే చూడటం మానేయండి" అని నోరు మూయించారు. (చదవండి: రోజూ వార్తల్లో ఉండకపోతే కంగనాకు భయం ) -
రాణి మల్లికా
హాట్ గర్ల్ ఇమేజ్ సొంతం చేసుకున్న మల్లికా శెరావత్ ఇప్పుడేం చేస్తున్నారు? అంటే కెరీర్‌పరంగా జోరు తగ్గిందనే చెప్పాలి. ప్రస్తుతం ‘భూ సబ్కీ ఫతేగీ’ అనే వెబ్ సిరీస్ మాత్రమే చేస్తున్నారామె. ఇప్పుడు ఆమెకు ఓ బంపర్ ఆఫర్ వచ్చింది. తమిళ చిత్రం ‘పాంబాట్టన్’లో రాణి పాత్ర చేసే అవకాశం దక్కింది. చిత్రదర్శకుడు వడివుడయాన్ ఇటీవల ముంబై వెళ్లి మల్లికాకు కథ కూడా వినిపించారు. ‘‘కథ విన్న వెంటనే ఆమె నటించడానికి ఒప్పుకున్నారు. ఇందులో రాణి పాత్ర కీలకం. సినిమా మొత్తం ఈ పాత్ర ఉంటుంది’’ అని దర్శకుడు పేర్కొన్నారు. గతంలో తమిళంలో కమల్‌హాసన్ నటించిన ‘దశావతారం’ (2008)లో మల్లికా ఓ కీలక పాత్ర చేశారు. ఆ తర్వాత ‘దబాంగ్’ రీమేక్ ‘ఓస్తీ’ (2011)లో ఐటమ్ సాంగ్ చేశారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ తమిళంలో ఆమె నటించబోతున్న చిత్రం ఇదే. ఈ సినిమాలో ఆమె ఫైట్స్ కూడా చేస్తారు. అందుకోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఈ నెలాఖరున మల్లికా పాత్ర చిత్రీకరణ మొదలవుతుంది. విశేషం ఏంటంటే.. ఈ చిత్రం తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది. -
బిల్‌గేట్స్‌తో ఆ విషయం చర్చించిన మల్లికా శెరావత్
బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. మర్డర్ సినిమా ద్వారా బాలీవుడ్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా.. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ని కలిసి మహిళా సాధికారత గురించి చర్చించిందట. వాషింగ్టన్లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు కలవడం ప్రాధాన్యతని సంతరించుకుంది. ఈ విషయం గురించి మల్లికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. ఆయనతో మహిళా సాధికారత గురించి మాట్లాడడం సంతోషంగా అనిపించిందని మల్లికా తన పోస్ట్‌లో పేర్కొంది. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజన్-13లోను మల్లికా శెరావత్ సందడి చేసిన సంగతి తెలిసిందే. (మల్లికా శెరావత్‌కు వింత అనుభవం) View this post on Instagram So enjoyed my conversation with Bill Gates abt female empowerment @thisisbillgates #inspired #billgates #womensrights #femaleempowerment A post shared by Mallika Sherawat (@mallikasherawat) on Jan 27, 2020 at 11:10pm PST -
మల్లికా శెరావత్‌కు వింత అనుభవం
ముంబై: తన ఉదరం(బెల్లీ)పై కోడిగుడ్డు ఫ్రై చేసేందుకు ఓ నిర్మాత ఉబలాటపడ్డాడని బాలీవుడ్ కథానాయిక మల్లికా శెరావత్ వెల్లడించారు. సినిమా పరిశ్రమలో తనకు ఎదురైన వింత అనుభవాలను కపిల్ శర్మ కామెడీ షోలో పంచుకున్నారు. ‘ఓ సినిమా కోసం పాట చిత్రీకరిస్తుండగా కొత్తగా ఏదైనా చేయాలని నిర్మాత భావించాడు. నన్ను చాలా హాట్‌గా చూపించాలని ఉబలాటపడ్డాడు. ఈ పాటలో నీ ఉదరంపై కోడిగుడ్డు ప్రై చేసినట్టు చూపిస్తానంటూ కొరియోగ్రాఫర్ ద్వారా అడిగించాడు. ఇది అక్షరాల నిజం. వాస్తవానికి నిర్మాతే నన్ను అడగాలనుకున్నాడ’ని మల్లికా శెరావత్ వెల్లడించారు. దీనికి మీరు ఒప్పుకున్నారా అని సహ వ్యాఖ్యాత అర్చనా పూరన్ సింగ్ అడగ్గా.. ఒప్పుకోలేదని మల్లిక జవాబిచ్చారు. తనకు ఎదురైన మరో వింత అనుభవం గురించి ఇటీవల మరో సందర్భంలో మల్లిక చెప్పారు. కొత్తదనం పేరుతో ఓ పాటలో తన నడుముపై వేడివేడి రోటీలు చేస్తున్నట్టు చూపిస్తానని ఒక దర్శకుడు అత్యుత్సాహం ప్రదర్శించాడట. చాలా మంది నటులు తమ ప్రియురాళ్లకు అవకాశం ఇచ్చి తనను పక్కన పెట్టడంతో 30 సినిమాల వరకు పోగొట్టుకున్నానని మల్లిక వాపోయారు. వాళ్లను ఇప్పుడు తలచుకుంటే బుద్ధిహీనుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. శృంగార తారగా తన మీద ముద్ర పడటంతో తమతో సన్నిహితంగా గడపాలని చాలా మంది నటులు అడిగారని తెలిపారు. తెరపై అలాంటి దృశ్యాల్లో కనిపించినప్పడు ఏకాంతంగా తమతో గడపటానికి అభ్యంతరం ఎందుకని ప్రశ్నించేవారని చెప్పారు. ఇలా చేయడం ఇష్టం లేక ఎన్నో సినిమాలు వదులుకున్నానని, మన దేశంలో నాలాంటి మహిళలను సమాజం ఏవిధంగా చూస్తుందనే దానికి ఈ ఘటనలు అద్దం పడతాయని అన్నారు. -
స్త్రీలోక సంచారం
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కె.చంద్రశేఖరరావు మహిళల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారని అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దనసరి అనసూయ (సీతక్క), తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద ఆరోపించారు. రాష్ట్రంలో స్త్రీ సంక్షేమ శాఖ క్రియాశీలకంగా లేకపోవడంతో యాదాద్రి వంటి చోట్ల వ్యభిచారం వర్ధిల్లుతోందని, ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు కేసీఆర్ తన మంత్రి వర్గంలోకి తక్షణం ఒక మహిళను తీసుకుని, ఆమెకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖను అప్పగించాలని వీరు డిమాండ్ చేశారు. ► బ్రెజిల్‌లోని రియోలో 2016లో జరిగిన ఒలింపిక్స్‌లో హిజాబ్ ధరించి పాల్గొన్న తొలి ముస్లిం–అమెరికన్ అథ్లెట్ ఇబ్తిహాజ్ ముహమ్మద్‌ను పోలిన కొత్త బార్బీ మార్కెట్లోకి వచ్చింది. ‘బాలికలు ఇప్పుడు హిజాబ్ ధరించిన బార్బీ బొమ్మతో ఆడుకోవచ్చు’ అని అంటూ, ఇది తన చిన్ననాటి కల అని 32 ఏళ్ల ఈ ఫెన్సింగ్ చాంపియన్ ట్వీట్ చేశారు. ►లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటూ, పదిలక్షల డాలర్ల పూచీకత్తుపై బెయిలు మీద తిరుగుతున్న హాలీవుడ్ దిగ్గజం హార్వీ వైన్‌స్టీన్ కేసు సెప్టెంబరు 10కి వాయిదా పడింది. వైన్‌స్టీన్ ఎవర్నీ బలవంత పెట్టలేదనీ, ఆయన తమపై అత్యాచారం జరిపారని ఆరోపిస్తున్న మహిళలు వైన్‌స్టీన్‌కు రాసిన ప్రేమలేఖల్ని బట్టి వారి మధ్య జరిగినది సమ్మతితో కూడిన కలయికే తప్ప లైంగిక దాడి కాదని వైన్‌స్టీన్ తరఫు న్యాయవాది.. ఆ ప్రేమలేఖల్ని కోర్టుకు సమర్పిస్తూ.. అతడిపై ఉన్న అన్ని కేసుల్ని కొట్టివేయాలని వాదించారు. ►అమెరికన్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ ధరించిన డెనిమ్ బూట్స్.. నలుగురి నోళ్లలో నానుతున్నాయి. ప్యాంట్, కాలి బూట్లు కలగలిసి ఉన్న ఈ డ్రెస్ ఆమె నడుముకింది నుంచి దిగి, మోకాళ్ల పైభాగం కనిపించేలా ఉండటంతో.. ‘జెన్నిఫర్ బాత్రూమ్కి వెళ్లి ప్యాంటు పైకి లాక్కోవడం మర్చిపోయి గానీ బయటికి రాలేదు కదా’ అనే నెగటివ్ కామెంట్లే ఈ డ్రెస్‌పై ఎక్కువగా వస్తున్నాయి. ► 2009 నుంచి 2016 వరకు 7 సీజన్లుగా, 156 ఎపిసోడ్లుగా సి.బి.ఎస్. (కొలంబియా బ్రాడ్‌కాస్టింగ్ సిస్టం) చానల్లో ప్రసారం అయి అత్యంత వీక్షకాదరణ పొందిన అమెరికన్ లీగల్, పొలిటికల్ డ్రామా ‘ది గుడ్ వైఫ్’ను బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ భారతదేశానికి తెచ్చేస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రను పోషించడంతో పాటు, నిర్మాణ భాగస్వామ్యానికి కూడా చొరవ చూపుతున్న శెరావత్ ప్రస్తుతం ఆ పనిలో భాగంగా ముంబైలోని న్యాయ నిపుణులను కలిసి భార్యాభర్తల న్యాయవివాదాలలోని మలుపుతీర్పులను (ల్యాండ్‌మార్క్ జడ్జిమెంట్స్) అధ్యయనం చేస్తున్నారు. ► స్టీవ్ జాబ్స్ కూతురు లిసా బ్రెనన్ కొత్త పుస్తకం ‘స్మాల్ ఫ్రై’ (అప్రాముఖ్యాలు) లో.. క్యాన్సర్‌తో చనిపోతున్న చివరి రోజులలో ఆమె తన తండ్రి పక్కన కూర్చున్నప్పుడు ‘నీ దగ్గర టాయ్‌లెట్ కంపు కొడుతోంది’ అని అన్నారని లిసా రాసిన జ్ఞాపకాలలోని కొంత భాగాన్ని ప్రచురణకర్తలు విడుదల చేశారు. ఆపిల్ కంపెనీని ప్రారంభించిన తొలి సంవత్సరాలలో న్యాయపరమైన వివాదాల కారణంగా లిసాను తన కూతురిగా అంగీకరించని స్టీవ్స్, ఆ తర్వాత ఆమె తన కూతురే అని ఒప్పుకున్నప్పటికీ చనిపోయేనాటి వరకు ఆమెను ద్వేషిస్తూనే ఉన్నారని, నిజానికి ఆయన ‘టాయ్‌లెట్ కంపు కొడుతోంది’ అన్న రోజు లీసా.. గులాబీల అత్తరును ఒంటి మీద స్ప్రే చేసుకుని ఉన్నారని ‘స్మాల్ ఫ్రై’లోంచి వెల్లడయిన ముఖ్యాంశాలను బట్టి తెలుస్తోంది. ► లైటెనింగ్ లేజర్ ట్రీట్మెంట్తో పెదవులు మెరిపించుకోవడం ఇప్పుడు నగరాల్లో ట్రెండ్‌గా మారింది. పుట్టుకతోనో, పొగతాగడం వల్లనో నల్లగా ఉన్న పెదవులపై నలుపు రంగును తగ్గించే ఈ ట్రీట్మెంట్ను ఎక్కువగా 25–35 మధ్య వయసున్న యువతులు చేయించుకుంటుండగా, దీని వల్ల ఆశించిన ఫలితం ఉన్నా లేకున్నా.. హాని మాత్రం లేకుండా ఉండదని గట్టిగా చెప్పలేమని వైద్య నిపుణులు అంటున్నారు. -
ఆ సమయంలో ఫోన్ చేసి రమ్మనేవారు: హీరోయిన్
సాక్షి, సినిమా: క్యాస్టింగ్ కౌచ్, చికాగో సెక్స్ రాకెట్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు స్పందించారు. అయితే తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా శెరావత్ షాకింగ్ నిజాలు బయలపెట్టారు. ఆమె కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. మల్లికా శెరావత్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెరవెనుక హీరోలతో చనువుగా ఉండనందుకే తనను కొన్ని సినిమాలను నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు. ‘తెరపై నటిస్తావు కదా.? మరి బయట చనువుగా ఉండటానికి ఇబ్బంది ఏంటి.?’ అని ప్రశ్నించేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్బాల్లో తనను అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఫోన్ చేసి వస్తావా అని అడిగేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. మర్డర్ సినిమాతో మల్లికా శెరావత్ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మొదటి సినిమాలోనే హాట్‌గా నటించడంతో తర్వాత తనకు అలాంటి పాత్రలే వచ్చాయన్నారు. అలాంటి పాత్రలకే సరిపోతానని తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకున్నారన్నారు. ఇండస్ట్రీలో తనకు ‘బోల్డ్ నటి’, ‘గ్లామరస్ నటి’, ముద్దు సీన్లలో నటిస్తుందనే పేరు రావడానికి దర్శకులు, సహ నటీనటులే కారణమనినామె తెలిపారు. తాను ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా ఒప్పుకుంటానని అందరూ అనుకునే వారంటూ పేర్కొన్నారు. పొట్టి దుస్తులు వేసుకున్నా.. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించినా.. సిగ్గు వదిలేసిన మహిళ అని తనపై చాలా నిందలు వేశారని తన బాధను వ్యక్తపరిచారు. -
సుష్మాజీ సాయం చేస్తారని నమ్ముతున్నా: నటి
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరుతున్నారు. తన స్నేహితురాలి వీసా విషయంలో చొరవ చూపాలంటూ నటి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె పలు ట్వీట్లు చేశారు. ఫ్రీ ఏ గర్ల్ అనే ఓ డచ్ ఎన్జీవో సంస్థకు సహ ఎవెలిన్ హెల్స్కెన్ వ్యవస్థాపకురాలు. తమ సంస్థ సేవలను భారత్‌లో కూడా అందించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెకు భారత వీసా దొరకలేదు. దీంతో ఆమె తరపున స్నేహితురాలు, నటి మల్లికా షరావత్ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మేడమ్ సుష్మా స్వరాజ్.. ఫ్రీ-ఏ-గర్ల్ సంస్థ గత కొన్నేళ్లుగా మహిళలు, చిన్నారుల కోసం విశేషంగా కృషి చేస్తోంది. భారత్‌లో కూడా వారి సేవలను కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురవుతోంది. దయచేసి సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ‘ఇలాంటి విషయాల్లో సుష్మాజీ ఎప్పుడూ సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో స్పందిస్తారని భావిస్తున్నా’ అని మల్లికా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ సంస్థ తరపున భారత్‌లో తన సేవలను అందించేందుకు సిద్ధమని మల్లికా వెల్లడించారు. Ma’am @SushmaSwaraj co-founder of Dutch NGO #FreeAGirl has been repeatedly denied visa to India, this NGO is doing superb work for trafficked children & women. Pls help! — Mallika Sherawat (@mallikasherawat) 12 February 2018 -
అద్దె ఇంటి నుంచి గెంటేశారా!
ముంబయి: బాలీవుడ్ నటి మల్లికా శెరావత్ను పారిస్‌లో అద్దె ఇల్లు కష్టాలు వీడటం లేదు. ఇంటి అద్దె ఎగ్గొట్టడంతో యజమాని ఆమెను, ఆమె ప్రియుడు సిరిల్ ఆక్సన్ఫాన్స్ను ఇంటినెంచి గెంటివేశారని గతేడాది మీడియాలో కథనాలు రాగా, హాట్ భామ మల్లికా ఘాటుగానే స్పందించారు. వివాదం సద్దుమణిగిందని ఆమె భావించింది. కానీ కొత్త సంత్సరంలో ఏకంగా కోర్టు నోటీసులు జారీ చేసిందని, రూ.64 లక్షల అద్దె చెల్లించకపోవడంతో యజమాని గెంటివేశాడంటూ మళ్లీ ఆమె గురించి ప్రచారం జరుగుతోంది. దీనిపై స్పందించిన మల్లికా తనను ఎవరూ ఇంటినుంచి గెంటివేయలేదని, అవమానించలేదని స్పష్టం చేశారు మల్లికా. మరికొందరు తనకు పారిస్‌లో ఇల్లు ఉందని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని చెప్పింది. తనకు ప్యారిస్‌లో అసలు ఇల్లే లేదని, అసలు అక్కడ ఎవరి ఇంట్లోనూ ఉండలేదని తెలిపింది. అక్కడ అద్దెకు ఉండకుండా అద్దె ఎగ్గొట్టడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. ‘సొంత ఇల్లు ఉందని ప్రచారం చేసేవాళ్లు.. నాకు పారిస్‌లో ఇల్లు ఏమైనా దానం చేయాలనుకుంటున్నారా.. నా పేరున ఇదివరకే ఇల్లు ఉండి ఉంటే ఇంటి అడ్రస్ ఇస్తే ప్రశాంతంగా అందులోనే ఉంటానని’ మల్లికా శెరావత్ స్పందించారు. గతంలో ఓసారి అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ కథనాలను నటి మల్లిక కొట్టిపారేసిన విషయం తెలిసిందే. -
మీడియా పుకార్లపై స్పందించిన మల్లికా
సాక్షి, ముంబై : మీడియాలో వస్తున్న పుకార్లపై ఎట్టకేలకు నటి మల్లికా షెరావత్ స్పందించారు. పారిస్.. ఇల్లు.. ఖాళీ చేయించటం వార్త నిజం కాదని ఆమె చెప్పారు. భారీగా బకాయిలు పడటంతో ఆమెను బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించినట్లు మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆమె తన ట్విట్టర్లో స్పందించారు. పారిస్‌లో ఇల్లు అంటూ వస్తున్న వార్త నిజం కాదు. నాకు అసలు ఇల్లు లేదు. అద్దెకూ ఉండటం లేదు. ఒకవేళ ఎవరైనా నాకు దానం చేయాలనుకుంటే వారి అడ్రస్ నాకు పంపండి అంటూ వ్యంగ్యంగా ఆమె ట్వీటారు. కాగా, పారిస్‌లోని విలాసవంతమైన ఈ అపార్ట్మెంట్లో బాయ్ ఫ్రెండ్ సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో ఆమె నివసించారు. గతంలో ఓసారి ఇదే అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కొందరు ఆగంతకులు దాడి చేయగా.. మీడియాలో ప్రముఖంగా వార్తలు కూడా వచ్చాయి. సుమారు 64 లక్షల దాకా బకాయిలు చెల్లించకపోవటంతో ఆమెను బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయించినట్లు బీబీసీ లాంటి ప్రముఖ మీడియా సంస్థల్లో కూడా కథనాలు ప్రసారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె అది నిజం కాదంటూ ఖండించటం కొసమెరుపు. Some in the media think I hv an apartment in Paris !! It’s absolutely Not True , if someone has donated one to me, pls send me the address :) https://t.co/ScDyL3Abt8 — Mallika Sherawat (@mallikasherawat) December 14, 2017 -
మల్లికా లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ట్వీట్
ముంబై: బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ఆసక్తికరమైన ట్వీట్ తో ఆకట్టుకుంటోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్‌గా, ఐటం గర్ల్‌గా పేరు గడించిన మల్లిక మేనత్త అయిందట. ఈ సందర్భంగా ముద్దులొలికే మేనల్లుడి ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసింది. తనకు అల్లుడు పుట్టినందుకు సంతోషంగా ఉందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది. దీంతో ప్రస్తుతం ఆ ఫొటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. తనకు అల్లుడు పుట్టినందుకు చెప్పలేనంత ఆనందంగా ఉందని..తానిపుడు మేనత్తను అని మల్లిక ట్వీట్ చేసింది. My nephew is born, I'm a bua now:):)🐥🐥🐥#happiness#bundleofjoy pic.twitter.com/ZgAJmFF0Zv — Mallika Sherawat (@mallikasherawat) February 3, 2017 -
ముగ్గురు దొంగలు... మల్లికా షెరావత్...
‘మన్మథుడు’ చూసిన వారందరికీ ఆ సీన్ గుర్తుండే ఉంటుంది. అందులో బ్రహ్మానందం ప్యారిస్‌లో ఉంటాడు. నాగార్జున, సోనాలీ బెంద్రే అక్కడకు వెళ్లినప్పుడు ‘ఇది ప్యారిస్... ఇండియాను టేప్రికార్డర్లో పెట్టి 50 సంవత్సరాలు ఫాస్ట్ ఫార్వర్డ్ నొక్కితే ఎలా ఉంటుందో ప్యారిస్ అలా ఉంటుంది’ అని గొప్పలు చెబుతుంటాడు. కాని ఆ ప్యారిస్‌లోనే కళ్లు మూసి తెరిచేంతలో అతని సూట్‌కేస్ కొట్టేస్తారు. జేబులో డబ్బులు లేక నాగార్జున, సోనాలీ అవస్థలు పడతారు. ప్యారిస్ గొప్పదనం అంతటితో మురుగు కాలవలో కలిసిపోతుంది. కాని నిజ జీవితంలో కూడా ప్యారిస్‌లో దొంగల బెడద ఎక్కువగానే ఉందని ఇటీవల మల్లికా షెరావత్ మీద జరిగిన దాడితో అర్థమవుతోంది. భారతీయ వెండితెర మీద సెక్స్‌బాంబ్‌గా ఒక వెలుగు వెలిగి ప్రస్తుతం సెలబ్రిటీ హోదాలో అమెరికా, ప్యారిస్, ఇండియాల మధ్య చక్కర్లు కొడుతున్న మల్లికా షెరావత్ మీద గత వారం దొంగల దాడి జరిగింది. ఆమె బాయ్‌ఫ్రెండ్, ప్యారిస్‌లో రియల్టర్‌గా పలుకుపడి ఉన్న సిరిల్ ఆక్సన్ ఫాన్స్‌తో ఆమె మొన్నటి గురువారం రాత్రి తొమ్మిదిన్నరకు ఫ్లాట్‌కు చేరుకుని లోపలికెళుతుండగా హఠాత్తుగా ఊడిపడిన ముగ్గురు దొంగలు ఒక్క మాటా మాట్లాడ కుండా మొదట టియర్ గ్యాస్ చల్లి, ఆ వెంటనే ముష్టిఘాతాలు కురిపించి మాయమయ్యారు. నిజానికి వాళ్లు ఏదో ఒకటి దోచుకుని వెళ్లి ఉండవచ్చు. అయితే అలాంటి పని జరగలేదు. దాడి జరిగిన తర్వాత ఈ విషయాన్ని సోషల్ మాధ్యమం ద్వారా వివరిస్తూ మల్లిక ‘ఆ ముగ్గురినీ ఎదిరించాను. నన్ను బెదరగొట్టడం వాళ్లకు సాధ్యం కాలేదు. నేను మీరు ఊహించి నంత సుకుమారిని కాను. గట్టి స్త్రీని’ అని కామెంట్ చేసింది. పోలీసులు ఈ కేసును విచారణ చేస్తుంటే ‘ఇదేమిటీ ఇలా అయింది’ అని ప్యారిస్‌లోనే బిక్కచచ్చి కూర్చోక తన కార్యక్రమాల్లో తానుంది మల్లిక. ప్రస్తుతం ఆమె స్విట్జర్లాండ్‌లో విహారాన్ని ఆస్వాదిస్తోంది. ‘భారతదేశంలో నాకు ఊపిరాడదు. అక్కడ స్త్రీలు అణిగిమణిగి ఉండాలి. వాళ్ల ప్రతి కదలికపై అదుపు ఉంటుంది’ అని విసుక్కునే మల్లిక ముంబైలో గడిపే రోజుల కంటే బయట దేశాల్లో గడిపే రోజులే ఎక్కువ. -
ప్రముఖ హీరోయిన్‌పై ముసుగు వ్యక్తుల దాడి
ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై పారిస్‌లో దాడి జరిగింది. ముఖానికి ముసుగు ధరించిన ముగ్గురు దుండగులు పారిస్‌లోని ఆమె అపార్ట్మెంట్ బ్లాక్‌లోకి చొరబడి.. దాడి చేశారు. మొదట టియర్‌గ్యాస్ విడుదల చేసి.. అనంతరం ఆమెపై ముగ్గురు దుండగులు పిడిగుద్దులు కురిపించారు. నెలరోజుల కిందట పారిస్‌లోనే హాలీవుడ్ స్టార్ కిమ్ కర్దాషియన్‌పై దోపిడీ దొంగలు దాడిచేసిన సంగతి తెలిసిందే. ఇదే రీతిలో ఆమెపై దాడి జరిగింది. గత శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో తన ప్రియుడు, ఫ్రెంచ్ వ్యాపారవేత్త సిరిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో కలిసి తన ఫ్లాట్‌లోకి వెళ్లిన తర్వాత ముగ్గురు దుండగులు చొరబడి ఈ దాడి చేశారు. ముగ్గురు దుండగులు ముఖానికి మాస్క్‌లు తొడిగారని, ఏమి మాట్లాడకుండా వస్తూనే టియర్‌గ్యాస్ విడుదల చేసి అనంతరం దాడి చేశారని లే పారిసీన్ దినపత్రిక తెలిపింది. ఈ ఘటనతో షాక్ తిన్న మల్లిక వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. పోలీసులు కేసు నమోదుచేసుకొని దుండగుల కోసం గాలిస్తున్నారు. -
సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు!
మల్లికా షెరావత్.. ఈ పేరు బాలీవుడ్ లో ఒకప్పటి సంచలనం. 'మర్డర్' సినిమాలో ఆమె సన్నివేశాలు చూసిన వారు ఇప్పటికీ ఆమె నుంచి మనసు మరల్చుకోలేరు. సెక్స్ బాంబ్ గా పేరున్న ఈ నటి ప్రస్తుతం ఫిట్ నెస్ పైనే ధ్యాస నిలిపింది. నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఉన్నా స్లిమ్ గా ఉండటం ఆమెకే చెల్లిందని బాలీవుడ్ జనాలు అప్పుడప్పుడు చెప్పుకునేవారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ అదే ఫిజిక్ ను ఆమె కొనసాగిస్తుంది. తాజాగా ఆమె జిమ్ లో కసరత్తులు చేయడం ఎందుకు మొదలుపెట్టిందంటూ అక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్లోనూ కామెంట్ చేస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది మల్లిక. తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది.. స్లిమ్ గా ఉండేందుకు ఎలాంటి కసరత్తులు చేస్తుందో తెలిపేందుకు ఫొటోలు, కొన్ని వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. యోగా చేయాలని, జిమ్ కు వెళ్లడం అలవరుచు కోవాలంటూ ఫ్యాన్స్ కు ఈ సెక్సీ స్టార్ సూచించింది. ఆరోగ్యంగా ఉండటం, బాడీని ఫిట్ గా ఉంచుకోవడం ట్రెండ్ కాదని ట్విట్ లో రాసుకొచ్చింది. ఇది మన జీవన విధానంలో భాగమని చెప్పింది. చివరగా గతేడాది విడుదలైన 'డర్టీ పాలిటిక్స్' లో తెరమీద కనిపించింది. శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ జిమ్ లో వర్కవుట్స్ చేయడంతో పాటు యోగా చేస్తానని చెప్పుకొచ్చింది. blockquote class="twitter-tweet" data-cards="hidden" data-lang="en"> Being healthy n fit isn't a trend , it's a lifestyle. #yoga#iyengaryoga#forwardbend #yogabymallika pic.twitter.com/ci7qpeA8Z3 — Mallika Sherawat (@mallikasherawat) March 9, 2016 -
జాట్లకు ట్విట్టర్లో మల్లిక సూచన
ముంబై: రిజర్వేషన్ల కోసం ఆందోళనలు చేస్తున్న జాట్లకు బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ ట్విట్టర్లో ఒక సూచన చేసింది. శాంతియుతంగా, అహింసాయుతంగా ముందుకుసాగాలని ఆమె జట్లకు విజ్ఞప్తి చేసింది. తమను ఓబీసీల్లో చేర్చి ప్రభుత్వ విద్య, ఉద్యోగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్ని రోజులుగా జాట్లు హింసాత్మక ఆందోళనలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. 'మర్డర్' సినిమాతో సంచలనం సృష్టించిన మల్లికా షెరావత్ది హరియాణా హిస్సార్ లోని ఓ మారుమూల కుగ్రామం. బాలీవుడ్ హీరోయిన్ అయిన మల్లిక చివరిసారిగా 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో కనిపించింది. జాట్ల ఆందోళనలతో హరియాణ అట్టుడుకుతున్న నేపథ్యంలో బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీలు వారికి విన్నపాలు చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా శాంతియుతంగా ముందుకుసాగాలని జాట్లకు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. -
విన్నారా..?ద్రౌపదిగా నటిస్తా!
ద్రౌపదిగా మల్లికా శెరావత్ నటిస్తే చూడాలని ఉందా...? ఎప్పుడు... ఏంటి అని మాత్రం అడగకండి. ఇది ఆమె మనసులోని కోరిక. గ్లామర్ పాత్రలతో కుర్రకారును అలరించిన మల్లిక ప్రస్తుతం బాలీవుడ్లో నడుస్తున్న ట్రెండ్ చూసి తాను అలాంటి చిత్రంలో నటించాలని ఫిక్స్ అయిపోయారు. ఏ పాత్రలో నటించాలని ఉంది అని అడిగితే ఆమె టక్కున ద్రౌపది పాత్రలో చేయాలనుందని సమాధానమిచ్చారు. దర్శక, నిర్మాతలు ఈ మాట విన్నారా? మల్లిక వెయిటింగ్ ఫలిస్తుందా? -
ద్రౌపదిగా చేయాలని.. మల్లిక తహతహ!
ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లంతా పౌరాణిక పాత్రలు, వాటిని పోలి ఉండే సామాజిక పాత్రలు పోషించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవలే అహల్య తరహా పాత్రను ఓ షార్ట్ ఫిలింలో పోషించింది. దానికి యూట్యూబ్‌లో దాదాపు 45 లక్షలకు పైగా హిట్లు వచ్చాయి. ఇప్పుడు తాను ద్రౌపది పాత్ర పోషిస్తానంటూ.. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ ముందుకొచ్చింది. ద్రౌపది చాలా శక్తిమంతమైన మహిళ అని.. అందుకే ఆ పాత్ర చేయాలని తనకు ఉందని మల్లిక ఓ కార్యక్రమంలో చెప్పింది. చివరిసారిగా ఆమె కేసీ బొకాడియా తీసిన 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో నటించింది. తనకు చాలా ఆఫర్లు వస్తున్నాయి గానీ, సరైన స్క్రిప్టు, సరైన సినిమాను ఎంచుకోవడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు చెప్పింది! -
‘ఆహా’లీవుడ్ తార
సొంత గడ్డ మీద విజయం సాధించడమే పెద్ద విషయం. మరి మనది కాని దేశానికి వెళ్లి అక్కడ మన జెండా పాతడం అంటే సామాన్యమైన విషయమా! కానే కాదు. కానీ ఈ బాలీవుడ్ బ్యూటీలు హాలీవుడ్‌కు దూసుకెళ్లి, అక్కడి చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకున్నారు. ఐశ్వర్యారాయ్ అందానికి నిర్వచనం చెప్పమంటే ప్రపంచంలోని సగానికి పైగా దేశాలు ఐశ్వర్యారాయ్ పేరు చెప్తాయంటే అతిశయోక్తి కాదు. మన దేశంలో పుట్టిన ఆ అందం విదేశీయులను సైతం అంతగా ముగ్ధుల్ని చేసింది మరి. అదే ఆమెకు హాలీవుడ్ అవకాశాలనూ తెచ్చిపెట్టింది. బ్రైడ్ అండ్ ప్రెజ్యుడీస్, మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్, ప్రొవోక్డ్, పింక్ పాంథర్ 2 లాంటి చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకులకు కూడా అభిమాన నటి అయిపోయింది ఐష్. టబు సక్సెస్ఫుల్ హీరోయిన్ల లిస్టులో టబు పేరుండదేమో కానీ, గొప్ప నటీమణుల లిస్టులో తప్పక ఉంటుంది. డబ్బు కోసం, పాపులారిటీ కోసం పాకులాడకుండా కేవలం తన ప్రతిభనే నమ్ముకుని సాగిపోతోన్న నటి ఆమె. ఆ లక్షణమే ఆమెను ఉత్తమ నటిని చేసింది. హాలీవుడ్‌కి కూడా తీసుకెళ్లింది. నేమ్‌సేక్, లైఫ్ ఆఫ్ పై వంటి చిత్రాలతో అక్కడి వారికి కూడా తన టాలెంట్‌ను రుచి చూపించింది టబు. ప్రియాంకా చోప్రా ఒక హీరోయిన్‌కి ఎన్ని ప్రత్యేకతలు ఉండాలో అన్నీ ఉంటాయి ప్రియాంకకి. ఒక నటి ఎన్ని సెన్సేషన్లు క్రియేట్ చేయగలదో అన్నీ చేసి చూపించిందామె. ఆమె సాధించిన వాటిలో అతి పెద్ద విజయం... హాలీవుడ్లో పాదం మోపడం. అయితే నిజానికి ఆమె నటిగా అక్కడివారికి పరిచయం కాలేదు. ఒక సింగర్‌గా తన పాప్ సాంగ్స్‌తో చేరువైంది. వారి మనసుల్లో స్థానం సంపాదించి ఇటీవలే ఓ హాలీవుడ్ చిత్రంలో నటించే చాన్స్ కొట్టేసింది. మల్లికా శెరావత్ బాలీవుడ్లోనే హాలీవుడ్‌ని తలదన్నేలా అందాలు ఒలకబోసిన ఘనత మల్లికాది. అలాంటిది ఏకంగా అక్కడ నటించే అవకాశం వస్తే ఊరుకుంటుందా! అందరి మతులూ పోగొట్టేసింది. జాకీచాన్ సరసన మల్లిక నటించిన ‘ద మిత్’ హాలీవుడ్‌తో పాటు మన దేశ ప్రేక్షకులనూ అలరించింది. ఆ తర్వాత ‘పాలిటిక్స్ ఆఫ్ లవ్’ అనే ఆంగ్ల చిత్రంలో కూడా నటించింది మల్లిక. -
ఆమిర్ ఖాన్ భార్యగా..?
అదృష్టం కలిసొస్తే... మంచి అవకాశం దక్కితే మనం ‘రొట్టె విరిగి నేతిలో పడింది’ అంటాం. అదే హిందీవాళ్లయితే ఏమనుకుంటారు? పూరీ వెళ్లి పానీలో పడ్డట్లే అంటారేమో. ప్రస్తుతం మల్లికా శెరావత్ అలాంటి ఆనందంలోనే ఉన్నారట. ఎంత ఆనందం అంటే ఎన్ని పానీ పూరీలిచ్చినా గప్ చుప్‌గా తినేసేంత! ఈవిడగారి ఆనందానికి కారణం ‘దంగల్’ చిత్రం. ప్రముఖ మల్లయోధుడు మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. మహావీర్ పాత్రను ఆమిర్ ఖాన్ పోషించనున్నారు. ఆయన భార్య పాత్రను పోషించే అవకాశం ఎవరికి దక్కుతుంది? అనే చర్చ హిందీ చిత్ర రంగంలో జరిగింది. హాట్ లేడీ మల్లికా శెరావత్ ఈ చిత్రం గురించి తెలుసుకుని, తనంతట తానుగా ఆమిర్ భార్య పాత్ర చేస్తానని అడిగారట. మల్లిక మంచి నటి కావడంతో ఆమె ప్రతిపాదనను కాదనకుండా, ఈ పాత్ర కోసం ఆడిషన్ చేశారట. అయితే, ఇంకా అధికారికంగా మల్లికతో ఒప్పందం కుదుర్చుకోలేదు. కానీ, ఈ అవకాశం తనకే అని మల్లిక ఫిక్సయిపోయారట. మరి... ఆమె నమ్మకం ఎంతవరకూ నిజమవుతోందనేది వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే మహావీర్ ఫోగట్ ఇద్దరు కుమార్తెలు గీత, బబిత పాత్రలకు టీవీ సీరియల్స్‌లో, కొన్ని చిత్రాల్లో నటించిన ఫాలిమానూ, ఢిల్లీకి చెందిన సాన్య అనే బ్యాలే డ్యాన్సర్‌నూ తీసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ఆరంభం కానుంది. -
కేన్స్ లో మెరిసిన కత్రినా కైఫ్
-
'మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి'
ముంబై: మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి వస్తానని బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ పేర్కొంది. రాజకీయాల్లోకి వస్తే మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టిపెడతానని వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోదీ పనితీరు తననెంతో ఆకట్టుకుందని తెలిపింది. 'నాకు మంచి ప్లాట్ ఫామ్ దొరికితే రాజకీయాల్లోకి వస్తా. మహిళలకు మేలు చేయడం ద్వారా సమాజానికి నా వంతు సేవ చేస్తా. నరేంద్ర మోదీ పనితీరు నన్నెంతో ఆకట్టుకుంది. జాతి యావత్తు ఆయన పనితీరును మెచ్చుకుంటోంది' అని మల్లికా షెరావత్ పేర్కొంది. ఆమె నటించిన తాజా చిత్రం 'డర్టీ పాలిటిక్స్' త్వరలో విడుదలకానుంది. కేసీ బొకాడియా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఓంపురి, అనుపమ్ ఖేర్, నసిరుద్దీన్ షా, జాకీష్రాఫ్ ముఖ్యపాత్రల్లో నటించారు. -
'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా
ముంబై: మల్లికా షెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' హిందీ సినిమా విడుదల మార్చి 6కు వాయిదా పడింది. హోలి సందర్భంగా మార్చి 6న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ముందుగా ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. అయితే అదే రోజున ఇతర సినిమాలు విడుదలవుతుండడం, ఈ సినిమాలో మరో పాట పెట్టాలని దర్శకుడు నిర్ణయించడంతో 'డర్టీ పాలిటిక్స్' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో పెట్టిన గాగ్రా పాటకు అనూహ్య స్పందన వచ్చిందని, దీంతో మరో పాట పెట్టాలని భావించినట్టు దర్శకుడు కేసీ బొకాడియా తెలిపారు. ఈనెల 13 నుంచి పాట చిత్రీకరణ ఉంటుందని చెప్పారు. -
'ఇక డిఫరెంట్ పాత్రలకే పరిమితం'
ముంబై: శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ ముందంజలో ఉంటారు. మరి ఇక నుంచి ఆ తరహా సన్నివేశాలను ఆమె నుంచి ఆశించడం కష్టమే. ఇక తాను డిఫరెంట్ పాత్రలకే పరిమితమవుతానంటోంది మల్లికా. ఇప్పటికే తనకు గ్లామరస్ పాత్రలు వెల్లువలా వస్తున్నాయని మల్లికా తాజాగా తెలిపింది. 'నేనెందుకు స్క్రిప్ట్ లను ఎంపిక చేసుకోకూడదు.నాకు కూడా ఎంపిక చేసుకునే అవకాశాలు మెండుగా వస్తున్నాయి. ఇందులో భాగంగానే పలు రకాలైన గ్లామరస్ పాత్రలు చేయడానికి సన్నద్ధం అవుతున్నా' అంటూ మల్లిక పేర్కొంది. ఇక నుంచి తాను సినిమాల్లోనటించడానికి ఆస్కారం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని.. ఏదో ఒక సాంగ్ కు డ్యాన్స్ చేసేందుకు మాత్రమే పరిమితం కానని తెలిపింది. తనకు డర్టీ పాలిటిక్స్ ఒక ప్లాట్ ఫాం లాంటిందని ఒక ప్రశ్నకు సమాధానం చెప్పింది ఈ ముద్దుగుమ్మ. -
ఆయనతో కష్టమే!
సీనియర్ అని గౌరవమో... లేక ఓల్డేజ్ గైతో రొమాన్స్‌లో పసలేదనో... మొత్తానికి మల్లికాషెరావత్ మనసులో మాటైతే బయట పెట్టేసింది. ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాలో ఓంపురితో కలసి చేసిన మల్లిక... ఆయనతో ‘బోల్డ్’ సీన్స్‌లో నటించడం ఎంతో కష్టమంటోంది. అయితే... ఆయన ‘ఎక్స్పీరియన్స్’ తనను కంఫర్టబుల్‌గా మార్చేసిందని వెంటనే కవరింగ్ ఇచ్చేసింది. ‘ఈ సినిమాలో ఓంపురితో నాకు కొన్ని బోల్డ్ సన్నివేశాలున్నాయి. తొలుత ఎలా చేయాలో ఆందోళన పడ్డా. కానీ ఆయన అనుభవం నాలోని ఆందోళన పోగొట్టింది. నిజంగా ఆయన ఓ ప్రొఫెషనల్’ అంటూ తన ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకుందీ సెక్సీ తార! కెరీర్లో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని... గాడ్‌ఫాదర్ ఎవరూ లేకనే ఈ పరిస్థితని గోడు వెళ్లబోసుకుంది. -
అబ్బో... ఆమిర్!
తాజాగా రిలీజ్ అయిన ‘పీకే’ సినిమా హిట్‌తో హీరో ఆమిర్‌ఖాన్‌పై పొగడ్తలు వెల్లువెత్తుతున్నాయి. ఆమిర్ అదని... ఇదని... అసలేం చేసినా సూపరనీ తెగ మోసేస్తున్నారు బాలీవుడ్ జనాలు. రొమాంటిక్ భామ మల్లికా షెరావత్ అయితే ఓ అడుగు ముందుకేసింది. అసలు విషయం వదిలేసి... ఆమిర్ సొసైటీకి ఎంతో సేవ చేసేస్తున్నాడంటూ కితాబిచ్చేసింది. ‘ఐ లవ్ దట్ మూవీ. ఈ ఏడాదికి అద్భుతమైన ముగింపు ఇది. అంతే కాదు... సమాజ శ్రేయస్సులో ఆమిర్ భాగస్వామ్యం అమూల్యం. నిస్వార్థం’ అంటూ సినిమా క్యారెక్టర్‌ను నిజ జీవితానికి ముడిపెట్టేసింది. అందుకు తన ట్విట్టర్ పేజీని వేదికగా చేసుకుందీ చక్కని చుక్క! -
ఆయనతో భలే ఇబ్బంది: మల్లికా శెరావత్
శృంగార సన్నివేశాలంటే ఏమాత్రం మొహమాటం, ఇబ్బంది లేకుండా నటించే వాళ్లలో మల్లికా శెరావత్ కొంత ముందంజలో ఉంటారు. అయితే.. ఆమె సైతం ఓ నటుడితో అలాంటి సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డారంటే నమ్మగలరా? అవును.. 'డర్టీ పాలిటిక్స్'లో సీనియర్ నటుడు ఓంపురితో 'ఆ' సన్నివేశాలు చేయడానికి ఇబ్బంది పడ్డానని స్వయంగా మల్లికా శెరావత్ తెలిపింది. ఆయనతో అలాంటి సీన్లు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడ్డానని, అయితే ఆయన తనను సౌకర్యంగా ఉండేలా చేశారని ఈ సెక్స్ బాంబ్ చెప్పింది. కె.సి. బొకాడియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మూలకథ భన్వారీదేవి సెక్స్ స్కాండల్ అని అంటున్నారు. ఇందులో ఓంపురి ఓ నాయకుడి పాత్రను చేస్తున్నారు. ఆయనను ఉపయోగించుకుని జీవితంలో ఎదగడానికి ప్రయత్నించే అనోఖిదేవి అనే పాత్రలో మల్లికా శెరావత్ నటించింది. ఈ సినిమాలో ఇంకా నసీరుద్దీన్‌షా, అనుపమ్‌ఖేర్, జాకీ ష్రాఫ్, అశుతోష్ రాణా, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. -
మల్లికా షెరావత్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై ఫలక్ నుమా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని నగరానికి చెందిన ఖాదిర్, సమూద్దీన్ లు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశింనట్లు అసిస్టెంట్ కమీషనర్ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మల్లికా షెరావత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని ఫిర్యాదులు రావడంతో ఆమెపై ఇప్పటికే పలుకేసులు నమోదైన సంగతి తెలిసిందే. -
నటి మల్లికా షెరావత్‌పై కేసు నమోదు
కరీంనగర్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని కరీంనగర్‌కు చెందిన న్యాయవాది బేతి మహేందర్‌రెడ్డి గురువారం అదనపు ఫస్ట్‌క్లాస్ జుడిషియల్ మేజిస్ట్రేల్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన న్యాయమూర్తి అజర్ హుస్సేన్ దర్యాప్తు నిమిత్తం కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు పంపించారు. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు నటి మల్లికా షెరావత్‌పై గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
మల్లికా షరావత్ పై కేసు నమోదు
-
మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు...
సాక్షి, హైదరాబాద్: డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని, ఆమెపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, బీఎంబీ మ్యూజిక్, మల్లికా షెరావత్లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. -
మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు
హైదరాబాద్ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'డర్టీ పాలిటిక్స్' సినిమాలో జాతీయ జెండాను అవమానపరిచారని దాఖలైన పిటిషన్‌పై న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. నిర్మాతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది. బాలివుడ్ నటి మల్లికా షెరావత్‌పై హైకోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో జాతీయ పతాకాన్ని అవమానిచే విధంగా ధరించినందుకు మానవ హక్కుల కార్యకర్త ధన్గోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మల్లికా షెరావత్‌పై చర్య తీసుకోవాల్సిందిగా కోర్టుకు పిర్యాదు చేసారు. సినిమా ఫస్ట్‌లుక్‌లో మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. దీనిపై స్పందించిన ధన్గోపాలరావు మువ్వన్నెల జెండాను వ్యాపార పరంగా వినియోగించడం దేశ గౌరవాన్ని అవమానించినట్లేనని ఇకపై చిత్ర నిర్మాత ప్రమోషన్ కోసం ఆ పోస్టర్‌ను వినియోగించరాదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ చర్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు మల్లికాకు నోటీసులు ఇచ్చింది. కాగా ఇదే వివాదంపై రాజస్థాన్ లోనూ కేసు నమోదు అయ్యింది. -
మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి
హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం హైదరాబాద్: జాతీయ పతాకాన్ని అవమానించిన బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. త్వరలో విడుదల కానున్న డర్టీ పొలిటిక్స్ చిత్రంలో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకున్నారని, ఇది జాతీయ జెండాను అవమానించడమేనంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధనగోపాల్ రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్లను విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది. -
నన్ను ఒంటరిగా వదిలేయండి:మల్లికా షెరావత్
ముంబై: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తరచు వార్తల్లో నిలవడం కొత్తేమీ కాదు. వివాదాలను వెంటబెట్టుకునే తిరిగే 37 ఏళ్ల ఈ అందాలభామ ప్రస్తుతం తెగ మదనపడుతోంది. దానికి కారణం మాత్రం హాలీవుడ్ నటుడు ఆంటోని బాండరస్. అతనితో మల్లిక ఎఫైర్లు నడుపుతున్నట్లు వార్తలు ఊపందుకోవడంతో ఆమె కలత చెందుతోంది.'నన్ను ఒంటరిగా వదిలేయండి. దయచేసి విసిగించకండి. తన వ్యక్తిగత జీవితంలో అంశాలను భూతద్దంలో చూపించకండి' అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. హాలీవుడ్ నటుడు ఆంటోనీ బాండాస్ భార్య మెలనీ గ్రిఫిత్ తో దూరం అయ్యాక.. మల్లికకు దగ్గరయ్యాడనే రూమర్లు ఈ మధ్య మరీ ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. వీటిని ఖండించిన మల్లిక.. రెండు సంవత్సరాల క్రితం అతనితో ఓ కార్యక్రమంలో డ్యాన్స్ చేసిన వీడియోలను ఇప్పుడు విడుదల చేసి నానా రాద్దాంతం చేస్తున్నారని మండిపడింది. అప్పుడెప్పుడో జరిగిన విషయాన్ని పెద్దదిగా చేయొద్దని విన్నవించింది. ఇదిలా ఉండగా, అతను గొప్ప డ్యాన్సరే కాకుండా అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడని మల్లిక కితాబిచ్చింది. -
మల్లిక... కారు దిగలేక!
బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ మరోసారి వార్తల్లో నిలిచింది. 37 ఏళ్ల ఈ అందాలభామ సొంతూరు ప్రయాణంతో పతాక శీర్షికలకెక్కింది. 'బ్యాచరెట్ ఇండియా-మేరీ ఖయలోన్ కీ మల్లిక' కార్యక్రమం షూటింగ్ కోసం హర్యానాలోని తన సొంతూరికి వెళ్లిన మల్లికకు అభిమానులు ఊహించని విధంగా స్వాగతం పలికారు. హీరోయిన్ అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. తమ అభిమాన తారను కలుసుకోవాలన్న ఉత్సాహంతో మల్లిక కారు చుట్టుముట్టారు. దారంటా ఆమె కారు వెనుక పరిగెత్తారు. మల్లిక మానియాతో ఆమె స్వగ్రామం ఊగిపోయింది. దీంతో మల్లిక కారులోంచి అడుగు పెట్టలేకపోయింది. చేసేది లేక కారులోనే నిస్సహాయంగా కూర్చుండిపోయింది. సొంతూరి పర్యటనలో తనకెదురైన అనుభవంపై మల్లిక ట్విటర్ లో స్పందించింది. కారు నుంచి కాలు బయటపెట్టలేకపోయానని పోస్ట్ చేసింది. My first visit to my hometown in Haryana, couldn't even get out of the car!! http://t.co/hXC3FfTzfM — Mallika Sherawat (@MallikaLA) June 19, 2014 -
మువ్వన్నెల జెండాతో దుశ్చర్య
సినిమా తీసేవాళ్లకే కాదు, చేసేవాళ్లకు కూడా నైతికత అవసరం. అది లేకపోతే... వాళ్లకే కాదు... సమాజానికీ ఎంతో నష్టం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే వెండితెరపై... దేశ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చే కథాకథనాల్ని, పాత్ర చిత్రణల్ని, ఆహార్యాల్ని ప్రోత్సహించడం ఒక రకంగా క్షమించరాని నేరం. బాలీవుడ్లో మల్లికా శరావత్ చేసిన ఓ దుశ్చర్య... ప్రస్తుతం ఈ స్థాయి విమర్శలకు కారణం అయ్యింది. ఆమె నటిస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాకు సంబంధించిన దృశ్యాలను ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ముందు చిత్రీకరించారు. జాతీయ జెండాను ఒంటికి చుట్టుకొని ప్రభుత్వ వాహనంపై కూర్చొని రెచ్చగొట్టే భంగిమలు మల్లిక ఇస్తుండగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పైగా మల్లికా తన నగ్న దేహానికి మువ్వన్నెల జెండాను చుట్టుకున్న స్టిల్‌ని ఈ సినిమా ఫస్ట్ లుక్‌గా విడుదల చేయడం మరో దారుణం. మొత్తంగా ఈ చిత్రం బృదం చేసిన దుశ్చర్య తీవ్రమైన వివాదానికి తెర లేపింది. జాతీయ జెండాను ఇలా అవమానించడం బాధాకరమే కాక, క్షమించరాని నేరం. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి. -
అర్ధనగ్నంగా 'నమో'నమః
-
అర్ధనగ్నంగా 'నమో'నమః
గుజరాత్ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ దేశమంతా చుట్టేస్లూ ఉదృతంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ప్రత్యర్థులపై వ్యంగ్య వాగ్బాణాలు సంధిస్తూ దూసుకుపోతున్నారు. పదుదైన మాటలతో రాజకీయ వాతావరణాన్ని వేడిక్కిస్తున్నారు. మోడీకి మద్దతుగా ఒక్కొక్కరూ ఒక్కోలా ప్రచారం చేస్తుంటే గుజరాత్‌కు చెందిన మోడల్ మేఘనా పటేల్ మాత్రం వినూత్న ప్రచారానికి దిగింది. అర్ధనగ్నంగా ఫొటోలకు పోజిచ్చి.. మోడీకి ఓటేయమని అర్థించింది. పలు సినిమాలతోపాటు సీరియళ్లలో నటించిన మేఘన ప్రస్తుతం ముంబైలో ఉంటోంది. ఈ ఫొటోలు నెట్లో, ప్రసారమాధ్యమాల్లో విస్తృతంగా రావడంతో మహారాష్ట్ర బీజేపీ రాష్ట్ర శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి మద్దతు తమకక్కర్లేదని, ప్రచారం కోసమే మేఘన ఇలా అసభ్యకర చర్యలకు దిగిందని మండిపడింది. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించింది. అయితే, తన చర్యలను అసభ్యకరమనడాన్ని మేఘన ఖండించింది. తాను శరీర వర్ణంలో కలిసిపోయేలా ఉన్న దుస్తులు వేసుకున్నానని, మోడీకి తాను మద్దతు తెలిపే విధానం ఇదేనని గడుసుగా సమాధానం ఇచ్చింది. మోడీకి మద్దతు తెలిపే అందాల భామల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ కూడా కొద్ది రోజుల క్రితం మోడీకి మద్దతు ప్రకటించింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చిన మల్లిక... తన షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అక్కడితే ఆగకుండా మోడీని ‘పర్ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది. తాజాగా మేఘనా పటేల్ తన అభిమాన నాయకుడికి 'అర్ధనగ్న' ప్రదర్శనతో ప్రచారం కల్పించింది. టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిస్తే నగ్నంగా నిలబడతానని ప్రకటించి అప్పట్లో పూనమ్ పాండే సంచలనం రేపింది. దాంతో రాత్రికి రాత్రే ఆమె పాపులరయింది. ఇప్పుడు మేఘన కూడా ఇదే దారిలో వెళుతున్నట్టు కనిపిస్తోంది. 'అర్ధనగ్న' ప్రచారాన్ని పాలిటిక్స్‌లో ప్రవేశపెట్టి ఇప్పటికే వార్తల్లో నిలిచింది మేఘన. మున్ముందు ఆమె ఇంకా ఎన్ని సంచలనాలు రేపుతుందో చూడాలి. -
అగ్రనేతపై మోజుపడ్డ సెక్స్‌బాంబ్
-
రజనీతో డేటింగ్ చేయాలనుంది
సూపర్‌స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టైల్ కింగ్ రజనీ అంటే మోజుపడని వారు ఉండరు. ఆయన సరసన ఒక్క చిత్రంలో అయినా నటించాలని ఆశపడని హీరోయిన్లు ఉండరు. రజనీకాంత్‌తో ఏకంగా డేటింగ్ చేయాలని కోరికను సంచలన నటి మల్లికా షెరావత్ వ్యక్తం చేయడం విశేషం. అది ఏకాంత దీవిలో రజనీతో డేటింగ్ చేయాలని ఆమె ఆశపడుతోందట. కోలీవుడ్‌లో దశావతారం చిత్రంలో నటించిన మల్లికాషెరావత్ ఆ మధ్య శింబు చిత్రం ఒస్తిలో ప్రత్యేక పాటలో కవ్వించింది కూడా. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న రియాలిటీ షోలో తన ప్రేమికుడిని ఎంపిక చేసుకునే ప్రయత్నంలో పడ్డ మల్లిక మనసును ఆకట్టుకున్న వ్యక్తిని ఎంచుకుంటానంటోంది. ఈ షోలో ఇప్పటి వరకు 15 మంది యువకులు ఈ బ్యూటీకి ప్రేమ వల వేశారట. వారి ప్రేమైక వచనాలకు సంతోషించిన మల్లిక బదులుగా ముద్దులు ఇచ్చుకుందట. ఈ సందర్భంగా ఎవరితో డేటింగ్ చేయాలని కోరుకుంటున్నారన్న ఒక విలేకరి ప్రశ్నకు మల్లికా షెరావత్ రజనీకాంత్‌తో ఏకాంత దీవిలో డేటింగ్ చేయాలనుందని బదులిచ్చిందట. -
మల్లిక ‘నమో’స్తుతి!
న్యూఢిల్లీ: బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై యువకులు, విద్యార్థులేకాదు బాలీవుడ్ కథానాయికలు కూడా అభిమానం చూపిస్తున్నారు. ఆయన అభిమానుల జాబితాలో తాజాగా బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ చేరింది. ఈ సుందరి త్వరలో ఓ రియాల్టీ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ షోలో నరేంద్ర మోడీ పాల్గొంటే ఆయన కోసం ఏం చేసేందుకైనా తాను సిద్ధమేనని ప్రకటించింది. మోడీని ‘పర్ఫెక్ట్ బ్యాచిలర్’గా, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’గా మల్లిక అభివర్ణించింది. లైఫ్ ఓకే చానల్లో ఈ నెల 7 నుంచి ప్రారంభం కానున్న ‘ద బ్యాచిలరెట్ ఇండియా- మేరే ఖయాలోంకీ మల్లిక’ రియాల్టీ షో ద్వారా జీవిత భాగస్వామిని ఎం పిక చేసుకుంటుందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మోడీ గురిం చి వ్యాఖ్యలు చేయడం విశేషం. స్వచ్ఛమైన ప్రేమ కోసమే... జీవిత భాగస్వామి కోసం రియాల్టీ షోలో పాల్గొనడం లేదని, కేవలం స్వచ్ఛమైన ప్రేమకోసమే షోలో పాల్గొంటున్నానని చెప్పింది మల్లిక. రియాల్టీ షోలో ఇప్పటిదాకా రాహుల్ మహాజన్ మినహా మరెవరూ పెళ్లి చేసుకోలేదని, తాను కూడా జీవిత భాగస్వామి కోసం కాకుండా నిజమైన ప్రేమ కోసం ఈ షోలో పాల్గొంటున్నట్లు చెప్పింది. అయితే ఈ షోలో ప్రేక్షకులు చూసేదంతా నిజమేనని, అందులో ముం దుగా ప్లాన్ చేసుకొని, రిహార్సల్స్ చేసి నటిస్తున్నదేమీ లేదని తెలిపింది. భారతీయుడినే పెళ్లాడతా... మల్లిక తరచూ అమెరికాకు వెళ్తోందని, అక్కడే ఎవరితోనో ప్రేమలో పడిందని, అతణ్నే పెళ్లి చేసుకుంటుందని మీడియాలో వచ్చిన కథనాలపై స్పందిస్తూ... విదేశీయుల్లో మానవత్వ విలువలు తక్కువే. అందుకే భారతీయుడినే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాని చెప్పింది. అంతేకాక సినీ పరిశ్రమకు దూరంగా ఉండే సామాన్య వ్యక్తినే పెళ్లాడతానని తెలిపింది. -
సినిమావాళ్లొద్దు.. నిజమైన ప్రేమికుడు కావాలి: మల్లికా షెరావత్
అందాల ఆరబోతకు, శృంగార సన్నివేశాల్లో నటించేందుకు అభ్యంతరం పెట్టని బాలీవుడ్ మెరుపు తీగ మల్లికా షెరావత్.. తనకు మాత్రం గ్లామర్ ప్రపంచానికి సంబంధించిన వ్యక్తులెవరూ నచ్చరని సెలవిచ్చింది. నిజమైన ప్రేమ కోసం అన్వేషిస్తున్నానని, అందులోనూ భారతీయుడై ఉండాలని షరతు విధించింది. సినీ పరిశ్రమకు చెందిన వారిని పెళ్లి చేసుకోబోనని, ఈ రంగానికి చెందిన వారు ఎవరూ తనను ఆకర్షించలేరని చెప్పింది. ప్రస్తుతం ఒంటరి జీవితం గడుపుతున్న మల్లిక తోడు కోసం అన్వేషిస్తోంది. ఓ టీవీ షోలో పాల్గొన్నంటున్న మల్లిక.. ఈ కార్యక్రమం ద్వారా తనకు నచ్చినవాడిని వెతుకున్నే ప్రయత్నం చేస్తోంది. గ్లామర్, సినిమాలు నిజమైన ప్రపంచం కావని, తనకు వాస్తవిక ప్రపంచంలో జీవించాలని ఉందని మల్లిక అంది. అందుకే చాలామంది తారలు సినీ పరిశ్రమ బయటి వ్యక్తుల్ని పెళ్లి చేసుకుంటారని మాధురీ దీక్షిత్, శిల్పాశెట్టిని ఉదహరించింది. -
దేశముదురు
-
నరేంద్రమోడీ అందగాడు... మల్లికా షెరావత్ పాట!
భారతీయ జనతాపార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అభిమానుల జాబితాలో బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్ చేరింది. నరేంద్ర మోడీ 63వ జన్మదినం రోజున శుభాకాంక్షలు తెలుపుతూ వీడియో సందేశాన్ని సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. అంతేకాక యూట్యూబ్ లో కూడా అభిమానులకు అందుబాటులో ఉంచింది. మోడీ 'మోస్ట్ ఎలిజిబుల్ బాచిలర్' వ్యాఖ్యలు చేయడం విశేషం. పబ్లిసిటీ కోసం వెంపర్లాడుతోంది అని మల్లికా చేసిన చర్యలను కొందరు బాహాటంగానే విమర్శించారు. మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అందర్ని దృష్టిని ఆకర్షించడానికి చేసిన పబ్లిసిటీ అని తెలిపింది. 'ది బాచెలరెట్ ఇండియా - మేరే ఖయాలోంకి మల్లికా' అనే కార్యక్రమ ప్రచారం కోసం ఉదయపూర్ చేరుకున్న మల్లికా మీడియాతో మాట్లాడుతూ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అని వ్యాఖ్యలు చేసింది. నరేంద్రమోడీ అందగాడు. అధునిక భావాలున్న వ్యక్తి.. కొన్నిసార్లు తప్పుగా అర్ధం చేసుకున్నాడు' అని మల్లికా షెరావత్ తెలిపింది. -
మోడీ అత్యంత అర్హుడైనబ్యాచిలర్
ఉదయ్‌పూర్: దేశంలో అత్యంత అర్హుడైన బ్యాచిలర్ అనేసరికి అందరికీ సల్మాన్‌ఖాన్ వంటివారి పేర్లే గుర్తొస్తాయి.. కానీ బాలీవుడ్ శృంగార తార మల్లికా షెరావత్కు మాత్రం నరేంద్ర మోడీ(62) పేరే గుర్తొచ్చింది. ఎందుకలాగ అని ప్రశ్నిస్తే.. ‘ఆయన తెలివైనవారు, అభ్యుదయవాది..’ అంటూ గుణగుణాలు వర్ణించుకుంటూ పోయింది. పాపం.. నన్ను అపార్థం చేసుకున్నట్లే... అందరూ ఆయన్ను అపార్థం చేసుకుంటారు అని వాపోయింది. ‘ద బ్యాచిలరెట్ ఇండియా-మేరీ కలియోంకీ మల్లిక’ టీవీ షో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన మల్లిక ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.