
మల్లికా షెరావత్ పై మరో కేసు నమోదు
హైదరాబాద్: బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై ఫలక్ నుమా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఆమె నటించిన డర్టీ పాలిటిక్స్ అనే హిందీ చిత్రం ప్రచార పోస్టర్‌లో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని అవమానకర రీతి లో ధరించించారని నగరానికి చెందిన ఖాదిర్, సమూద్దీన్ లు స్థానిక మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు.
ఫిర్యాదును పరిశీలించిన కోర్టు.. ఆమెపై కేసు నమోదు చేయాలని ఆదేశింనట్లు అసిస్టెంట్ కమీషనర్ మహ్మద్ అబ్దుల్ బారీ తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు మల్లికా షెరావత్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని ఫిర్యాదులు రావడంతో ఆమెపై ఇప్పటికే పలుకేసులు నమోదైన సంగతి తెలిసిందే.