మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు | high court issues notice to Mallika Sherawat | Sakshi
Sakshi News home page

మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు

Published Mon, Aug 4 2014 2:21 PM | Last Updated on Fri, Aug 31 2018 8:26 PM

మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు - Sakshi

మల్లికా షెరావత్కు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్కు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 'డర్టీ పాలిటిక్స్‌' సినిమాలో జాతీయ జెండాను అవమానపరిచారని దాఖలైన పిటిషన్పై న్యాయస్థానం ఈమేరకు స్పందించింది. నిర్మాతతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను కోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.


బాలివుడ్ నటి మల్లికా షెరావత్పై  హైకోర్టులో కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.  డర్టీ పాలిటిక్స్ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్లో జాతీయ  పతాకాన్ని అవమానిచే విధంగా ధరించినందుకు మానవ హక్కుల కార్యకర్త ధన్గోపాలరావు ఈ పిటిషన్ దాఖలు చేశారు. మల్లికా షెరావత్పై చర్య తీసుకోవాల్సిందిగా కోర్టుకు పిర్యాదు చేసారు.

సినిమా ఫస్ట్లుక్లో  మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు. దీనిపై స్పందించిన ధన్గోపాలరావు మువ్వన్నెల జెండాను వ్యాపార పరంగా వినియోగించడం దేశ గౌరవాన్ని అవమానించినట్లేనని ఇకపై చిత్ర నిర్మాత ప్రమోషన్ కోసం ఆ పోస్టర్ను వినియోగించరాదని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే ఈ చర్యకు పాల్పడినవారిని కఠినంగా శిక్షించాలని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ పిటిషన్పై స్పందించిన హైకోర్టు మల్లికాకు నోటీసులు ఇచ్చింది. కాగా  ఇదే వివాదంపై రాజస్థాన్ లోనూ  కేసు నమోదు అయ్యింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement