
మల్లికా షెరావత్‌కు హైకోర్టు నోటీసులు...
సాక్షి, హైదరాబాద్: డర్టీ పాలిటిక్స్ చిత్ర పోస్టర్లలో బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తన ఒంటికి జాతీయ పతాకాన్ని చుట్టుకుని అవమానించారని, ఆమెపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన టి.ధనగోపాల్‌రావు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై హైకోర్టు స్పందించింది. ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వానికి, బీఎంబీ మ్యూజిక్, మల్లికా షెరావత్‌లకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశిస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.