మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి | Mallika Sherawat to give orders for operations | Sakshi
Sakshi News home page

మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి

Published Wed, Jul 30 2014 3:33 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి - Sakshi

మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశాలివ్వండి

హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

హైదరాబాద్: జాతీయ పతాకాన్ని అవమానించిన బాలీవుడ్ నటి మల్లికా షెరావత్‌పై తగిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. త్వరలో విడుదల కానున్న డర్టీ పొలిటిక్స్ చిత్రంలో మల్లికా షెరావత్ జాతీయ పతాకాన్ని తన ఒంటికి చుట్టుకున్నారని, ఇది జాతీయ జెండాను అవమానించడమేనంటూ హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త టి.ధనగోపాల్ రావు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.

ఆ చిత్ర నిర్మాత కస్తూర్ చంద్ బొకాడియా ఉద్దేశపూర్వకంగానే జాతీయ జెండాను అవమానపరిచేలా ఉన్న వాల్ పోస్టర్‌లను విడుదల చేశారని పిటిషనర్ పేర్కొన్నారు. మల్లికా షెరావత్‌పై చర్యలకు ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై వచ్చే వారం కోర్టు విచారణ జరిపే అవకాశం ఉంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement