సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు! | Mallika Sherawat her diet and fitness routines in the past | Sakshi
Sakshi News home page

సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు!

Published Thu, Mar 10 2016 5:19 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు! - Sakshi

సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు!

మల్లికా షెరావత్.. ఈ పేరు బాలీవుడ్ లో ఒకప్పటి సంచలనం. 'మర్డర్' సినిమాలో ఆమె సన్నివేశాలు చూసిన వారు ఇప్పటికీ ఆమె నుంచి మనసు మరల్చుకోలేరు. సెక్స్ బాంబ్ గా పేరున్న ఈ నటి ప్రస్తుతం ఫిట్ నెస్ పైనే ధ్యాస నిలిపింది. నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఉన్నా స్లిమ్ గా ఉండటం ఆమెకే చెల్లిందని బాలీవుడ్ జనాలు అప్పుడప్పుడు చెప్పుకునేవారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ అదే ఫిజిక్ ను ఆమె కొనసాగిస్తుంది. తాజాగా ఆమె జిమ్ లో కసరత్తులు చేయడం ఎందుకు మొదలుపెట్టిందంటూ అక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్లోనూ కామెంట్ చేస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది మల్లిక.

తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది.. స్లిమ్ గా ఉండేందుకు ఎలాంటి కసరత్తులు చేస్తుందో తెలిపేందుకు ఫొటోలు, కొన్ని వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. యోగా చేయాలని, జిమ్ కు వెళ్లడం అలవరుచు కోవాలంటూ ఫ్యాన్స్ కు ఈ సెక్సీ స్టార్ సూచించింది. ఆరోగ్యంగా ఉండటం, బాడీని ఫిట్ గా ఉంచుకోవడం ట్రెండ్ కాదని ట్విట్ లో రాసుకొచ్చింది. ఇది మన జీవన విధానంలో భాగమని చెప్పింది. చివరగా గతేడాది విడుదలైన 'డర్టీ పాలిటిక్స్' లో తెరమీద కనిపించింది. శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ జిమ్ లో వర్కవుట్స్ చేయడంతో పాటు యోగా చేస్తానని చెప్పుకొచ్చింది.

blockquote class="twitter-tweet" data-cards="hidden" data-lang="en">

Being healthy n fit isn't a trend , it's a lifestyle. #yoga#iyengaryoga#forwardbend #yogabymallika pic.twitter.com/ci7qpeA8Z3

— Mallika Sherawat (@mallikasherawat) March 9, 2016

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement