diet and fitness
-
సెన్సేషనల్ స్టార్ బ్యూటీ సీక్రెట్స్ : మేక పెరుగు, నెయ్యి, జ్యూస్‌లు
ఆర్ట్ కలెక్టర్, దాత సోషల్ మీడియా సెన్సేషన్, రియాలిటీ టీవీ స్టార్ షాలిని పాసి 'ఫ్యాబులస్ లైవ్స్ వర్సెస్ బాలీవుడ్ వైవ్స్' సిరీస్‌తో మరింత పాపులర్ అయిపోయింది. ఆమె అదిరిపోయే పంచ్ డైలాగులు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంతేకాదు 49 ఏళ్ల వయసులో ఇంత అందంగానా? శిల్పం లాంటి ఆకృతి, మెరిసే చర్మం కోసం, ఆమె ఏమి తింటుంది అనేది చర్చకు తెరతీసింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూలో తన ఆహార నియమాలు, సౌందర్య రహస్యాలను బహిర్గతం చేసింది. షాలిని రోజువారీ ఆహారంలో ఎటువంటి ఘనమైన ఆహారం తీసుకోదట. సెలెరీ (ఆకుకూరలు)జ్యూస్, కూరగాయలతో చేసిన జ్యూస్‌లు, నెయ్యి, మేక పెరుగు ఖచ్చితంగా తీసుకుంటానని తాగా వెల్లడించింది. ప్రధానంగాకొంచెం వింతగా అనిపించినా తాను మేక పెరుగును ఎక్కువగా తీసుకుంటానని చెప్పింది. మేక పెరుగుతో ఎముకలు ,దంతాలు బలంగా ఉంటాయని వివరించింది. డైట్ మాత్రమే కాదు, రోజుకు రెండు గంటల వ్యాయామం తప్పకుండా చేస్తుందట.షానిలి డైట్ సీక్రెట్, ఆమె మాటల్లో ఉదయం ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటా.తర్వాత ఉసిరి అల్లం కలిపిన బీట్రూట్ రసం.డైట్లో హెర్బల్ లిక్విడ్లు, కూరగాయలజ్యూస్లు ఎక్కువ భాగం ఉంటాయి. రెండు గిన్నెల మొలకలను నమలడం కష్టం. అదే జ్యూస్ అయితే సులభంగా తాగవచ్చు. సెలెరీ జ్యూస్, రెడ్ జ్యూస్, స్ప్రౌట్ జ్యూస్, మిరియాలతో చేసే క్యాప్సికమ్ జ్యూస్ ఇలా చాలా ఉంటాయి.సాయంత్రం ఆహారంలో ప్రతిదీ సూప్ రూపంలో ఉంటుంది. వడకట్టకుండా, చిక్కగా ఉండే కూరగాయలను జ్యూస్‌లను తాగుతాను. ఇంకా బచ్చలికూర, బ్రోకలీ సూప్, టొమాటో, బెండ, తామర కాండం, బఠానీలు ఇలా ఏదైనా జ్యూస్ రూపంలోనే.సాయంత్రం 6 గంటల వరకు పచ్చి ఆహారం మాత్రమే .. రాత్రి 7 గంటలకు భోజనం. అదీ కూడా 'ఘర్ కా ఖానా (ఇంట్లో వండిన ఆహారం)'ఉండేలా చూసుకుంటా. కొల్లాజెన్ ఉత్పత్తిలో సహాయపడే సహజమైన వాటిని మాత్రమే తీసుకుంటాను.డిన్నర్లో అవకాడో, రాగి లేదా జొన్న పిండితో చేసిన దోసలు తింటానుఇక గుడికి వెళ్లని రోజుల్లో ప్రోటీన్ కోసం గుడ్డు, చేపలు లేదా చికెన్ తీసుకుంటా.సాయంత్రం 4 నుండి 6 వరకు నా వర్కౌట్ సమయం. కండరాలకు బలం చేకూర్చే పైలేట్స్ , డ్యాన్స్ చేస్తాను. ఆ సమయంలో నన్ను డిస్టర్బ్ చేయకూడదు. (ఫ్యాషన్‌తో దుమ్మురేపుతున్న షాలిని పాసి, ఒక్కో బ్యాగు ధర..!) -
ఒలింపిక్స్ క్రీడాకారులు.. ఏం తినాలి! ఎంత తినాలి!!
ఒలింపిక్స్ క్రీడాకారుల ఆహారం చాలా నిశితమైన పరిశీలనతో డిజైన్ చేస్తారు. వాళ్ల ఆరోగ్యం, సంబంధిత క్రీడకు అవసరమైన మోతాదులో ΄ోషకాలు సమృద్ధిగా అందేలా ఆహారం ఉంటుంది. కేలరీలు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్స్ వంటి మ్యాక్రో న్యూట్రియెంట్స్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ డీ, మెగ్నీషియం, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్) వంటి మైక్రో న్యూట్రియెంట్లు అందాలి. క్రీడాకారుల డైట్లో దేహానికి ఒక రోజుకు అవసరమైన కేలరీలలో 55–65 శాతం కార్బోహైడ్రేట్ల రూపంలోనే ఉంటుంది. శ్రమను బట్టి రోజుకు 2 వేల నుంచి 10 వేల కేలరీల వరకు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటీన్లు దేహం బరువును బట్టి కేజీకి 1.2 నుంచి 2 గ్రాములు అందాలి. ఆరోగ్యకరమైన ఫ్యాట్ శక్తినివ్వడంతోపాటు హార్మోన్ ఉత్పత్తికి దోహదం చేస్తుంది. దేహానికి అందాల్సిన కేలరీల్లో 20 నుంచి 30 శాతం ఫ్యాట్ రూపంలో ఉండాలి. మారథాన్, స్విమ్మింగ్‌కి శిక్షణ నిడివి ఎక్కువ ఉంటుంది. క్రీడను బట్టి కూడా ΄ోషకాల అవసరం మారుతుంది.ఎప్పుడు తినాలి? ఎలా తినాలి?ఆహారంతోపాటు హైడ్రేషన్, మీల్ టైమింగ్, వర్కవుట్కు రెండు – మూడు గంటల ముందు తీసుకోవాల్సిన ఆహారం, వర్కవుట్ సమయం గంటకు మించినప్పుడు మధ్యలో తీసుకోవాల్సిన తక్షణ శక్తినిచ్చే ఆహారం, వర్కవుట్ తర్వాత కండరాల పునర్నిర్మాణం కోసం తీసుకోవాల్సిన ఆహారం మోతాదులు స్పష్టంగా నిర్దేశితమై ఉంటాయి. అయితే బాడీ కం΄ోజిషన్, మెటబాలిక్ రెస్పాన్స్, ఫుడ్ ఇన్టాలరెన్స్ వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటాయి. కాబట్టి సాధారణ నియమావళిని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క స్పోర్ట్స్పర్సన్కి వ్యక్తిగత డైట్ ΄్లాన్ సిద్ధం చేయాలి. అలాగే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, వీగన్ వంటి వారి వ్యక్తిగత ఆహార విశ్వాసాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.– ఐరన్: రెడ్ మీట్, ఆకు కూరలు, ధాన్యాల ద్వారా శక్తితోపాటు దేహభాగాలకు ఆక్సిజన్ సమర్థంగా అందుతుంది.– క్యాల్షియమ్: వెన్న తీయని పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు ఎముకల పటుత్వానికి దోహదం చేస్తాయి. – విటమిన్–డి: కొవ్వుతో కూడిన చేపలు, తృణధాన్యాలు, సూర్యరశ్మి ద్వారా ఎముకల పటుత్వంతోపాటు వ్యాధినిరోధకత మెరుగవుతుంది. – మెగ్నీషియం: నట్స్, సీడ్స్, పొట్టుతీయని ధాన్యాలు, ఆకుకూరలు శక్తిని పెంచడంతోపాటు కండరాల సంకోచవ్యాకోచాలను సులువు చేస్తాయి. – ఎలక్ట్రోలైట్స్: పండ్లు, కూరగాయలు, పాలు, పాల ఉత్పత్తులు, స్పోర్ట్స్ డ్రింక్‌లు దేహంలో ద్రవాల స్థాయులను క్రమబద్ధీకరించడంతోపాటు కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి.హెల్దీ డైట్..వంద గ్రాములు... మనదేశానికి ఒక బంగారు పతకాన్ని దూరం చేసింది. బంగారు పతకంతోపాటు బంగారంలాంటి క్రీడాకారిణి మనోధైర్యాన్ని దెబ్బతీసింది. బరువు లెక్కలు ఇంత కచ్చితంగా పాటించే ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులు తీసుకునే ఆహారం ఎలా ఉండాలనే వివరాలను అందించారు న్యూట్రిషనిస్ట్, వెల్నెస్ కోచ్ డాక్టర్ కరుణ.– డాక్టర్ కరుణ, న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కోచ్హార్మోన్ల సమతుల్యత! వీటన్నింటితోపాటు నిద్ర, ఒత్తిడి చాలా కీలకమైన పాత్ర ΄ోషిస్తాయి. క్రీడాకారిణులకు ఎనిమిది గంటల మంచినిద్ర తప్పనిసరి. నిద్రలేనప్పుడు హార్మోన్ల సమతుల్యత లోపించడం, ఒత్తిడి, బరువు మీద ప్రభావం చూపిస్తుంది. ఒత్తిడిని ఎదుర్కోవడంలో మగవాళ్లకు మహిళలకు మధ్య తేడా ఉంటుంది. మానసికమైన ఒత్తిడి, భావోద్వేగాలు వారి సమర్థమైన ప్రదర్శన మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఈ పరిస్థితిని అధిగమించడానికి మెడిటేషన్, బ్రీత్ ఎక్సర్సైజ్, కృతజ్ఞత, క్షమ, పరిస్థితిని యథాతథంగా స్వీకరించడం వంటివి సాధన చేయాలి. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
కత్రినా ఫిట్నెస్ సీక్రెట్ తెలిసిపోయింది ఆమెది షట్పావళి డైట్ ప్లాన్
-
డైట్ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్ సీక్రెట్స్
తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే తన డైట్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్‌పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్లో భాగమైన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఫ్యాడ్ డైట్‌ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు, ఫిట్నెస్ సీక్రెట్స్‌పై తన ఫ్యాన్స్‌తో అప్డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా తన డైట్‌కు సంబంధించి పిక్స్ షేర్ చేసింది. తన బాలెన్స్డ్ డైట్ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్ కూడా పెట్టింది. ఇందులో డైట్ అంటే ఏంటో ఇలా వివరించింది."నా ఫీడ్‌లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు. 'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్.’’ View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) డైట్ నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.కాగా రిలయన్స్ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్‌తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్‌గా కనిపించింది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు రణవీర్ సింగ్ గతంలో ప్రకటించారు. -
WC 2023: విరాట్ కోహ్లి మాంసం అస్సలు తినడు.. వాళ్లు మాత్రం అవే తింటారు!
Details of Virat Kohli’s diet For WC 2023: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం నుంచే అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రికార్డులు బద్దలు కొట్టాడు. అంతర్జాతీయ కెరీర్లో 78వ సెంచరీ సాధించి రన్‌మెషీన్ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లో వరుసగా 85, 55*, 16, 103*, 95 పరుగులు సాధించాడు కోహ్లి. మొత్తంగా 354 పరుగులతో సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లిని ఫిట్‌నెస్‌కు మారుపేరుగా పేర్కొంటారు క్రికెట్ అభిమానులు. ఫిట్‌గా లేడన్న కారణంగా కోహ్లి జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు. జిమ్‌లో కఠిన వర్కౌట్లు చేస్తూ మంచి ఆహారపుటలవాట్లతో తనను ఫిట్‌గా ఉంచుకునేందుకు ఇష్టపడతాడు కోహ్లి. తాజాగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నేపథ్యంలో అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు? ఎలాంటి డైట్ పాటిస్తున్నాడు అన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. విరాట్ మాంసం అస్సలు తినడు టీమిండియా బస చేసిన హోటల్స్‌లో ఒకటైన లీలా ప్యాలెస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ చెఫ్ అనుష్మాన్ బాలి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ‘‘విరాట్ మాంసం అస్సలు తినడు. మాక్ మీట్ మాక్ మీట్స్, టోఫు ఇంకా ఆవిరిపై ఉడికించిన ఆహార పదార్థాలు తినడానికే ప్రాధాన్యం ఇస్తాడు. కాబట్టి మేము కూడా అతడి కోసం స్టీమ్డ్ ఫుడ్ తయారు చేస్తాం. వెజిటేరియన్ డిమ్ సమ్స్(డంప్లింగ్స్ లాంటివి) వంటివి తయారు చేస్తాం. వెజ్ డిమ్‌సమ్స్ ప్రొటిన్లు ఎక్కువగా లభించే సోయా వంటి మాక్ మీట్స్, టోఫు(సోయా పాలతో తయారు చేసే పెరుగు/బీన్ కర్డ్) లాంటివి సర్వ్ చేస్తాం. కొద్ది మోతాదులో పాల ఉత్పత్తులు కూడా కోహ్లి భోజనంలో ఉండేలా చూసుకుంటాం’’ అని అనుష్మాన్ పేర్కొన్నారు. టోఫు అంతా అవే తింటారు ఇక టీమిండియా క్రికెటర్లంతా బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్ దోసలు, మిల్లెట్, క్వినోవా ఇడ్లీలు తినేందుకు ఆసక్తి చూపుతారని.. అందరికీ ఫేవరెట్ మాత్రం రాగి దోస అని అనుష్మాన్ తెలిపారు. రాగి దోస అన్ని రకాల మాంసాహారాలు వండుతాం అదే విధంగా ఇతర క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నిజానికి ఫుడ్ బఫేలో మేము అన్ని రకాల మాంసాహారాలు అందుబాటులో ఉంచుతాం. కానీ చాలా మంది క్రికెటర్లు స్టీమ్డ్ లేదంటే గ్రిల్డ్ చికెన్ లేదంటే ఫిష్ తినడానికి ఇష్టపడతారు. ఇక న్యూజిలాండ్ క్రికెటర్లయితే కూరలు అస్సలు తినరు. అయితే, డెవాన్ కాన్వే వంటి కొంతమంది ఇండియన్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. పరాటా, దోస లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు’’ అని అనుష్మాన్ బాలి చెప్పుకొచ్చారు. కాగా ప్రపంచకప్-2023లో చివరగా టీమిండియాతో న్యూజిలాండ్‌తో ధర్మశాలలో తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది రోహిత్ సేన. తదుపరి అక్టోబరు 29న లక్నోలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా.. -
బరువు తగ్గాలని రోజూ కూరగాయలు తింటున్నారా? ఈ విషయాలు తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీనికి కారణం శారీరక శ్రమ తగ్గించడం, ఎక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్నీ, జంక్ ఫుడ్‌నీ తీసుకోవడం, తగినంత నిద్రపోకపోవడం వంటివి. ఊబకాయం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్, హై బీపీ, గుండె జబ్బులు, మానసిక ఒత్తిడి వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే సరైన బరువును మెయింటెయిన్ చేయడం అవసరం. బరువు తగ్గాలంటే పొట్ట మాడ్చుకోనవసరం లేదు. కొన్ని రకాల కూరగాయలని డైట్లో చేర్చుకోవాలి. వాటి గురించి తెలుసుకుందాం. బ్రకోలీ బ్రకోలీలో ఉండే కెరోటినాయిడ్ అనే మూలకం వేగంగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో విటమిన్ సి, కె వంటి పోషకాలు, ఫైబర్ ఉంటాయి. ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి. అందువల్ల బ్రకోలీని సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. క్యాబేజీ క్యాబేజీలో విటమిన్ ఎ, బి, ఐరన్, జింక్, కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది. కాబట్టి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. పాలకూర పాలకూరలో ఐరన్, విటమిన్ ఎ, కాల్షియం, విటమిన్ సి వంటి పోషకాలు ఉంటాయి. ఇందులో ఫైబర్ అధిక శాతం ఉండటం వల్ల మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలి అదుపులో ఉంటుంది. కంటిచూపు మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ క్యాప్సికమ్‌లో పొటాషియం, ఫోలేట్, విటమిన్ బి6, సి, ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో క్యాప్సైసిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీవక్రియ రేటును పెంచుతుంది. వేగంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్‌లో ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఎక్కువ మొత్తంలో నీరు ఉంటుంది. దీన్ని తినడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. సులువుగా బరువు తగ్గుతారు. వీటన్నింటినీ తీసుకోవడంతో పాటు ప్రతిరోజూ వ్యాయామం చేయడం, సమయానికి తినడం, తగినంత నిద్రపోవడం కూడా అవసరం. -
మా కుక్కలు కూడా డైట్ మెయింటైన్ చేస్తాయి...అందుకే మాకు పొట్టలు రావు
-
తాప్సీ డైటిషియన్ నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే! స్వయంగా చెప్పిన నటి
సినీ సెలబ్రెటీలది లగ్జరీ లైఫ్. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటులు ఏం చేస్తుంటారు, ఏం తింటుంటారో తెలుసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. సాధారణ ప్రజల కంటే వారి ఆహారపు అలవాట్లు కాస్తా భిన్నంగా ఉంటాయి. అలాగే నటీనటులు కూడా ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్నెస్, గ్లామర్‌పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వెచ్చించే డబ్బు లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విషయాలు తెలిసినప్పడు అంతా అవాక్కవుతుంటారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ తన ఫిట్నెస్ కోసం పెట్టే ఖర్చు ఎంతో బయటపెట్టింది. ఇది తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు బాడీలో మార్పులు వస్తుంటాయి. చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే.. ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్స్ సలహా చాలా అవసరం. మనం ఎప్పుడు ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వారు సూచిస్తుంటారు. అందుకే ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా డైటిషియన్‌ను పెట్టుకున్నా. నా డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు పే చేస్తాను. అది నా ప్రోఫెషన్. తప్పుదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్పీ డైటీషియన్ జీతం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ‘ఒక్క డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే.. ఇక మిగలిన వాటికి ఎంత చేస్తుందో?’ అంటూ నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు. కాగా తాప్సీ చివరగా తెలుగులో మిషన్ ఇంపాజిబుల్లో నటించింది. -
క్రిస్టియానో రొనాల్డో సీక్రెట్స్ బట్టబయలు
పోర్చుగల్ ఫుట్‌బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డోకు అభిమానం గణం ఎక్కువే. ఆరడుగుల అందగాడు ఏం తింటాడు, ఫిట్నెస్ ఎలా మెయింటేన్ చేస్తున్నాడన్న సీక్రెట్స్ తెలుసుకోవాలని అతన్ని ప్రేమించే అభిమానులకు కుతూహులం ఉండడం సహజం. అంతేకాదు మ్యాచ్‌లో కనిపించిన ప్రతీసారి రొనాల్డో చేతులకు రెండు రింగులు కనిపిస్తాయి. అందులో ఒకటి ఫిట్నెస్ రింగ్ అయితే.. మరొకటి బ్రేస్లెట్(Bracelet). బ్రేస్లెట్(Bracelet) అనేది తన పర్సనల్ కాబట్టి దాని గురించి మాట్లాడుకోనవసరం లేదు. కానీ రొనాల్డో ఫుట్ సీక్రెట్ ఏంటి.. ఫిట్నెస్ రింగ్ ఎందుకు ధరించాడనే దానిని ఒక వ్యక్తి బట్టబయలు చేశాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బ్లీసా. స్పానిష్ న్యూస్‌పేపర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో ఫుట్ సీక్రెట్స్‌తో పాటు అతని ఫిట్నెస్ రింగ్ రహస్యాన్ని పంచుకున్నాడు. ''రొనాల్డో తన ఫుడ్‌లో కొవ్వు తక్కువగా ఉండే పదార్థాలకు ఎక్కువ చోటిస్తాడు. అతను పాటించే స్ట్రిక్ట్ డైట్ ఫిట్‌గా ఉంచేందుకు దోహదపడుతుంది. తినే ఆహారాన్ని బట్టి ఆరోజు ఎన్ని కేలరీలు కరిగించాలనేది రొనాల్డో ముందుగానే నిర్ణయించుకుంటాడు. అందుకు తగ్గట్టుగానే తనను తాను ప్రిపేర్ చేసుకుంటాడు. ఈ సందర్భంగా మీకో విషయం చెప్పాలి. ప్రస్తుతం రొనాల్డో ప్రాతినిధ్యం వహిస్తున్న అల్-నసర్ క్లబ్‌లోని ఆటగాళ్లంతా రొనాల్డో కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారు. దీనివల్ల ఆటగాళ్లలో 90శాతం మార్పు కనిపిస్తోంది. కొవ్వు తక్కువున్న పదార్థాలను తీసుకుంటూ ఆటగాళ్లు గంటల తరబడి ఎక్సర్సైజులు చేస్తూ తమ ఫిట్నెస్ను రోజురోజుకు మరింత మెరుగుపరుచుకుంటున్నారు. అల్-నసర్ క్లబ్ న్యూట్రిషనిస్ట్ జోస్ బీస్లాతో రొనాల్డో ఇక రొనాల్డో చేతులకు రెండు రింగులు ఉంటాయి. ఒకటి బ్రేస్లెట్.. మరొకటి ఫిట్నెస్ రింగ్. ఈ ఫిట్నెస్ రింగ్ రొనాల్డో ఎంతసేపు నిద్రపోతున్నాడు.. ఎంతసేపు ఫిజికల్ యాక్టివిటీస్‌లో చురుగ్గా ఉన్నాడనేది లెక్కిస్తుంది. అతను పడుకున్నా, కదలికలు ఉన్నా ఫిట్నెస్ రింగ్ పని చేస్తూనే ఉంటుంది. అంతేకాదు హార్ట్‌బీట్‌తో పాటు శ్వాసరేటను, శరీర ఉష్ణోగ్రతను, కదలికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఇక బ్రేస్లెట్ అతని పర్సనల్ విషయం.. దాని గురించి ఆరా తీయలేదు(నవ్వుతూ)'' ముగించాడు. ఇక రొనాల్డో గతేడాది డిసెంబర్లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. పోర్చుగల్ జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన రొనాల్డో కేవలం ఒకే ఒక్క గోల్ కొట్టి దారుణ ప్రదర్శన చేశాడు. అటుపై మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్‌తో జరిగిన వివాదం తెగదెంపులకు దారి తీసింది. అయితే రొనాల్డో క్రేజ్ మాత్రం ఏం తగ్గలేదు. అల్-నసర్ ఫుట్‌బాల్ క్లబ్‌తో రొనాల్డో రెండేళ్ల కాలానికి భారీ ఒప్పందం చేసుకున్నాడు. View this post on Instagram A post shared by Jose Blesa Nutrición (@joseblesanutri) Beautiful 💛🎶 https://t.co/uFWlOgLkQv pic.twitter.com/PgdCK697N0 — AlNassr FC (@AlNassrFC_EN) February 17, 2023 చదవండి: 'కనబడుట లేదు'.. ఐపీఎల్లో ఆడించేందుకే ఈ డ్రామాలు Christian Atsu: టర్కీ భూకంపం.. మృత్యువుతో పోరాడి ఓడిన స్టార్ ఫుట్‌బాలర్ Viswanathan Anand: చదరంగంలో మిస్టర్ మేధావి.. తొలి గురువు ఎవరంటే? -
గోల్డెన్...ఫైట్
సాక్షి, హైదరాబాద్: ఆమె కరాటే సాధన ప్రారంభించే సమయానికి వయసు 12ఏళ్లు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనే సమయానికి 13ఏళ్లు. ‘తొలుత ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మా నాన్న చాలా సంకోచించారు. అయితే నా పట్టుదల చూసి వెన్ను తట్టారు. ఇప్పుడు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు సయ్యదా. సాధన తప్పదు..గాయాలూ తప్పవు ‘టోర్నమెంట్‌కు ముందు రోజుకి కనీసం 4 నుంచి 5 గంటల పాటు శిక్షణ తప్పనిసరి. మిగిలిన రోజుల్లో కూడా రెండు పూటలా ఫిట్నెస్ కాపాడుకునే వ్యాయామాలు చేయాల్సిందే’ నని చెప్పారు సయ్యదా. ‘ఏ విజయం కూడా సునాయాసంగా రాదు. పురుషులకైనా, మహిళలకైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే కష్టం అనిపించదు’ అంటారు. కామన్వెల్త్ ఛాంపియన్ షిప్కి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉందనగా సరిగ్గా 2 నెలల ముందు కాలికి తీవ్ర గాయంతో కదలలేకుండా పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ... ఇవన్నీ ఆటలో భాగం అంటారామె. డైట్...రైట్..రైట్ సాధనకు తగ్గట్టుగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైన డైట్ తీసుకుంటానని చెబుతున్నారామె. రోజువారీగా వ్యాయామం తప్పదు. అందుకే రంజాన్ వంటి అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భాల్లో ఆమె మరింత జాగ్రత్తగా తన సాధనను దినచర్యను బ్యాలెన్స్ చేసుకుంటారామె. రాజకీయ శాస్త్రంలో పట్టా సాధించి, ప్రస్తుతం లా కోర్సు చేస్తున్న సయ్యదా... తాజాగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం విశేషం. రాజకీయాల్లో క్రీడాభివృద్ధికి మాత్రమే కాక మహిళల స్వయం సాధికారత కోసం కూడా తాను కృషి చేస్తానని అంటున్నారామె. (చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై) -
స్లిమ్, జీరోసైజ్ మోజులో ప్రాణాల మీదకు
‘నేడు ప్రపంచంలో ఎంతోమంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నారు. ఆహారం దొరకక కాదు. కచ్చితమైన శరీర కొలతల చట్రంలో ఇమడటానికి’ అనే విషయాన్ని మిరాసోల్ ఈటింగ్ డిజార్డర్ రికవరీ సంస్థ స్పష్టం చేసింది. ప్రపంచంలో దాదాపు 69 మిలియన్ల మంది మహిళలు సమాజం విధించిన కొలతల చట్రంలో తమ శరీరాన్ని ఉంచడానికి పొట్ట మాడ్చుకుంటున్నారని, ఫలితంగా వారు అనొరెక్సియా వంటి ప్రమాదకర ఆరోగ్యసమస్యల బారినపడుతున్నారని తమ నివేదికల ద్వారా తెలియజేసింది. ఇటీవల బాలీవుడ్ నటి శ్వేతా తివారి షూటింగ్ జరుగుతున్న సమయంలో సృహ తప్పిపడిపోయి, ఆసుపత్రిలో చేరింది. కొన్ని రోజుల్లోనే ఏకంగా పది కేజీల బరువు తగ్గిన శ్వేత తాను తీసుకున్న ఆహార నియమాల వల్లే ఆసుపత్రి పాలైందని తెలుస్తుంది. సాధారణంగా పురుషుడు అంటే శారీరకంగా దృఢంగా ఉంటాడు. స్త్రీ అంటే సున్నితంగా, సన్నగా ఉంటుంది అనేది సర్వత్రా అందరిలోనూ ఉన్న ఆలోచన. అమ్మాయిలు నాజూకుగానే ఉండాలనే విషయంలో స్లిమ్, జీరోసైజ్, కచ్చితమైన శరీర కొలతల కోసం చేసే ప్రయోగాలు వారి ప్రాణాల మీదకు తెస్తూనే ఉన్నాయి. సామాజిక మాధ్యమాల్లో ... జీరోసైజ్ ఫిగర్, పర్ఫెక్ట్ ఫిగర్, అమ్మాయి శరీరం వంపులుగా ఉండాలి, బండగా ఉంటే బాగుండదు.. వంటి బాడీ ఇమేజ్ కామెంట్లు సోషల్ మీడియా ద్వారా మన ఇంటి డైనింగ్ టేబుల్ నుంచి టాయిలెట్ వరకు చేరుకుంటున్నాయి. ఇటీవల 40 ఏళ్ల శ్వేత తివారీ తన ఫొటోషూట్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచింది. ఆమె గతంలో కన్నా చాలా సన్నగా, కొత్త స్టైల్లో కనిపించింది. ఇలా నాజూకు బొమ్మలా కనిపించే ‘గ్లామర్ డాల్స్’ ఎంతోమంది నేటి అమ్మాయిలకు ‘సన్న’బడాలనే విషయంలో ప్రేరణగా నిలుస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసే చిత్రాల్లో మరింత స్లిమ్‌గా కనిపించాలనే తాపత్రయం సన్నగా మారడానికి ప్రయోగాలు చేసే దిశగా మళ్లిస్తుందన్నది నిజం. తమ ‘జీరో సైజ్’ ఫొటోలకు ఎన్ని లైక్‌లు, షేర్లు వస్తే అంత గొప్పగా భావించేవారూ ఎక్కువయ్యారు. వయసును దాచడానికి కూడా ‘సన్న’బడటం ఒక ప్రామాణికంగా మారింది. ‘కచ్చితమైన కొలతల్లో ఉండాలనే భారం ఎంతో మంది అతివల మీద మోయలేనంతగా పెరిగిపోయింది. ఫలితంగా నవ్వడం, ఆడటం, తినడం, తాగడం వంటివి కూడా కేలరీలలో లెక్కించడం ప్రారంభిస్తున్నారు. చివరకు ప్రమాదకరమైన వ్యాధులకు లోనవుతున్నారు’ అంటున్నారు మానసిక నిపుణులు. ఆ అవగాహన అగమ్యం ఒకప్పుడు సినిమా రంగానికే పరిమితమైన గ్లామర్ ఈ నవ లోకంలో చాలా మంది యువతను చుట్టుముట్టేసింది. అందుకు తగినట్టుగానే డిజిటల్ మీడియా అందించిన రెక్కలతో యువత కొత్తగా విహరిస్తోంది. బాలీవుడ్ నటి రిచా చద్దా ఒక ప్రదర్శనలో అందం గురించి మాట్లాడుతూ ‘నేను గతంలో అందం ప్రమాణాలలో ఎంతగా మునిగిపోయానంటే, తిన్న ఆహారం వాంతులు చేసుకోవడమే దినచర్యగా ఉండేది. చాలా కాలం తర్వాత కోలుకోగలిగాను’ అని వివరించింది. ప్రిన్సెస్ డయానా కూడా ఈ సమస్యతో బాధపడిందని, అనొరెక్సియా వ్యాధికి గురైందని బ్రిటీష్ కుటుంబ జీవిత ఆధారంగా ‘ది క్రౌన్’ సీరిస్‌లో తెలియజేశారు. చాలా మంది సినీతారలు తాము తీసుకునే ఆహారంలో వారి శరీరానికి తగినట్టు పోషకాహారనిపుణుల సూచనలు పాటిస్తుంటారు. అవేమీ తెలియని దిగువ, మధ్యతరగతి మగువలు ‘సన్న’గా ఉండాలంటే తినే తిండి సగానికి పైగా తగ్గించేయాలనుకుంటున్నారు. ఇక బులీమియా అనే సమస్యకు లోనయినవారు ఆకలికి తట్టుకోలేక తిన్నా, ఆ తిన్నదానిని బలవంతంగా వాంతి చేసుకోవడానికి గంటలు గంటలు టాయిలెట్లలో గడుపుతుంటారు. ఫలితంగా బలహీనత, రక్తహీనత, రుతుక్రమ సమస్యలు, రకరకాల ఆందోళనలతో గడుపుతూ చివరకు డిప్రెషన్ బారిన పడే అవకాశమూ ఉంది. నివేదికల్లో స్పష్టం ఈటింగ్ డిజార్డర్స్‌పై పనిచేస్తున్న మిరాసోల్ అనే అంతర్జాతీయ సంస్థ నివేదిక ప్రకారం 43 మిలియన్ల మంది మహిళలు తాము తీసుకునే ఆహారం చాలా తక్కువగా ఉండాలనుకుంటున్నారు. 26 మిలియన్ల మహిళలు తమ శరీర ఆకృతిని ఏవిధంగానైనా కాపాడుకోవాలి అనుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 69 మిలియన్ల మంది మహిళలు తమ శరీరం ఒక కొలతల చట్రంలో ఉంచడానికి ఆకలితో ఉంటున్నారు. ప్రపంచంలో పురుషుల్లో కేవలం 0.3 శాతం మందిలోనే రక్తహీనత ఉంటే, ఇది మహిళల్లో ఒక శాతం ఉంది. 15 నుంచి 24 ఏళ్ల వయసు వారిలో ఈ ప్రభావం అధికంగా ఉందనే విషయాలను కూడా ఈ సంస్థ స్పష్టం చేసింది. ‘చిన్న వయస్సు నుండే మహిళలు సన్నగా, కొలతల ప్రకారంగా ఉన్న చిత్రాలలోని మహిళలను చూసి, అదే స్థిరమైన శరీర ఇమేజీగా మనస్సుల్లో ముద్రించుకుంటున్నారు. ఈ ప్రక్రియ వల్ల చాలా సార్లు స్వీయహింసకు గురవుతున్నారు. అమ్మాయిల్లో ‘జీరో సైజ్’ సమస్య పెరుగుతున్న ఈ కాలంలో వారిని ఆ ప్రభావం నుంచి బయట పడేయడానికి కుటుంబసభ్యులు, మిత్రుల సాయం తప్పనిసరి. పోషకాహార నిపుణులు, మానసిక నిపుణుల సాయంతో ‘కొలతల్లో ఇమిడిపోవాల’నే ఆలోచనను అధిగమించవచ్చు’ అంటున్నారు నిపుణులు. -
నేను చేసిన తప్పు అదేనేమో!
‘‘ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఈ కారణంగా నా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు తమన్నా. ‘‘కొన్నేళ్ల క్రితం సరైన ఆహారపు అలవాట్లనే ఫాలో అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్ లుక్స్ కోసం ఎక్కువగా వర్కౌట్స్ చేశాను. దీంతో నాకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేందుకు కేవలం సేంద్రీయ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నాను. వ్యాయామ నిపుణల సలహాల ప్రకారమే వర్కౌట్స్ చేస్తున్నాను. స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించేందుకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాను. నా కెరీర్ ఆరంభంలోనే ఓ మంచి డైటీషియన్‌ను నియమించుకోకపోవడమే నేను చేసిన ఓ తప్పుగా భావిస్తున్నాను’’ అని తమన్నా చెప్పుకొచ్చారని నెటింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో తమన్నా చేస్తున్న ‘ఎఫ్ 3’, ‘గుర్తుందా..శీతాకాలం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. -
అవసరానికి మించి ప్రోటీన్స్ ప్రమాదమే..
మనం తరుచూ తీసుకునే ఆహారపదార్థాల్లో పోషక విలువలు సమతుల్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. శరీరానికి పుష్టిని చేకూర్చే పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్స్ అందుతాయి. ఆరోగ్యమే మనకి మహా సంపదతో సమానం. ‘‘అనారోగ్యంతో ఉన్న వారికి సకల ఐశ్వర్యాలున్నా.. వృధానే’’అని పెద్దలు చెబుతుంటారు. శరీరానికి 70 శాతం వ్యాయామం.. 30 శాతం తిండి అవసరం. కానీ ఇందుకి భిన్నంగా ప్రస్తుతం జరుగుతోంది. సమయానికి తగ్గట్లు సరైన ఆహారం తీసుకోవాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. మన వంటింట్లోనే మనకు కావాల్సిన పోషకాలున్న పదార్థాలు ఉన్నాయి. కానీ వాటిని తీసుకునే విధానంలో క్రమపద్ధతిని పాటించడం లేదు. డా. లవ్‌నీత్ బాత్రా చేసిన సూచనలు ఉదయం పూట: ఒక కప్పు నీటిలో గోధుమ గడ్డి (వీట్ గ్రాస్) పౌడర్, ఒక టీస్ఫూను కొబ్బరి నూనె లేదా టీ స్ఫూను పీనట్ బటర్‌తో పాటు రోజుకో ఆపిల్‌ను డైట్లో చేర్చుకోవాలి. టిఫిన్ కి ముందు: ప్రోటీన్లు కలిగిన పదార్థాలలో కొబ్బరి నీరు ఉండేటట్లు చూసుకోవాలి. టిఫిన్‌లోకి మూడు ఎగ్‌వైట్స్, శెనగలతో చేసిన పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శనగల్ని ఇష్టపడని వారు టోస్ట్ అవకాడోని తీసుకోవచ్చు. ఒక వేళ శాకాహారులైతే 100 గ్రాముల పన్నీర్ ని కలుపుకోవచ్చు. భోజనానికి ముందు: ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒక టీ స్ఫూన్ నానాబెట్టిన వేరుశనగలు తీసుకోవాలి. భోజనం: అన్నంతో పాటు ఒక కప్పు పెరుగు, వంద గ్రాముల పన్నీర్, ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. రొట్టెతో పప్పు లేదా బెండకాయ, కూరగాయలు ఉంటే సరిపోతుంది. మధ్యాహ్నం మూడింటికి: చక్కెర శాతం తక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి. చెర్రీ మొదలయినవి ఉంటే మంచిది. సాయంత్రంఐదింటికి: టోస్ట్‌తో పాటు లైట్ పుడ్ చిప్స్, బిస్కెట్స్ లాంటి వాటిని తీసుకోవాలి అవసరమైతే అవకాడో వంటివి అదనంగా చేర్చుకోవచ్చు. ఏడింటికి: కొద్దిగా (మష్రూమ్) పుట్టగొడుగు సూప్ లేదా వేడిగా ఏవైనా తీసుకుంటే సాయంత్రం పూట నూతనుత్తేజం వస్తుంది. చివరగా డిన్నర్: బ్రౌన్‌రైస్‌తో పాటు ( అన్ ఫాలిష్) 150 గ్రాముల సోయా(టోఫు) ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే రెండు చపాతీలతో బెండకాయ లేదా కాయగూరలు ఉండేట్లు సిద్ధం చేసుకోవాలి. ఏవైన ఇతర సమస్యలుంటే నిద్రకి ముందు అశ్వగంధ టాబ్లెట్లు లేదా నానాపెట్టిన అయిదు బాదం గింజల్ని తీసుకోవడం మంచిది. ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాలు 1. శరీర అవయవాల(ఆర్గాన్స్) పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల వేడి నీటిని ప్రతీ రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. 2. శరీరానికి ప్రోటీన్ 30 గ్రాములకు మించినా ప్రమాదమే...! 3. డాక్టర్ బాత్రా మాట్లాడుతూ..‘‘ మీ శరీరానికి నూతనుత్తేజం వ్యాయామ్యమేనని కనీసం రోజుకి 30 నిమిషాలు వ్యాయామ్యం చేయడం ద్వారా సమతుల్యంగా ప్రోటీన్ శరీరానికి అందుతుంది. రోజుకు మనకు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్ సరిపోతుందని’’ ఆమె తెలిపారు. 4. అవసరానికి మించి ప్రోటిన్ తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరమని గ్యాస్, అజీర్తిని కలిగిస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 5. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం (లివర్)దేనికి లేని ప్రత్యేకత కాలేయానికి ఉంది. 90 శాతం చెడిపోయినా కూడా తొలగిస్తే తిరిగి పెరుగుతుంది. అలాంటి దానిని కపాడుకోవాలి కదా..:! లివర్ పనితీరును మెరుగుపరిచేందుకు గోధుమ గడ్డి( వీట్ గ్రాస్) అశ్వగంధ ఉపయోగపడుతుందని సమతుల్య ఆహారాన్ని తీసుకుని కండరాలను పుష్ఠిగా మార్చుకోవాలని అన్నారు. ఎక్కువ ప్రోటీన్ శరీరంలో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని హెచ్చరించారు. ఈ రోజే మీ డైట్ ను ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారండి. మరెందుకు ఆలస్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. -
కఠిన క్రమశిక్షణ రామ
బోయపాటి శ్రీను సినిమాల్లో యాక్షన్స్ సీన్లు ఎక్కువ. విలన్స్ కూడా. మరి వాళ్లను మట్టికరిపించాలంటే హీరో ఎలా ఉండాలి? పిడికిలి బిగిస్తే చొక్కా చినిగేలా కండలు, గుండీలు ఊడిపోయేంత దేహదారుఢ్యం ఉండాలి. ‘వినయ విధేయ రామ’ పోస్టర్స్‌లో, ట్రైలర్లో అలాంటి బాడీనే రామ్‌చరణ్ చూపించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్‌చరణ్, కియారా అద్వానీ జంటగా నటించిన చిత్రం ‘వినయ విధేయ రామ’. దానయ్య నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం రామ్‌చరణ్ ఎటువంటి డైట్ ఫాలో అయ్యారనే డౌట్ ఫ్యాన్స్‌కు కలిగింది. ఆ సందేహాన్ని తీర్చారు చరణ్ భార్య ఉపాసన. జిమ్ ట్రైనర్ రాకేశ్ ఉడియార్ తయారు చేసిన ఫుడ్ చార్ట్‌నే ఫాలో అయ్యారట చరణ్. ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఆరు వరకూ సాగే ఈ డైట్లో ఉదయం ఎనిమిదిన్నరకు త్రీ ఎగ్ వైట్స్, రెండు ఎగ్స్, ఓట్స్‌తో పాటు ఆల్మండ్ మిల్క్, పదకొండున్నరకు పెద్ద కప్పు వెజిటెబుల్ సూప్, మధ్యాహ్నం ఒకటిన్నరకు చికెన్, బ్రౌన్ రైస్‌తో పాటు వెజిటెబుల్స్ కర్రీ. సాయంకాలం నాలుగంటలకు గ్రిల్డ్ ఫిష్, స్వీట్ పొటాటో, ఒకటిన్నర కప్పు గ్రీన్ వెజిటెబుల్, సాయంత్రం ఆరుగంటలకు గ్రీన్ ఫ్రూట్స్ సలాడ్‌తో పాటు కొన్ని నట్స్ తీసుకోవాలి. కాఫీ, పాల ఉత్పత్తులు, స్వీట్ ఎక్కువ కలిగి ఉన్న ఫ్రూట్స్, మద్యానికి స్ట్రిక్ నో. ఈ మధ్యలో ఆకలిగా అనిపిస్తే నట్స్, పచ్చి కూరగాయలు తీసుకోవచ్చు. ఈ డైట్‌ను రామ్‌చరణ్ సుమారు 21 రోజులు పాటించారట. అలాగే రాత్రి డిన్నర్ టైమ్ నుంచి ఉదయం టిఫిన్‌కు సుమారు పన్నెండు గంటలు ఖాళీ కడుపుతోనే ఉన్నారట. ఇంత కష్టతర, కఠిన డైట్‌ను కూడా క్రమశిక్షణతో విధేయంగా పాటించారు కాబట్టే స్క్రీన్ మీద విసిల్ కొట్టే బాడీతో కనిపించనున్నారు చరణ్. -
బ్యూటీ క్వీన్.. వర్కవుట్‌తో విన్
ఆకాశం నుంచి దిగొచ్చినట్టు ఉంటారు. ఆత్మవిశ్వాసంతో మెరిసిపోతుంటారు. కదలికల్లో కవ్వింపు ఉంటుంది. అన్నింటా ‘రాణి’ంపు ఉట్టిపడుతుంది. బ్యూటీ కాంటెస్ట్‌లలో పాల్గొని వచ్చిన అమ్మాయిల తీరే మారిపోతుంది. దీనికి కారణం కాంటెస్ట్‌లో పాల్గొన్న సమయంలో వారితో చేయించే సాధన. ముఖ్యంగా ఫిట్నెస్–డైట్ రొటీన్ అని చెప్పాలి. నగరానికి చెందిన యువతులకు బ్యూటీ పోటీలపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ కాంటెస్ట్‌లలో పాల్గొనే వారికిచ్చే శిక్షణకు సంబంధించి నిపుణులు చెబుతున్న విశేషాలివి... సాక్షి, సిటీబ్యూరో : అటు శరీరాన్ని, ఇటు బాడీ లాంగ్వేజ్‌ని తీర్చిదిద్దడానికి ఫిట్నెస్ అత్యవసరం.దీని కోసం వీరితో చేయించే సాధన క్రమం ఇలా ఉంటుంది. ⇔ మైండ్ అండ్ బాడీ: యువతుల దేహంతో పాటు మైండ్‌ని కూడా తప్పనిసరిగా ట్యూన్ చేస్తారు. దీని కోసం ఫ్రీనెక్ ఎక్సర్సైజ్లు, బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయిస్తారు. అలాగే పర్వత త్రికోణాసన, అర్ధకటి చక్రాసన, వజ్రాసన తదితర ప్రాధమిక స్థాయి యోగాసనాలు వేయిస్తారు. ⇔ బాడీ బ్యాలెన్స్: శరీరంలో ఫ్లెక్సిబిలిటీని పెంచడమే దీని ఉద్దేశం. ర్యాంప్‌వాక్ చేసేటప్పుడు సరైన విధంగా అడుగులు కదపడానికి పిలాటిస్ వ్యాయామం చేయిస్తారు. అలాగే దృష్టిని ఒకే చోట నిలుపుతూ మాట్లాడడానికి ఏకాగ్రత అవసరం. కాబట్టి యోగాని పిలాటిస్తో కలిపి ప్రత్యేక వర్కవుట్ చేయిస్తారు. ⇔ బాడీ ఎటాక్: సాధన ఊపందుకున్నాక చేయించే ప్రక్రియ ఇది. దీనిలో భాగంగా క్రీడాకారుల శైలి వ్యాయామాలు చేయిస్తారు. కేవలం బాడీ వెయిట్‌తో మాత్రమే చేసే వర్కవుట్స్ దీని స్పెషాలిటీ. వీటికి ఏరోబిక్స్ కూడా జత చేస్తారు. ⇔ బూట్ క్యాంప్: పచ్చని ప్రకృతి, సహజమైన వాతావరణంలో దీనిని చేయిస్తారు. ఇది సర్క్యూట్ స్టైల్ వర్కవుట్. పుషప్స్, సిటప్స్, స్క్వాట్స్, లంజెస్, కెటిల్ బెల్స్, బాల్ వర్క్‌లతో పాటు స్కిప్పింగ్, రన్నింగ్, కాలిస్థెనిక్స్ వంటివి ఉంటాయి. మరికొందరితో కలిసి చేయాల్సిన వ్యాయామ విధానం ఇది. ⇔ బాడీపంప్: చాలామంది అమ్మాయిలకు తమకు ఫ్యాట్ ఉన్న విషయం తెలియదు. ఈ కాంటెస్ట్‌లలో ఏ మాత్రం ఫ్యాట్ ఉన్నా ఫలితం వ్యతిరేకం కాక తప్పదు. అందుకే ప్రపంచంలోనే అత్యంత వేగంగా కొవ్వును కరిగించే వ్యాయామశైలి అయిన బాడీపంప్ను చేయిస్తారు. వెయిట్స్తో చేసే స్ట్రెంగ్త్ ట్రయినింగ్ ఆధారంగా రూపుదిద్దుకున్న వ్యాయమం ఇది. లోయర్‌బాడీ కంటే అప్పర్ బాడీకి కాస్త ఎక్కువగా వెయిట్స్ ఉపయోగిస్తారు. ⇔ లెథల్ లెగ్స్: సరైన టోనింగ్ ఉంటేనే లోయర్ బాడీ లుక్ బాగుంటుంది. అందుకే లోయర్‌బాడీ టోనప్ చేసేందుకు ప్రత్యేకంగా రూపొందింది లెథల్ లెగ్స్. దీనిలో స్క్వాట్స్, లంజెస్, లెగ్ రైజర్స్, లెగ్ కిక్స్ వంటివి ఉంటాయి. ⇔ కూల్‌డౌన్: వ్యాయామాన్ని వార్మప్‌తో ప్రారంభించి తప్పనిసరిగా దేహం కూల్‌డౌన్ కావాలి. దీనికోసం కొన్ని రకాల సెల్ఫ్ స్ట్రెచ్‌లు కనీసం 10సెకన్లు అదే భంగిమలో ఉండేట్టు చేయిస్తారు. శవాసనంతో ఫిట్నెస్ రొటీన్ ముగిసిన తర్వాత వ్యక్తిగత సందేహాలను నివృత్తి చేసేందుకు 15నిమిషాల పాటు గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి. డైట్..వెరీ స్పెషల్ అందాల పోటీల్లో పాల్గొనే వారికి డైట్ క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది. అయితే ఫ్యాట్లెస్గా అన్ని పోషకాలతో ఉంటుంది. తెల్ల బియ్యంతో వండిన అన్నం అసలు ఉండదు. ఇక అత్యధికంగా వినియోగించేవి కూరగాయలు. డైట్ విషయంలో టైమ్‌టేబుల్ ఏ మాత్రం మిస్సవకుండా జాగ్రత్త పడతారు. రోజుకు కనీసం గంటన్నర పాటు వ్యాయామాలు చేస్తున్నప్పుడు ముఖసౌందర్యం దెబ్బతినకుండా, మేని మెరుపు కోల్పోకుండా జాగ్రత్తగా డైట్‌ని తీర్చిదిద్దుతారు. పోషకాహార నిపుణులు ప్రత్యేకంగా రూపొందించిన వంటకాల మెనూ వీరికి వడ్డిస్తారు. ⇔ బ్రేక్ ఫాస్ట్: పుచ్చకాయ, బొప్పాయి పండు ముక్కలు, కీరదోసకాయ, టమాటా ముక్కలు, వెన్న తీసిన పెరుగు, వీట్ఫ్లేక్స్, కార్న్‌ఫ్లేక్స్, ఎండు ఖర్జూరాలు, బాదం, ఎగ్ వైట్స్, ఉడకబెట్టిన బీన్స్, ఓట్మీల్, కొతిమీర పచ్చడి, ఊతప్పం, వెజిటబుల్ సాంబార్, బటర్‌మిల్క్, కమలా పండ్లు, పైనాపిల్ జ్యూస్, వీట్‌బ్రెడ్, విభిన్న గింజధాన్యాలతో రూపొందిన మల్టీ గ్రెయిన్ బ్రెడ్ తదితర సమాహారంగా ఉంటుంది. ⇔ లంచ్: టమాటా సలాడ్స్, క్యారెట్స్ లేకుండా ఇండియన్ గ్రీన్ సలాడ్స్, క్యాబెజీ రెడ్ ఆనియన్ సలాడ్స్, స్టీమ్డ్ అమెరికన్ కార్న్ చాట్, టమాటా సాస్‌తో గ్రిల్డ్ వెజిటబుల్స్, రోటీలు, మేతీ మూంగ్ దాల్, గోధుమ పిండి చపాతీలు ఉంటాయి. ⇔ డిన్నర్: స్టీమ్డ్ చికెన్, పప్పు, గోధుమ బ్రెడ్ రోల్స్, ఉడికించిన బ్రౌన్‌రైస్, చేపలు, పుదీనా పరాటాలు వంటివి రాత్రి డైట్‌కి ఉపయోగిస్తారు. తరచూ వెజ్సూప్లు, కొబ్బరి నీళ్లు, జల్జీరా జ్యూస్‌లు, పండ్లు, డ్రైఫ్రూట్స్ అందిస్తారు. ఇందులో పూర్తిగా కాకపోయినా కూసింతైనా ఫాలో అవగలిగితే కిరీటం సంగతేమో గానీ.. ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడడం సాధ్యమే. అందుకే బ్యూటీ కాంటెస్ట్‌లో పాల్గొని గెలిచినవారు, ఫైనలిస్ట్‌గా మాత్రమే మిగిలినవారు కూడా ఈ కాంటెస్ట్ మా జీవితాన్ని మార్చేసింది అని చెబుతారు. -
వారానికి రెండు రోజులు అలా చేస్తే..
లండన్ : మారుతున్న జీవన శైలితో చిరుప్రాయంలోనే వ్యాధులు దాడిచేస్తున్న క్రమంలో మెరుగైన మార్పుల ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. వారంలో రెండు రోజుల పాటు తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా గుండె జబ్బుల ముప్పును తప్పించుకోవచ్చని యూనవర్సిటీ ఆఫ్ సర్రేకు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 5:2 డైట్‌గా పేరొందిన ఈ ఆహారాన్ని వైద్య నిపుణులు పెద్ద ఎత్తున సిఫార్సు చేస్తున్నారు. సాధారణ క్యాలరీల కంటే తక్కువ క్యాలరీలతో కూడిన ఆహారాన్ని వారంలో రెండు రోజులు తీసుకుంటే జీవక్రియల వేగం పుంజుకుంటుందని వారు చెబుతున్నారు. 5:2 డైట్ ద్వారా శరీరంలో హానికారక కొవ్వులను సులబంగా తొలగించుకోవచ్చని పరిశోధకులు తేల్చారు. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో కార్డియోవాస్క్యులర్ జబ్బుతో పాటు ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఒబెసిటీతో బాధపడుతున్నవారితో పాటు ఇతరులపై పరిశోధకులు జరిపిన క్యాలరీ లెక్కింపులో ఈ ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. అథ్యయన వివరాలు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురితమయ్యాయి. -
సెక్సీ స్టార్ ఫిట్ నెస్ పాఠాలు!
మల్లికా షెరావత్.. ఈ పేరు బాలీవుడ్ లో ఒకప్పటి సంచలనం. 'మర్డర్' సినిమాలో ఆమె సన్నివేశాలు చూసిన వారు ఇప్పటికీ ఆమె నుంచి మనసు మరల్చుకోలేరు. సెక్స్ బాంబ్ గా పేరున్న ఈ నటి ప్రస్తుతం ఫిట్ నెస్ పైనే ధ్యాస నిలిపింది. నాలుగు పదుల వయసుకు దగ్గర్లో ఉన్నా స్లిమ్ గా ఉండటం ఆమెకే చెల్లిందని బాలీవుడ్ జనాలు అప్పుడప్పుడు చెప్పుకునేవారు. ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ అదే ఫిజిక్ ను ఆమె కొనసాగిస్తుంది. తాజాగా ఆమె జిమ్ లో కసరత్తులు చేయడం ఎందుకు మొదలుపెట్టిందంటూ అక్కడ చర్చనీయాంశంగా మారింది. ట్విట్టర్లోనూ కామెంట్ చేస్తూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది మల్లిక. తన అందాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తుంది.. స్లిమ్ గా ఉండేందుకు ఎలాంటి కసరత్తులు చేస్తుందో తెలిపేందుకు ఫొటోలు, కొన్ని వీడియోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. యోగా చేయాలని, జిమ్ కు వెళ్లడం అలవరుచు కోవాలంటూ ఫ్యాన్స్ కు ఈ సెక్సీ స్టార్ సూచించింది. ఆరోగ్యంగా ఉండటం, బాడీని ఫిట్ గా ఉంచుకోవడం ట్రెండ్ కాదని ట్విట్ లో రాసుకొచ్చింది. ఇది మన జీవన విధానంలో భాగమని చెప్పింది. చివరగా గతేడాది విడుదలైన 'డర్టీ పాలిటిక్స్' లో తెరమీద కనిపించింది. శరీర సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ జిమ్ లో వర్కవుట్స్ చేయడంతో పాటు యోగా చేస్తానని చెప్పుకొచ్చింది. blockquote class="twitter-tweet" data-cards="hidden" data-lang="en"> Being healthy n fit isn't a trend , it's a lifestyle. #yoga#iyengaryoga#forwardbend #yogabymallika pic.twitter.com/ci7qpeA8Z3 — Mallika Sherawat (@mallikasherawat) March 9, 2016