నేను చేసిన తప్పు అదేనేమో! | Tamannaah Bhatia Shares Her Thoughts On Crash Diets | Sakshi
Sakshi News home page

Tamannaah: నేను చేసిన తప్పు అదేనేమో!

Published Wed, Sep 22 2021 12:02 AM | Last Updated on Wed, Sep 22 2021 7:56 AM

Tamannaah Bhatia Shares Her Thoughts On Crash Diets - Sakshi

‘‘ఓ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాను. ఈ కారణంగా నా ఆహారపు అలవాట్లు, జీవన విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి’’ అని ఇటీవల ఓ సందర్భంలో పేర్కొన్నారు తమన్నా. ‘‘కొన్నేళ్ల క్రితం సరైన ఆహారపు అలవాట్లనే ఫాలో అయ్యాను. ఆ తర్వాత డిఫరెంట్‌ లుక్స్‌ కోసం ఎక్కువగా వర్కౌట్స్‌ చేశాను. దీంతో నాకు ఓ ఆరోగ్య సమస్య వచ్చింది. ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడేందుకు కేవలం సేంద్రీయ ఆహార పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నాను.

వ్యాయామ నిపుణల సలహాల ప్రకారమే వర్కౌట్స్‌ చేస్తున్నాను. స్లిమ్‌గా, ఫిట్‌గా కనిపించేందుకు ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకుంటున్నాను. నా కెరీర్‌ ఆరంభంలోనే ఓ మంచి డైటీషియన్‌ను నియమించుకోకపోవడమే నేను చేసిన ఓ తప్పుగా భావిస్తున్నాను’’ అని తమన్నా చెప్పుకొచ్చారని నెటింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికొస్తే... తెలుగులో తమన్నా చేస్తున్న ‘ఎఫ్‌ 3’, ‘గుర్తుందా..శీతాకాలం’ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement