Taapsee Pannu Says She Spends Rs 1 lakh Per Month on Her Dietician - Sakshi
Sakshi News home page

Taapsee Pannu: ఒక్క డైటిషియన్‌కే నెలకు తాప్పీ ఎంత ఖర్చు పెడుతుందో తెలుసా?

Published Fri, Mar 17 2023 4:47 PM | Last Updated on Fri, Mar 17 2023 5:08 PM

Taapsee Pannu Says She Spends Rs 1 lakh Per Month on Her Dietician - Sakshi

సినీ సెలబ్రెటీలది లగ్జరీ లైఫ్‌. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్‌ తమ అభిమాన నటీనటులు ఏం చేస్తుంటారు, ఏం తింటుంటారో తెలుసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. సాధారణ ప్రజల కంటే వారి ఆహారపు అలవాట్లు కాస్తా భిన్నంగా ఉంటాయి. అలాగే నటీనటులు కూడా ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్‌నెస్‌, గ్లామర్‌పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వెచ్చించే డబ్బు లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విషయాలు తెలిసినప్పడు అంతా అవాక్కవుతుంటారు.

చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం?

తాజాగా స్టార్‌ హీరోయిన్‌ తాప్సీ తన ఫిట్‌నెస్‌ కోసం పెట్టే ఖర్చు ఎంతో బయటపెట్టింది. ఇది తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్‌ బిజీగా ఉన్న తాప్సీ రీసెంట్‌గా ఓ బాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫిట్‌నెస్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్‌గా ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు బాడీలో మార్పులు వస్తుంటాయి.

చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే..

ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్స్‌ సలహా చాలా అవసరం. మనం ఎప్పుడు ఏం తినాలి, ఎలాంటి ఫుడ్‌ తీసుకోవాలో వారు సూచిస్తుంటారు. అందుకే ఫిట్‌నెస్‌ కోసం ప్రత్యేకంగా డైటిషియన్‌ను పెట్టుకున్నా. నా డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు పే చేస్తాను. అది నా ప్రోఫెషన్‌. తప్పుదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్పీ డైటీషియన్‌ జీతం తెలిసి అంతా షాక్‌ అవుతున్నారు. ‘ఒక్క డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే.. ఇక మిగలిన వాటికి ఎంత చేస్తుందో?’ అంటూ నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు. కాగా తాప్సీ చివరగా తెలుగులో మిషన్‌ ఇంపాజిబుల్‌లో నటించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement