spent
-
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
పిజ్జాల కోసం డామినోస్ మాజీ సీఈవో ఖర్చు ఎంతో తెలుసా?
డామినోస్ మాజీ సీఈవో రిచ్ అల్లిసన్ మళ్లీ వార్తల్లో నిలిచారు. 2022లో ఆయన కంపెనీని విడిచిపెట్టినప్పుడు ఈ పదవి తనకు జీవితకాల ప్రత్యేక హక్కు అని వ్యాఖ్యానించారు. తాజాగా గత సంవత్సరం డామినోస్ మాజీ సీఈవో ఖర్చులకు సంబంధించిన ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఆయన వ్యక్తిగత పిజ్జా ఖర్చు కోసం దాదాపు 4,000 డాలర్లు (రూ.3లక్షలకు పైగా) చెల్లించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: ఎయిర్టెల్ కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్.. ఇక అన్లిమిటెడ్ 5జీ డేటా! ఫినాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం... డామినోస్ ఎగ్జిక్యూటివ్ పరిహారం కింద 2021 సంవత్సరంలో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసమే అల్లిసన్‌కు కంపెనీ 3,919 డాలర్లు చెల్లించింది. దీంతోపాటు వ్యక్తిగత జెట్, బృంద సభ్యుల బహుమతులు, ఇతర ఖర్చులకు ఆ సంవత్సరానికి అల్లిసన్ మొత్తంగా 7,138,002 డాలర్లు (దాదాపు రూ.59 కోట్లు) అందుకున్నారు. 2020లో మరీ ఎక్కువ.. 2021లో అల్లీసన్ పిజ్జాల ఖర్చు అంతకుముందు సంవత్సరం అంటే 2020తో పోల్చుకుంటే తక్కువే. 2021లో 3,919 డాలర్లు ఖర్చు చేస్తే అదే 2020 కరోనా మహమ్మారి సమయంలో ఆయన పిజ్జా ఖర్చు 6,126 డాలర్లు అంటే రూ.5 లక్షలకు పైనే. డామినోస్ ప్రస్తుత సీఈవో రస్సెల్ వీనర్ కూడా 2021లో వ్యక్తిగత పిజ్జా కొనుగోళ్ల కోసం 2,810 డాలర్లు ఖర్చు చేశారు. ఇదీ చదవండి: Sandeep Bakhshi: ఐసీఐసీఐ బ్యాంకును నిలబెట్టిన సీఈవో ఈయన.. జీతం ఎంతో తెలుసా? అల్లిసన్ డామినోస్ కోసం పదేళ్లకుపైగా పనిచేశారు. ఇందులో నాలుగేళ్లు కంపెనీ సీఈవోగా వ్యవహరించారు. 2022లో ఆయన పదవీ విరమణ పొందారు. అల్లిసన్ సీఈవోగా ఉన్నప్పుడు కంపెనీని పురోగతి వైపు నడిపించడమే కాకుండా రిస్క్ తీసుకునే వాతావరణాన్ని ప్రోత్సహించారు. -
తాప్సీ డైటిషియన్ నెల జీతం తెలిస్తే షాకవ్వాల్సిందే! స్వయంగా చెప్పిన నటి
సినీ సెలబ్రెటీలది లగ్జరీ లైఫ్. అందుకే వారికి సంబంధించిన ప్రతి విషయం ఆసక్తిగా ఉంటుంది. ముఖ్యంగా ఫ్యాన్స్ తమ అభిమాన నటీనటులు ఏం చేస్తుంటారు, ఏం తింటుంటారో తెలుసుకునేందుకు అమితాసక్తిని కనబరుస్తారు. సాధారణ ప్రజల కంటే వారి ఆహారపు అలవాట్లు కాస్తా భిన్నంగా ఉంటాయి. అలాగే నటీనటులు కూడా ఇండస్ట్రీలో రాణించాలంటే ఫిట్నెస్, గ్లామర్‌పై శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం వారు వెచ్చించే డబ్బు లక్షల్లోనే ఉంటుంది. అలాంటి విషయాలు తెలిసినప్పడు అంతా అవాక్కవుతుంటారు. చదవండి: ఓ ఇంటివాడైన చై! నాగార్జున ఇంటికి సమీపంలోనే మకాం? తాజాగా స్టార్ హీరోయిన్ తాప్సీ తన ఫిట్నెస్ కోసం పెట్టే ఖర్చు ఎంతో బయటపెట్టింది. ఇది తెలిసి అంతా నోళ్లు వెల్లబెడుతున్నారు. ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న తాప్సీ రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తన ఫిట్నెస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘హీరోయిన్గా ఉండాలంటే చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నేను చేసే సినిమాను బట్టి నా శరీరాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. అయితే శరీరం ఎప్పుడు ఒకేలా ఉండదు. ప్రతి మూడు, నాలుగు సంవత్సరాలకు బాడీలో మార్పులు వస్తుంటాయి. చదవండి: అమెరికాలో లగ్జరీ బంగ్లా రెంట్‌కు తీసుకున్న ఉపాసన! ఎందుకంటే.. ఫిట్‌గా ఉండాలంటే ప్రాంతం, దేశం బట్టి ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి సమయంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలో డైటీషియన్స్ సలహా చాలా అవసరం. మనం ఎప్పుడు ఏం తినాలి, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో వారు సూచిస్తుంటారు. అందుకే ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా డైటిషియన్‌ను పెట్టుకున్నా. నా డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు పే చేస్తాను. అది నా ప్రోఫెషన్. తప్పుదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక తాప్పీ డైటీషియన్ జీతం తెలిసి అంతా షాక్ అవుతున్నారు. ‘ఒక్క డైటిషియన్‌కే నెలకు లక్ష రూపాయలు ఖర్చు చేస్తే.. ఇక మిగలిన వాటికి ఎంత చేస్తుందో?’ అంటూ నెటిజన్లు నాలుక కరుచుకుంటున్నారు. కాగా తాప్సీ చివరగా తెలుగులో మిషన్ ఇంపాజిబుల్లో నటించింది. -
ఉగ్రవాద సంస్థలకు రూ. కోట్లు ఖర్చు చేశాం
-
లక్షల రూపాయలతో బ్యాగ్ లు కొనేసింది!
నాలుగేళ్ళ క్రితం ఆమెను నడమంత్రపు సిరి వరించింది. ఓ బ్యాంక్ అనుకోకుండా చేసిన తప్పిదం ఆమెను ధనవంతురాల్ని చేసింది. అప్పనంగా వచ్చిన సుమారు ఏభై లక్షల రూపాయలను ఆమె.. మూడో కంటికి తెలియకుండా ఖర్చు చేసేందుకు చూసింది. అయితే ఆ అదృష్టం కేవలం నాలుగేళ్ళే నిలిచింది. ఆరా తీసిన బ్యాంక్ సిబ్బందికి అసలు విషయం తెలియడంతో ప్రయాణానికి ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆమెను వలవేసి పట్టుకున్నారు. మిలియనీర్ గా మారిన 21 ఏళ్ళ క్రిస్టీన్ జియాక్సిన్ లీ.. తనకు కలసి వచ్చిన అదృష్టాన్నినాలుగేళ్ళపాటు రహస్యంగానే ఉంచింది. బ్యాంక్ సిబ్బంది చేసిన తప్పుతో ఆమె అకౌంట్ లోకి వచ్చిన సుమారు 46 లక్షల రూపాయలను ఖరీదైన డిజైనర్ వస్తువులు, హ్యాండ్ బ్యాగ్ ల కొనుగోలుకు ఖర్చు చేసేసింది. అయితే నాలుగేళ్ళ తర్వాత ఆమె ఓ ఎమర్జెన్సీ పాస్ పోర్టుతో మలేషియా వెళ్ళేందుకు సిడ్నీ ఎయిర్ పోర్టుకు చేరగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇంకా తన బ్యాంకులో 33 లక్షల రూపాయల వరకూ బ్యాలెన్స్ ఉందని, మిగిలిన డబ్బును తనకిష్టమైన ఖరీదైన వస్తువులు కొనుక్కున్నానని, కెమికల్ ఇంజనీరింగ్ విద్యార్థిని జియాక్సిన్ పోలీసులకు తెలిపింది. డబ్బు వచ్చిందని తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం, ఆమె స్వంత ఖర్చులకు వినియోగించడాన్ని కోర్టు నేర చర్యగా పరిగణించింది. సిడ్నీ విమానాశ్రయంలో ఫ్లైట్ ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న జియాక్సిన్ ను అరెస్టు చేసిన పోలీసులు 2014 జూలై నుంచి, 2015 ఏప్రిల్ మధ్య కాలంలో ఆమె అనేక దఫాలుగా ఏటీఎం నుంచి డబ్బును డ్రా చేసినట్లు చెప్తున్నారు. అయితే కనీసం తనకు వచ్చిన డబ్బు ఏ బ్యాంకు నుంచి వచ్చిందన్న విషయాన్నికూడ తెలుసుకునేందుకు ఆమె ప్రయత్నించలేదని ఆరోపించారు. అయితే జియాక్సిన్ కు బెయిల్ ఇచ్చిన ఆమె బాయ్ ఫ్రెండ్ మాత్రం... బ్యాంకు చేసిన పొరపాటు గురించి తనకు ఎటువంటి అవగాహనా లేదని, అయితే ఆమె ఖర్చు చేసినట్లు ఆరోపణలు మాత్రం ఎదుర్కోవాల్సి వస్తోందని వివరించాడు. -
3వేల కోట్లతో సచివాలయం నిర్మాణం
-
ఇది లెక్కలు అడగాల్సిన సమయం
న్యూఢిల్లీ : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిని విస్మరించడాన్ని ఆయన తప్పుబట్టారు. శాస్త్రి లాంటి జాతీయ నాయకుడికి ప్రధాని నివాళలర్పించకపోవడం మంచి పరిణామం కాదన్నారు. మహాత్మాగాంధీ 146వ జయంతి సందర్భంగా రాజ్‌ఘాట్ సందర్శించి గాంధీజీకి నివాళులర్పించిన కేజ్రీవాల్ అనంతరం విజయఘాట్లోని లాల్ బహదూర్ శాస్త్రికి కూడా అంజలి ఘటించారు. ఆ తర్వాత విధాన సభలో ఏర్పాటు చేసిన సభలో ప్రధానిపై సీఎం పరోక్ష విమర్శలు గుప్పించారు. విభజించి పాలించే సంస్కృతి అంతం కోసం అందరం ప్రార్ధిద్దాం. బీఫ్ నిషేధం మనుషుల ప్రాణాలను హరిస్తోందంటూ పరోక్షంగా బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. వాగ్దానాలకు, చేపడుతున్న కార్యక్రమాలకు తగ్గట్టుగా కార్యాచరణ కూడా ఉండాలన్నారు. ఫోటోల కోసం ఏడాదికొకసారి వీధులు శుభ్రం చేస్తే స్వచ్ఛ భారత్ కల నెరవేరదంటూ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు అటూ ట్విట్టర్లో కూడా కేజ్రీవాల్... మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. స్వచ్ఛ భారత్ అంటూ పాటలు పాడితే ,చీపురు పట్టుకుని వీధులు శుభ్రం కావని విమర్శించారు. అసలు స్వచ్ఛ భారత్ కోసం ఇప్పటి వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో సమాచారం కావాలన్నారు. గత ఏడాది ఈ స్వచ్ఛ భారత్ మిషన్ వెచ్చించిన నిధుల లెక్కలు ప్రకటించాలన్నారు. ఈ కార్యక్రమం ద్వారా శుభ్రమైన వీధుల వివరాలు కావాలంటే కేజ్రీవాల్ ట్విట్ చేశారు. ఈ వివరాలను అడగాల్సిన సందర్భం ఇదేనని ఆయన వ్యాఖ్యానించారు. Gandhi's birthday 2day. Lets pledge 2 put an end 2 divisive politics. Beefban murder outcome of divisive politics. Plzzz. Let's stop this — Arvind Kejriwal (@ArvindKejriwal) October 2, 2015 1 yr of swach bharat. Which streets got cleaned as a result of "this campaign"? How much budget spent on it? Time to question symbolism? — Arvind Kejriwal (@ArvindKejriwal) October 2, 2015 -
విలాసాల సీఎం