సాక్షి, హైదరాబాద్: ఆమె కరాటే సాధన ప్రారంభించే సమయానికి వయసు 12ఏళ్లు. అంతర్జాతీయ పోటీలో పాల్గొనే సమయానికి 13ఏళ్లు. ‘తొలుత ఈ రంగాన్ని ఎంచుకున్నప్పుడు అమ్మా నాన్న చాలా సంకోచించారు. అయితే నా పట్టుదల చూసి వెన్ను తట్టారు. ఇప్పుడు వారే నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహిస్తున్నారు’ అని చెప్పారు సయ్యదా.
సాధన తప్పదు..గాయాలూ తప్పవు
‘టోర్నమెంట్‌కు ముందు రోజుకి కనీసం 4 నుంచి 5 గంటల పాటు శిక్షణ తప్పనిసరి. మిగిలిన రోజుల్లో కూడా రెండు పూటలా ఫిట్‌నెస్ కాపాడుకునే వ్యాయామాలు చేయాల్సిందే’ నని చెప్పారు సయ్యదా. ‘ఏ విజయం కూడా సునాయాసంగా రాదు. పురుషులకైనా, మహిళలకైనా ఇష్టమైన రంగాన్ని ఎంచుకుంటే కష్టం అనిపించదు’ అంటారు. కామన్వెల్త్ ఛాంపియన్ షిప్‌కి భారత్ తరపున ప్రాతినిథ్యం వహించాల్సి ఉందనగా సరిగ్గా 2 నెలల ముందు కాలికి తీవ్ర గాయంతో కదలలేకుండా పోయిన సందర్భాన్ని గుర్తు తెచ్చుకుంటూ... ఇవన్నీ ఆటలో భాగం అంటారామె.
డైట్...రైట్..రైట్
సాధనకు తగ్గట్టుగా శరీరాన్ని తీర్చిదిద్దుకోవడానికి సరైన డైట్ తీసుకుంటానని చెబుతున్నారామె. రోజువారీగా వ్యాయామం తప్పదు. అందుకే రంజాన్ వంటి అత్యంత ముఖ్యమైన పండుగ సందర్భాల్లో ఆమె మరింత జాగ్రత్తగా తన సాధనను దినచర్యను బ్యాలెన్స్ చేసుకుంటారామె. రాజకీయ శాస్త్రంలో పట్టా సాధించి, ప్రస్తుతం లా కోర్సు చేస్తున్న సయ్యదా... తాజాగా రాజకీయ రంగంలో కూడా ప్రవేశించడం విశేషం. రాజకీయాల్లో క్రీడాభివృద్ధికి మాత్రమే కాక మహిళల స్వయం సాధికారత కోసం కూడా తాను కృషి చేస్తానని అంటున్నారామె.
(చదవండి: నన్ను ఎవరూ భయపెట్టలేరు. దేనికీ భయపడను: తెలంగాణ గవర్నర్ తమిళిసై)
Comments
Please login to add a commentAdd a comment