డైట్‌ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్‌ సీక్రెట్స్‌ | Deepika Padukone Reveals She Eats Well, Hates Fad Diet; Check Details | Sakshi
Sakshi News home page

డైట్‌ అంటే ఏంటి? నిండు గర్భిణి దీపికా పదుకొణే డైట్‌ సీక్రెట్స్‌

Published Wed, Jul 17 2024 3:26 PM | Last Updated on Wed, Jul 17 2024 4:07 PM

Deepika Padukone Reveals She Eats Well, Hates Fad Diet; Check Details

తన తొలి బిడ్డకు త్వరలోనే జన్మనివ్వబోతున్న స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణే తన డైట్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది.  తాను బాగా తింటానని, ఫ్యాడ్ డైట్‌పై తనకస్సలు నమ్మకం లేదంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది.  

దీపికా పదుకొణె తన ప్రెగ్నెన్సీ డైట్‌లో   భాగమైన కొన్ని ఫోటోలను షేర్‌ చేసింది. ఫ్యాడ్ డైట్‌ని ఫాలో అయ్యే కంటే బాగా తినడానికేతాను ఇష్టపడతానని వెల్లడించింది. (ఫాడ్ డైట్: తొందరగా,సులువుగా, అనూహ్యంగా బరువు తగ్గే ఆహార ప్రణాళిక).

నిండు గర్భిణి దీపికా పదుకొణె మాతృత్వ అనుభవం కోసం  రోజులు లెక్కిస్తోంది. తన ప్రెగ్నెన్సీ జర్నీ, అనుభవాలు,  ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌పై  తన ఫ్యాన్స్‌తో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది. తాజాగా  తన డైట్‌కు సంబంధించి పిక్స్‌ షేర్‌ చేసింది. తన బాలెన్స్‌డ్‌ డైట్‌ వెనుక రహస్యాన్ని దీపిక బుధవారం వెల్లడించింది. రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన మూడు చిత్రాలను షేర్ చేసింది. దీంతో పాటు ఒక సుదీర్ఘ నోట్‌ కూడా పెట్టింది. ఇందులో డైట్‌ అంటే ఏంటో ఇలా వివరించింది.

"నా ఫీడ్‌లో దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను  బాగా తింటాను! నాకు తెలిసిన ఎవరినైనా అడగండి. బాగా తింటా. కాబట్టి మీరు విన్న లేదా చదివిన దాన్ని నమ్మవద్దు.  'డైట్' అనే పదం చుట్టూ చాలా అపార్థాలున్నట్లు అనిపిస్తుంది, 'డైట్' అంటే ఆకలితో అలమటించడం, తక్కువ తినడం లేదా మనకు నచ్చని వస్తువులన్నింటినీ తినడం అని అనుకుంటాం. బాలెన్స్‌, క్రమం తప్పకుండా తింటూ, మన బాడీ మాట వినడమే ఇదే అసలైన ట్రిక్‌.’’

 

డైట్  నిజమైన అర్థం ఒక వ్యక్తి పూర్తిగా తినే ఆహారం, లేదా పానీయం అని దీపిక పేర్కొంది.. 'డైట్' అనే పదం గ్రీకు పదం 'డైటా' నుండి వచ్చింది. అంటే జీవిన విధానం అని అర్థంని, తానెపుడు  విపరీతమైన ఆహారపు అలవాట్లకు బదులు సమతుల్యమైన ఆహారాన్ని పాటిస్తానని వెల్లడించింది.

కాగా రిలయన్స్‌ వారసుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ పెళ్లిలో దీపికా తన బేబీ బంప్‌తో అందంగా కనిపించింది. సందర్భానికి తగ్గట్టుగా చక్కటి అనార్కలీ, దుప్పట్టాతో స్టయిలిష్‌గా కనిపించింది. సెప్టెంబర్‌లో బిడ్డకు జన్మ నివ్వబోతున్నా మని దీపికా, ఆమె భర్త నటుడు  రణవీర్‌ సింగ్‌ గతంలో ప్రకటించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement