భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లి
Details of Virat Kohli’s diet For WC 2023: టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. వన్డే వరల్డ్‌కప్-2023 ఆరంభం నుంచే అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న ఈ ఢిల్లీ బ్యాటర్.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో రికార్డులు బద్దలు కొట్టాడు.
అంతర్జాతీయ కెరీర్‌లో 78వ సెంచరీ సాధించి రన్‌మెషీన్ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు. సొంతగడ్డపై ప్రపంచకప్ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఐదు ఇన్నింగ్స్‌లో వరుసగా 85, 55*, 16, 103*, 95 పరుగులు సాధించాడు కోహ్లి.
మొత్తంగా 354 పరుగులతో సెకండ్ లీడింగ్ రన్‌స్కోరర్‌గా ఉన్నాడు. ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లిని ఫిట్‌నెస్‌కు మారుపేరుగా పేర్కొంటారు క్రికెట్ అభిమానులు. ఫిట్‌గా లేడన్న కారణంగా కోహ్లి జట్టుకు దూరమైన సందర్భాలు అరుదు.
జిమ్‌లో కఠిన వర్కౌట్లు చేస్తూ మంచి ఆహారపుటలవాట్లతో తనను ఫిట్‌గా ఉంచుకునేందుకు ఇష్టపడతాడు కోహ్లి. తాజాగా వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నేపథ్యంలో అతడు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాడు? ఎలాంటి డైట్ పాటిస్తున్నాడు అన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి.
విరాట్ మాంసం అస్సలు తినడు
టీమిండియా బస చేసిన హోటల్స్‌లో ఒకటైన లీలా ప్యాలెస్‌కు చెందిన ఎగ్జిక్యూటివ్ చెఫ్ అనుష్మాన్ బాలి టైమ్స్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు. ‘‘విరాట్ మాంసం అస్సలు తినడు.
మాక్ మీట్
మాక్ మీట్స్, టోఫు ఇంకా
ఆవిరిపై ఉడికించిన ఆహార పదార్థాలు తినడానికే ప్రాధాన్యం ఇస్తాడు. కాబట్టి మేము కూడా అతడి కోసం స్టీమ్డ్ ఫుడ్ తయారు చేస్తాం. వెజిటేరియన్ డిమ్ సమ్స్(డంప్లింగ్స్ లాంటివి) వంటివి తయారు చేస్తాం.
వెజ్ డిమ్‌సమ్స్
ప్రొటిన్లు ఎక్కువగా లభించే సోయా వంటి మాక్ మీట్స్, టోఫు(సోయా పాలతో తయారు చేసే పెరుగు/బీన్ కర్డ్) లాంటివి సర్వ్ చేస్తాం. కొద్ది మోతాదులో పాల ఉత్పత్తులు కూడా కోహ్లి భోజనంలో ఉండేలా చూసుకుంటాం’’ అని అనుష్మాన్ పేర్కొన్నారు.
టోఫు
అంతా అవే తింటారు
ఇక టీమిండియా క్రికెటర్లంతా బ్రేక్‌ఫాస్ట్‌లో మిల్లెట్ దోసలు, మిల్లెట్, క్వినోవా ఇడ్లీలు తినేందుకు ఆసక్తి చూపుతారని.. అందరికీ ఫేవరెట్ మాత్రం రాగి దోస అని అనుష్మాన్ తెలిపారు.
రాగి దోస
అన్ని రకాల మాంసాహారాలు వండుతాం
అదే విధంగా ఇతర క్రికెటర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘నిజానికి ఫుడ్ బఫేలో మేము అన్ని రకాల మాంసాహారాలు అందుబాటులో ఉంచుతాం. కానీ చాలా మంది క్రికెటర్లు స్టీమ్డ్ లేదంటే గ్రిల్డ్ చికెన్ లేదంటే ఫిష్ తినడానికి ఇష్టపడతారు.
ఇక న్యూజిలాండ్ క్రికెటర్లయితే కూరలు అస్సలు తినరు. అయితే, డెవాన్ కాన్వే వంటి కొంతమంది ఇండియన్ ఫుడ్ తినేందుకు ఆసక్తి చూపిస్తారు. పరాటా, దోస లాంటివి బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకుంటారు’’ అని అనుష్మాన్ బాలి చెప్పుకొచ్చారు.
కాగా ప్రపంచకప్-2023లో చివరగా టీమిండియాతో న్యూజిలాండ్‌తో ధర్మశాలలో తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించింది రోహిత్ సేన. తదుపరి అక్టోబరు 29న లక్నోలో ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమవుతోంది.
చదవండి: WC 2023: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా లేడు.. ఒకవేళ బుమ్రా కూడా..
Comments
Please login to add a commentAdd a comment