
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి తొలిసారి డకౌటయ్యాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా లక్నో వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్‌లో 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో బెన్ స్టోక్స్‌కు క్యాచ్ ఇచ్చి విరాట్ ఔటయ్యాడు.
కాగా వన్డేల్లో కోహ్లి డకౌట్ కావడం 32 ఇన్నింగ్స్‌లు తర్వాత ఇదే తొలిసారి. కాగా ఇంగ్లండ్‌పై వన్డేల్లో కోహ్లికి అంతమంచి రికార్డు లేదు. ఇప్పటివరకు వన్డేల్లో అన్ని జట్లపైన 50పైగా సగటు కలిగి ఉన్న విరాట్.. ఇంగ్లండ్‌పై మాత్రం 35 వన్డేల్లో 43.22 సగటుతో 1,340 పరుగులు చేశాడు. కాగా మెగా టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన కింగ్ కోహ్లి.. 88.50 సగటుతో 354 పరుగులు చేశాడు.
చదవండి: World Cup 2023: రోహిత్ శర్మకు ఇది స్పెషల్ ‘సెంచరీ’.. బీసీసీఐ ట్వీట్