అవసరానికి మించి ప్రోటీన్స్‌ ప్రమాదమే.. | Healthy Food Ready To Gain Muscle | Sakshi
Sakshi News home page

అవసరానికి మించి ప్రోటీన్స్‌ ప్రమాదమే..

Published Sat, Dec 5 2020 6:08 PM | Last Updated on Mon, Dec 21 2020 12:28 PM

Healthy Food Ready To Gain Muscle - Sakshi

మనం తరుచూ తీసుకునే ఆహారపదార్థాల్లో పోషక విలువలు సమతుల్యంగా ఉండేటట్లు చూసుకోవాలి. శరీరానికి పుష్టిని చేకూర్చే పదార్థాలను తినడం ద్వారా ప్రోటీన్స్‌‌ అందుతాయి.  ఆరోగ్యమే  మనకి మహా సంపదతో సమానం. ‘‘అనారోగ్యంతో ఉన్న వారికి సకల ఐశ్వర్యాలున్నా.. వృధానే’’అని పెద్దలు చెబుతుంటారు. శరీరానికి 70 శాతం వ్యాయామం.. 30 శాతం తిండి అవసరం. కానీ ఇందుకి భిన్నంగా ప్రస్తుతం జరుగుతోంది. సమయానికి తగ్గట్లు సరైన ఆహారం తీసుకోవాలనే విషయంపై చాలా మందికి అవగాహన లేదు. మన వంటింట్లోనే మనకు కావాల్సిన పోషకాలున్న పదార్థాలు ఉన్నాయి. కానీ వాటిని తీసుకునే విధానంలో క్రమపద్ధతిని పాటించడం లేదు.

 డా. లవ్‌నీత్‌ బాత్రా చేసిన సూచనలు
ఉదయం పూట: ఒక కప్పు నీటిలో గోధుమ గడ్డి (వీట్‌ గ్రాస్‌) పౌడర్‌, ఒక టీస్ఫూను కొబ్బరి నూనె లేదా టీ స్ఫూను పీనట్‌ బటర్‌తో పాటు రోజుకో ఆపిల్‌ను డైట్‌లో చేర్చుకోవాలి.
టిఫిన్‌ కి ముందు: ప్రోటీన్లు కలిగిన పదార్థాలలో కొబ్బరి నీరు ఉండేటట్లు చూసుకోవాలి. టిఫిన్‌లోకి మూడు ఎగ్‌వైట్స్‌,  శెనగలతో చేసిన పదార్థాలు ఉండేటట్లు చూసుకోవాలి. శనగల్ని ఇష్టపడని వారు టోస్ట్‌ అవకాడోని తీసుకోవచ్చు. ఒక వేళ శాకాహారులైతే 100 గ్రాముల పన్నీర్‌ ని కలుపుకోవచ్చు. 
భోజనానికి ముందు: ఒక కప్పు మొలకెత్తిన గింజలు, ఒ‍క టీ స్ఫూన్‌ నానాబెట్టిన వేరుశనగలు తీసుకోవాలి. 
భోజనం: అన్నంతో పాటు ఒక కప్పు పెరుగు, వంద గ్రాముల పన్నీర్‌, ఆకుకూరలు, కూరగాయలు ఉండేటట్లు చూసుకోవాలి. రొట్టెతో పప్పు లేదా బెండకాయ, కూరగాయలు ఉంటే సరిపోతుంది. 
మధ్యాహ్నం మూడింటికి: చక్కెర శాతం తక్కువగా ఉన్న పండ్లు తీసుకోవాలి. చెర్రీ మొదలయినవి ఉంటే మంచిది.  
సాయంత్రం​ఐదింటికి: టోస్ట్‌తో పాటు లైట్‌ పుడ్‌ చిప్స్‌, బిస్కెట్స్‌ లాంటి వాటిని తీసుకోవాలి అవసరమైతే  అవకాడో వంటివి అదనంగా చేర్చుకోవచ్చు.
ఏడింటికి: కొద్దిగా (మష్రూమ్‌) పుట్టగొడుగు సూప్‌ లేదా వేడిగా ఏవైనా తీసుకుంటే సాయంత్రం పూట నూతనుత్తేజం వస్తుంది.    
చివరగా డిన్నర్‌:  బ్రౌన్‌రైస్‌తో పాటు ( అన్‌ ఫాలిష్‌) 150 గ్రాముల సోయా(టోఫు) ఉండేటట్లు చూసుకోవాలి. లేదంటే రెండు చపాతీలతో బెండకాయ లేదా కాయగూరలు ఉండేట్లు సిద్ధం చేసుకోవాలి. ఏవైన ఇతర సమస్యలుంటే నిద్రకి ముందు అశ్వగంధ టాబ్లెట్లు లేదా నానాపెట్టిన అయిదు బాదం గింజల్ని తీసుకోవడం మంచిది.

ఆరోగ్యానికి పాటించాల్సిన సూత్రాలు 
1. శరీర అవయవాల(ఆర్గాన్స్‌) పనితీరు మెరుగ్గా ఉండాలంటే రోజుకి కనీసం 3 నుంచి 4 లీటర్ల వేడి నీటిని ప్రతీ రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.  
2. శరీరానికి ప్రోటీన్‌ 30 గ్రాములకు మించినా ప్రమాదమే...!
3. డాక్టర్‌ బాత్రా మాట్లాడుతూ..‘‘ మీ శరీరానికి నూతనుత్తేజం వ్యాయామ్యమేనని కనీసం రోజుకి 30 నిమిషాలు వ్యాయామ్యం చేయడం ద్వారా సమతుల్యం‍గా ప్రోటీన్‌ శరీరానికి అందుతుంది. రోజుకు మనకు 25 నుంచి 30 గ్రాముల ప్రోటీన్‌ సరిపోతుందని’’ ఆమె తెలిపారు. 
4. అవసరానికి మించి ప్రోటిన్‌ తీసుకోవడం కూడా శరీరానికి ప్రమాదకరమని  గ్యాస్‌, అజీర్తిని కలిగిస్తుందని జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
5. శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలేయం (లివర్‌)దేనికి లేని ప్రత్యేకత కాలేయానికి ఉంది. 90 శాతం చెడిపోయినా కూడా తొలగిస్తే తిరిగి పెరుగుతుంది. అలాంటి దానిని కపాడుకోవాలి కదా..:! లివర్‌  పనితీరును మెరుగుపరిచేందుకు గోధుమ గడ్డి( వీట్‌ గ్రాస్‌) అశ్వగంధ ఉపయోగపడుతుందని సమతుల్య ఆహారాన్ని తీసుకుని కండరాలను పుష్ఠిగా మార్చుకోవాలని అన్నారు. ఎక్కువ ప్రోటీన్‌  శరీరంలో యాసిడ్‌ను ఉత్పత్తి చేస్తుందని హెచ్చరించారు. 
ఈ రోజే మీ డైట్‌ ను ప్రారంభించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారండి. మరెందుకు ఆలస్యం మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement