ఆ సమయంలో ఫోన్‌ చేసి రమ్మనేవారు: హీరోయిన్‌ | Mallika Sherawat Opens Up On Casting Couch | Sakshi
Sakshi News home page

అర్ధరాత్రి ఫోన్‌ చేసి రమ్మనేవారు: హీరోయిన్‌

Published Thu, Jul 5 2018 11:19 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Mallika Sherawat Opens Up On Casting Couch - Sakshi

బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌

సాక్షి, సినిమా: క్యాస్టింగ్‌ కౌచ్‌, చికాగో సెక్స్‌ రాకెట్‌లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీని కుదుపేస్తున్నాయి. వీటిపై ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు స్పందించారు. అయితే తాజాగా క్యాస్టింగ్‌ కౌచ్‌పై బాలీవుడ్‌ హాట్‌​ బ్యూటీ మల్లికా శెరావత్‌ షాకింగ్‌ నిజాలు బయలపెట్టారు. ఆమె కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 

మల్లికా శెరావత్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తెరవెనుక హీరోలతో చనువుగా ఉండనందుకే తనను కొన్ని సినిమాలను నుంచి తప్పించారని ఆమె పేర్కొన్నారు. ‘తెరపై నటిస్తావు కదా.? మరి బయట చనువుగా ఉండటానికి ఇబ్బంది ఏంటి.?’ అని ప్రశ్నించేవారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని సందర్బాల్లో తనను అర్థరాత్రి మూడు గంటల సమయంలో ఫోన్ చేసి వస్తావా అని అడిగేవారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. 

మర్డర్‌ సినిమాతో మల్లికా శెరావత్‌ బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. మొదటి సినిమాలోనే హాట్‌గా నటించడంతో తర్వాత తనకు అలాంటి పాత్రలే వచ్చాయన్నారు. అలాంటి పాత్రలకే సరిపోతానని తనపై తప్పుడు అభిప్రాయం ఏర్పరుచుకున్నారన్నారు. ఇండస్ట్రీలో తనకు ‘బోల్డ్ నటి’, ‘గ్లామరస్‌ నటి’, ముద్దు సీన్లలో నటిస్తుందనే పేరు రావడానికి దర్శకులు, సహ నటీనటులే కారణమనినామె తెలిపారు. తాను ఎలాంటి పాత్రల్లో నటించడానికైనా ఒప్పుకుంటానని అందరూ అనుకునే వారంటూ పేర్కొన్నారు.  పొట్టి దుస్తులు వేసుకున్నా.. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించినా.. సిగ్గు వదిలేసిన మహిళ అని తనపై చాలా నిందలు వేశారని తన బాధను వ్యక్తపరిచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement