
విన్నారా..?ద్రౌపదిగా నటిస్తా!
ద్రౌపదిగా మల్లికా శెరావత్ నటిస్తే చూడాలని ఉందా...? ఎప్పుడు... ఏంటి అని మాత్రం అడగకండి. ఇది ఆమె మనసులోని కోరిక. గ్లామర్ పాత్రలతో కుర్రకారును అలరించిన మల్లిక ప్రస్తుతం బాలీవుడ్‌లో నడుస్తున్న ట్రెండ్ చూసి తాను అలాంటి చిత్రంలో నటించాలని ఫిక్స్ అయిపోయారు.
ఏ పాత్రలో నటించాలని ఉంది అని అడిగితే ఆమె టక్కున ద్రౌపది పాత్రలో చేయాలనుందని సమాధానమిచ్చారు. దర్శక, నిర్మాతలు ఈ మాట విన్నారా? మల్లిక వెయిటింగ్ ఫలిస్తుందా?