మల్లికా షెరావత్ - కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ సాయం కోరుతున్నారు. తన స్నేహితురాలి వీసా విషయంలో చొరవ చూపాలంటూ నటి విజ్ఞప్తి చేస్తోంది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆమె పలు ట్వీట్లు చేశారు.
ఫ్రీ ఏ గర్ల్ అనే ఓ డచ్ ఎన్జీవో సంస్థకు సహ ఎవెలిన్ హెల్స్‌కెన్ వ్యవస్థాపకురాలు. తమ సంస్థ సేవలను భారత్‌లో కూడా అందించేందుకు ఆమె సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఆమెకు భారత వీసా దొరకలేదు. దీంతో ఆమె తరపున స్నేహితురాలు, నటి మల్లికా షరావత్ విజ్ఞప్తి చేస్తున్నారు. ‘మేడమ్ సుష్మా స్వరాజ్.. ఫ్రీ-ఏ-గర్ల్ సంస్థ గత కొన్నేళ్లుగా మహిళలు, చిన్నారుల కోసం విశేషంగా కృషి చేస్తోంది. భారత్‌లో కూడా వారి సేవలను కొనసాగించేందుకు నిర్ణయించుకుంది. కానీ, ఆమె వీసా తిరస్కరణకు గురవుతోంది. దయచేసి సాయం చేయండి’ అంటూ ఆమె ట్వీట్ చేశారు.
‘ఇలాంటి విషయాల్లో సుష్మాజీ ఎప్పుడూ సానుకూలంగానే స్పందించారు. ఇప్పుడు కూడా అదే రీతిలో స్పందిస్తారని భావిస్తున్నా’ అని మల్లికా ఓ ప్రకటన విడుదల చేశారు. కాగా, ఆ సంస్థ తరపున భారత్‌లో తన సేవలను అందించేందుకు సిద్ధమని మల్లికా వెల్లడించారు.
Ma’am @SushmaSwaraj co-founder of Dutch NGO #FreeAGirl has been repeatedly denied visa to India, this NGO is doing superb work for trafficked children & women. Pls help!
— Mallika Sherawat (@mallikasherawat) 12 February 2018
Comments
Please login to add a commentAdd a comment