
'ద డర్టీ పాలిటిక్స్' వాయిదా
ముంబై: మల్లికా షెరావత్ నటించిన 'డర్టీ పాలిటిక్స్' హిందీ సినిమా విడుదల మార్చి 6కు వాయిదా పడింది. హోలి సందర్భంగా మార్చి 6న ఈ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ముందుగా ఫిబ్రవరి 18న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు.
అయితే అదే రోజున ఇతర సినిమాలు విడుదలవుతుండడం, ఈ సినిమాలో మరో పాట పెట్టాలని దర్శకుడు నిర్ణయించడంతో 'డర్టీ పాలిటిక్స్' విడుదల వాయిదా పడింది. ఈ సినిమాలో పెట్టిన గాగ్రా పాటకు అనూహ్య స్పందన వచ్చిందని, దీంతో మరో పాట పెట్టాలని భావించినట్టు దర్శకుడు కేసీ బొకాడియా తెలిపారు. ఈనెల 13 నుంచి పాట చిత్రీకరణ ఉంటుందని చెప్పారు.