ఆడపిల్ల పుట్టిందని అమ్మ డిప్రెషన్‌లో.. ఏ పాపం చేశాం? | Mallika Sherawat Says She was Discriminated in Family as They Never Wanted Girl Child | Sakshi
Sakshi News home page

Mallika Sherawat: సోదరుడిని అతి ప్రేమగా.. నాకేమో స్వాతంత్య్రమే లేకుండా చేశారు!

Published Fri, Oct 11 2024 8:40 PM | Last Updated on Sat, Oct 12 2024 9:38 AM

Mallika Sherawat Says She was Discriminated in Family as They Never Wanted Girl Child

ఆడపిల్ల ఇంటికి భారం అనుకునే తల్లిదండ్రులు ఎంతోమంది. ఆ జాబితాలో తన పేరెంట్స్‌ కూడా ఉన్నారంటోంది బాలీవుడ్‌ బ్యూటీ మల్లికా షెరావత్‌. తన సోదరుడికి ప్రేమను పంచి తనపై మాత్రం వివక్ష చూపించారని చెప్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నా పేరెంట్స్‌ ఎప్పుడూ నా సోదరుడిని ముద్దు చేసేవారు, అతి గారాబం చేసేవారు. నాపై మాత్రం వివక్ష చూపించేవారు. 

కొడుకుపై పెట్టుబడి
వాళ్లు ఎందుకలా చేస్తున్నారో అసలు అర్థమయ్యేది కాదు. కొడుకును బాగా చదివించాలి, విదేశాలకు పంపాలి, అతడికోసం ఎంతైనా ఖర్చు చేయాలి.. ఇలా ఉండేవి వాళ్ల ఆలోచనలు, మాటలు. కుటుంబ ఆస్తి మొత్తం కుమారుడికి, వాడికి పుట్టే కొడుక్కి వెళ్తుంది.. మరి అమ్మాయిలేం పాపం చేశారు? ఓహ్‌.. వాళ్లకు పెళ్లి చేయాలి, భారం తగ్గించేసుకోవాలి.. అంతేనా?

గేమ్స్‌ ఆడినా తప్పే..
పేరెంట్స్‌ ప్రవర్తన, మాటలు నన్నెంతో బాధించేవి. కానీ ఇలాంటి పరిస్థితి నా ఒక్కదానికే రాలేదని, గ్రామంలోని ప్రతి ఇంట్లో ఉన్న ఆడపిల్ల పరిస్థితి కూడా ఇంతేనని తర్వాత తెలుసుకున్నాను. నా పేరెంట్స్‌ నాకు అన్నీ ఇచ్చారు.. ఒక్క స్వాతంత్య్రం తప్ప! వాళ్లకు తెలీకుండా స్పోర్ట్స్‌ ఆడేదాన్ని. ఎందుకంటే నీకు కండలు వస్తున్నాయి.. ఇలా మగాడిలా తయారైతే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు? అని అరిచేవారు.

అమ్మ డిప్రెషన్‌లో..
అలా ఎన్నో నిబంధనలు పెట్టారు. నేను పుట్టినప్పుడు నా కుటుంబం అంతా విచారం వ్యక్తం చేసింది. మా అమ్మ అయితే కచ్చితంగా డిప్రెషన్‌లోకి వెళ్లి ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. కాగా మల్లికా షెరావత్‌.. క్వాశిష్‌, మర్డర్‌, ప్యార్‌కే సైడ్‌ ఎఫెక్ట్స్‌, వెల్‌కమ్‌, డర్టీ పాలిటిక్స్‌, దశావతారం వంటి పలు చిత్రాల్లో నటించింది. ఐటం సాంగ్స్‌తో ఎక్కువ ఫేమస్‌ అయింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement