
ఈ రోజుల్లో మనకు సరైన వ్యక్తిని కనుగొనడం కష్టమే అంటోంది బాలీవుడ్ బ్యూటీ మల్లికా షెరావత్. ప్రియుడు క్రిల్ ఆక్సన్‌ఫాన్స్‌తో విడిపోయిన ఈ ముద్దుగుమ్మ తాజాగా రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడింది. మనకు సరిగ్గా సెట్టవుతాడు అనిపించే వ్యక్తిని కనుగొనడం ఈ రోజుల్లో కష్టమైపోతుంది. నేను నిజం చెప్తున్నా.. ఇప్పుడు నేను సింగిల్‌గా ఉన్నాను.

అతడి(క్రిల్)తో బ్రేకప్ అయింది. దాని గురించి అస్సలు మాట్లాడాలనుకోవడం లేదు అంది. పెళ్లి గురించి అడగ్గా.. దానిపై నాకు ఆసక్తి లేదు, అలా అని వివాహానికి నేను వ్యతిరేకం కాదు. భవిష్యత్తులో నాకు కనెక్ట్ అయ్యే వ్యక్తిపై ఇది ఆధారపడి ఉంటుంది అని పేర్కొంది.
కాగా మల్లికా షెరావత్.. క్వాశిష్, మర్డర్, ప్యార్‌కే సైడ్ ఎఫెక్ట్స్, డర్టీ పాలిటిక్స్, దశావతారం వంటి పలు సినిమాల్లో యాక్ట్ చేసింది. ఎక్కువగా ఐటం సాంగ్స్‌తోనే ప్రేక్షకులకు దగ్గరైంది. ఇటీవల విక్కీ విద్యాకా వో వాలా వీడియో సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment