బిల్‌గేట్స్‌తో ఆ విషయం చర్చించిన మల్లికా శెరావత్‌ | Mallika Sherawat With Bill Gates Talks About Female Empowerment | Sakshi
Sakshi News home page

బిల్‌గేట్స్‌తో ఆ విషయం చర్చించిన మల్లికా శెరావత్‌

Published Fri, Jan 31 2020 1:41 PM | Last Updated on Fri, Jan 31 2020 1:49 PM

Mallika Sherawat With Bill Gates Talks About Female Empowerment - Sakshi

బాలీవుడ్‌ నటి మల్లికా శెరావత్‌ మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిశారు. మర్డర్‌ సినిమా ద్వారా బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ తాజాగా.. మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్‌గేట్స్‌ని క‌లిసి మ‌హిళా సాధికార‌త గురించి చ‌ర్చించింద‌ట. వాషింగ్ట‌న్‌లో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ఏర్పాటు చేసిన పార్టీలో వీరు క‌ల‌వడం ప్రాధాన్య‌త‌ని సంత‌రించుకుంది. ఈ విష‌యం గురించి మ‌ల్లికా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియ‌జేసింది. ఆయ‌న‌తో మహిళా సాధికార‌త గురించి మాట్లాడ‌డం సంతోషంగా అనిపించింద‌ని మ‌ల్లికా త‌న పోస్ట్‌లో పేర్కొంది. సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న బిగ్ బాస్ సీజ‌న్-13లోను మ‌ల్లికా శెరావ‌త్ సంద‌డి చేసిన సంగతి తెలిసిందే. (మల్లికా శెరావత్‌కు వింత అనుభవం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement