Jeff Bezos Shocking Reaction On His Girl Friend Leonardo And Dicaprio Viral Video - Sakshi
Sakshi News home page

Jeff Bezos: హాలీవుడ్ హీరోని బెదిరించిన అమెజాన్‌ అధినేత.. ట్వీట్ వైరల్

Published Wed, Nov 10 2021 11:08 AM | Last Updated on Wed, Nov 10 2021 1:24 PM

Jeff Bezos Reacts Twitter Viral Video Of His Girlfriend Leonardo DiCaprio - Sakshi

అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్ ఇటీవల హాలీవుడ్‌ హీరో లియోనార్డో డికాప్రియోను ఓ కార్యక్రమంలో కలిశారు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్‌ బెజోస్‌ ట్విటర్‌ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇదంతా సరదాకే.

అసలు సంగతి ఏంటంటే.. గత శనివారం అమెరికాలోని లాస్‌ఏంజెల్స్‌లో జరిగిన లాక్మే ఆర్ట్‌+ఫిల్మ్‌ గాలా ఈవెంట్ కి అమెజాన్‌ అధినేత తన ప్రియురాలు లారెన్‌ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో డికాప్రియో, లారెన్‌ సాంచెజ్‌ కాసేపు ఏదో విషయమై సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో పై బెజోస్‌ ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్ చేశారు.

అందులో.. ‘ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం’ అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. ‘లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి’ అంటూ బెజోస్‌ ఓ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల వ్యూస్ రాగా, 1.4 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement