Leonardo Dicaprio
-
భర్త ముందే శృంగారపు సన్నివేశంలో నటించా : హీరోయిన్
భారతీయ సినిమాల్లో శృంగారపు సన్నివేశాలకు హద్దు ఉంటుంది కానీ హాలీవుడ్లో అలా కాదు. తెరపై రొమాంటిక్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయితే.. వాళ్లకంటే బోల్డ్‌గా మరెవరూ చూపించరు. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్స్లేట్ కూడా అలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. భర్త ముందే బోల్డ్ సీన్స్‌లో నటించడం..ఇబ్బందిగా, విచిత్రంగా అనిపించిందట. ‘టైటానిక్’ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ కలిసి ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్..అప్పట్లో సంచలనం సృష్టించాయి. భర్త డైరెక్షన్లో లియోనార్డో డికాప్రియోతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది. తాజాగా కేట్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో రెండోసారి డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో శృంగారపు సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను’ అని కేట్ తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది. -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
మోడల్‌తో డిన్నర్‌కు వెళ్లిన టైటానిక్ స్టార్, ఫోటో వైరల్
టైటానిక్ హీరో లియొనార్డో డికాప్రియో ఓ మోడల్‌తో కలిసి డిన్నర్‌కు వెళ్లాడు. తనకంటే 25 ఏళ్లు చిన్నదైన మోడల్ విక్టోరియా లామస్తో కలిసి మంగళవారం రాత్రి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇక డిన్నర్ పూర్తవగానే ఇద్దరూ వేర్వేరు కార్లలో ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలిసి వారేమైనా ప్రేమలో ఉన్నారని కొందరు భ్రమపడుతున్నారు. కానీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహంతోనే ఇలా కలిసి డిన్నర్‌ను ఆస్వాదించారట. కాగా నటుడు లారెంజో లామస్ కూతురే విక్టోరియా లామస్. ఎక్కువగా మోడలింగ్‌పైనే ఫోకస్ పెట్టిన విక్టోరియా ద లాస్ట్ థింగ్ ద ఎర్త్ సేడ్, ఎ విర్చుయస్ రోల్, టు నైనర్ వంటి సినిమాల్లోనూ నటించింది. లియొనార్డో డికాప్రియో విషయానికి వస్తే ఇటీవలే అతడు తన ప్రేయసి కెమిలా మోరోన్‌కు బ్రేకప్ చెప్పాడు. ప్రస్తుతం అతడు మోడల్ గిగి హాడిడ్‌తో లవ్‌లో ఉన్నట్లు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. న్యూయార్క్ ఫ్యాషన్ వీక్ పార్టీలో వీరిద్దరూ క్లోజ్‌గా కనిపించడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లైంది. గిగి విషయానికి వస్తే ఆమె ప్రియుడితో విడిపోయి ఒక్కగానొక్క బిడ్డతో కలిసి ఉంటోంది. View this post on Instagram A post shared by Izabel Alves (@fofocamiope) చదవండి: తనపై జరిగిన దాడిపై తొలిసారి స్పందించిన హీరో తొలిసారి కూతురిని చూసి రేవంత్ ఎమోషనల్ -
ఒక్క సినిమాకే వెయ్యి కోట్ల పారితోషికం!
సినిమాలో ఎవరి పారితోషికం ఎక్కువ అంటే హీరోలదే అన్న సమాధానం వస్తుంది. అది అందరికీ తెలిసిన విషయమే! అయితే రానురానూ షూటింగ్ బడ్జెట్ కంటే కూడా కథానాయకుల పారితోషికానికి పెట్టే బడ్జెటే ఎక్కువవుతూ వస్తోంది. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు రూ.40, 50, 100 కోట్ల వరకు తీసుకుంటున్నారు. అయితే హాలీవుడ్ హీరోలు మాత్రం ఓస్, వందేనా.. మేము వెయ్యి కోట్లు తీసుకుంటున్నాం. అయినా ఇది మాకు చాలా మామూలు విషయమని తేలికగా తీసిపారేస్తున్నారట. హాలీవుడ్లో ఏ హీరో ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నాడనేదానిపై తాజాగా ఓ సర్వే లెక్కలు బయటకు వచ్చాయి. ఇందులో టామ్ క్రూయిజ్ దాదాపు రూ.800 కోట్ల(100 మిలియన్ డాలర్స్) చొప్పున తీసుకుంటున్నాడట! టాప్ గన్: మావెరిక్ సినిమాకు ఇంత మొత్తాన్నే వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు నిర్మాత కూడా టామ్ క్రూయిజే కావడంతో బోనస్‌గా అతడికి మరో రూ.180 కోట్ల దాకా వచ్చాయట. అంటే మొత్తంగా ఒక్క సినిమాకే ఈ స్టార్ హీరో దాదాపు వెయ్యి కోట్ల మేర వెనకేశాడన్నమాట. ఇక ఆస్కార్ అవార్డుల ఫంక్షన్లో హోస్ట్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించి సెన్సేషన్ అయిన విల్ స్మిత్ ఎమాన్సిపేషన్ మూవీకిగానూ రూ.280 కోట్లు (35 మిలియన్ డాలర్స్) అందుకున్నాడట. లినార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్ ఇద్దరూ తాము నటిస్తున్న సినిమాకు రూ.240 కోట్లు(30 మిలియన్ డాలర్స్) అందుకున్నారట. డ్వేన్ జాన్సన్ రూ.180 కోట్లు (22.5 మిలియన్ డాలర్స్), క్రిస్ హేమ్స్‌వర్త్, డెంజెల్ వాషింగ్టన్, విన్ డీజిల్, జాక్విన్ ఫోనిక్స్, టామ్ హార్డీ, విల్ ఫెరల్, ర్యాన్ రెనాల్డ్స్ తలా రూ.160 కోట్లు (20 మిలియన్ డాలర్స్) వెనకేసుకుంటున్నారట. చదవండి: ప్రాణం కాపాడినవాన్నే అణచివేస్తే.. 'పరంపర 2' సిరీస్ రివ్యూ వేదం బ్యూటీ ఇలా అయిపోయిందేంటి? -
ఉక్రెయిన్‌కు రూ.77 కోట్ల విరాళం ప్రకటించిన స్టార్ హీరో
హాలీవుడ్ స్టార్, 'టైటానిక్' హీరో లియొనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు భారీ విరాళాన్ని ప్రకటించాడు. రష్యా భీకర దాడులతో దద్దరిల్లిపోయిన ఉక్రెయిన్‌కు తనవంతుగా రూ.77 కోట్లను విరాళంగా అందించాడు. కాగా ఉక్రెయిన్‌తో లియొనార్డోకు అవినాభావ సంబంధం ఉంది. ఇతడి అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. కానీ 1917లో తన తల్లిదండ్రులతో కలిసి జెర్మనీకి వలస వెళ్లింది. జెర్మనీలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయిన ఆమె 1943లో లియొనార్డో తల్లి ఇర్మెలిన్కు జన్మనిచ్చింది. ఇతడు ఏడాది వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా లియొనార్డో అమ్మమ్మతో ఎక్కువ సమయం గడిపేవాడు. లియొనార్డో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్‌కు వెళ్లేదామె. అతడి యాక్టింగ్ కెరీర్‌కు ఎంతగానో సపోర్ట్ చేసిన హెలెన్ 93 ఏళ్ల వయసులో 2008లో మరణించింది. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టార్ హీరో ఉక్రెయిన్‌కు ఏకంగా 77 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. Leonardo DiCaprio just donated 10 million to the Ukraine armed forces. absolute stud. #LeonardoDiCaprio @LeoDiCaprio #humanitarian — Michael Rosenbaum (@michaelrosenbum) March 9, 2022 -
హాలీవుడ్ హీరోని బెదిరించిన అమెజాన్ అధినేత.. ట్వీట్ వైరల్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ఇటీవల హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోను ఓ కార్యక్రమంలో కలిశారు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, డికాప్రియోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారడంతో జెఫ్ బెజోస్ ట్విటర్ వేదికగా బెదిరింపులకు పాల్పడ్డారు. అయితే ఇదంతా సరదాకే. అసలు సంగతి ఏంటంటే.. గత శనివారం అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన లాక్మే ఆర్ట్+ఫిల్మ్ గాలా ఈవెంట్ కి అమెజాన్ అధినేత తన ప్రియురాలు లారెన్ సాంచెజ్‌తో కలిసి హాజరయ్యారు. అదే వేడుకకు డికాప్రియో కూడా వచ్చారు. ఆ కార్యక్రమంలో డికాప్రియో, లారెన్ సాంచెజ్ కాసేపు ఏదో విషయమై సంభాషించుకున్నారు. ఇందుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో పై బెజోస్ ఫన్నీగా స్పందిస్తూ ట్వీట్ చేశారు. అందులో.. ‘ప్రమాదం! ఏటవాలుగా ఉన్న కొండ ప్రాంతం’ అని హెచ్చరిక బోర్డును పట్టుకొని చొక్కా లేకుండా తాను దిగిన ఓ ఫొటోను ఆ వీడియోకు జత చేస్తూ.. ‘లియో ఇక్కడకు రా.. నీకొకటి చూపించాలి’ అంటూ బెజోస్ ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలయ్యింది. ఇప్పటికే దానిని 17 మిలియన్ల వ్యూస్ రాగా, 1.4 లక్షల లైకులు వచ్చాయి. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. Leo, come over here, I want to show you something… @LeoDiCaprio https://t.co/Gt2v9JZTNz pic.twitter.com/KqGLB839NI — Jeff Bezos (@JeffBezos) November 8, 2021 చదవండి: అవును నా ఇంట్లో దెయ్యాలున్నాయి.. తరిమేశాను: నటి -
ఢిల్లీలో నిరసన: హాలీవుడ్ హీరో మద్దతు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు కాలుష్యం తారస్థాయికి చేరుతోంది. దీంతో ఢిల్లీ వాయు కాలుష్యం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలపై.. అక్కడి ప్రజలకు అవగాహన కల్పించడానికి కొంతమంది గ్రూపులుగా చేరి నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండు చేస్తున్నారు. ఈ క్రమంలో హాలీవుడ్ నటుడు, పర్యావరణ ప్రేమికుడు లియోనార్డో డికాప్రియో సోషల్ మీడియా వేదిక ఢిల్లీ నిరసనకారులకు మద్దతు తెలిపాడు. ‘న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద సుమారు 1500 వందల మంది సమూహాంగా చేరి నగరంలో ప్రమాదకరంగా మారుతోన్న వాయు కాలుష్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ నివేదిక ప్రకారం వాయు కాలుష్యం వల్ల భారతదేశంలో ప్రతి ఏటా సుమారు 10.5 లక్షల మంది మృత్యువాత పడుతున్నారు. ఇది ప్రపంచ వాయు కాలుష్యా మరణాల గణాంకాలలో 5వ స్థానంలో ఉంది’ అని ఈ ఆస్కార్ అవార్డు గ్రహీత తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చారు. అదే విధంగా ఈ నిరసనకు.. కొద్ది గంటలోపే ప్రభుత్వం స్పందించిందని తెలిపారు. ఈ క్రమంలో... కాలుష్య నివారణకై భారత ప్రధాని కార్యాలయం ఓ ప్రత్యేక కమిటీని నియమించిందని, ఈ కమిటి సమస్యపై సుదీర్ఘ విచారణ చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక కూడా ఇవ్వనుందని లియోనార్డో తన పోస్టులో పేర్కొన్నారు. View this post on Instagram #Regram #RG @extinctionrebellion: Over 1500 citizens gathered in at India Gate, in New Dehli, to demand immediate action on the cities hazardous pollution levels. According to the World Health Organisation, air pollution in India is estimated to kill about 1.5 million people every year; these statistics make air pollution the fifth-largest killer in India. People of all ages joined the demonstration, which succeeded to directly trigger action for Indian citizens: 1. The Indian Prime Ministers office set up a special panel to address the issue, within a few hours of the protest. The panel is due to report on the issue within 2 weeks. 2. The Supreme Court of India asked the Central Government and respective state governments to fix the crop and waste burning issue of Dehli within a week. 3. The Center accepted that Green Fund will be used to combat toxic air pollution. 4. The Indian Prime Minister asked the Agriculture Ministry to distribute equipment urgently so that crop burning is no longer necessary. Despite these promises, the air is still unsafe and activists will keep the pressure on until the air pollution reaches safe levels. The protest was organised by a collaboration of movements; @xrebellionind @LetMeBreathe_In @FridaysForFutureIndia_ along with other activists. Photography by Arjun Mahatta and co, via @FridaysForFuture #RightToBreathe #ExtinctionRebellion #IndiaGate #SolutionNotPollution #ActNow #RebelForLife A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on Nov 18, 2019 at 7:24am PST అలాగే లియోనార్డో డికాప్రియో క్లైమేట్ యాక్టివిస్ట్ గ్రూప్, ఎక్స్‌టింక్షన్ రెబెలియన్లు వంటి సామాజిక సంస్థల గురించి ఇన్‌స్టా పోస్టులో ప్రస్తావిస్తూ.. ‘ ఈ కార్యకర్తలు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, అలాగే కాలుష్యం తీవ్రత స్థాయి తగ్గి.. సాధారణ స్థాయికి వచ్చే వరకు ఈ సంస్థ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోస్తుంది’ అని రాసుకోచ్చిన ఈ పోస్టుకు ‘నాకు మంచి భవిష్యత్తు కావాలి’ అంటూ ప్లకార్డును పట్టుకుని నిరసన తెలుపుతున్న ఓ చిన్నారి ఫోటోను జత చేశారు. అదే విధంగా న్యూఢిల్లీలోని కాలుష్యం గురించి ప్రస్తావించారు. కాగా చెన్నై నీటి సంక్షోభం గురించి కూడా అతడు ఇటీవల ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక పర్యావరణ ప్రేమికుడైన ఈ హలీవుడ్ నటుడు వాతావరణ సమస్యలపై అవగాహన కల్పించేందుకు 1998లోనే తన పేరు మీద ఓ సంస్థను స్థాపించాడు. ఆహార కాలుష్యంపై 2016లో వచ్చిన ఓ డాక్యూమెంటరీ నిమిత్తం 2015లో భారత్‌కు కూడా వచ్చాడు. -
అమెజాన్ రక్షణకు హీరో భారీ విరాళం
ప్రపంచంలోనే అతి పొడవైన రైయిన్ ఫారెస్ట్ అయిన అమెజాన్ అడవుల్లో ఇప్పుడు కార్చిచ్చు రగులుకుంది. గత రెండు వారాలుగా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అక్కడి యంత్రాంగం సాయశక్తులా కృషి చేస్తోంది. ప్రతీ ఏటా ఈ అడవుల్లో వేల సంఖ్యలో అగ్ని ప్రమాదాలు సంభవించటం వల్ల ప్రకృతి సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అమెజాన్‌ను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు విరాళాల సేకరణకు నడుం బిగించాయి. తాజాగా ఈ కార్యక్రమానికి తనవంతు సాయం అందించడానికి హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో ముందుకు వచ్చారు. అమెజాన్‌లో తరుచూ జరుగుతున్న అగ్నిప్రమాదాలను అరికట్టేందుకు మరికొంత మందితో కలిసి రక్షణ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అందుకోసం 5 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 35 కోట్లు) రూపాయలను తన సేవా సంస్థద్వారా అందించనున్నట్టుగా ప్రకటించారు. View this post on Instagram #Regram #RG @earthalliance #EarthAlliance, launched in July by @LeonardoDiCaprio, Laurene Powell Jobs, and Brian Sheth, has formed an emergency Amazon Forest Fund with a commitment of $5 million dollars to focus critical resources for indigenous communities and other local partners working to protect the life-sustaining biodiversity of the Amazon against the surge of fires currently burning across the region. Join Us. 100 percent of your donation will go to partners who are working on the ground to protect the Amazon. Earth Alliance is committed to helping protect the natural world. We are deeply concerned about the ongoing crisis in the Amazon, which highlights the delicate balance of climate, biodiversity, and the wellbeing of indigenous peoples. To learn more or to donate, please visit ealliance.org/amazonfund (see link in bio) Photos: @chamiltonjames, @danielbeltraphoto 2017 A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on Aug 25, 2019 at 6:51am PDT -
సెలబ్రిటీల స్వర్గమేమో కదా అదీ!
అది సెలబ్రిటీలకు, యువ రాజులకు స్వర్గధామం. ప్రైవేటు బీచుల మీదుగా వీచే చల్లటిగాలులు, అహ్లాదకరమైన వాతావరణంతో అలరారే పరిసరాల మధ్య అనంద డోలికల్లో తేలిపోతూ కమ్మని సువాసనల మధ్య కమనీయ ముచ్చట్లతో మురిసిపోతూ పసందైన వంటకాల రుచులను ఆస్వాదిస్తూ ‘స్వర్గమే కదా ఇదీ!’ అంటూ తూగే ప్రాంతమది. నిజంగా చెప్పాలంటే సెలబ్రిటీలకు అది ఓ రహస్య స్వర్గం. రసమయ లోకం. అన్యులకు అందని ఆనందాల తీరం. అక్కడి రాయల్ విల్లా నిజంగా రారాజుల విల్లానే. అందుకే ప్రముఖ హాలీవుడ్ సెలిబ్రిటీలు లియోనార్దో డికాప్రియా, మెరిల్ స్ట్రీప్, క్రిస్టినో రొనాల్డో, కైలి మినోగ్, మెల్గిబ్సన్లు తరచు వచ్చి పోతుంటారు. గ్రీస్‌లోని అథేనియా రివీరాలో ఓ ప్రైవేటు ద్వీపకల్పమే ఈ స్వర్గధామం. 72 ఎకరాల విస్తీర్ణంలో విలాసవంతమై 16 హోటల్ బీచెస్, 8 ప్రైవేటు బీచెస్, రాయల్ విల్లాలు ఉన్నాయి. బంధు, మిత్రులతో కాకుండా సకల పని వారలతో కలసి వచ్చినా వారందరికి తగిన వసతులు అందుబాటులో ఉన్నాయి. విల్లాలలోనే కాకుండా హోటళ్లలో కూడా విశాలమైన పడక గదులు, విశ్రాంతి గదులతో పాటు, స్వీయ పాకానికి వంట శాలలు, అధునిక మధు శాలలు, వ్యాయామానికి ప్రైవేటు జిమ్ములు ఉన్నాయి. సూర్య చంద్రుల ఆగమ, నిష్క్రమణ సంధ్యా కాంతులకు అనుగుణంగా, అల్పాహార, మధ్యాహ్న, విందు భోజనాలను ఆస్వాదించేందుకు అన్ని దిక్కుల అహ్లాద ఏర్పాట్లు ఉన్నాయి. ఒకటేమిటీ మార్బుల్ బాత్రూమ్లతోపాటు ఇండోర్, అవుట్ డోర్ స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి. అవసరాన్నిబట్టి వాటిలోని నీరును వేడినీరుగా కూడా మార్చుకునే వెసలుబాటూ ఉంది. 24 గంటలపాటు వంటవాడు అందుబాటులో ఉండడమే కాకుండా 24 గంటలపాటు సర్వీసు ఉంటుంది. సెలబ్రిటీలు ప్రత్యేక ఆకర్షణగా ఈ స్వర్గధామంలో అడుగుపెట్టేందుకు ఓ హెలిపాడ్‌తో పాటు హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ముందుగా చెప్పుకుంటే అమ్మాయికి అబ్బాయి పెళ్లి ఆఫర్ చేసినప్పుడు హెలికాప్టర్ గుండా పుష్పాభిషేకం కూడా చేస్తారు. ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి కదా! అత్యంత ఖరీదు కాబోలు అనుకుంటే పొరపాటే! ఇక్కడి అన్నింటి కన్నా విలాసవంతమైన 400 చదరపు అడుగుల రాయల్ విల్లాలో ఒక రోజు ఉండేందుకు కేవలం లక్ష రూపాయలే. అతిథుల కోసం సూట్లతోపాటు హోటళ్లలో ఒకటేసి గదులు కూడా ఉన్నాయి. పనివారలు, వ్యక్తిగత సిబ్బంది కోసం ఇతర గదులు ఉన్నాయి. సాధారణంగా సెలబ్రిటీలు ఇక్కడి సొంత వంటవాళ్లను వెంట తెచ్చుకుంటారు.‘మామ మియా’ సినిమాను 2008లో ఇక్కడే తీశారు. అప్పుడు ఆ సినీ తారలలోపాటు యావత్ నిర్మాణ సిబ్బంధి ఇక్కడే ఉన్నారు. అందుకనే వివిధ స్థాయిల వ్యక్తులను, వారి అవసరాలను, అభిరుచులను దష్టిలో పెట్టుకొని ఇక్కడ తగిన ఏర్పాటు చేశారు. ప్రముఖ గ్రీక్ ఆర్కిటెక్ట్‌లు, ఇంటీరియర్ డిజైనర్స్ ఇక్కడి వసతులను ఆకర్షణీయంగా తీర్చి దిద్దారు. రాల్ఫ్ లారెన్, కామెరిచ్, విల్లా లూమి, మురానో లాంటి ప్రముఖ నిపుణులు ఇక్కడి ఫర్నీచర్‌కు రూపకల్పణ చేశారు. అతిథుల అభిరుచులకు అనుగుణంగా పెద్ద పెద్ద చెట్లను తొలగించి కూడా వాటి స్థానంలో ఎప్పటికప్పుడు ఇతర చెట్లను రీప్లాంట్ చేయడం ఇక్కడ మరో విచిత్రం, విశేషం అని కూడా చెప్పవచ్చు. అందమైన అమ్మాయిలు మరింత అందంగా మెరిసి పోవాలనే ఉద్దేశంతోనేమోగానీ రాయల్ విల్లా నిర్వాహకులు ఇటీవల అమ్మాయిల కోసం 24 క్యారెట్ల బంగారు స్విమ్మింగ్ సూట్లుకు తెప్పించారట! -
చెన్నై నీటి కష్టాలపై స్పందించిన హాలీవుడ్ హీరో
తమిళనాట గతంలో ఎన్నడూ లేనంతగా నీటి సమస్య ఏర్పడింది. ప్రధాన రిజర్వాయర్లన్నీ అడుగంటడంతో చెన్నై నగరంలో తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పటికే స్పందించిన ప్రభుత్వం ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నిస్తున్న వర్షాలు భారీగా కురిస్తే తప్ప సమస్య పరిష్కారమయ్యా దారి కనిపించటం లేదు. తాజాగా ఈ విషయంపై హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియో స్పందించారు. తన ఇన్స్టాగ్రామ్ పేజ్‌లో బావి దగ్గర నీటి కోసం చూస్తున్న మహిళల ఫోటోను పోస్ట్ చేసిన డికాప్రియో చెన్నై సమస్యపై సుధీర్ఘ కామెంట్ చేశారు. ఈ సమయంలో చెన్నైని వర్షం మాత్రమే కాపాడగలదని అభిప్రాయపడ్డారు. అంతేకాదు చెన్నైలో సామాన్య ప్రజానీకం ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తన పోస్ట్‌లో ప్రస్తావించారు డికాప్రియో. ‘చెన్నైలో అత్యవరస పరిస్థితి ఏర్పడటంతో అంతా పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వం ట్యాంకర్ల ద్వారా అందించే నీటి కోసం గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తోంది. నీరు అందక హోటళ్లు, రెస్టారెంట్లు మూసేస్తున్నారు. మెట్రోలో ఏసీల వినియోగం ఆపేశారు’ అంటూ కామెంట్ చేశారు లియోనార్డో డికాప్రియో. View this post on Instagram #Regram #RG @bbcnews: "Only rain can save Chennai from this situation." A well completely empty, and a city without water. The southern Indian city of Chennai is in crisis, after the four main water reservoirs ran completely dry. The acute water shortage has forced the city to scramble for urgent solutions and residents have to stand in line for hours to get water from government tanks. As the water levels depleted, hotels and restaurants started to shut down temporarily, and the air con was turned off in the city's metro. Officials in the city continue to try and find alternative sources of water - but the community continue to pray for rain. Tap the link in our bio to read more about Chennai's water crisis. (📸 Getty Images) #chennai #watercrisis #india #bbcnews A post shared by Leonardo DiCaprio (@leonardodicaprio) on Jun 25, 2019 at 1:42pm PDT -
అప్పట్లో ఒకడుండేవాడు
ఏదైనా కథ చెప్పాలంటే అనగనగా లేదా అప్పట్లో ఒకడుండేవాడు అని మొదలుపెడతాం. హాలీవుడ్ డైరెక్టర్ క్వెంటిన్ టరంటినో కూడా తన లేటెస్ట్ కథను ఇలానే చెప్పబోతున్నారు. బ్రాడ్ పిట్, ఆల్ పాచినో, లియోనార్డో డికాప్రియో ముఖ్య తారలుగా దర్శకుడు క్వెంటిన్ రూపొందించనున్న చిత్రం ‘వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ హాలీవుడ్’. 1969 కాలంలో ఫేడవుట్ అయిపోయిన టీవీ సిరీస్ యాక్టర్, అతని బాడీ డబుల్ సర్వైవ్ అవ్వడానికి పడ్డ స్ట్రగుల్ ఏంటో ఈ సినిమాలో చూపించదలిచారట క్వెంటిన్. ఫేడవుట్ అయిన హీరోగా బ్రాడ్ పిట్, బాడీ డబుల్ క్యారెక్టర్లో లియొనార్డో డీ కాప్రియో నటించనున్నారు. 2019లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నారు. రక్తం ధారలై ప్రవహించకపోతే రుచించని క్వెంటిన్ ఒక ఫెయిల్డ్ యాక్టర్ జీవితాన్ని ఎలా చూపిస్తారోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. -
టైటానిక్ హీరో.. ‘ఆ’ లిస్ట్ పెద్దదే
హాలీవుడ్ హీరో, టైటానిక్ ఫేమ్ లియోనార్డో డికాప్రియో డేటింగ్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. అవివాహితుడైన 43 ఏళ్ల డికాప్రియో ఇప్పటిదాకా డజను పైగా అమ్మాయిలతో అఫైర్లు నడిపాడు. తాజాగా అర్జెంటీనా మోడల్, నటి కమిలా మోర్రోనె(20)తో డికాప్రియో డేటింగ్లో ఉన్నాడు. ఫేజ్ సిక్స్ సంచిక ఈ మేరకు డికాప్రియో రొమాంటిక్ లైఫ్‌పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కమిలా అతని కన్నా వయసులో 23 ఏళ్లు చిన్నది కాగా.. కమిలా తల్లి వయసు కూడా డికాప్రియో కన్నా రెండేళ్లు తక్కువే కావటం గమనార్హం. గత డిసెంబర్ నైనా అగ్దల్తో విడిపోయి.. కమిలియా తో రిలేషన్ షిప్ మొదలుపెట్టారు. పలు ఈవెంట్లలో వీరిద్దరూ కలిసి జంటగా చక్కర్లు కొడుతున్నారు. కాగా, 1997లో బ్రిటీష్ సింగర్ ఎమ్మా బంటన్తో మొదలైన ఈ డేటింగ్ వ్యవహారం ఇప్పుడు కమిలియాతో కొనసాగుతోంది. డికాప్రియో డేటింగ్ చేసిన వారిలో బిజౌ ఫిలిప్స్, క్రిస్టన్ జంగ్, ఎమ్మా మిల్లర్, గిసెలె బుంద్చన్, బార్ రఫైలి ఉన్నారు. ఇక 2010లో మోడల్ అరెథా విల్సన్‌తో డేటింగ్ వ్యవహారం బెడిసి కొట్టడం.. ఆమె బాటిల్‌తో డికాప్రియో తల పగలకొట్టడం.. ఆపై ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష... అతని రొమాంటిక్ లైఫ్‌లో ఓ చేదు అనుభవంగా మిలిగిపోయింది. -
జాక్ చనిపోయి ఉండాల్సింది కాదు!
‘రోజ్... నువ్వు బతకాలి. నాకోసం నువ్వు బతకాలి’. ‘జాక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి’ ‘రోజ్.. నాకు నువ్వు బతకడమే కావాలి.. నన్ను వదిలెయ్. నా చేయి వదిలేయ్’. రోజ్ వదల్లేక వదల్లేక జాక్ చేతిని వదిలేస్తుంది. ‘టైటానిక్’ సినిమా చివర్లో గాఢ ప్రేమికులు జాక్–రోజ్ల సంఘర్షణ ఇది. బండరాయిని ఢీ కొని, ప్రమాదానికి గురైన టైటానిక్ ఓడ సాక్షిగా సముద్రంలోనే సమాధి అయినవాళ్లు, ప్రాణాలను కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు. విరిగిపోయిన ఓ ముక్క మీద రోజ్ ఉంటుంది. జాక్ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్’లో లియొనార్డో డికాప్రియో (జాక్), కేట్ విన్స్లెట్ (రోజ్) తమ నటనతో మైస్మరైజ్ చేశారు. సినిమా చూసిన వాళ్లందరూ దర్శకుడు జేమ్స్ కేమరూన్ కొంచెం కనికరించి, జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనుకున్నారు. కేట్ విన్స్లెట్ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న కేట్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ‘‘విరిగిన ముక్క మీద జాక్కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్ కామెరూన్ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్ చేతిని రోజ్ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్. అంత గాఢమైన ప్రేమకథలో నటించారు కాబట్టి.. ‘టైటానిక్’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏదైనా ఉండేదా? అన్న ప్రశ్నకు –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్ విన్స్లెట్. -
దేవుడిచ్చిన వరం: టైటానిక్ నటి
లాస్ ఏంజెలిస్: విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో తెరకెక్కించిన చిత్రం టైటానిక్. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అస్కార్ వేడుకల్లో అవార్డుల పంట పండించింది. ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్లేట్లు జీవితాంతం టైటానిక్ విజయాన్ని మరిచిపోరు. రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా నటుడు డికాప్రియోతో తన రిలేషన్‌ను షేర్ చేసుకున్నారు. 'టైటానిక్ మూవీ తర్వాత మా ఇద్దరికి చాలా గుర్తింపు దక్కింది. ఇప్పటికీ మా ఇద్దరినీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం టైటానిక్. ఆ మూవీ షూటింగ్లో ఏర్పడ్డ మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంకా చెప్పాలంటే డికాప్రియో నాకు కుటుంబసభ్యుడు లాంటివారు. అతడితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాస్తవానికి మాపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి టైటానిక్ క్లైమాక్స్‌లో జరిగినదే నిజ జీవితంలోనూ జరిగిందంటూ' నటి కేట్ చమత్కరించారు. -
ప్రియురాలి బర్త్‌డే కోసం కరీబియన్‌కు..
లాస్ ఎంజెల్స్: ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో కరీబియన్ దీవుల్లో ప్రత్యక్షం అయ్యారు. ఆయన తన గర్ల్‌ఫ్రెండ్, మోడల్ నైనా అగ్దాల్ (25) పుట్టిన రోజు వేడుకల అక్కడే ఘనంగా జరిపారు. మార్చి 26న ఆమె పుట్టిన రోజు కావడంతో కొంతమంది స్నేహితులతో కలిసి లియోనార్డోప్రత్యేక విమానంలో వెళ్లినట్లు ఓ ఆంగ్ల వెబ్సైట్ పేర్కొంది. ‘ఆయన ఇప్పుడే విమానంలో వెళ్లారు. అయితే, ఆ విమానం ఆయనది కాదు’ అని కూడా ఆ సైట్ పేర్కొంది. ఎంజెలీనాతో విడిపోయిన తర్వాత డికాప్రియో గత ఏడాది (2016) జూలై నుంచి నైనాతో ఆయన డేటింగ్ చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఆయన 42వ పుట్టిన రోజు వేడుకలో ఫ్రాన్స్‌లోని ఓ దీవిలోగల రిసార్ట్‌లో ఇద్దరు కలిసి ఉన్నారు. -
భయం భయంగా అమెరికా వచ్చాను!
లండన్: సూపర్ మోడల్ గా తనకంటూ పేరు సంపాదించుకుంది నినా అగ్డాల్. ప్రస్తుతం తాను లగ్జరీ జీవితాన్ని లీడ్ చేస్తున్నానని, గతంలో అలాంటి పరిస్థితులు లేవని కొన్ని వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. తన సొంతదేశం డెన్మార్క్ నుంచి అమెరికాకు పొట్టచేత పట్టుకుని తక్కువ డబ్బుతో.. ఎక్కువ భయంతో వచ్చినట్లు తెలిపింది. ఆ సమయంలో ఆమె చేతిలో కేవలం 40 అమెరికన్ డాలర్లు మాత్రమే ఉన్నాయట. దాంతోపాటు మరెన్నో భయాలు తనను వెంటాడాయని చెబుతోంది. నటిగానూ అడుగులు వేస్తోంది నినా. ప్రస్తుతం తన వయసు 24 ఏళ్లు.. కాగా ఆరేళ్ల కిందట తన పరిస్థితి వేరని చెప్పుకొచ్చింది మోడల్ నినా అగ్డాల్. 18 ఏళ్లున్నప్పుడు డెన్మార్క్ లోని హిల్లేరోడ్ నుంచి మయామి, ఫ్లోరిడాలకు వచ్చినప్పుడు ఎంతో భయం భయంగా ఉండేదట. అసలు ఇంగ్లీష్ అంటే తనకెంతో భయమని, స్కూల్లోనూ తనకు నచ్చని సబ్జెక్ట్ అదేనని నినా అంటోంది. అంచెలంచెలుగా ఎదిగిన నినా మోడల్ గా తనకంటూ పేరు, డబ్బు, హోదాను సంపాదించుకుంది. హాలీవుడ్ హీరో లియోనార్డో డికాప్రియోతో డేటింగ్ చేస్తూ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తుంది ఈ ముద్దుగుమ్మ. రోజుకు మూడుసార్లు కచ్చితంగా వర్కవుట్స్ చేస్తానని, లేకపోతే ఆరోగ్యంతో పాటు శరీరాకృతి దెబ్బతింటుందని ఇండస్ట్రీలో ఉండాలంటే ఇలాంటివి తప్పవంటోంది. -
ఈ వజ్రాలకు రక్తం మరకలు లేవు!
కాలిఫోర్నియా: తళతళ మెరసే వజ్రాల వెనక రక్తం మరకలు ఉన్నాయన్న విషయం మనకు తెల్సిందే. వజ్రాల కోసం అంగోల, కాంగో, లిబేరియా దేశాల్లో రక్తం ఏరులై పారింది. సియెర్రా లియోన్ లాంటి దేశాల్లో బానిసలతో వజ్రపు గనులను తవ్వించారు. ప్రపంచంలో వజ్రాల కోసం యుద్ధాలు జరిగిన సంఘటనలే కాకుండా వజ్రాలతో ఆయుధాలు కొనుగోలు చేసి యుద్ధాలు చేసిన చరిత్ర కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే రక్తం ధారల నుంచి పుట్టుకొచ్చిందే వజ్రం. అందుకనే 2007లో హాలివుడ్లో ‘బ్లడ్డైమండ్’ పేరితో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో ప్రముఖ హాలివుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో హీరోగా నటించారు. స్వచ్ఛమైన కార్బన్ నుంచి వజ్రాలు ప్రకృతి సిద్ధంగా తయారవుతాయని తెల్సిందే. వందల కోట్ల సంవత్సరాల అత్యున్నత ఉష్ణోగ్రత, భూపొరల్లో కలిగే అత్యధిక ఒత్తిడి కారణంగా భూగర్భంలో వందకిలోమీటర్ల లోపల బొగ్గుగనులు వ జ్రాల గనులుగా మారుతాయి. ప్రపంచం మొత్తంలో ఇప్పటివరకు ఉత్పత్తయిన వజ్రాల్లో కేవలం 0.1 శాతం మాత్రమే రక్తపుటేరులతో తడిసిపోయాయని, నాటు వజ్రాల వ్యాపారాన్ని నిర్వహించే ‘కింబర్లే ప్రాసెస్’ వెల్లడించింది. అయినా రక్తపు చరిత్రలేని ఈకో ఫ్రెండ్లీ కృత్రిమ వజ్రాల ఫ్యాక్టరీ ఇప్పుడు అమెరికాలోని కాలిఫోర్నియాలో అందుబాటులోకి వచ్చింది. ‘డైమండ్ ఫౌండ్రీ’ని ఆస్ట్రియా, అమెరికనైన మార్టిన్ రుషుసు గతేడాది నవంబర్‌లో స్థాపించి, దానికి ప్రస్తుతం సీఈవోగా వ్యవహరిస్తున్నారు. ట్విట్టర్ వ్యవస్థాపకుడు ఎవాన్ విలియమ్స్‌తోపాటు, బ్లడ్ డైమండ్‌లో నటించిన డికాప్రియో తదితర 12 మంది బిలియనీర్లు ఇందులో పెట్టుబడులు పెట్టారు. ఇంతకుముందు తనతోపాటు కలసి నానో సోలార్ కంపెనీలో పనిచేసిన ఇంజనీర్ల బృందాన్నే మార్టిన్ ఇందులోకి తీసుకున్నారు. సూర్యుడి ఉపరితలంపై ఉండే వేడికి సమానమైన, దాదాపు పదివేల ఫారన్‌హీట్ డిగ్రీల ఉష్ణోగ్రత కలిగిన ప్లాస్మాను రియాక్టర్లో ఉత్పత్తి చేయడం ద్వారా ఈ కంపెనీ కృత్రిమ వజ్రాలను తయారు చేస్తోంది. ప్రపంచంలో కృత్రిమ వజ్రాలను ఉత్పత్తిచేసే కంపెనీలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నాయని, అయితే తాము అనుసరించే విధానం ఇతర కంపెనీలకన్నా భిన్నమైనదని, తాము పర్యావరణానికి అనుకూలమైన ఇంధనాన్ని మాత్రమే వజ్రాల తయారీకి వినియోగిస్తామని మార్టిన్ వివరించారు. మార్కెట్లో దొరికే వజ్రాలకన్నా తాము పది నుంచి 15 శాతం తక్కువకు వజ్రాలను సరఫరా చేస్తామని, నెలకు వెయ్యి కారెట్ల బరువుగల వజ్రాలను తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు తమ కంపెనీ తయారు చేసిన వజ్రాల్లో 12 క్యారెట్ల వజ్రమే అతి పెద్దదని ఆయన తెలిపారు. 0.13 క్యారెట్ల బరువుగల వజ్రం 305 డాలర్లకు, 2.30 క్యారెట్లు కలిగిన వజ్రం 23 వేల డాలర్లకు విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రకృతి సిద్ధంగా దొరికే వజ్రాలకు, కృత్రిమ వజ్రాలకు ధరలో పెద్ద తేడా ఏమీ ఉండదని, ఏదైనా వజ్రం, వజ్రమేకదా! అని మార్టిన్ వ్యాఖ్యానించారు. రక్తం మరకలు గుర్తురాకుండా ఉండాలంటే ఈ కృత్రిమ వజ్రాలే మేలేమో! -
ఆస్కార్ హీరోకు తప్పిన కారు ప్రమాదం
న్యూయార్క్: కారు ప్రమాదం నుంచి ఆస్కార్ అవార్డు పొందిన నటుడు బయటపడ్డాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత లియోనార్డో డికాప్రియో ప్రయాణిస్తున్న కారు ఓ చిన్న ప్రమాదానికి గురైంది. ఆయన కారు వెనుక ఓ మినీ కూపర్ తగలడంతో అది స్వల్పంగా దెబ్బతిన్నది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఆయన గర్ల్ ఫ్రెండ్‌గా ఇప్పటికే వదంతులు వ్యాపించిన నైనా అద్గాల్ కూడా ఉంది. వీకెండ్ ట్రిప్ లో భాగంగా తన కొత్త గర్ల్ ఫ్రెండ్ తో న్యూయార్క్ సమీపంలోని ఈస్ట్ హాంప్టన్ వైపు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటన జరిగిన అక్కడికి అంబులెన్స్ కూడా వచ్చింది. అయితే, ఇది స్వల్ప ప్రమాదమే అని వారు చెప్పారు. కాగా, కారు ఢీకొట్టిన సమయంలో వారిద్దరు తమ సీట్లో నుంచి ముందు సీట్లకు తగిలారని, ఆ సమయంలో వేగం తక్కువగా ఉండటంతో పెద్దగా ప్రమాదం జరగలేదని స్థానిక మీడియా వెల్లడించింది. -
'ఆ హీరోని ఒప్పించడం అంత తేలిక కాదు'
లాస్ ఎంజెల్స్: ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియోను ఒక చిత్రానికి ఒప్పించడం అంత తేలికైన పనికాదని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బజ్ లార్మన్ చెప్పారు. డికాప్రియాతో 1996లో రోమియో జూలియట్, 2013 ది గ్రేట్ గ్యాట్స్బై అనే రెండు చిత్రాలకు లార్మన్ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సినిమాలు ఎంపిక చేసుకునే విషయంలో డికాప్రియో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాడని అన్నారు. ఆయన ముఖ్యంగా ప్రకృతి ప్రేమికుడని, పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలున్న కథలకు ఆయన ససేమిరా ఒప్పుకోడని, అది ఆయనకు మాత్రమే ఉన్న గొప్ప ఆలోచన అని కొనియాడారు. నిర్ణయాలను అంత తేలికగా తీసుకోడని ఆచితూచి అందరికీ మంచి జరుగుతుంది అనుకుంటేనే ఆ సినిమాకు ఒప్పుకుంటాడని, తన చిత్రం ద్వారా పర్యవరణానికి ఎలాంటి హానీ జరగదని భావిస్తేనే అంగీకరిస్తాడని తెలిపారు. అందుకే తనకు ఎన్నిసార్లయినా సినిమా తీసేందుకు సిద్ధంగా ఉంటానని, మా ఇద్దరి ఆలోచనలు కూడా దాదాపు సమీపంగానే ఉంటాయన్నారు. -
తోటి నటుడ్ని ఆటపట్టించిన స్టార్ హీరో!
-
తోటి నటుడ్ని ఆటపట్టించిన స్టార్ హీరో!
పెద్దగా ఎండలేదు. వాతావరణం శాంతియుతంగా ఉంది. పరిసరాల్లో పెద్దగా అలికిడి లేదు. ఎవరి పనుల్లో వాళ్లు ఉన్నారు. అమెరికన్ నటుడు జోన్హా హిల్ కూడా సరదాగా నడుచుకుంటూ వెళుతున్నాడు. చెవుల్లో హియర్‌ఫోన్స్.. మధురమైన పాటలు వింటున్నాడు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి ఫోన్ పట్టుకొని పరిగెత్తుకొచ్చాడు. ఫొటో ఫొటో అంటూ బెదరగొట్టాడు. జోన్హా హిల్ బెదిరిపోయాడు. కాస్తా తెరుకొని చూస్తే.. హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో.. స్టన్ అయ్యాడు జోన్హా హిల్. 'ద వోల్ఫ్ ఆఫ్ వాల్‌స్ట్రీట్' సినిమాలో తన సహ నటుడైన జోన్హా హిల్‌ను ఇలా ఆటపట్టించాడు డికాప్రియో. ఒక్కసారిగా ఫొటో ఫొటో అంటూ డికాప్రియో మీదపడటంతో ఏంటో అర్థం కాక బెదిరిపోయాడు హిల్. నిజానికి ఈ ఇద్దరు మంచి స్నేహితులు. ఆస్కార్ వేడుకల్లోనూ కలిసి కామెడీ షోలు చేశారు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడిని కాస్తా ఆటపట్టించడానికి 'టైటానిక్' స్టార్ ఇలా బెదరగొట్టాడు. ఈ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
విహారనౌకలో ప్రియురాలితో.. !
లాస్ ఏంజిల్స్: ‘టైటానిక్’ హీరో లియోనార్డో డికాప్రియో మళ్లీ ప్రేమలో మునిగిపోయాడు. తన కొత్త ప్రియురాలి నినా ఆగ్డాల్తో ఆయన ఓ విహారనౌకలో విహారించాడు. ఇబిజాలోని సముద్రతీరంలో వీరు మిత్రులతో కలిసి షికారు చేశారు. 41 ఏళ్ల డికాప్రియో ఇటీవల ‘రెవరెంట్’ సినిమాకుగాను ఆస్కార్ అవార్డు గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ ఆనందంలో ఉన్న ఆయన తాజాగా డానిష్ మోడల్ నినాతో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నాడు. అయితే, గతవారం డికాప్రియో నిర్వహించిన పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో నినా పాల్గొనలేదు. వీరు జంటగా కనిపించకపోవడంతో వీళ్ల మధ్య అప్పుడే చెడిందా అని వార్తలు వచ్చాయి. అయితే, ఈ రూమర్స్ కొట్టిపారేస్తూ ఈ లవర్స్ తాజాగా నౌకవిహారంలో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేశారు. లగ్జరీ బోటులో సముద్రయానం చేస్తూ ఆనందంగా సాగిన ఈ జర్నీలో డికాప్రియో సన్నిహితులు, మిత్రులు కూడా పాల్గొన్నారు. మొత్తానికి ఈ నౌకవిహారం ద్వారా నినా-డికాప్రియో జంట తమ బ్రేకప్ కాలేదు.. తాము ప్రేమలో మునిగిపోయి ఉన్నామని చాటారు. -
ఆర్ఎస్ఎస్ తరఫున లియోనార్డో డికాప్రియో ప్రచారం?
ప్రముఖ హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ కాస్టర్ డేవిడ్ అటన్ బరో, బిజినెస్ దిగ్గజం రిచర్డ్ బ్రాన్ సన్ లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) తరఫున ప్రచారం చేయనున్నారా? అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సంఘ్ పరివార్ కు చెందిన కొందరు వ్యక్తులు తెలిపిన వివరాల ప్రకారం ఈ నెల 30, 31 తేదీలలో యూకే పర్యటనకు వెళ్లనున్న ఆర్ ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ను హాలీవుడ్ ప్రముఖులు కలవనున్నట్లు తెలిపారు. బీఫ్ వినియోగం, శాఖాహారంపై ఆర్ ఎస్ఎస్ తరఫున వీరందరూ ప్రచారం చేయనున్నట్లు వివరించారు. ఆ తర్వాత కాంటర్బ్యూరీలోని ఆర్చీ బిషప్ ను కలుస్తారని చెప్పారు. హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా శివీర్ గ్రాండ్ క్యాంప్ కోసం యూకే వెళ్తున్న ఆయన మిగిలిన కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు. కాగా, జంతు వధలపై డికాప్రియో ఎప్పటినుంచో ప్రచారం చేస్తుండగా, వేగన్ అయిన బ్రాన్ సన్ తాను సొంతగా వేగన్ ఎయిర్ లైన్ ను ప్రారంభించబోతున్నట్లు 2015లో ప్రకటించారు.సంఘ్ పరివార్ కు అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆసియా దేశాల్లో ప్రచారకులు ఉన్నారు. -
గర్ల్‌ఫ్రెండ్ వద్దకు ప్రతిరోజూ ఫ్లైట్‌లో..
లండన్: టైటానిక్ హీరో.. ఇటీవల రెవనాంట్ చిత్రంలో అద్భుతమైన నటనతో ఆస్కార్ అవార్డును దక్కించుకున్న ప్రముఖ హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో కాలు ఇప్పుడు ఓ చోట నిలవడం లేదంట. ఆయన ప్రతి రోజు ప్లైట్ లో వెళ్లి వస్తున్నాడంట. అది సినిమా షూటింగ్ కోసం అనుకుంటే భ్రమపడ్డట్టే. ఎందుకంటే ఆయన ఇప్పుడు విమానంలో ఎగురుతుంది ఓ గర్ల్ ఫ్రెండ్ కారణంగా. ఇటీవలె ఆమెపై మనసు పారేసుకున్న డికాప్రియో ఆమెకు ఫిదా అయ్యి ఎస్సెక్స్ లో ఉంటున్న ఆమె వద్దకు ప్రతి రోజు విమానంలో వెళ్లి వస్తున్నాడని హాలీవుడ్ వర్గాలు గుప్పుమంటున్నాయి. డికాప్రియో ఆమెతో చాలా గాఢంగా డేటింగ్ చేస్తున్నాయని చెబుతున్నాయి. ఆమె ఎవరో కాదు.. మొన్నటి వరకు ఓ బాయ్ ఫ్రెండ్‌తో ఉంటూ ఇటీవలే అతడికి గుడ్ బాయ్ చెప్పిన మోడల్ రాక్సీ హార్నర్. ఎస్సెక్స్ కు చెందిన రాక్సీ హార్నర్ ఇటీవల తన మాజీ బాయ్ ఫ్రెండ్ జోఎక్స్ కు టాటా చెప్పింది. అనంతరం డికాప్రియోకు దగ్గరయింది. గత మంగళవారం కూడా ప్రత్యేకంగా బ్రిటన్ వెళ్లిన డికాప్రియో ఆమెతో బార్లలో చిందులు, నైట్ క్లబ్బుల్లో షికార్లు, అనంతరం లండన్‌లోని చిల్టర్న్ ఫైర్ హౌజ్ అనే హోటల్ లో ఉన్నారంట. అంతేకాకుండా పలు మ్యూజిక్ పార్టీల్లో డికాప్రియో ఆమెతో కలిసి చిందులేస్తున్నాడట. -
హాలీవుడ్ సూపర్ స్టార్‌పై నిషేధం!
లాస్ ఏంజిల్స్: 'రెవనెంట్' సినిమాతో ఈ ఏడాది ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న హాలీవుడ్ సూపర్ స్టార్ లియోనార్డో డికాప్రియో ఇండోనేషియాలో చిక్కులు ఎదుర్కొంటున్నాడు. ఆయన తమ దేశానికి రాకుండా నిషేధం విధించాలని ఇండోనేషియా భావిస్తోంది. పర్యావరణ కార్యకర్త అయిన 41 ఏళ్ల లియో గత నెల ఇండోనేషియాలోని సమత్రా దీవులను సందర్శించాడు. ఆ తర్వాత అమెరికా తిరిగి వచ్చిన ఆయన ఇండోనేషియాలోని పామాయిల్ తోటలు పర్యావరణానికి తీవ్ర హాని చేస్తున్నాయని, ముఖ్యంగా అటవీ వర్షపాతం తగ్గిపోవడానికి ఇవి కారణమవుతున్నాయని ఆయన వ్యాఖ్యలు చేశాడు. పామాయిల్ తోటల కారణంగా సమత్ర దీవుల్లోని లెవుసర్ పర్యావరణ ప్రాంతంలోని జంతువుల మనుగడ ప్రమాదంలో పడిందని, అక్కడి పులులు, ఏనుగులు ఆవాస స్థలాలను కోల్పోతున్నాయని చెప్పాడు. పెద్ద ఎత్తున చేపడుతున్న ఈ తోటల కోసం అడవులను కాల్చివేసి.. నరికివేసే పద్ధతిని అక్కడి రైతులు వాడుతున్నట్టు యూఎస్ మ్యాగజీన్ తన కథనంలో తెలిపింది. ఈ తోటల విస్తరణ ఇటీవలికాలంలో పెద్ద ఎత్తున కొనసాగుతుండటంతో ఏనుగులు, ఇతర అటవీ జంతువులకు ఆహారం, నీరు లభించడం లేదని, దీంతో ఈ జీవులు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశాడు. డియోకాప్రియో చేసిన వ్యాఖ్యలు, ఈ విషయంలో అతడు రాసిన వ్యాసంపై ఇండోనేషియా కన్నెర్ర జేసింది. అతడు మరోసారి ఇండోనేషియా రాకుండా నిషేధం విధిస్తామని ఆదేశ అధికార ప్రతినిధి హెరు సాంతోసో తెలిపారు. తమ దేశం గురించి సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ.. లేనిపోని కల్పనలు కల్పిస్తున్న ఆయనను బ్లాక్‌లిస్టులో పెడతామని హెచ్చరించింది.