అమితాబ్తో మళ్లీ నటిస్తా: 'టైటానిక్' హీరో | I would love to work with Amitabh Bachchan again: Leonardo DiCaprio | Sakshi
Sakshi News home page

అమితాబ్తో మళ్లీ నటిస్తా: 'టైటానిక్' హీరో

Published Mon, Jan 13 2014 9:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

అమితాబ్తో మళ్లీ నటిస్తా: 'టైటానిక్' హీరో

అమితాబ్తో మళ్లీ నటిస్తా: 'టైటానిక్' హీరో

లాస్ ఏంజెలెస్: బాలీవుడ్ సీనియర్ నటుడు అమితాబ్ బచ్చన్తో మరోసారి పనిచేయడానికి సిద్ధమని హాలీవుడ్ నటుడు లియొనార్డో డికాప్రియో ప్రకటించాడు. 'బిగ్ బి'తో కలిసి పనిచేయడాన్ని తానెంతో ఇష్టపడతానని చెప్పారు. అమితాబ్ ప్రతిభావంతుడైన నటుడని, మంచి వ్యక్తి అని కితాబిచ్చాడు. తన తాజా చిత్రం 'ద వూల్ప్ ఆఫ్ వాల్ స్ట్రీట్' గురించి ఇచ్చిన ఇంటర్వ్యూలో డికాప్రియో వ్యాఖ్యలు చేశాడు.

అమితాబ్తో కలిసి పనిచేసే అవకాశం వస్తే తప్పకుండా అంగీకరిస్తానని 'టైటానిక్' స్టార్ వెల్లడించాడు. 71 ఏళ్ల వయసులోనూ నటన పట్ల ఆయన చూపే ఉత్సుకత తననెంతో ఆకట్టుకుందన్నాడు. ఆయనతో తెర పంచుకోవడాన్ని గౌరవంగా భావిస్తానని చెప్పాడు. ‘ద గ్రేట్ గట్స్‌బి’ సినిమాలో అమితాబ్తో కలిసి  డికాప్రియో నటించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement