'ఆ స్ట్రాంగ్ లీడర్‌లా నటించాలని ఉంది' | Leonardo DiCaprio would love to play Vladimir Putin | Sakshi
Sakshi News home page

'ఆ స్ట్రాంగ్ లీడర్‌లా నటించాలని ఉంది'

Published Mon, Jan 18 2016 4:35 PM | Last Updated on Sun, Sep 3 2017 3:51 PM

'ఆ స్ట్రాంగ్ లీడర్‌లా నటించాలని ఉంది'

'ఆ స్ట్రాంగ్ లీడర్‌లా నటించాలని ఉంది'

ప్రపంచంలో బలమైన నాయకుడు, రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌. రష్యాను తిరుగులేకుండా పరిపాలిస్తున్న ఆయనకు వివాదాస్పదుదిగానూ పేరుంది. విలక్షణమైన నేతగా పేరొందిన ఆయన పాత్రను పోషించాలని 'టైటానిక్‌' హీరో లియోనార్డో డికాప్రియో ముచ్చటపడుతున్నారు. తాజాగా 'రెవెనంట్‌' సినిమాలో హూ గ్లాస్‌గా నటించి అదరగొట్టిన ఈ 41 ఏళ్ల హీరో తన అభినయానికి ఆస్కార్ నామినేషన్ పొందారు. గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాన్ని కైవసం చేసుకున్నారు. 'ద వోల్ఫ్ ఆఫ్ వాల్‌స్ట్రీట్‌' వంటి ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన డికాప్రియో తాజాగా తెరపై కనిపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిపారు.

'పుతిన్ చాలా ఆసక్తికరమైన వ్యక్తి. ఆయన పాత్ర పోషించడం నాకెంతో ఇష్టం' అని ఈ హాలీవుడ్ స్టార్ తెలిపారు. అంతరించిపోతున్న సైబీరియన్ పులుల సంకరక్షణపై అవగాహన కోసం 2010లో ఓసారి పుతిన్‌ను డికాప్రియో స్వయంగా కలిశారు. రాజకీయాలకు సంబంధం లేకుండా తన ఫౌండేషన్ ఆధ్వర్యంలో పులుల సంరక్షణ గురించి అప్పట్లో పుతిన్‌తో చర్చించినట్టు ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement