
అతడి అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. కానీ 1917లో తన తల్లిదండ్రులతో జెర్మనీకి వలస వెళ్లింది. అక్కడే పెళ్లి చేసుకుని స్థిరపడ్డ ఆమె 1943లో లియొనార్డో తల్లి ఇర్మెలిన్‌కు జన్మనిచ్చింది
హాలీవుడ్ స్టార్, 'టైటానిక్' హీరో లియొనార్డో డికాప్రియో ఉక్రెయిన్‌కు భారీ విరాళాన్ని ప్రకటించాడు. రష్యా భీకర దాడులతో దద్దరిల్లిపోయిన ఉక్రెయిన్‌కు తనవంతుగా రూ.77 కోట్లను విరాళంగా అందించాడు. కాగా ఉక్రెయిన్‌తో లియొనార్డోకు అవినాభావ సంబంధం ఉంది. ఇతడి అమ్మమ్మ హెలెన్ ఇండెన్‌బిర్కెన్ ఉక్రెయిన్‌లోని ఒడెస్సాలో జన్మించింది. కానీ 1917లో తన తల్లిదండ్రులతో కలిసి జెర్మనీకి వలస వెళ్లింది.
జెర్మనీలోనే పెళ్లి చేసుకుని స్థిరపడిపోయిన ఆమె 1943లో లియొనార్డో తల్లి ఇర్మెలిన్‌కు జన్మనిచ్చింది. ఇతడు ఏడాది వయసున్నప్పుడే తల్లిదండ్రులు విడిపోగా లియొనార్డో అమ్మమ్మతో ఎక్కువ సమయం గడిపేవాడు. లియొనార్డో నటించిన ప్రతి సినిమా ప్రీమియర్‌కు వెళ్లేదామె. అతడి యాక్టింగ్ కెరీర్‌కు ఎంతగానో సపోర్ట్ చేసిన హెలెన్ 93 ఏళ్ల వయసులో 2008లో మరణించింది. ఈ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న స్టార్ హీరో ఉక్రెయిన్‌కు ఏకంగా 77 కోట్ల రూపాయల విరాళాన్ని ప్రకటించి ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు.
Leonardo DiCaprio just donated 10 million to the Ukraine armed forces. absolute stud. #LeonardoDiCaprio @LeoDiCaprio #humanitarian
— Michael Rosenbaum (@michaelrosenbum) March 9, 2022