భారతీయ సినిమాల్లో శృంగారపు సన్నివేశాలకు హద్దు ఉంటుంది కానీ హాలీవుడ్‌లో అలా కాదు. తెరపై రొమాంటిక్ సీన్స్ చూపించాలని డిసైడ్ అయితే.. వాళ్లకంటే బోల్డ్‌గా మరెవరూ చూపించరు. అయితే ఆ సీన్స్ చేసేటప్పుడు హీరో హీరోయిన్లు ఒక్కోసారి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ‘టైటానిక్’ హీరోయిన్ కేట్ విన్‌స్లేట్ కూడా అలాంటి సన్నివేశాలు చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డారట. భర్త ముందే బోల్డ్ సీన్స్‌లో నటించడం..ఇబ్బందిగా, విచిత్రంగా అనిపించిందట.
‘టైటానిక్’ సినిమా తర్వాత లియోనార్డో డికాప్రియో, కేట్ కలిసి ‘రెవల్యూషనరీ రోడ్’ అనే సినిమాలో నటించారు. ఆ సినిమాకి కేట్ మాజీ భర్త సామ్ మెండిస్ దర్శకత్వం వహించారు. అందులో ఉన్న రొమాంటిక్ సీన్స్..అప్పట్లో సంచలనం సృష్టించాయి. భర్త డైరెక్షన్‌లో లియోనార్డో డికాప్రియోతో కలిసి కేట్ రొమాన్స్ చేసింది.
తాజాగా కేట్ ఆ విషయం గురించి మాట్లాడుతూ.. ‘రివల్యూషనరీ రోడ్ మూవీ టైంలో రెండోసారి డికాప్రియోతో కలిసి నటించడం ఆనందంగా అనిపించింది. ఆ సినిమాకి డైరెక్టర్ నా భర్తే కాబట్టి.. డికాప్రియోతో శృంగారపు సన్నివేశాలలో నటించేటప్పుడు ఓవైపు ఇబ్బందిగా, మరోవైపు విచిత్రంగా ఫీలయ్యాను’ అని కేట్ తెలిపింది. ఆ సినిమాకి కేట్ బెస్ట్ యాక్ట్రెస్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment