దేవుడిచ్చిన వరం: టైటానిక్ నటి | Actress Kate Winslet reveals about relation with DiCaprio | Sakshi
Sakshi News home page

దేవుడిచ్చిన వరం: టైటానిక్ నటి

Published Thu, Sep 28 2017 12:08 PM | Last Updated on Thu, Sep 28 2017 1:30 PM

Actress Kate Winslet reveals about relation with DiCaprio

లాస్ ఏంజెలిస్: విఖ్యాత దర్శకుడు జేమ్స్ కామెరూన్ 1997లో తెరకెక్కించిన చిత్రం టైటానిక్. ప్రపంచ వ్యాప్తంగా రికార్డు వసూళ్లు రాబట్టిన ఈ మూవీ అస్కార్ వేడుకల్లో అవార్డుల పంట పండించింది. ఈ మూవీలో హీరోహీరోయిన్లుగా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లేట్‌లు జీవితాంతం టైటానిక్ విజయాన్ని మరిచిపోరు. రెండు దశాబ్దాలు గడిచినా కేట్, డికాప్రియోల రిలేషన్‌పై హాలీవుడ్‌లో వదంతులు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఓ టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా నటుడు డికాప్రియోతో తన రిలేషన్‌ను షేర్‌ చేసుకున్నారు.

'టైటానిక్ మూవీ తర్వాత మా ఇద్దరికి చాలా గుర్తింపు దక్కింది. ఇప్పటికీ మా ఇద్దరినీ ప్రేక్షకులు గుర్తుంచుకోవడానికి కారణం టైటానిక్. ఆ మూవీ షూటింగ్‌లో ఏర్పడ్డ మా స్నేహబంధం నేటికీ కొనసాగుతోంది. మేం ఒకరినొకరం పరస్పరం గౌరవించుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఇంకా చెప్పాలంటే డికాప్రియో నాకు కుటుంబసభ్యుడు లాంటివారు. అతడితో స్నేహం దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. వాస్తవానికి మాపై ఎన్నో వదంతులు ప్రచారంలో ఉన్నాయి. నిజానికి టైటానిక్‌ క్లైమాక్స్‌లో జరిగినదే నిజ జీవితంలోనూ జరిగిందంటూ' నటి కేట్ చమత్కరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement