సినీ ప్రపంచంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను తెరెకెక్కించిన హాలీవుడ్ నిర్మాత జోన్ లాండౌ (63) మరణించారు. ఆయన జులై 5వ తేదీనే మృతిచెందారు. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో కలిసి టైటానిక్, అవతార్ సీక్వెల్స్ చిత్రాలను నిర్మించారు. ఆయన మరణ వార్తను లాండౌ కుటుంబం ఆలస్యంగా ప్రకటించింది. అయితే, అందుకు సంబంధించిన కారణాలను వారు వెళ్లడించలేదు.
డైరెక్టర్ కామెరూన్‌తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన చిత్రాలు మూడు ఆస్కార్ నామినేషన్‌లకు ఎంపిక కావడం విశేషం. ఈ క్రమంలో 1997లో టైటానిక్‌కి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవతార్, దాని సీక్వెల్‌గా వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో సహా చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్స్‌గా రికార్డ్ క్రియేట్ చేశాయి. 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ కెరియర్‌ను ఆయన ప్రారంభించాడు. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదం వల్ల మునిగిపోవడంతో సుమారు 1500 మంది మరణించారు. ఆ షిప్ మహా జలసౌధ నిర్మాణం, ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో ఉన్నాయని ఆయన గ్రహించాడు.
దీంతో కామెరూన్‌తో కలిసి టైటానిక్ అనే సినిమాను నిర్మించి 1997లో విడుదల చేశారు. ఈ చిత్రం 11 అస్కార్ అవార్డులను గెలుచుకుంది. జోన్ లాండౌ నిర్మాతగా 2009లో విడుదలైన చిత్రం అవతార్.. ఈ సినిమా సుమారు రూ.24 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతోంది. అవతార్ 2 కూడా రూ. 19 వేల కోట్లు రాబట్టింది. అయితే, షాకింగ్ విషయం ఏమిటంటే టైటానిక్ చిత్రం 1997లోనే రూ. 18 వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది.
ఇంతటి భారీ చిత్రాలను నిర్మించిన జోన్ లాండౌ మరణించడంతో హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జోన్ లాండౌకు భార్య జూలీ (45),వారి కుమారులు, జామీ, జోడీ ఉన్నారు. వీరితో పాటు ఆయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment