Avatar 2: Kate Winslet reveals the difference she find in James Cameron - Sakshi
Sakshi News home page

Kate Winslet: టైటానిక్ టూ అవతార్.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ..!

Published Fri, Dec 16 2022 4:01 PM | Last Updated on Fri, Dec 16 2022 4:27 PM

Kate Winslet REVEALS the difference she finds in James Cameron - Sakshi

'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. యావత్‌ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్‌-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్‌ వండర్‌గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్‌.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. 

(ఇది చదవండి: అవతార్‌-2 అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో రికార్డుల మోత)

అయితే ఈ చిత్రంలో టైటానిక్ భామ కేట్ విన్‌స్లెట్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జేమ్స్‌ కామెరూన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టైటానిక్ విడుదలైన 25 ఏళ్ల తర్వాత కేట్ విన్ స్లెట్, జేమ్స్ కామెరూన్ మళ్లీ అవతార్-2లో కలిసి పనిచేయడం గమనార్హం.

అవతార్‌ మూవీతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన జేమ్స్ కామెరూన్.. దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్‌లో పండోరలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపించారు. సామ్ వర్తింగ్టన్, జో సాల్దానా.. జేక్, నేత్రి పాత్రలు పోషించగా.. ఈ అడ్వెంచర్‌లో టోనోవరీ భార్యగా రోనల్ పాత్రలో కేట్ విన్స్‌లెట్ నటించింది. 

టైటానిక్ భామ కేట్ విన్‌ స్లెట్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అనుకుంటున్నా. టైటానిక్ విడుదలై 25 ఏళ్లైంది. ఇది చాలా సుదీర్ఘ సమయం. అది నా జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ. ఇప్పుడు పరిస్థితులు  పూర్తిగా మారిపోయాయి. నేను తల్లిని అయ్యా. జేమ్స్‌ కామెరూన్ కూడా పేరెంట్ అయ్యారు. మేమిద్దరం కళాకారులం. మేం ప్రయోగాత్మకంగా మరింత సాహసోపేతంగా ఉన్నాం. అదే మా ఇద్దరి మధ్య ప్రధాన వ్యత్యాసం. ఇద్దరి మధ్య సృజనాత్మకమైన తేడాలు చాలా ఉన్నాయి.' అని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement