హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (అవతార్- 2). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం పలు ఓటీటీల్లోనూ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా సినీ ప్రియులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి అద్దె చెల్లించకుండానే చూసేలా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది.
(ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్‌లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్)
రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్‌కు అందుబాటులో రానున్నట్లు ప్రకటించింది. ఈ విజువల్ వండర్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదల కానుందన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
(ఇది చదవండి: చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!)
కాగా.. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో సందడి చేసింది. తొలి భాగం అవతార్‌లానే పలు రికార్డులు సృష్టించిన ఈ సీక్వెల్ 2023 మార్చి 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలైన మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment