
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
(ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!)
అయితే ఇప్పటికే ఈ సినిమా రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఇండియాలో ఫ్రీగా చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు ఈ విజువల్ వండర్‌ను చూడడం మిస్సయిన వారు చూసేయండి.
(ఇది చదవండి: రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి)
Comments
Please login to add a commentAdd a comment