Avatar 2 The Way Of Water OTT Release Date And Streaming Platform Details - Sakshi
Sakshi News home page

Avatar 2 OTT: భారీ ధరకు అవతార్‌-2 డిజిటల్‌ రైట్స్‌ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ

Published Sun, Dec 25 2022 12:19 PM | Last Updated on Sun, Dec 25 2022 1:14 PM

Avatar 2 The Way Of Water OTT Release Date And Streaming Platform Details - Sakshi

విజువల్‌ వండర్‌ అవతార్‌-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ కామెరూన్‌ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్‌16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇక  3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్‌-2 సినిమా టికెట్‌ రేట్స్‌ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్‌న్యూస్‌. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది.

రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల త‌ర్వాతే అవ‌తార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుంద‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మరి  ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement