avatar sequel
-
ఆ సీక్వెల్స్‌కి నేను డైరెక్షన్ చేయకపోవచ్చు!
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అవతార్’. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పండోరా ప్రపంచంలో విహరించేలా చేసింది. కలెక్షన్స్‌లో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. దీంతో ‘అవతార్’కు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2’, ‘అవతార్ 3’, ‘అవతార్ 4’, ‘అవతార్ 5’లను ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’ సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అవతార్ 3’, ‘అవతార్ 4’ సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరుగుతున్నాయి. ‘అవతార్ 3’ ఈ ఏడాదిలో విడుదల కావాల్సింది. కానీ 2025కి వాయిదా వేశారు. 2025 డిసెంబరు 19న‘అవతార్ 3’, 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు కూడా చాన్స్ ఉందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ‘అవతార్’ సినిమా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ– ‘‘అవతార్’ ఫ్రాంచైజీలోని ఐదు సినిమాలకు కథలు రెడీగా ఉన్నాయి. ‘అవతార్ 6’, ‘అవతార్ 7’ల గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు నేను దర్శకత్వం వహించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. హలీవుడ్లో ‘టైటానిక్’, ‘ది టెర్మినేటర్’ వంటి అద్భుత చిత్రాలను కూడా తీసిన జేమ్స్ కామెరూన్ కెరీర్‌ను ‘అవతార్’ ఫ్రాంచైజీ ఒక్కటే డామినేట్ చేయడం ఆయన ఫ్యాన్స్‌కు రుచించడం లేదని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఇక కామెరూన్ అన్నట్లు భవిష్యత్‌లో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లు సెట్స్‌పైకి వెళితే.. కనీసం ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ఈ సినిమాలను తీయాల్సి ఉంటుందన్నట్లు హాలీవుడ్ సినీ విశ్లేషకులు అభి్రపాయపడుతున్నారట. -
ఎనిమిదేళ్ల తర్వాత అవతార్ 5
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. 2031లో ఫైనల్ అవతార్ తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు. ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు. -
‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
విజువల్ వండర్ అవతార్-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్-2 సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల తర్వాతే అవతార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే. -
విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా నిన్న (డిసెంబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు వారు సైతం ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో అవతార్ ఫస్ట్‌పార్ట్ సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు -
తొలి రోజే తుస్సుమన్న అవతార్-2.. ఆ సినిమాను కూడా దాటలేకపోయింది
సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ విజువల్ వండర్ మూవీ 'అవతార్- 2'. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు రావడంతో వసూళ్లు సైతం భారీ స్థాయిలో ఉండవచ్చని అభిమానులు ఫ్యాన్స్ భావించారు. 13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈనెల 16న విడుదలైన ఈ చిత్రం సాధించిన వసూళ్లపై ఓ లుక్కేద్దాం. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.38-40 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు సినీవర్గాలు అంచనా వేశాయి. ఈ కలెక్షన్లతో స్పైడర్ మ్యాన్:నో వే హోమ్, అవెంజర్స్: ఇన్ఫీనిటీ వార్ సినిమాలను వెనక్కి నెట్టింది. అయినప్పటికీ దేశంలో అతిపెద్ద హాలీవుడ్ ఓపెనింగ్స్ రాబట్టిన అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. (ఇది చదవండి: ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ) ఇండియాలో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ మొదటి రోజు రూ.31 కోట్లు, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ రూ.32 కోట్లు వసూలు చేయగా.. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ రూ.53 కోట్ల ఓపెనింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అవతార్- పార్ట్ 1 ఇప్పటి వరకు 2.9 బిలియన్ డాలర్లతో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రంగా రికార్డ్ సాధించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్-పార్ట్ 1 విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఈ సారి సీక్వెల్‌తో నీటి అడుగున అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశారు. భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజువల్స్ పరంగా సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. సినీ విశ్లేషకులు నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా(రెండు రోజుల్లో) రూ.300కోట్లు వరకు వసూలు చేసిందని అన్నారు. -
అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్
ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్ 2: ది వే ఆఫ్ వాటర్’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే తేదీన థియేటర్స్‌కి రానుంది. అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి రచయిత–దర్శకుడు, నటుడు శ్రీనివాస్ అవసరాల డైలాగ్స్ రాశారు. విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తన మార్క్‌ని చూపించిన అవసరాల ఇప్పుడు అవతార్-2తో ఏ విధంగా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది. -
అవతార్-2 టికెట్స్.. ధర వింటే సినిమా కనపడుద్ది..!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుక్సింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్లపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్) ఆ స్క్రీన్ల టికెట్ ధరలు చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్ 3డీ), దేశ రాజధాని దిల్లీలో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్ రూ.750, ఇండోర్ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ ధర రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), విశాఖ రూ.210 (3డీ ఫార్మాట్) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. త్వరలోనే సాధారణ థియేటర్స్‌లోనూ టికెట్ ధరలు అందుబాటులో ఉంచనున్నారు. అవతార్-2 లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు నటించారు. -
కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అవతార్-2. 9ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు డెరెక్టర్. ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. మరి విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. On December 16, experience the motion picture event of a generation. Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr — Avatar (@officialavatar) November 22, 2022 -
వామ్మో! ‘అవతార్ 2’ తెలుగు రైట్స్‌కు అన్ని కోట్లా?
2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలనం సృష్టించిన హాలీవుడ్ చిత్రం ‘అవతార్’. ఈ సినిమాతో ప్రేక్షకులను ఓ కొత్త ప్రపంచలోనికి తీసుకేళ్లాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. భారత ప్రేక్షకులను సైతం ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు సినిమాకు సీక్వెల్‌గా రానున్న సంగతి తెలిసిందే. అవతార్ 2(ది వే ఆఫ్ వాటర్) పేరుతో సీక్వెల్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. చదవండి: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. యువ నటుడు, గాయకుడు మృతి దాదాపు 160 దేశాల్లో ఈ ఏడాది డిసెంబర్ 16న అవతార్ 2 విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. భారీ బడ్జెట్‌తో హై ఎండ్ టెక్కాలజీతో నిర్మించిన ఈ సినిమా విడుదలకు ముందే బిజినెస్ విషయంలో వివిధ దేశాల్లో రికార్డు సృష్టిస్తోందని సమాచారం. ఇండియాలో సైతం అవతార్ 2 భారీగానే బిజినెస్ చేసేలా ఉందని సినీ విశ్లేషకుల అంచనా. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ సినిమాకు విపరీతమైన హైప్ నెలకొంది. చదవండి: సమంత అనారోగ్యంపై స్పందించిన మరో అక్కినేని హీరో, వెంకటేశ్ కూతురు అందుకే అవతార్ థియేట్రికల్ రైట్స్‌ను దక్కించుకునేందుకు తెలుగు రాష్ట్రాల్లోని డిస్ట్రిబ్యూటర్స్ ఆసక్తిగా ఉన్నారట. దీంతో తెలుగులో ఈ మూవీ దాదాపు రూ.100 కోట్లకు పైగా ధర పలుకుతున్నట్లు వినికిడి. పలువురు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి ఈ సినిమాను కొనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇందుకు సంబంధించిన వార్తలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి విడుదలకు ముందే ఇన్ని వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో వేచి చూడాలి. -
ఏడు నిమిషాలు నీటిలోనే!
ప్రస్తుతం హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘అవతార్’ సిరీస్ ఒకటి. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘టైటానిక్’ ఫేమ్ కేట్ విన్స్లెట్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్. ‘అవతార్’ సీక్వెల్స్ కథాంశం ప్రకారం అండర్ వాటర్ (నీటి లోపల) కూడా చిత్రీకరణ జరిపారు. ఇందులో భాగంగా కేట్ విన్స్లెట్ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ సన్నివేశం కోసం ఏడు నిమిషాలు పాటు ఊపిరి ఆపుకున్నారామె. సినిమా చిత్రీకరణల్లో ఇదో రికార్డ్ అని హాలీవుడ్ అంటోంది. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల పాటు ఊపిరి ఆపుకుంటూ అండర్‌వాటర్ సీన్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు క్రూజ్ రికార్డ్‌ను కేట్ బద్దలు కొట్టేశారు. ‘ఈ రికార్డ్ బద్దలు కొట్టానని నాకు ఇటీవలే తెలిసింది’ అన్నారు కేట్ విన్స్లెట్. ‘అవతార్ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. -
పండోరా గ్రహంలోకి...
మొన్న ఆస్ట్రేలియన్ నటుడు బ్రెండన్ కోవెల్, నిన్న మలేషియన్ నటి మిచెల్లి వోహ్... తాజాగా న్యూజిలాండ్ నటుడు జైమైనే క్లేమిట్ ‘అవతార్’ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. 2009లో ‘అవతార్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సినీ ప్రేమికులకు అంతగా నచ్చిన ఈ సినిమాకు సీక్వెల్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారాయన. ఈ ప్రక్రియలో ‘అవతార్’ కుటుంబం పెద్దది అవుతోంది. జెమైనే క్లేమిట్ అవతార్ ఫ్యామిలీలో చేరిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘‘పండోర ప్రపంచంలో సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్ గార్విన్ పాత్రను జెమైనే క్లేమిట్ చేయబోతున్నారు. ‘అవతార్’ సీక్వెల్స్ కోసం ఆయన్ను తీసుకున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఇక క్లేమిట్ విషయానికి వస్తే.. ‘జెంటిల్మెన్ బ్రోన్కోస్’ (2009), ‘మెన్ ఇన్ బ్లాక్ 3’ (2012) చిత్రాల్లో నటించారు. అంతేకాదు ‘వాట్ వుయ్ డు ఆన్ ది షాడోస్’ (2014) అనే హారర్ కామెడీ ఫిల్మ్‌తో దర్శకునిగా కూడా మారారు. ప్రస్తుతం ‘లెజియన్’ అనే అమెరికన్ టీవీ సీరిస్తో ఆయన బిజీగా ఉన్నారు. ‘అవతార్ 2’ డిసెంబర్ 17, 2021న రిలీజ్. -
సైంటిస్ట్ కరీనా
పండోరా గ్రహంలోకి సైంటిస్ట్ కరీనా మోగ్గా వెళ్తున్నారు మలేషియన్ యాక్ట్రెస్ మిచెల్ వోహ్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమైన రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. అందుకే అవతార్ సీక్వెల్స్ (ప్రస్తుతానికి ‘అవతార్ 2’ నుంచి ‘అవతార్ 5’)ను రెడీ చేసే పనిలో ఉన్నారు కామెరూన్. నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ యాక్టర్ బ్రాడెన్ కోవెల్ని ఇటీవలే ‘అవతార్’ ఫ్యామిలీలోకి ఆహ్వానించిన కామెరూన్ తాజాగా మలేషియన్ నటి మిచెల్ వోహ్‌కు స్వాగతం పలికారు. ‘‘అవతార్ సీక్వెల్స్‌లో సైంటిస్ట్ కరీనా మోగి పాత్రలో మలేషియన్ నటి మిచెల్ వోహ్ నటిస్తారు. విభిన్నమైన అద్భుతమైన పాత్రలతో పాటు ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. మిచెల్‌తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. 1977 జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘టుమారో నెవర్ డైస్’లో నటించారు మిచెల్. కానీ ఎక్కువగా ఆమె హాంకాంగ్ యాక్షన్ బేస్డ్ సినిమాలు చేశారు. ‘యస్, మేడమ్ (1985), పోలీస్ స్టోరీ 3 (1992), సూపర్‌కాప్ (1992) హోలి వెపన్ (19 93)’ చిత్రాలు మిచెల్ నటించిన హాంకాంగ్ యాక్షన్ ఫిల్మ్స్‌లో కొన్ని. ఇక ‘అవతార్ 2, అవతార్ 3’ల చిత్రీకరణ ఒకేసారి జరుగుతుందని తెలిసింది. -
టైటానిక్‌కు ముందు నాలుగు పెళ్లిళ్లు!
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరూన్ పేరు చెబితే ముందు ‘టైటానిక్’ సినిమా గురించి మాట్లాడాలా, ‘అవతార్’ గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తాం. కానీ, అంతకుముందే అద్భుతాలు సృష్టించాడాయన. హాలీవుడ్ సినిమాకు ఒక కొత్త అర్థాన్ని, కొత్త రూపురేఖల్నీ పట్టుకొచ్చిన కేమరూన్, ‘టైటానిక్’కు ముందు ప్రతి విషయానికీ కోపంతో ఊగిపోయేవాడట. ఏదైనా తప్పు జరిగితే అందరి మీదా అరిచేవాడట. ‘టైటానిక్’ విడుదలయ్యాక కొన్నాళ్లు కేవలం సముద్రాలను ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు కేమరూన్. ఆ సమయంలోనే సినిమాలు ముఖ్యమే కానీ, మనుషులు, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నాడట. అప్పట్నుంచీ కేమరూన్ కూల్ పర్సన్. ‘టైటానిక్’కు ముందు నాలుగు పెళ్లిళ్లు బ్రేక్ చేశాడు కేమరూన్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో సుజీ అమిస్ను పెళ్లాడి, ఇప్పటికీ ఆవిడతోనే హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు పెళ్లిళ్లు ఎందుకు బ్రేక్ చేశారు? అనడిగితే, కేమరూన్ ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు – ‘‘నా కథల్లో స్ట్రాంగ్ వుమెన్ ఉంటారు. ఇండిపెండెంట్ ఉంటారు. అలాంటి అమ్మాయిలంటే నాకు బాగా ఇష్టం. లైఫ్‌లోనూ అలాంటి అమ్మాయిలే ఉండాలని కోరుకున్నా. అయితే స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిలతో సమస్య ఏంటంటే, వాళ్లకు నాలాంటి వాడి అవసరం ఉండదు’’ అన్నారు. సుజీ అమిస్ గురించి మాట్లాడుతూ, ‘‘తనకు మాత్రం నేనెందుకో అవసరమయ్యా!’’ అంటూ తన ఐదు పెళ్లిళ్ల గురించి చెబుతున్నాడు జేమ్స్ కేమరూన్. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడాయన. -
అండర్ వాటర్... ఆరు నెలలు శిక్షణ!
లెక్క లేదు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమాలకు వచ్చిన అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. విమర్శకులు సైతం ఆయన సినిమాలను మెచ్చుకోకుండా ఉండరు. అల్మోస్ట్ 20ఏళ్ల క్రితం 1997లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ ప్రపంచ సినిమా చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత 2009లో ఆయన రూపొందించిన ‘అవతార్’ సినిమా ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘అవతార్’కు నాలుగు స్వీక్వెల్స్ను జేమ్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 18న ‘అవతార్ 2’, 2021 డిసెంబర్ 17న ‘అవతార్ 3’, 2024 డిసెంబర్ 20న ‘అవతార్ 4’ ఫైనల్‌గా 2025 డిసెంబర్ 19న ‘అవతార్ 5’ చిత్రాలను రిలీజ్ చేయనున్నట్లు డేట్స్‌తో సహా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టారు జేమ్స్ కామెరూన్. ‘‘ఇప్పటివరకూ ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘అవతార్’ సీక్వెల్స్‌ను తెరకెక్కించబోతున్నాం. అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను వినియోగించనున్నాం. ఇందుకు డిఫరెంట్ టెక్నాలజీతో కూడిన పవర్ఫుల్ కెమెరాను వందల సంఖ్యలో వాడాలి. అండర్ వాటర్ సీన్స్‌ను పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. టైమ్ పడుతుంది. ఏడాదిన్నరగా ఈ విషయంపైనే టీమ్ అంతా ఎంతో ఏకాగ్రతగా వర్క్ చేస్తున్నాం. ఈ నెల 14న అండర్ వాటర్ టెస్ట్ షూట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఐదుగురు టీనేజర్స్, ఏడేళ్ల బాలుడు షూట్లో పాల్గొన్నారు. నీళ్ల అడుగు భాగంలో ఊపిరి తీసుకునేందుకు వారికి మేం ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. మూడు, నాలుగు భాగాల్లో ముఖ్యమైన అండర్ వాటర్స్ సీన్స్ ఉన్నాయి’’ అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. -
20 ఏళ్ల తరువాత అవతార్ సీక్వల్ లో.!
టైటానిక్.. విడుదలైన ప్రతీచోటా సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో హీరోయిన్లు గా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ లా జీవితాలను మార్చేసింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేళ్ల తరువాత మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. అవతార్ సినిమాతో మరో భారీ విజయాన్ని సాధించిన కామరూన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేట్ విన్స్ లెట్ మరోసారి కామరూన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను 2020 డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అవతార్ 2తో పాటు 3, 4, 5లను కూడా రూపొందిస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. రెండో భాగంలో నటించనున్న కేట్ విన్స్ లెట్ తరువాత సీక్వల్స్ లో నటిస్తుందీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. -
అవతార్ సీక్వెల్స్‌లో ఎవరంటే...
సాక్షి, సినిమా : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అవతార్ అనే అద్భుత లోకాన్ని సృష్టించి.. అందులోని గ్రాపిక్స్ అనే మాయాజాలంతో ప్రపంచాన్ని కట్టిపడేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఊహకందని ఆ విజువల్స్ గురించి ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. అలాంటిది ఆ చిత్ర సీక్వెల్స్‌ను మొదలుపెట్టి వచ్చే 8 ఏళ్లలో ఒక్కోక్కటిగా విడుదల చేయబోతున్నాడు. అయితే మొదటి పార్ట్ లో పెద్ద నటీనటులనే ఎంచుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ఆ పని చేయబోవటం లేదు. సుమారు 6 నుంచి 17 ఏళ్లలోపు వాళ్లనే ప్రధాన తారాగణంగా ఎంచుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఆ నటుల్లో ఒకరైన బ్రిటైన్ డాల్టన్ తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్నితెలియజేశాడు. కొద్ది సంవత్సరాల పాటు తాము అవతార్ సినిమాలతోనే గడపబోతున్నామంటూ ప్రకటించాడు. స్టార్ నటీనటులు లేకుండా అవతార్ సిరీస్‌ను తెరకెక్కించాలన్న కామెరూన్ నిర్ణయం చర్ఛనీయాంశంగా మారింది. గతంలో హాలీవుడ్లో నార్నియా సిరీస్ కూడా పిల్లలతో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్న బడ్జెట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక బిలియన్ డాలర్లు (దాదాపు 6539 కోట్లు) సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్నట్లు నిర్మాత జాన్ లన్డౌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తొలి సీక్వెల్ అవతార్-2ను 2020 డిసెంబర్ 18న విడుదల చేస్తుండగా, 2021 డిసెంబర్ 17న అవతార్-3ని, 2024 డిసెంబర్ 20న అవతార్-4, 2025 డిసెంబర్ 19న అవతార్-5ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. -
అవతార్ సీక్వెల్.. ఫస్ట్‌లుక్ చూశారా?
లాస్ఏంజిలెస్: నిత్యం వినూత్న సినిమాలు అందించే జేమ్స్ కామెరూన్ ఏది చేసినా సంచలనమే! 1980ల్లో వచ్చిన టెర్మినేటర్ నుంచి 2009లో వచ్చిన అవతార్ వరకు కామెరూన్ చేసిన ప్రతి సినిమా అత్యద్భుత దృశ్యకావ్యాలుగా నిలిచిపోయాయి. తాజాగా అవతార్ సీక్వెల్ గురించి మరో వార్త సంచలనంగా మారింది. మంగళవారం నుంచి అవతార్ నాలుగు సీక్వెల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఒక బిలియన్డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చుతో వీటిని నిర్మిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6,539 కోట్ల పైమాటే! మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీక్వెల్స్ ఎపుడు విడుదల చేసేది కూడా ముందే ప్రకటించారు కామెరూన్. 2020 డిసెంబరులో ‘అవతార్ 2’ విడుదల కాబోతోంది. 2021 డిసెంబరులో అవతార్ 3’, 2024 డిసెంబరులో ‘అవతార్ 4’, 2025 డిసెంబరులో ‘అవతార్ 5’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
'2017లో అవతార్ సీక్వెల్'
అమెరికా : తాను తీస్తున్న 'అవతార్' సినిమా సీక్వెళ్ల విడుదలకు మరో మూడేళ్లు సమయం పడుతుందని ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. ఆ చిత్ర మొదటి సీక్వెల్ 2017 లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణం కోసం చాలా అంకిత భావంతో పనిచేయాల్సి ఉందన్నారు. ఈ మూడు చిత్రాల నిర్మాణంలో కొంత వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కామెరూన్ వివరించారు. అలాగే ఈ మూడు చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మూడు చిత్రాలు ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయని.... ఈ చిత్రాలన్నింటిని న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుతామన్నారు. ఈ చిత్రాల మాతృక అయిన అవతార్ చిత్రం కూడా న్యూజిలాండ్‌లోనే షూటింగ్ జరిపిన సంగతిని జేమ్స్ కామెరూన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.