జేమ్స్ కామెరూన్
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అవతార్’. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పండోరా ప్రపంచంలో విహరించేలా చేసింది. కలెక్షన్స్‌లో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. దీంతో ‘అవతార్’కు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2’, ‘అవతార్ 3’, ‘అవతార్ 4’, ‘అవతార్ 5’లను ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’ సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అవతార్ 3’, ‘అవతార్ 4’ సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరుగుతున్నాయి. ‘అవతార్ 3’ ఈ ఏడాదిలో విడుదల కావాల్సింది. కానీ 2025కి వాయిదా వేశారు.
2025 డిసెంబరు 19న‘అవతార్ 3’, 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు కూడా చాన్స్ ఉందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్‌లో పాల్గొన్న ఆయన ‘అవతార్’ సినిమా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ– ‘‘అవతార్’ ఫ్రాంచైజీలోని ఐదు సినిమాలకు కథలు రెడీగా ఉన్నాయి. ‘అవతార్ 6’, ‘అవతార్ 7’ల గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు నేను దర్శకత్వం వహించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు.
హలీవుడ్‌లో ‘టైటానిక్’, ‘ది టెర్మినేటర్’ వంటి అద్భుత చిత్రాలను కూడా తీసిన జేమ్స్ కామెరూన్ కెరీర్‌ను ‘అవతార్’ ఫ్రాంచైజీ ఒక్కటే డామినేట్ చేయడం ఆయన ఫ్యాన్స్‌కు రుచించడం లేదని హాలీవుడ్‌లో కథనాలు వస్తున్నాయి. ఇక కామెరూన్ అన్నట్లు భవిష్యత్‌లో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లు సెట్స్‌పైకి వెళితే.. కనీసం ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ఈ సినిమాలను తీయాల్సి ఉంటుందన్నట్లు హాలీవుడ్ సినీ విశ్లేషకులు అభి్రపాయపడుతున్నారట.
Comments
Please login to add a commentAdd a comment