Avatar 2 Movie Tickets Booking Prices Shocking For Audience, Check Details - Sakshi
Sakshi News home page

Avatar 2 Movie Tickets: 'అవతార్‌-2'.. బెంగళూరులో రూ.1450.. హైదరాబాద్‌లో ఎంతంటే?

Published Tue, Nov 22 2022 7:25 PM | Last Updated on Tue, Nov 22 2022 8:07 PM

Avatar 2 Movie Tickets Booking Prices Shocking For Audience - Sakshi

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్‌ చిత్రం ‘అవతార్‌2’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. ఇప్పటికే రిలీజ్‌ అయిన ట్రైలర్‌ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది.

ప్రస్తుతం ఈ సినిమా టికెట్‌ బుక్సింగ్స్‌ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సైట్స్‌, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రాన‍్ని ఐమ్యాక్స్‌ 3డీ, 4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్‌లపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. 

(చదవండి: కళ్లు చెదిరే విజువల్‌ వండర్స్‌తో అవతార్‌-2 కొత్త ట్రైలర్‌)

ఆ స్క్రీన్‌ల టికెట్‌ ధరలు చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ సైట్‌ బెంగళూరులోని ఐమ్యాక్స్‌ 3డీ ఫార్మాట్‌ కలిగిన థియేటర్‌లో టికెట్‌ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్‌ 3డీ), దేశ రాజధాని దిల్లీలో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్‌ రూ.750, ఇండోర్‌ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్‌ ధర రూ.350 (4డీఎక్స్‌ 3డీ ఫార్మాట్‌), విశాఖ రూ.210 (3డీ ఫార్మాట్‌) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్‌ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. త్వరలోనే సాధారణ థియేటర్స్‌లోనూ టికెట్‌ ధరలు అందుబాటులో ఉంచనున్నారు. అవతార్‌-2 లో సామ్‌ వర్దింగ్టన్‌, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్‌, కేట్‌ విన్స్‌లెట్‌ కీలక పాత్రలు నటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement