Avatar: The Way of Water Box Office Day 1 Collection in India - Sakshi
Sakshi News home page

Avatar-2: 'అవతార్ -2' తొలి రోజు వసూళ్లు ఎంతంటే?

Published Sat, Dec 17 2022 12:47 PM | Last Updated on Sat, Dec 17 2022 4:29 PM

Avatar The Way of Water box office day 1 collections In India - Sakshi

సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ విజువల్ వండర్​ మూవీ 'అవతార్​- 2'. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు రావడంతో వసూళ్లు సైతం భారీ స్థాయిలో ఉండవచ్చని అభిమానులు ఫ్యాన్స్ భావించారు. 13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈనెల 16న విడుదలైన ఈ చిత్రం సాధించిన వసూళ్లపై ఓ లుక్కేద్దాం.

అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.38-40 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు సినీవర్గాలు అంచనా వేశాయి. ఈ కలెక్షన్లతో స్పైడర్‌ మ్యాన్:నో వే హోమ్, అవెంజర్స్: ఇన్‌ఫీనిటీ వార్ సినిమాలను వెనక్కి నెట్టింది. అయినప్పటికీ దేశంలో అతిపెద్ద హాలీవుడ్‌ ఓపెనింగ్స్ రాబట్టిన అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. 

(ఇది చదవండి: ‘అవతార్‌-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ)

ఇండియాలో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ మొదటి రోజు రూ.31 కోట్లు, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ రూ.32 కోట్లు వసూలు చేయగా.. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ రూ.53 కోట్ల ఓపెనింగ్‌తో  అగ్రస్థానంలో నిలిచింది. అవతార్- పార్ట్ 1 ఇప్పటి వరకు 2.9 బిలియన్ డాలర్లతో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రంగా రికార్డ్ సాధించింది.

జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో వచ్చిన అవతార్-పార్ట్ 1 విజువల్‌ వండర్‌గా బాక్సాఫీస్‌ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్‌.. ఈ సారి సీక్వెల్‌తో నీటి అడుగున అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశారు. భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్​తో తెరకెక్కించారు. విజువల్స్​ పరంగా సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు.  సినీ విశ్లేషకులు నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా(రెండు రోజుల్లో) రూ.300కోట్లు వరకు వసూలు చేసిందని అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement