హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అమెరికన్ ప్రముఖ రచయిత చార్లెస్ ఆర్. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’ బుక్ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్ కామెరూన్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ్రపాణాలతో బతికి బయటపడ్డ జపాన్ ఇంజనీర్ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని హాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.
చార్లెస్ రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’, ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం ‘అవతార్’ ఫ్రాంచైజీతో జేమ్స్ కామెరూన్ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్ (2019), అవతార్: ద వే ఆఫ్ వాటర్’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) చిత్రం 2025లో రిలీజ్ కానుంది.
ఇంకా ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి... ‘అవతార్’ ఫ్రాంచైజీని పక్కన పెట్టి జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ చేస్తారా? లేదా అనే అంశంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘అవతార్’ ఫ్రాంచైజీలకన్నా ముందే ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళితే 1997లో వచ్చిన ‘టైటానిక్’ తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించే నాన్ అవతార్ ఫిల్మ్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’నే అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment