ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా నిన్న (డిసెంబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు వారు సైతం ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు.
చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత
సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో అవతార్ ఫస్ట్‌పార్ట్ సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు.
చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment