
చిత్రీకరణలో కేట్
ప్రస్తుతం హాలీవుడ్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘అవతార్’ సిరీస్ ఒకటి. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘టైటానిక్’ ఫేమ్ కేట్ విన్స్‌లెట్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్. ‘అవతార్’ సీక్వెల్స్ కథాంశం ప్రకారం అండర్ వాటర్ (నీటి లోపల) కూడా చిత్రీకరణ జరిపారు. ఇందులో భాగంగా కేట్ విన్స్‌లెట్ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు.
ఈ సన్నివేశం కోసం ఏడు నిమిషాలు పాటు ఊపిరి ఆపుకున్నారామె. సినిమా చిత్రీకరణల్లో ఇదో రికార్డ్ అని హాలీవుడ్ అంటోంది. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల పాటు ఊపిరి ఆపుకుంటూ అండర్‌వాటర్ సీన్‌లో యాక్ట్ చేశారు. ఇప్పుడు క్రూజ్ రికార్డ్‌ను కేట్ బద్దలు కొట్టేశారు. ‘ఈ రికార్డ్ బద్దలు కొట్టానని నాకు ఇటీవలే తెలిసింది’ అన్నారు కేట్ విన్స్‌లెట్. ‘అవతార్ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది డిసెంబర్‌లో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది.
Comments
Please login to add a commentAdd a comment