హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2). గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్ కామెరూన్. ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం..ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది.
మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ‘అవతార్’ టీమ్ ఓ ట్వీట్ చేసింది. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’అని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. మార్చి 28 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు.
Return to Pandora whenever you want at home, only on Digital March 28. Get access to over three hours of never-before-seen extras when you add #AvatarTheWayOfWater to your movie collection. pic.twitter.com/4dOhyjMU9l
— Avatar (@officialavatar) March 7, 2023
Comments
Please login to add a commentAdd a comment