అవతార్‌-2కి డైలాగ్స్‌ రాసిన అవసరాల శ్రీనివాస్‌ | Srinivas Avasarala Writes For Avatar 2 | Sakshi
Sakshi News home page

Avasarala Srinivas: అవతార్‌-2కి డైలాగ్స్‌ రాసిన అవసరాల శ్రీనివాస్‌

Published Wed, Dec 14 2022 3:39 PM | Last Updated on Wed, Dec 14 2022 3:41 PM

Srinivas Avasarala Writes For Avatar 2 - Sakshi

ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘అవతార్‌ 2: ది వే ఆఫ్‌ వాటర్‌’. జేమ్స్‌ కామెరూన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగులోనూ అదే తేదీన థియేటర్స్‌కి రానుంది.  అవతార్ 2 కి రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం ఉన్న థియేటర్స్ లో 90 శాతం అవతార్ 2 కి కేటాయిస్తున్నారు..స్టార్ హీరో సినిమాకి కాకుండా ఒక హాలీవుడ్ డబ్ చిత్రానికి ఈ రేంజ్ రిలీజ్ రావడం ఇదే తొలిసారి.

అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి.  ఇదిలా ఉండగా ఈ సినిమా తెలుగు వెర్షన్‌కి రచయిత–దర్శకుడు, నటుడు శ్రీనివాస్‌ అవసరాల డైలాగ్స్‌ రాశారు. విలక్షణ నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తన మార్క్‌ని చూపించిన అవసరాల ఇప్పుడు అవతార్‌-2తో ఏ విధంగా మెప్పిస్తారన్నది చూడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement