లెక్క లేదు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమాలకు వచ్చిన అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. విమర్శకులు సైతం ఆయన సినిమాలను మెచ్చుకోకుండా ఉండరు. అల్మోస్ట్ 20ఏళ్ల క్రితం 1997లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ ప్రపంచ సినిమా చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత 2009లో ఆయన రూపొందించిన ‘అవతార్’ సినిమా ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘అవతార్’కు నాలుగు స్వీక్వెల్స్‌ను జేమ్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
2020 డిసెంబర్ 18న ‘అవతార్ 2’, 2021 డిసెంబర్ 17న ‘అవతార్ 3’, 2024 డిసెంబర్ 20న ‘అవతార్ 4’ ఫైనల్‌గా 2025 డిసెంబర్ 19న ‘అవతార్ 5’ చిత్రాలను రిలీజ్ చేయనున్నట్లు డేట్స్‌తో సహా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టారు జేమ్స్ కామెరూన్. ‘‘ఇప్పటివరకూ ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘అవతార్’ సీక్వెల్స్‌ను తెరకెక్కించబోతున్నాం. అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను వినియోగించనున్నాం. ఇందుకు డిఫరెంట్ టెక్నాలజీతో కూడిన పవర్‌ఫుల్ కెమెరాను వందల సంఖ్యలో వాడాలి.
అండర్ వాటర్ సీన్స్‌ను పర్‌ఫెక్ట్‌గా క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. టైమ్ పడుతుంది. ఏడాదిన్నరగా ఈ విషయంపైనే టీమ్ అంతా ఎంతో ఏకాగ్రతగా వర్క్ చేస్తున్నాం. ఈ నెల 14న అండర్ వాటర్ టెస్ట్ షూట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఐదుగురు టీనేజర్స్, ఏడేళ్ల బాలుడు షూట్‌లో పాల్గొన్నారు. నీళ్ల అడుగు భాగంలో ఊపిరి తీసుకునేందుకు వారికి మేం ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. మూడు, నాలుగు భాగాల్లో ముఖ్యమైన అండర్ వాటర్స్ సీన్స్ ఉన్నాయి’’ అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment