అవతార్‌ సీక్వెల్‌.. ఫస్ట్‌లుక్‌ చూశారా? | Avatar sequels go into production | Sakshi
Sakshi News home page

అవతార్‌ సీక్వెల్‌.. ఫస్ట్‌లుక్‌ చూశారా?

Published Tue, Sep 26 2017 11:20 PM | Last Updated on Tue, Sep 26 2017 11:20 PM

Avatar sequels go into production

లాస్‌ఏంజిలెస్‌: నిత్యం వినూత్న సినిమాలు అందించే జేమ్స్‌ కామెరూన్‌ ఏది చేసినా సంచలనమే! 1980ల్లో వచ్చిన టెర్మినేటర్‌ నుంచి 2009లో వచ్చిన అవతార్‌ వరకు కామెరూన్‌ చేసిన ప్రతి సినిమా అత్యద్భుత దృశ్యకావ్యాలుగా నిలిచిపోయాయి. తాజాగా అవతార్‌ సీక్వెల్‌ గురించి మరో వార్త సంచలనంగా మారింది. మంగళవారం నుంచి అవతార్‌ నాలుగు సీక్వెల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్‌ పనులు ప్రారంభమయ్యాయి. 

దాదాపు ఒక బిలియన్‌డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చుతో వీటిని నిర్మిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6,539 కోట్ల పైమాటే! మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీక్వెల్స్‌ ఎపుడు విడుదల చేసేది కూడా ముందే ప్రకటించారు కామెరూన్‌. 2020 డిసెంబరులో  ‘అవతార్‌ 2’ విడుదల కాబోతోంది. 2021 డిసెంబరులో అవతార్‌ 3’, 2024 డిసెంబరులో ‘అవతార్‌ 4’, 2025 డిసెంబరులో ‘అవతార్‌ 5’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement