ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్‌ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది.
దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి.
2031లో ఫైనల్ అవతార్
తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు.
ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు
వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment