Release dates
-
పుష్ప-2 వాయిదా.. రేసులోకి వచ్చేసిన ఎన్టీఆర్ బామ్మర్ది!
జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా ఇండస్ట్రీకి పరిచయం హీరో నార్నెనితిన్. మ్యాడ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మొదటి మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. తాజాగా నితిన్ హీరోగా నటిస్తోన్న చిత్రం 'ఆయ్'. అతనికి జంటగా నయన్ సారిక హీరోయిన్గా కనిపించనుంది. ఈ సినిమాను జీఏ2 బ్యానర్‌పై అంజి కె.మణిపుత్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలుదా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తాజాగా ఈ ఆయ్ మూవీ రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పాటలకి ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ తేదీ విడుదల కావాల్సిన పుష్ప-2 వాయిదా పడడంతో చిన్న సినిమాలు క్యూ కడుతున్నాయి.మరోవైపు అదే రోజున హీరో రానా నిర్మాతగా తెరకెక్కిస్తోన్న '35 – ఇది చిన్నకథ కాదు' రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రియదర్శి, నివేదా థామస్ జంటగా నటించారు. వీటితో రామ్ పోతినేని-పూరి కాంబోలో వస్తోన్న డబుల్ ఇస్మార్ట్ సినిమాను అదే రోజు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో ఈ మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. మరి ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందో వేచి చూడాల్సిందే. Gear Up to Celebrate Godavari Emotion, Love, Friendship & much more with the 𝐔𝐋𝐓𝐈𝐌𝐀𝐓𝐄 𝐅𝐔𝐍 𝐄𝐍𝐓𝐄𝐑𝐓𝐀𝐈𝐍𝐄𝐑 of the 𝗦𝗘𝗔𝗦𝗢𝗡 🥳❤️🔥#AAYMovie Grand release in theatres on Independence Day, 𝐀𝐔𝐆𝐔𝐒𝐓 𝟏𝟓𝐭𝐡!😍#AAY #AAYonAUG15 🤩#AlluAravind #BunnyVas… pic.twitter.com/HJV9kDEKgj— Geetha Arts (@GeethaArts) June 25, 2024From the sacred land of Tirupathi ✨Bringing you a lovely narrative that will touch everyone’s heartsPresenting35 ~ Chinna Katha Kaadu❤️🔥Starring @i_nivethathomas @PriyadarshiPN @imvishwadev @gautamitads In cinemas from AUGUST 15th, 2024#35Movie #NandaKisore… pic.twitter.com/4HjdTTXk8o— Rana Daggubati (@RanaDaggubati) June 25, 2024 -
రిలీజ్ పోస్ట్ పోన్.. కొత్త డేట్ చెప్పు గురూ..
సినిమా సెట్ అనుకున్నప్పుడే చూచాయగా రిలీజ్ డేట్ కూడా సెట్ చేస్తుంటారు మేకర్స్. అలా కాకపోయినా షూటింగ్ సగం పూర్తయ్యాక సెట్ చేస్తారు. వన్ ఫైన్ డే ఆ డేట్‌ని అధికారికంగా ప్రకటిస్తారు. కానీ.. సెట్ చేసిన డేట్‌కి కొన్ని సినిమాలు విడుదల కాకపోవచ్చు. సాంకేతిక కారణాలు, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతుంటాయి. అలా ప్రస్తుతం అరడజను చిత్రాల దాకా వాయిదా పడ్డాయి. ఏ సినిమా కారణం ఆ సినిమాది. ఇక అనుకున్న డేట్‌కి రాకుండా కొత్త డేట్ సెట్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పైకి రానున్న సినిమాల గురించి తెలుసుకుందాం. ‘సలార్’లో ప్రభాస్ ∙ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో భాగంగా ‘సలార్: పార్ట్ 1–సీజ్ఫైర్’ని ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు తొలుత మేకర్స్ ప్రకటించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ నెలాఖరులో ప్రభాస్ ఫ్యాన్స్‌కి, సినిమా లవర్స్‌కి పండగే. అయితే ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నారంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో విడుదల వాయిదా పడనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అయితే ‘సలార్’ రిలీజ్ వాయిదాపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో ఎప్పుడు రిలీజ్ చేస్తారు? అనేదానిపై పాన్ ఇండియా స్థాయిలో చర్చ జరుగుతోంది. తాజా అప్డేట్ ప్రకారం ఈ సినిమాని దీపావళి కానుకగా నవంబర్‌లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ముందుగా అనుకున్నట్లు ఈ నెల 28న సినిమాని విడుదల చేస్తారా? లేదా అనేది తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాలి. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రియా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. ‘స్కంద’లో రామ్, శ్రీలీల రామ్ పోతినేని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘స్కంద’ కూడా ముందు అనుకున్న తేదీకి కాకుండా వేరే తేదీకి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్. శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు గతంలో చిత్రబృందం ప్రకటించింది. అయితే తాజాగా మేకర్స్ సినిమా విడుదలను వాయిదా వేశారు. ఈ నెల 15న కాకుండా 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే సినిమా విడుదల తేదీ ఎందుకు మార్చాల్సి వచ్చిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ‘చంద్ర ముఖి–2’లో కంగన రజనీకాంత్ హీరోగా జ్యోతిక టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘చంద్రముఖి’ (2005). పి. వాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘చంద్రముఖి 2’. తొలి భాగానికి దర్శకత్వం వహించిన పి. వాసునే రెండో భాగాన్ని తీశారు. అయితే సీక్వెల్లో హీరో, హీరోయిన్ మారారు. రాఘవ లారెన్స్ హీరోగా, కంగనా రనౌత్ టైటిల్ రోల్లో నటించారు. సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రాన్ని వినాయక చవితి సందర్భంగా ఈ నెల 15న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఈ నెల 15న కాకుండా 28న విడుదల చేయనున్నట్లు నిర్మాణ సంస్థ ప్రకటించింది. కొన్ని సాంకేతిక కారణాల వల్లే విడుదలను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ‘చంద్రముఖి 2’ని తెలుగులో రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ ఉప్పుటూరి, వెంకట రత్నం శాఖమూరి రిలీజ్ చేస్తున్నారు. ‘ఆదికేశవ’లో వైష్ణవ్ తేజ్ వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ఆదికేశవ’. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. తొలుత ఈ చిత్రాన్ని జూలైలో రిలీజ్ చేయాలనుకున్నారు.. చేయలేదు. ఆ తర్వాత ఆగస్టు 18న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత అది కూడా వాయిదా పడి చివరికి నవంబర్ 10వ తేదీకి ఫిక్స్ అయింది. ఫారిన్లో కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉండటం వల్లే విడుదల వాయిదా వేస్తున్నట్లు ‘ఆదికేశవ’ చిత్రబృందం ప్రకటించింది. ‘టిల్లు స్క్వేర్’లో సిద్ధు సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా విమల్ కృష్ణ దర్శకత్వం వహించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా సూపర్ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘టిల్లు స్క్వేర్’ రూపొందింది. ఈ చిత్రానికి డైరెక్టర్, హీరోయిన్ మారారు. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్గా నటించారు. ‘డీజే టిల్లు’ని నిర్మించిన సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. ఈ మూవీని కూడా ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే విడుదల వాయిదా పడింది. ‘‘టిల్లు స్క్వేర్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. క్వాలిటీ ఔట్పుట్ కోసం విడుదల వాయిదా వేయక తప్పడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తాం’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. ‘పెద కాపు’లో విరాట్ కర్ణ ∙‘నారప్ప’ వంటి హిట్ మూవీ తర్వాత శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన చిత్రం ‘పెదకాపు–1’. విరాట్ కర్ణ, ప్రగతి శ్రీవాస్తవ జంటగా నటించారు. మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ఈ సినిమాని తొలుత ఆగస్టులో విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించినా, వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేదానిపై తాజాగా చిత్ర యూనిట్ స్పష్టత ఇచ్చింది. ఈ నెల 29న ‘పెదకాపు –1’ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. -
చరిత్ర చెప్పడానికి రెడీ అవుతున్న రెండు సినిమాలు
డైనమిక్ ఫ్రీడమ్ ఫైటర్‌గా చరిత్రలో నిలిచిపోయిన బెంగాలీ స్వాతంత్య్రోద్యమకారుడు జతీంద్రనాథ్ ముఖర్జీ బయోపిక్ ‘బాఘా జతిన్’, డైనమిక్ లేడీ ఇందిరా గాంధీ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎమర్జెన్సీ ఎందుకు విధించారు? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘ఎమర్జెన్సీ’. జతీంద్రనాథ్గా దేవ్ అధికారి, ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ నటించారు. హిస్టరీ నేపథ్యంలో రూపొంది, రిలీజ్‌కి రెడీ అవుతున్న ఈ రెండు చిత్రాల తాజా అప్డేట్స్ ఈ విధంగా... అందుకే ఆయన పేరులో ‘బాఘా’ చేరింది ‘దౌర్జన్యం ప్రబలినప్పుడు విధ్వంసం ఎంతో దూరంలో ఉండదు. ఈ దురాగతాలను అంతం చేయడానికి మనకు ఒక వీర రక్షకుడు కావాలి. భారతదేశపు పుత్రుడు బాఘా జతీన్ కథను మొదటిసారిగా వెండితెరపై చూపించబోతున్నాం’ అంటూ ‘భాఘా జతీన్’ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తున్న బెంగాలీ నటుడు దేవ్ అధికారి తాజా లుక్‌ని విడుదల చేసింది చిత్ర యూనిట్. భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్రోద్యమకారుడు బాఘా జతీన్ (జతీంద్రనాథ్ ముఖర్జీ) బయోపిక్‌గా అరుణ్ రాయ్ దర్శకత్వంలో బెంగాలీ, హిందీ భాషల్లో రూపొందిన చిత్రం ‘బాఘా జతీన్’. ఈ చిత్రంలో బాఘా జతీన్గా నటించి, నిర్మించారు దేవ్ అధికారి. 1879 డిసెంబర్ 7న జన్మించిన జతీంద్రనాథ్ ముఖర్జీ 1915 సెప్టెంబర్ 10న మరణించారు. తుపాకీ కాల్పులకు గురై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కాగా, జతీంద్రనాథ్కి బాఘా జతీన్ అని పేరు రావడానికి కారణం ఆయన ఎలాంటి మారణాయుధాలు లేకుండా ఒట్టి చేతులతో పులిని చంపడం. ‘బాఘా’ అంటే బెంగాలీలో పులి అని అర్థం. 1906లో పులిని అంతం చేశాక జతీంద్రనాథ్ పేరు ‘భాఘా జతీన్’గా మారింది. స్వాతంత్య్రం కోసం జతీన్ చేసిన వీర పోరాటాలతో పాటు ఇలాంటి పలు విశేషాలతో ‘భాఘా జతీన్’ తెరకెక్కింది. ‘‘నవరాత్రి శుభ సందర్భంగా దేవ్ఎంటర్టైన్మెంట్స్ నుంచి అక్టోబర్ 20న ‘భాఘా జతీన్’ థియేటర్లకు రానుంది’’ అంటూ తాజా పోస్టర్‌తో పాటు, చిత్రం విడుదల తేదీని ప్రకటించారు దేవ్ అధికారి. భారత్ అంటే ఇందిరా...! ‘దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత నా చేతుల్లో ఉంది. ఎందుకంటే భారత్ అంటే ఇందిరా.. ఇందిరా అంటే భారత్’ అనే డైలాగ్స్‌తో ‘ఎమర్జెన్సీ’ చిత్రం టీజర్ విడుదలైంది. ఇంకా టీజర్లో ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, టీవీ ప్రసారాలు నిలిపివేయడం, ఆందోళనకారులపై దాడి వంటివి చూపించారు. 1975 జూన్ 25 తేదీతో టీజర్ ఆరంభమవుతుంది. ‘రక్షకురాలా లేక నియంతా? మన దేశ నేత తన ప్రజలపై యుద్ధం ప్రకటించిన చీకటి రోజులకు సాక్షిగా చరిత్రలో నిలిచిన ఘట్టం ఇది..’ అంటూ కంగనా రనౌత్ ఈ టీజర్‌ని షేర్ చేశారు. భారత ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ (1975–1977) ఎందుకు విధించారు? అనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందిరా గాంధీగా కంగనా రనౌత్ ఒదిగిపోయినట్లు ఆమె లుక్ స్పష్టం చేస్తోంది. ఈ చిత్రానికి కంగనాయే దర్శకత్వం వహించి, ఓ నిర్మాతగా వ్యవహరించడం విశేషం. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయనున్నట్లు యూనిట్ ప్రకటించింది. -
ఎనిమిదేళ్ల తర్వాత అవతార్ 5
ప్రేక్షకులను కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిన హాలీవుడ్ ‘అవతార్’, సూపర్ హీరోని చూపించిన మార్వెల్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఇటు ‘అవతార్’ సీక్వెల్స్ అటు ‘మార్వెల్’ ఫ్రాంచైజీల కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటారు. ఈ రెండు భారీ ్ర΄ాజెక్ట్స్ని హాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వాల్ట్ డిస్నీ రాజీపడకుండా నిర్మిస్తుం టుంది. దర్శకుడు జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ తొలి భాగం 2009లో రాగా, రెండో భాగం రావడానికి పదమూడేళ్లు పట్టింది. గత ఏడాది ‘అవతార్ 2’ విడుదలైంది. మూడు, నాలుగు, ఐదో భాగం కూడా ఉంటాయని చిత్ర యూనిట్ ప్రకటించి, విడుదల తేదీలను కూడా ప్రకటించింది. అయితే తేదీలు వాయిదా పడ్డాయి. ఇక ‘మార్వెల్’ ఫ్రాంచైజీలను ఒకే దర్శకుడు కాకుండా వేరు వేరు డైరెక్టర్లు తెరకెక్కించే విషయం తెలిసిందే. ఈ చిత్రాల విడుదల తేదీలు కూడా వాయిదా పడ్డాయి. 2031లో ఫైనల్ అవతార్ తొలుత ‘అవతార్’ మూడో భాగాన్ని 2024లో, నాలుగో భాగాన్ని 2025లో, ఐదో భాగాన్ని 2028లో విడుదలకు మేకర్స్ ΄్లాన్ చేశారు. అయితే వాయిదా వేశారు. ఈ విషయాన్ని వాల్ట్ డిస్నీ సంస్థ బుధవారం ప్రకటించింది. మూడో భాగాన్ని 2025 డిసెంబర్ 19న, నాలుగో భాగాన్ని 2029 డిసెంబర్ 21న, ఐదో భాగాన్ని.. అంటే ఫైనల్ ‘అవతార్’ని 2031 డిసెంబర్ 19న విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. ‘‘ఒక్కో ‘అవతార్’ సినిమా ఒక్కో అద్భుతం. ఆ అద్భుతాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఇవ్వడానికి ఫిలిం మేకర్స్‌గా మేం తగినంత కృషి చేస్తున్నాం. నాణ్యత విషయంలో రాజీపడేది లేదు. 2025లో థియేటర్స్‌లో పండోరా ప్రపంచాన్ని చూపించడానికి యూనిట్ హార్డ్‌వర్క్ చేస్తోంది’’ అని చిత్ర నిర్మాతల్లో ఒకరైన జాన్ లాండవ్ అన్నారు. ఏడాదికి రెండు మార్వెల్ చిత్రాలు వాల్ట్ డిస్నీ ఓ నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తున్న మార్వెల్ చిత్రాలు చాలా ఫేమస్. ఇప్పటికి దాదాపు 30 చిత్రాలు రాగా, మార్వెల్ ఫ్రాంచైజీలో మరో 10 చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా... ఇప్పటికే విడుదల తేదీ ప్రకటించిన చిత్రాల కొత్త విడుదల తేదీలను నిర్మాణ సంస్థ ప్రకటించింది. మార్వెల్ ఫ్రాంచైజీలో వచ్చే ఏడాది మే 3న ‘డెడ్ పూల్ 3’ విడుదల కానుండగా అదే తేదీన విడుదలకు షెడ్యూల్ అయిన ‘కెప్టెన్ అమెరికా: బ్రేవ్ న్యూ వరల్డ్’ జూలై 24కి వాయిదా పడింది. కాగా, ‘థండర్ బోల్ట్స్’ని జూలై 24న విడుదల చేయాలనుకున్నారు కానీ, డిసెంబర్ 20కి వాయిదా వేశారు. వచ్చే ఏడాది ఆరు నెలల గ్యాప్‌లో ఈ రెండు చిత్రాలు వస్తాయి. ఇక 2025లో కూడా రెండు మార్వెల్ చిత్రాలు రానున్నాయి. ‘బ్లేడ్’ని 2025 ఫిబ్రవరి 14న, అదే ఏడాది మే 2న ‘ఫెంటాస్టిక్ ఫోర్’ని, ‘ఎవెంజర్స్: ది కాంగ్ డైనాస్టీ’ని 2026 మే 1న, ‘ఎవెంజర్స్: సీక్రెట్ వార్స్’ని 2027 మే 7న విడుదల చేయనున్నారు. -
పుష్పరాజ్ తో షారుఖ్ వేంకటేష్ ఫైట్
-
అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి.. లేట్‌గా అయినా లేటెస్ట్గా
కొన్ని సినిమాలు లేట్‌గా వచ్చినా లేటెస్ట్గా వస్తుంటాయి. రిలీజ్లు కాస్త ఆలస్యమైనా ఫర్వాలేదు కానీ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం రాజీ పడకపోవడమే ఈ వాయిదాలకు ఓ కారణం. మరో కారణం ఒకేసారి ఎక్కువ చిత్రాలు విడుదలైతే, థియేటర్లు దొరకని పరిస్థితి ఏర్పడటం. కారణాలేమైనా అనుకున్న తేదీ ఒకటి.. అయినది వేరొకటి అన్నట్లుగా ఇటీవల పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. ఒకటికి మించి ఎక్కువసార్లు వాయిదా పడిన సినిమాలు ఉన్నాయి. ఆ చిత్రాలు, వాటి కొత్త విడుదల తేదీల గురించి తెలుసుకుందాం. ► వేసవికి రావాల్సిన ‘భోళా శంకర్’ ఆగస్టుకు షిఫ్ట్ అయ్యాడు. చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. ఈ సినిమాను ముందు ఏప్రిల్ 14న విడుదల చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే ఆగస్టు 11కు రిలీజ్‌ను వాయిదా వేశారు. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం కోల్‌కతా బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుంది. ► ఈ ఏడాది సంక్రాంతికి ‘ఆదిపురుష్’ చిత్రం సిల్వర్ స్క్రీన్‌పైకి రావాల్సింది. కానీ మెరుగైన వీఎఫ్ఎక్స్ కోసం జూన్ 16కు వాయిదా వేశారు. ఈ మైథలాజికల్ ఫిల్మ్‌లో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీసనన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవ దత్తా, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. టి. సిరీస్ భూషణ్ కుమార్, క్రిష్ణకుమార్, ఓమ్ రౌత్, ప్రసాద్ సుతారియా, రెట్రోఫిల్స్ రాజేష్ నాయర్, యూవీ క్రియేషన్స్ వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం నుంచి ‘జై శ్రీరామ్..’ అనే తొలి పాటను విడుదల చేశారు. అజయ్–అతుల్ సంగీతం అందించిన ఈ పాటకి రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించారు. ► మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు నిర్మాత నాగవంశీ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు. ఫైనల్‌గా జనవరి 13న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటిస్తున్న చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2022 క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు. ఆ తర్వాత ఫిబ్రవరిలో రిలీజ్ చేస్తారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ‘ఖుషి’ సినిమాను సెప్టెంబరు1న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ► నిఖిల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘స్పై’. ఎడిటర్ గ్యారీ బీహెచ్ దర్శకత్వలో రాజశేఖర్ రెడ్డి, చరణ్ రాజ్ నిర్మించారు. ఈ చిత్రాన్ని 2022 దసరాకు విడుదల చేస్తున్నట్లు గతంలో ప్రకటించారు మేకర్స్. కానీ రిలీజ్ 2023 సమ్మర్‌కు వాయిదా పడింది. అయితే ఈ వేసవికి ‘స్పై’ రాలేదు. ఫైనల్‌గా జూన్ 29న విడుదల కానుంది. ► బెల్లంకొండ గణేశ్ హీరోగా నటించిన ‘నేను స్టూడెంట్ సర్’ 2022 డిసెంబరులో రిలీజ్ కావాలి. కానీ రాలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. కానీ వీలుపడలేదు. తాజాగా జూన్ 2న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో ‘నాంది’ సతీష్ వర్మ నిర్మించిన చిత్రం ఇది. ► దగ్గుబాటి అభిరామ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘అహింస’. తేజ దర్శకత్వంలో పి. కిరణ్ నిర్మిస్తున్నారు. గతంలో రెండుమూడు సార్లు ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. రీసెంట్గా ఈ సినిమాను ఏప్రిల్ 7న విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేసినప్పటికీ మరోమారు వాయిదా పడి, జూన్ 2న రిలీజ్‌కు రెడీ అవుతోంది. డేట్ ఫిక్స్ కాని చిత్రాలు ► వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్. శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాను ఏప్రిల్ 29న రిలీజ్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ఓ సందర్భంలో వెల్లడించింది. అయితే జూలైలో విడుదల చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించింది. ► అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేశ్ బాబు దర్శకత్వంలో వంశీ, ప్రమోద్ నిర్మించారు. ఈ చిత్రాన్ని ఈ సమ్మర్లో రిలీజ్ చేస్తున్నట్లు యూనిట్ ప్రకటించింది. కానీ రిలీజ్ కాలేదు. ► ‘డీజే టిల్లు’కి సీక్వెల్‌గా సిద్ధు జొన్నలగడ్డ హీరోగా ‘డీజే టిల్లు స్క్వైర్’ సెట్స్‌పై ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లుగా యూనిట్ ప్రకటించింది. అయితే ఆగస్టు లేదా సెప్టెంబరులో రిలీజ్ అయ్యేందుకు రెడీ కానున్నట్లు టాక్. మల్లిక్‌రామ్ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్. ► శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘సామజవరగమన’ ఈ నెల 18న రిలీజ్ కావాల్సింది. కానీ వాయిదా పడింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించారు. రెబా మౌనిక హీరోయిన్గా ఈ సినిమాను అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ► తేజా సజ్జా, అమృతా అయ్యర్ జంటగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను– మాన్’. ఈ సినిమాను మే 12న రిలీజ్ చేయాలను కున్నారు. కానీ వాయిదా పడింది. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన చిత్రం ఇది. -
దీపావళికి థియేటర్స్‌లో సందడి చేయబోయే సినిమాలివే..
పండగ సీజన్ అనగానే సినీ ప్రేక్షకులు కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాల కోసం ఎంతగానో ఎదురుచూస్తారు. ఇప్పటికే దసరా కానుకగా మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, కింగ్ నాగార్జున ‘ది ఘోస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీపావళి సందర్భంగా యంగ్ హీరోలు బాక్సాఫీస్ వద్దబరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమాలపై ఓ లుక్కేద్దాం. మంచు విష్ణు హీరోగా ఇషాన్ సూర్య డైరెక్షన్ లో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘జిన్నా’. పాయల్ రాజ్‌పుత్, సన్నీలియోన్ హీరోయిన్స్‌గా నటించిన ఈ సినిమా దీపావళి కానుకగా ఈ నెల 21న థియేటర్స్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యింది. ఇప్పటికే ట్రైలర్, పాటలతో మంచి హైప్ క్రియేట్ చేసుకుంది. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా భారీగా చేయడంతో మూవీపై బజ్ ఏర్పడింది. మరి జిన్నాపైనే ఆశలు పెట్టుకున్న విష్ణు ఈ సినిమాతో హిట్ కొటతాడా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఇక యంగ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జోడీగా అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో రూపొందిన సోషియో ఫాంటసీ మూవీ ‘ఓరి దేవుడా’. విక్టరీ వెంకటేశ్ మోడ్రన్ దేవుడిగా ఎంటర్ టైన్ చేయబోతున్న ఈ మూవీ తమిళ సూపర్ హిట్ ‘ఓ మై కడవుళే’ కు రీమేక్‌గా తెరకెక్కింది. తమిళంలో అశోక్ సెల్వన్, రితికాసింగ్, వాణిబోజన్, విజయ్ సేతుపతి నటించిన ఈ సినిమా అక్కడ హిట్ అయింది. డిఫరెంట్ జానర్‌తో వస్తున్న విశ్వక్ ఓరి దేవుడా అంటూ ఈనెల21న ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందన్నది చూడాలి. దీపావళి కానుకగా రాబోతున్న మరో సినిమా ప్రిన్స్. శివ కార్తికేయన్,మారియా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కెవి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ రెండు భాషలలోనూ ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతుంది.ఇందులో శివకార్తికేయన్ స్కూల్ టీచర్‌గా నటించారు. నటుడు ఇందులో సత్యరాజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు ప్రిన్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ సైతం రంగంలోకి దిగి ప్రమోషన్స్ చేశారు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందన్నది చూడాల్సి ఉంది. ఇక మరో తమిళ హీరో కార్తి కూడా ఈసారి దీపావళి బరిలోకి దిగుతున్నారు. కార్తీ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం సర్దార్. పీఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. రాశిఖన్నా,రజీషా విజయన్ ఇందులో హీరోయిన్స్‌గా నటించారు. నటి లైలా ఇందులో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో దాదాపు 15 గెటప్పుల్లో కార్తి కనిపించనున్నట్లు తెలుస్తోంది. జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ఈనెల 21న తెరపైకి రానుంది. ఇప్పటికే కార్తికి తెలుగులోనూ మంచి డిమాండ్ ఉంది. మరి ఈ సినిమాతో కార్తికి ఇంకో హిట్టు పడినట్లేనా అన్నది చూద్దాం. -
సమ్మర్‌కి సై అంటున్న స్టార్ హీరోలు
వేసవి సీజన్ అంటే సినిమా పండగ. ఈ సీజన్లో ఎన్ని సినిమాలు విడుదలైనా టికెట్లు తెగుతాయి. అందుకే సమ్మర్‌కి సినిమాలను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తుంటారు. అలా ‘సమ్మర్‌కి సై’ అంటూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న, రిలీజ్‌కి రెడీ అవుతున్న త్రాల గురిం తెలుసుకుందాం. వేసవి అంటే దాదాపు మార్చి నుంచి ఆరంభమవుతుంది. మార్చిలో ఇప్పటివరకూ విడుదల తేదీ ఖరారు చేసుకున్న చిత్రాల్లో నాని హీరోగా నటిస్తున్న ‘దసరా’ ఉంది. ఈ చిత్రం మార్చి 30న రిలీజ్ కానుంది. శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘నేను లోకల్’ చిత్రం తర్వాత నాని, కీర్తీ సురేష్ జోడీగా నటిస్తున్న చిత్రం ఇది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ సినివను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇక ఏప్రిల్‌లో ఇప్పటికే విడుదల తేదీ ఖరారు చేసుకున్నవాటిలో చిరంజీవి, మహేశ్‌బాబుల చిత్రాలు ఉన్నాయి. చిరంజీవి హీరోగా మోహర్ రమేష్ దర్శకత్వంలో ‘బోళా శంకర్’ చిత్రం రపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. చిరంజీవి చెల్లెలి పాత్రను కీర్తీ సురేష్ చేస్తున్నారు. అనిల్ సుంకర, రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ కానుంది. ఇక ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాల తర్వాత హీరో మహేశ్‌బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో మూడో సినివ రపొందనున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తారు. ఎస్. రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినివ వచ్చే ఏడాది ఏప్రిల్ 28న విడుదల కానుంది. అయితే ఈ సినిమా షటింగ్ ఇంకా ఆరంభం కాలేదు. సెప్టెంబరు లేదా అక్టోబరు మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. మరోవైపు బాలకృష, పవన్ కల్యాణ్ కూడా వేసవి బరిలో నిలిచే అవకాశం ఉంది. బాలకృష, హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా రపొందనున్న సంగతి తెలిసిందే. హరీష్ పెద్ది, సాహు గారపాటి ఈ సినివను నిర్మించనున్నారు. త్వరలో షటింగ్ ఆరంభం కానుంది. ఈ చిత్రాన్ని వేసవిలో రిలీజ్ చేయాలనుకుంటున్నారట. అలాగే పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో రపొందుతున్న పీరియాడికల్ ఫిల్మ్ ‘హరి హర వీరమల్లు’ కూడా సమ్మర్‌కే రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్‌పాల్ విలన్‌గా నటిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. ఏయం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే వేసవిలో రిలీజ్ చేసే ప్లాన్స్ ఉన్నట్లుగా ఇటీవల ఓ సందర్భంలో ఏయం రత్నం పేర్కొన్నారు. కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ కూడా సమ్మర్ సందడిలో ఉండే అవకాశం ఉంది. ‘జనతా గ్యారేజ్’ చిత్రం తర్వాత ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా రపొందనుంది. కల్యాణ్ రామ్ సమర్పణలో మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ ఈ సినివను నిర్మించనున్నారు. ఈ సినిమా కోసం పాన్ ఇండియా అప్పీల్ ఉండే కథను రెడీ చేస్తున్నారట కొరటాల. త్వరలో ఈ సినిమా రెగ్యులర్ షటింగ్ స్టార్ట్ కానుంది. ఈ సినివను వేసవిలోనే విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. మరోవైపు రామ్‌చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినివ షటింగ్ జరుగుతోంది. ఈ చిత్రం కూడా వేసవి బరిలో నిలుస్తుందని టాక్. మేలో రిలీజ్ చేయాలనుకుంటున్నారని భోగట్టా. మరికొన్ని భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు, మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా సమ్మర్లో రిలీజ్ కానున్నాయి. మ్మర్‌కి సై -
తారుమారైన తేదీలు.. ఆలస్యంగా రానున్న సినిమాలు
కరోనా వల్ల సినిమాల విడుదల తేదీలు తారుమారయ్యాయి. 2020లో ముందుగానే విడుదల తేదీ ప్రకటించిన ఏ సినిమా కూడా చెప్పిన తేదీకి దాదాపు రాలేదు. దానికి కారణం లాక్డౌన్. కరోనా కాస్త సద్దుమణిగి, సినిమాల విడుదల జోరు పెరిగినా కానీ రెండేళ్ల కరోనా ప్రభావం సినిమా విడుదలపై ఇంకా ఉంది. ఇప్పటికీ సినిమాల విడుదల తేదీలు తారుమారవుతున్నాయి. దానికి ఒక కారణం కరోనా తర్వాత థియేటర్లకు ప్రేక్షకులు వచ్చే సంఖ్య తగ్గడమే అని కొందరు పరిశ్రమ ప్రముఖులు అంటున్నారు. ఏది ఏమైనా సినిమాకి పూర్వ వైభవం వస్తుందనే నమ్మకం కూడా వెలిబుచ్చారు. ఇక విడుదల తేదీలు తారుమారైన చిత్రాల గురించి తెలుసుకుందాం. కాగా సీక్రెట్ ఏజెంట్‌గా అఖిల్ చేపట్టిన ఆపరేషన్ ఏంటి? అనేది తెలియాలంటే ‘ఏజెంట్’ రిలీజ్ వరకూ ఆగాల్సిందే. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఏజెంట్’. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కావాల్సి ఉంది. ఇటీవల ‘ఏజెంట్’ ట్రైలర్‌ని కూడా అభిమానుల మధ్య గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. అయితే.. ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. కొత్త రిలీజ్ తేదీని చిత్రబృందం ప్రకటించలేదు. ఇంకోవైపు సమంత లీడ్ రోల్లో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘యశోద’ ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. హరి–హరీశ్ దర్శకత్వంలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా ఓ పాట చిత్రీకరించాల్సి ఉండగా మరోవైపు గ్రాఫిక్స్, డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసినట్లు చిత్రయూనిట్ ఆ మధ్య పేర్కొంది. కొత్త విడుదల తేదీపై స్పష్టత ఇవ్వలేదు. ఇక సముద్రంలోని ద్వారకా నగరంపై నిఖిల్ చేసిన అన్వేషణ కూడా తెరపైకి కాస్త లేట్‌గా రానుంది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన హిట్ మూవీ ‘కార్తికేయ’కి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘కార్తికేయ 2’. ఇందులోనే నిఖిల్ ద్వారకా నగర అన్వేషణ చేశారు. టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 22న విడుదల చేయనున్నట్లు తొలుత చిత్రయూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఆగస్టు 12న రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఫైనల్‌గా ఒక రోజు ఆలస్యంగా ఆగస్టు 13న విడుదల చేయనున్నట్లు తాజాగా చిత్రబృందం ప్రకటించింది. కాగా నిఖిల్ హీరోగా నటించిన మరో చిత్రం ‘18 పేజెస్’ విడుదల తేదీలోనూ మార్పు జరిగింది. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఈ చిత్రం విడుదల కావాల్సింది. అయితే సెప్టెంబరు 10న రిలీజ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ‘బన్నీ’ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అదే విధంగా వైష్ణవ్ తేజ్ వైభవాన్ని చూడాలంటే సెప్టెంబర్ 2 వరకూ వేచి చూడాలి. గిరీశాయ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా రూపొందిన చిత్రం ‘రంగరంగ వైభవంగా’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా విడుదల రెండు సార్లు వాయిదా పడి ఫైనల్‌గా మూడోసారి ఫిక్స్ అయింది. ఈ చిత్రాన్ని తొలుత మే 27న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించినా కాలేదు. ఆ తర్వాత జూలై 1న విడుదల అంటూ అనౌన్స్ చేసినా వాయిదా పడింది. ఫైనల్‌గా సెప్టెంబరు 2న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పోలీస్ ఆఫీసర్ కృష్ణదేవ్ (అడివి శేష్ పాత్ర పేరు) ఓ కేసు విచారణపై శ్రద్ధ పెట్టారు. ఈ విచారణ విశేషాలు తెలియాలంటే ‘హిట్ 2’ రిలీజ్ వరకు వేచి చూడాలి. శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘హిట్: ది సెకండ్ కేస్’. ప్రశాంతి త్రిపిర్నేని నిర్మిస్తున్నారు. ‘హిట్’కి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ‘హిట్ 2’ జూలై 29న రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సత్యదేవ్ ‘గుర్తుందా శీతాకాలం’ కూడా వాయిదా జాబితాలో ఉంది. నాగశేఖర్ దర్శకత్వంలో సత్యదేవ్, తమన్నా జంటగా నాగశేఖర్, భావనా రవి నిర్మించిన ఈ చిత్రం జూలై 15న ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ విడుదల వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు? అనేది ఇంకా చిత్రయూనిట్ ప్రకటించలేదు. మరోవైపు బెల్లంకొండ సురేశ్ చిన్న కుమారుడు గణేశ్ హీరోగా పరిచయ మవుతున్న చిత్రం ‘స్వాతిముత్యం’. లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా వేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు. ఇంకా విడుదల తేదీ వాయిదాపడిన చిత్రాలు కొన్ని ఉన్నాయి. ఒక తేదీకి అనుకున్న సినిమా మరో తేదీకి వాయిదా పడటం అనేది సాధారణ విషయమే. అయితే ఒకేసారి ఇన్ని చిత్రాలు వాయిదా పడటం అంటే విషయమే. -
వచ్చే 3 నెలల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే..
Upcoming Telugu Movies 2022: New Films Coming In 3 Months Theater: థియేటర్లలో మళ్లీ సినిమా సందడి మొదలైంది. పుష్పతో ప్రారంభమైన ఈ మూవీ ఫెస్టివల్ మే 27న విడుదలైన ఎఫ్3 (F3) కొనసాగుతోంది. పుష్ప, శ్యామ్‌సింగరాయ్, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మే రెండోవారంలో సర్కారు వారి పాట ఘనంగా విడుదల కాగా చివరి వారంలో ఎఫ్3 రిలీజైంది. సర్కారు వారి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా అదే తరహాలో నవ్వులు పంచే సినిమాగా ఎఫ్3 విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మే నెల ఎఫ్3తో శుభం కార్డు పడగా.. తర్వాతి నెలల్లో వచ్చే సినిమాలకు ఆహ్వానం పలికేందుకు మరింత ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు. కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్ ఏంటో చూద్దామా ! జూన్: విక్రమ్- జూన్ 3 మేజర్- జూన్ 3 అంటే.. సుందరానికి- జూన్ 10 రామారావు ఆన్ డ్యూటీ-జూన్ 17 (ప్రస్తుతానికి వాయిదా పడింది) గాడ్సే- జూన్ 17 సమ్మతమే- జూన్ 24 జూలై: పక్కా కమర్షియల్- జూలై 1 విరాటపర్వం- జూలై 1 రంగ రంగ వైభవంగా- జూలై 1 థ్యాంక్ యూ- జూలై 8 ది వారియర్- జూలై 14 కార్తికేయ 2- జూలై 22 విక్రాంత్ రోణ- జూలై 28 హిట్ 2- జూలై 29 ఆగస్టు: బింబిసార- ఆగస్టు 5 యశోద- ఆగస్టు 12 ఏజెంట్- ఆగస్టు 12 మాచర్ల నియోజకవర్గం- ఆగస్టు 12 లైగర్- ఆగస్టు 25 వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 19 సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే జూన్ 17న రావాల్సిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే వాయిదా పడింది. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఒక వేళ ఈ సినిమా ఈ మూడు నెలల్లోనే రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో కలిపి వచ్చే 3 నెలల్లో మొత్తంగా 20 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పైన ఉన్న సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. చదండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి.. -
ఆవకాయ సీజన్ బ్లాక్.. 'అంటే సుందరానికీ' ఏడు రిలీజ్ డేట్స్!
Nani Ante Sundaraniki Release Date: గత కొద్దికాలంగా సరైన హిట్టు లేక అల్లాడిపోయిన నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 'అంటే సుందరానికీ' మూవీ ఉంది. ఇందులో నాని పాత్ర పేరు ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'రాజారాణి' ఫేమ్ నజ్రియా నజీమ్ ఫాహద్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే 'ఆర్ఆర్ఆర్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు రెండేసి రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ నేపథ్యంలో తామేం తక్కువ కాదంటూ 'అంటే సుందరానికీ' చిత్రం కోసం ఒకటీరెండు కాదు, ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు ప్రకటించాడు నాని. ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10.. వీటిలో ఏదో ఒక తేదీలో థియేటర్లలో అడుగుపెడతాం అంటూ స్పెషల్ పోస్టర్ వదిలాడు. 'మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా? ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్.. మెల్లగ డిసైడ్ చేస్తాం..' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. View this post on Instagram A post shared by Nani (@nameisnani) -
సమ్మర్ రేసులో మరిన్ని భారీ చిత్రాలు.. ఏ సినిమాకు మీ ఓటు?
విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమకథకు డేట్ సెట్ అయింది. సన్నాఫ్ ఇండియా చేసిన పోరాటం చూసే డేట్ సెట్ అయింది. కరోనా కరుణిస్తే పక్కా కమర్షియల్ చూసే డేట్ సెట్ అయింది. ఇంతేనా... ఇంకా బుధవారం బోలెడన్ని డేట్స్ సెట్ అయ్యాయి. పలు తెలుగు చిత్రాలతో పాటు తమిళ్, హిందీ చిత్రాల రిలీజ్ డేట్ సెట్ అయింది. ఇక ప్రేక్షకులు ఏ రోజు సినిమా చూడాలో... డేట్ సెట్ చేసుకోవడమే ఆలస్యం. విక్రమాదిత్య, ప్రేరణల ప్రేమకావ్యంగా రూపొందిన చిత్రం ‘రాధేశ్యామ్’. విక్రమాదిత్యగా ప్రభాస్, ప్రేరణగా పూజా హెగ్డే జంటగా ఇటలీ నేపథ్యంలో సాగే ప్రేమకథాగా ఈ చిత్రం రూపొందింది. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మించారు. మార్చి 11న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఇక ఈ నెలలోనే ‘సన్నాఫ్ ఇండియా’ తెరపైకి వచ్చే తేదీ షురూ అయింది. సమాజాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసే పవర్ఫుల్ వ్యక్తిగా మోహన్‌బాబు టైటిల్ రోల్ చేసిన చిత్రం ఇది. ఈ సినిమాకు మోహన్‌బాబు స్క్రీన్‌ప్లే సమకూర్చడం విశేషం. ‘డైమండ్’ రత్నబాబు దర్శకత్వంలో శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్‌తో కలసి 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై విష్ణు మంచు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. మరోవైపు మూడు నెలల తర్వాత రానున్న డేట్‌ని ‘పక్కా కమర్షియల్’ టీమ్ ప్రకటించింది. కరోనా కరుణిస్తే... అనుకున్న తేదీకి పక్కాగా వస్తాం అంటూ ఈ చిత్రాన్ని మే 20న విడుదల చేస్తామని చిత్రబృందం పేర్కొంది. గోపీచంద్ హీరోగా అల్లు అరవింద్ సమర్పణలో యూవీ క్రియేషన్స్‌తో కలిసి జీఏ2 పిక్చర్స్‌పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. మారుతి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాశీ ఖన్నా హీరోయిన్. భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు పలు మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాల రిలీజ్ డేట్ కూడా ఖరారైంది. మార్చి 4న ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమా తెరకు రానుంది. ఈ తేదీని ప్రకటించి, టీజర్‌ని రిలీజ్ చేశారు. మూడు పదుల వయసున్న అర్జున్ కుమార్‌కి పెళ్లి ఎందుకు కాలేదు? చివరకి పెళ్లి కోసం అర్జున్ కుమార్ అండ్ ఫ్యామిలీ ఏం చేశారు? అనే విషయాలతో ఈ సినిమా సాగుతుంది. విశ్వక్ సేన్, రుక్సార్ థిల్లాన్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘రాజావారు రాణిగారు’ చిత్రదర్శకుడు రవి కిరణ్ కోలా కథ–మాటలు–స్క్రీన్‌ప్లే అందించారు. ఇక ఫిబ్రవరి 18న విడుదలకు రెడీ అయిన సినిమా ‘సురభి 70 ఎంఎం’ (హిట్టు బొమ్మ ). గంగాధర వై.కె. అద్వైత దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. సినిమా అనేది ప్రతి తెలుగువాడి నరనరాల్లో ఉన్న ఎమోషన్, సినిమా థియేటర్ని కాపాడుకోవాలి అనే కథతో గ్రామీణ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. బాబీ ఫిలిమ్స్ సమర్పణలో కేకే చైతన్య నిర్మించిన ఈ చిత్రంలో అక్షత శ్రీనివాస్, వినోద్, అనిల్, చందు, మహేశ్, ఉషాంజలి, శ్లోక తదితరులు నటించారు. ఆచార్య ఏప్రిల్ 29, సర్కారు వారి పాట మే 12కు రిలీజ్ అవుతున్నాయి. హిందీలోనూ... బాలీవుడ్‌లోనూ రిలీజ్‌ల హడావిడి కనబడుతోంది. ఆలియా భట్ టైటిల్ రోల్ చేసిన ‘గంగూబాయి కతియావాడి’ ఈ నెల 25న విడుదల కానుంది. అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్ చేసిన ‘ఝుంద్’ మార్చి 4న, ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ‘అనేక్’ మే 13న, కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులెయ్యా 2’ మే 20న రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి. ఇంకా రిలీజ్ లిస్ట్‌లో పలు చిత్రాలు ఉన్నాయి. కోలీవుడ్‌లోనూ... తమిళ పరిశ్రమ కూడా సినిమా విడుదల తేదీలను ఖరారు చేసుకుంటోంది. రిలీజ్ కానున్న చిత్రాల్లో అజిత్ కుమార్ ‘వలిమై’, సూర్య ‘ఎదర్కుమ్ తునిందవన్’ ఉన్నాయి. అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మించిన ‘వలిమై’ ఈ నెల 24న విడుదల కానుంది. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ అనువాదరూపంలో అదే తేదీన ఈ చిత్రం తెరకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ పాత్ర చేయడం విశేషం. ఇక ఈ కరోనా కాలంలో సూర్య హీరోగా నటించిన రెండు చిత్రాలు ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలయ్యాయి. అది సూర్య ఫ్యాన్స్‌ని కాస్త నిరాశపరిచింది. అయితే సూర్య హీరోగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం ‘ఎదర్కుమ్ తునిందవన్’ చిత్రం థియేటర్స్‌లో రానుండటం వారికి ఆనందాన్నిచ్చే విషయం. మార్చి 10న ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో అనువదించి, అదే తేదీన విడుదల చేయనున్నారు. డబుల్ డేట్! ఒక పని చేయడానికి ఓ ప్లాన్ అనుకుంటాం. అది ప్లాన్ ‘ఎ’. ఆ ప్లాన్ ప్రకారం జరగకపోతే అనే ఆలోచనతో ప్లాన్ ‘బి’ కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు తెలుగులో ‘ప్లాన్ బి’ ట్రెండ్ నడుస్తోంది. సినిమా రిలీజ్‌కి ‘డబుల్ డేట్’ ప్రకటించి, ఆ తర్వాత ఓ డేట్‌కి ఫిక్స్ అవుతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’తో ఈ ట్రెండ్ మొదలైందని చెప్పొచ్చు. ఓ పది రోజుల క్రితం ‘‘మా ‘ఆర్ఆర్ఆర్’ని ఈ ఏడాది మార్చి 18న లేదా ఏప్రిల్ 28న విడుదల చేస్తాం’’ అని ఈ చిత్రబృందం ప్రకటించింది. చివరికి మార్చి 25న విడుదల చేయనున్నట్లు సోమవారం ఓ తేదీని ఫిక్స్ చేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘ఆర్ఆర్ఆర్’ తరహాలోనే ‘భీమ్లా నాయక్’ రెండు విడుదల తేదీలను ప్రకటించింది. పవన్ కల్యాణ్–రానా హీరోలుగా సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. లేకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని సోమవారం ప్రకటించారు. మంగళవారం రవితేజ ‘రామారావు: ఆన్ డ్యూటీ’, వరుణ్ తేజ్ ‘గని’.. ఈ రెండు చిత్రాలకు సంబంధించి ‘డబుల్ డేట్’ ప్రకటన వచ్చింది. రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రామారావు ఆన్ డ్యూటీ’. దివ్యాంశా కౌశిక్, రజీషా విజయన్ హీరోయిన్లు. సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ‘‘మార్చి 25న మా సినిమాను విడుదల చేయాలనుకున్నాం. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి మార్చి 25 కుదరకపోతే ఏప్రిల్ 15న విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం’’ అని నిర్మాతలు ప్రకటించారు. మరోవైపు వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘గని’. అల్లు అరవింద్ సమర్పణలో సిద్ధు ముద్ద, అల్లు బాబీ నిర్మించారు. ‘‘భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్‌లో ఫిబ్రవరి 25 కూడా ఉంది. ఆ చిత్రం ఫిబ్రవరి 25కి రాకపోతే అదే రోజున ‘గని’ విడుదలవుతుంది.. ‘భీమ్లా నాయక్’ 25నే రిలీజ్ అయితే ‘గని’ మార్చి 4న రిలీజవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. -
వరుణ్ తేజ్ గని మూవీకి 2 రిలీజ్ డేట్స్, ఎప్పుడైనా రావొచ్చు..
కరోనా కారణంగా వాయిదా పడ్డ క్రేజీ సినిమాల రిలీజ్ డేట్స్‌ను మేకర్స్ వరసగా ప్రకటిస్తున్నారు. ఈ సంక్రాంతి బరిలో ప్రేక్షకులు ముందుకు రావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్‌తో పాటు పెద్ద సినిమాలు ఆచార్య, భీమ్లా నాయక్, ఎఫ్3 సినిమాల రిలీజ్ డేట్స్‌ను నిన్న(సోమవారం) వెల్లడించారు. ఈ నేపథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గని సినిమా రిలీజ్ డేట్‌ను కూడా తాజాగా చిత్ర బృందం ప్రకటించింది. ఫిబ్రవరి 25వ తేదీ లేదా మార్చిన 4వ తేదీన గని మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకవచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు మేకర్స్ ట్విటర్ వేదికగా వెల్లడించారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చామని, గని మూవీని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4వ తేదీన రిలీజ్ చేస్తామని ట్వీట్లో పేర్కొన్నారు. కాగా గని చిత్రాన్ని ముందుగా దీపావళికి రిలీజ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 24కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన బాలీవుడ్ నటి సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తోంది. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన చంద్ర, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వరుణ్ తేజ్ ఇప్పటి వరకు చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో సరికొత్త లుక్‌లో బాక్సర్‌గా అలరించబోతున్నాడు. ఇటీవల మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే ఇందులో తమన్నా స్పెషల్ సాంగ్‌లో నటించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా తమన్నా స్పెషల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా ఈ పాటకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. After careful deliberation and considering the prevailing situations, #Ghani 🥊 will be releasing on February 25th or March 4th! See you all in theaters soon! 🤩@IAmVarunTej @saieemmanjrekar @dir_kiran @MusicThaman @george_dop @abburiravi @sidhu_mudda @Bobbyallu @adityamusic pic.twitter.com/Oqi2cDyIMh — Renaissance Pictures (@RenaissanceMovi) February 1, 2022 -
తీపి కబురు.. పెద్ద సినిమాల కొత్త రిలీజ్ డేట్స్ ఇవే!
మంచిది.. ఇలా కదా చేయాల్సింది.. మంచిది... ఇది కదా జరగాల్సింది. మంచిది... ఇంత ఫ్రెండ్లీగా కదా ఉండాల్సింది. సోమవారం కొన్ని మంచి విషయాలను మోసుకొచ్చింది. టాలీవుడ్ పెద్ద నిర్మాతలందరూ మంచి నిర్ణయం తీసుకున్న కబురు తెచ్చింది. పెద్ద సినిమాలు క్లాష్ కాకుండా.. నిర్మాతలు సినిమాల రిలీజ్ డేట్స్‌ని డిసైడ్ చేశారు. సోమవారం ముందు ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్ ప్రకటన వచ్చింది. ఆ తర్వాత మిగతా సినిమాల రిలీజ్ డేట్స్ వచ్చాయి. నిర్మాతలు డిసైడ్ అయి, ఇలా విడుదల తేదీలు చెప్పడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక రిలీజ్ ‘డేట్ లాక్’ చేసుకున్న సినిమాల డేటా తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ‘రౌద్రం.. రుధిరం.. రణం’ (ఆర్ఆర్ఆర్) సినిమా గురించి సినీ లవర్స్ ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పలుమార్లు రిలీజ్ వాయిదా పడిన ఈ భారీ పాన్ ఇండియా చిత్రాన్ని మార్చి 18 లేదా ఏప్రిల్ 28న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. కానీ జనవరి 31 (సోమవారం) ‘ఆర్ఆర్ఆర్’ కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించి, స్వీట్ షాక్ ఇచ్చింది. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. ‘బాహుబలి’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలు. స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్‌చరణ్ నటించారు. కొన్ని కల్పిత అంశాలకు స్నేహం, భావోద్వేగాలను మిళితం చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు ఇటీవల రాజమౌళి చెప్పారు. డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా దాదాపు పద్నాలుగు భాషల్లో (విదేశీ భాషలతో కలిపి) విడుదల కానుంది. ఇక ధర్మస్థలి పోరాటాన్ని వెండితెరపై చూసే సమయం ఎప్పుడో తెలిసిపోయింది. చిరంజీవి హీరోగా, రామ్‌చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఆచార్య’ చిత్రం ధర్మస్థలి అనే విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, చరణ్‌కు జోడీగా పూజా హెగ్డే కనిపిస్తారు. ఏప్రిల్ 29న ‘ఆచార్య’ను విడుదల చేస్తున్నట్లుగా చిత్రబృందం సోమవారం ప్రకటించింది. రామ్‌చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మరోవైపు 2022లో ముందుగానే రిలీజ్ డేట్‌ను ప్రకటించిన చిత్రాల జాబితాలో మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ ముందు వరుసలో ఉంది. ఈ సినిమాను ఈ ఏడాది జనవరి 13న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కుదర్లేదు (అప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల జనవరి 7కి షెడ్యూలైన కారణంగా ‘సర్కారువారి పాట’ చిత్రాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కోరిన మేరకు వాయిదా వేసుకున్నారు). ఆ తర్వాత ఏప్రిల్ 1న ‘సర్కారువారి పాట’ను రిలీజ్ చేయనున్నట్లు ఈ చిత్రనిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, గోపీ ఆచంట, రామ్ ఆచంట తెలిపారు. అయితే ఏప్రిల్ 1కి షెడ్యూల్ అయిన ఈ చిత్రం ఆ తేదీకి రావడంలేదు. మే 12న విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు తాజాగా ప్రకటించారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ కథానాయిక. ఇటు మేం ఎప్పుడు వస్తే అప్పుడే నవ్వుల పండగ అని ‘ఎఫ్ 3’ టీమ్ చెబుతూనే ఉంది. ఏప్రిల్ 28న ప్రేక్షకులను నవ్వించాలని ఈ సినిమా టీమ్ ఇటీవల డిసైడ్ అయింది. అయితే ‘ఆర్ఆర్ఆర్’, ‘ఆచార్య’ వంటి సినిమాల కొత్త విడుదల తేదీలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ‘ఎఫ్ 3’ సినిమా విడుదలలో ఏమైనా మార్పు ఉంటుందా? అనే అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ సినిమాను ఏప్రిల్ 28నే విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా, రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ మంచి విజయాన్ని సాధించింది. ‘దిల్’ రాజు నిర్మించారు. ఇక ‘ఎఫ్ 3’ గ్యాంగ్‌లో సునీల్, సోనాలీ చౌహాన్ కూడా చేరారు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్ ‘ఎఫ్ 3’ సినిమాను నిర్మించారు. మరోవైపు పవన్ కల్యాణ్, రానా హీరోలుగా రూపొందుతున్న చిత్రం ‘భీమ్లానాయక్’. సాగర్ కె. చంద్ర దర్శకుడు. ఈ ఏడాది జనవరి 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఫిబ్రవరి 25కి వాయిదా పడింది. అయితే సోమవారం కొన్ని చిత్రాల రిలీజ్ డేట్స్ ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో తమ సినిమా రిలీజ్‌ను కూడా ‘భీమ్లానాయక్’ టీమ్ ప్రకటించింది. ‘‘మా చిత్రాన్ని ఫిబ్రవరి 25న రిలీజ్ చేస్తాం.. ఒకవేళ పరిస్థితులు సహకరించకపోతే ఏప్రిల్ 1న చిత్రం థియేటర్స్‌కు వస్తుంది’’ అని చిత్రనిర్మాత సూర్యదేవర నాగవంశీ తెలిపారు. కోవిడ్ సృష్టించిన అయోమయ పరిస్థితుల కారణంగా సినిమాల విడుదలలు వాయిదా పడుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇలా ఒకేసారి పెద్ద చిత్రాల విడుదల తేదీలు ఖరారు కావడం సినిమాని నమ్ముకున్న అందరికీ తీపి కబురులాంటిది. విడుదల తేదీలు ఆర్ఆర్ఆర్ – మార్చి 25 ఆచార్య – ఏప్రిల్ 29 ఎఫ్ 3 – ఏప్రిల్ 28 సర్కారువారి పాట – మే 12 భీమ్లా నాయక్ – ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1 డేట్ డిబేట్ ఇక మరికొన్ని పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ గురించి డిబేట్స్ (చర్చలు) జరుగుతున్నాయని తెలిసింది. ఈ జనవరి 14న విడుదల కావాల్సిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’ థియేటర్స్‌కు రాలేదు. మార్చి 11న ఈ చిత్రం విడుదల కానుందన్నది లేటెస్ట్ టాక్. రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, ప్రసీద ఈ చిత్రాన్ని నిర్మించారు. అలాగే వరుణ్ తేజ్ చేసిన ‘గని’ని మార్చి 18న విడుదల చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే అనుకున్న సమయానికంటే ముందుగానే అంటే ఫిబ్రవరిలోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రనిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద. అలాగే శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహోర్లు’ను ఫిబ్రవరి 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఆ తేదీకి ‘భీమ్లా నాయక్’ వస్తే, ‘ఆడవాళ్ళు...’ సినిమా రిలీజ్ డేట్ మారొచ్చు. అలాగే ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’ విడుదల కావాల్సింది. కానీ తాజా విడుదల తేదీల ఖరారు దృష్ట్యా ఈ సినిమా రిలీజ్ డేట్ (‘ఆచార్య’, ‘ఎఫ్ 3’ రిలీజ్ కారణంగా) మారే చాన్స్ ఉంది. అలాగే మరికొన్ని సినిమాల రిలీజ్ డేట్స్‌పై నిర్మాతల మధ్య సానుకూల వాతావరణంలో డేట్ డిబేట్ జరుగుతోంది. -
మెగా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి
ఈ ఏడాది సంక్రాంతి బరిలో రావాల్సిన పాన్ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్, పెద్ద సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడ్డనుండటంతో వాయిదా పడ్డ పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాల విడుదల తేదీలను వరసగా ప్రకటిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ డేట్‌ను జక్కన ప్రకటించగా.. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్ డేట్‌ను కూడా వెల్లడించింది ఆ చిత్ర బృందం. 'ఆర్ఆర్ఆర్' మార్చి 25న వస్తుండగా.. చిరు, చరణ్‌ల 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా మేకర్స్ అధికారిక ప్రకటన ఇచ్చారు. తొలుత ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన ఆచార్య దర్శక-నిర్మాతలు కరోనా కారణంగా ఏప్రిల్ 1 అని నిర్మాతలు లోగడ ఎనౌన్స్ చేశారు. ఇక పలు చర్చల అనంతరం చివరకు విడుదల తేదీని ఏప్రిల్ 29కి నిర్ణయించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వివరించింది. #Acharya on 29th April In Theatres pic.twitter.com/ptYGJnzPoQ — Aakashavaani (@TheAakashavaani) January 31, 2022 చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కించారు. ఇదిలా ఉంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్ మూవీ రిలీజ్‌పై కూడా తాజాగా మేకర్స్ ఓ క్లారిటీ ఇచ్చారు. అంతా బాగుంటే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, లేదా ఏప్రిల్ 1వ తేదీకి విడుదల చేస్తామంటూ కొద్ది సేపటి క్రితం భీమ్లా నాయక్ మేకర్స్ ట్వీట్ చేశారు. As we have always promised, #BheemlaNayak will be a massive theatrical experience. So, we have to wait for the pandemic to subside for presenting it in the theatres for you all. We intend to release the movie on 25th February or 1st April, whenever the situation improves! pic.twitter.com/7DfEFTF9gp — Sithara Entertainments (@SitharaEnts) January 31, 2022 -
ఊ అంటావా.. ఊహూ అంటావా .. కరోనా
ఊ అంటావా కరోనా.. ఊహూ అంటావా కరోనా... రమ్మంటావా కరోనా.. రావొద్దంటావా కరోనా.. రెండేళ్లుగా సినిమాల విడుదల విషయంలో కరోనా ఇలానే దోబూచులాడుతోంది. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుని, తెరపై ప్రత్యక్షమవడమే ఆలస్యం అనుకునే టైమ్‌లో కరోనా విజృంభించి ‘ఊహూ’ అంటోంది... ‘రావద్దంటోంది’. కరోనా ఎఫెక్ట్‌తో జనవరి, ఫిబ్రవరి నెలల్లో రావాల్సిన సినిమాలు ఏప్రిల్‌కి వాయిదా పడ్డాయి. అయితే ఆరేడు సినిమాల వరకూ పెద్దవే కావడంతో డేట్ల సర్దుబాబు, థియేటర్ల సర్దుబాటు... ఇలా ఎన్నో సర్దుబాట్లు అవసరం. మరి.. అన్ని సర్దుబాట్లూ చేసుకుని తీరా రిలీజ్ టైమ్‌కి కరోనా ‘ఊ’ అంటుందా... ‘రావొద్దు’ అంటుందా అనేది సమ్మర్లో తెలుస్తుంది. ఇక సమ్మర్లో మెయిన్ సీజన్ అయిన ఏప్రిల్‌లో విడుదల కానున్న సినిమాలేంటో చూద్దాం. ఏప్రిల్ ఎండలు పుంజుకునే టైమ్‌కి నెల తొలి రోజే రావడానికి రెడీ అవుతున్నాడు ‘ఆచార్య’. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు ఈ సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ సినిమా ఉగాది సందర్భంగా ఏప్రిల్ 1న విడుదల కానుంది. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటించగా, రామ్‌చరణ్, పూజా హెగ్డే ఓ జంటగా చేశారు. రామ్‌చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మించారు. ఇదిలా ఉంటే.. ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న రిలీజ్‌కు ప్రకటించక ముందే ఇదే తేదీని ముందుగా బుక్ చేసుకుంది ‘సర్కారువారి పాట’ చిత్రం. మహేశ్‌బాబు హీరోగా పరశురామ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కీర్తీ సురేష్ కథానాయిక. నవీన్ ఎర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఇటీవల మహేశ్ కాలికి సర్జరీ జరగడం, ఆ తర్వాత కరోనా బారిన పడటం, అలాగే ఈ చిత్రానికి చెందిన కొందరు సాంకేతిక నిపుణులు కూడా కోవిడ్ బారిన పడటంతో ‘సర్కారువారి పాట’ చిత్రం విడుదల ఆగస్టుకు వాయిదా పడుతుందనే వార్తలు వినిపించాయి. కానీ ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1నే విడుదల చేసే సాధ్యాసాధ్యాలను ఈ చిత్రం యూనిట్ పరిశీలిస్తోందని తెలిసింది. మరి.. ఏప్రిల్ 1నే ‘ఆచార్య’, ‘సర్కారువారి పాట’ విడుదలవుతాయా? ఏదైనా చిత్రం వాయిదా పడుతుందా? మరోవైపు ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యేందుకు ‘కేజీఎఫ్ 2’ ఆల్రెడీ కర్చీఫ్ వేసింది. యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్: చాఫ్టర్ 1’కు కొనసాగింపుగా ‘కేజీఎఫ్ 2’ వస్తోంది. విజయ్ కిరగందూర్ నిర్మించారు. ఇక ఇదే నిర్మాత నిర్మిస్తోన్న మరో భారీ చిత్రం ‘సలార్’ కూడా ఏప్రిల్ 14 విడుదల జాబితాలో ఉంది. ఈ తేదీని చిత్రబృందం ఎప్పుడో ప్రకటించింది. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. అయితే ‘కేజీఎఫ్: చాప్టర్ 2’, ‘సలార్’ చిత్రాలకు ఒకే నిర్మాత, ఒకే దర్శకుడు కాబట్టి, పైగా ‘కేజీఎఫ్ 2’తో పోల్చితే ‘సలార్’ షూటింగ్ ఇంకా చాలా ఉంది కాబట్టి ఈ చిత్రం వాయిదా పడుతుందనే ప్రచారం సాగుతోంది. ‘సలార్’ దసరాకు విడుదలయ్యే చాన్స్ ఉందనే వార్తలు వస్తున్నాయి. కాగా ఏప్రిల్ 14నే నాగచైతన్య తెరపై కనిపించనున్నారు. కానీ నాగచైతన్య హీరోగా చేసిన చిత్రంతో కాదు. బాలీవుడ్లో ఆమిర్ ఖాన్ హీరోగా అద్వైత్ చందన్ దర్శకత్వంలో రూపొందిన ‘లాల్‌సింగ్ చద్దా’లో నాగచైతన్య ఓ కీ రోల్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 14న హిందీతోపాటు తెలుగులోనూ విడుదల కానుంది. ఇంకోవైపు సంక్రాంతి నుంచి ఫిబ్రవరికి, ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కు వాయిదా çపడిన చిత్రం ‘ఎఫ్ 3’. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఎఫ్ 3’. వెంకీ–వరుణ్–అనిల్ కాంబినేషన్లో వచ్చిన ‘ఎఫ్ 2’కి సీక్వెల్‌గా ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ‘ఎఫ్ 3’ ఏప్రిల్ 29న థియేటర్స్‌కు రానుంది. నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ కూడా ఇదే తేదీన విడుదలకు రెడీ అవుతోంది. ఎమ్ఎస్ రాజశేఖర రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కృతీ శెట్టి హీరోయిన్. ఇక సమంత నటించిన తొలి మైథలాజికల్ ఫిల్మ్ ‘శాకుంతలం’ కూడా సమ్మర్ లిస్ట్‌లోనే ఉంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు చిత్రనిర్మాతలు ‘దిల్’ రాజు, నీలిమ గుణ తేదీలు పరిశీలిస్తున్నారని సమాచారం. ఇవే కాదు.. మరికొన్ని మీడియమ్, స్మాల్ బడ్జెట్ చిత్రాలు కూడా ఏప్రిల్ రిలీజ్‌ను టార్గెట్ చేసుకుంటున్నాయి. మరి.. సెలవులను క్యాష్ చేసుకోవడానికి ఏప్రిల్ మంచి సీజన్ కదా. ఏప్రిల్ వైపు ‘ఆర్ఆర్ఆర్’ చూపు? ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ప్యాన్ ఇండియన్ మూవీ ‘రౌద్రం.. రణం.. రుధిరం’ (ఆర్ఆర్ఆర్). ఇప్పటికే నాలుగుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం నెక్ట్స్ రిలీజ్ ఎప్పుడు అనే విషయంపై అన్ని ఇండస్ట్రీస్‌లో చర్చ జరుగుతోంది. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని ఏప్రిల్ 29న విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్‌ను కన్ఫార్మ్ చేసుకుంటే ‘ఎఫ్ 3’, ‘మాచర్ల నియోజకవర్గం’ చిత్రాల విడుదల్లో మార్పు జరిగే అవకాశం ఉంటుందని ఊహించవచ్చు. వేసవిలో తెలుగు సినిమాలతో పాటు తమిళ అనువాద చిత్రాలు కూడా విడుదలవుతుంటాయి. ఈ వేసవికి కమల్‌హాసన్ ‘విక్రమ్’, విజయ్ ‘బీస్ట్’, దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. వీటిలో ముందుగా విజయ్ ‘బీస్ట్’ ఏప్రిల్ 14న విడుదల అవుతుందని కోలీవుడ్ టాక్. రిలీజ్ డేట్ చెప్పలేదు కానీ ‘విక్రమ్’ కూడా ఏప్రిల్‌లోనే రానున్నట్లు తెలిసింది. విక్రమ్, కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్ తదితరులు నటించిన ‘పొన్నియిన్ సెల్వన్’ తొలి పార్ట్ వేసవిలోనే రిలీజ్ కానుంది. అయితే రిలీజ్ తేదీపై స్పష్టత రావాల్సి ఉంది. -
టాలీవుడ్, బాలీవుడ్ల మధ్య క్లాష్ తప్పదా..
కోవిడ్ వల్ల సినిమా షూటింగ్ షెడ్యూల్స్, రిలీజ్ డేట్స్ అన్నీ తారుమారు అయిపోయాయి. విడుదల కావాల్సిన సినిమాల సంఖ్య అలా పెరిగిపోయింది. దీంతో రిలీజ్ డేట్స్ బుక్ చేసుకోవడం కీలకమైంది. ఎంత ముందు బుక్ చేసుకున్నా క్లాష్ అనివార్యంలా కనిపిస్తోంది. సౌత్‌లో తెరకెక్కుతున్న పలు భారీ సినిమాలన్నింటినీ ప్యాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో సౌత్‌లో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా సినిమాలు, హిందీ సినిమాల రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ఏర్పడుతోంది. ఇప్పటి వరకూ ప్రకటించిన చిత్రాల్లో సౌత్ వర్సెస్ నార్త్ క్లాష్ వివరాలు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న మన సౌత్ సినిమాలకు క్లాష్ వల్ల ఏదైనా మైనస్ ఉంటుందా? థియేటర్స్ విషయంలో ఏదైనా ఇబ్బంది ఏర్పడుతుందా? నార్త్ ఆడియన్స్ కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చి ఏ సినిమా బావుంటే అది చూస్తారా? లేక హిందీ సినిమాలకే ఓటు వేస్తారా? క్లాష్ అంటే బిజినెస్‌ని షేర్ చేసుకున్నట్టే. మరి బిజినెస్‌ని షేర్ చేసుకుంటారా? లేక కలిసి కూర్చుని మాట్లాడుకుని, ఒకేసారి కాకుండా డేట్స్‌ని మార్చుకుంటారా చూడాలి. ఆర్ఆర్ఆర్ వర్సెస్ మైదాన్ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దసరా స్పెషల్‌గా అక్టోబర్ 13న విడుదల చేసున్నట్టు ఇటీవలే ప్రకటించారు. దసరా వీకెండ్‌కి హిందీలో అజయ్ దేవగణ్ నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘మైదాన్’ కూడా విడుదల కాబోతోంది. బోనీ కపూర్ ఈ సినిమా నిర్మాత. అక్టోబర్ 15న మైదాన్ రిలీజ్. ‘‘కోవిడ్ వల్ల ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. మా సినిమా రిలీజ్ డేట్ ఇచ్చిన తర్వాత కూడా ‘ఆర్ఆర్ఆర్’ వాళ్లు రిలీజ్ డేట్ ఇవ్వడం సరైనదిగా అనిపించడంలేదు’ అని బోనీకపూర్ బాలీవుడ్ మీడియాతో పేర్కొన్నారు. విశేషం ఏంటంటే.. ‘ఆర్ఆర్ఆర్’లో అజయ్ దేవగణ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ వర్సెస్ గంగూబాయి ప్రభాస్ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రం ‘రాధేశ్యామ్’. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను జూలై 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడు అదే తేదీకి ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘గంగూబాయి కతియావాడి’ని రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ‘పద్మావత్’ చిత్రం తర్వాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇది. ఇందులో వేశ్య పాత్రలో నటించారు ఆలియా. పుష్ప వర్సెస్ అటాక్ అల్లు అర్జున్ తొలి ప్యాన్ ఇండియన్ చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఇండిపెండెన్స్ వీక్కి ఆగస్ట్ 12న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. హిందీ సినిమాల్లో ఇండిపెండెన్స్ వీక్ కూడా కీలకమైనదే. ఈ ఇండిపెండెన్స్ డే వీక్‌కు వస్తున్నట్టు జాన్ అబ్రహామ్ ప్రకటించారు. తన తాజా చిత్రం ‘అటాక్’ని ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. మేజర్ వర్సెస్ షేర్షా ముంబై తాజ్ అటాక్స్‌లో మరణించిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. కథను అందించి, టైటిల్ రోల్ చేశారు అడివి శేష్. శశి కిరణ్ తిక్క దర్శకుడు. ఈ సినిమా జూన్ 2న విడుదల కానుంది. అదే రోజున సిద్ధార్థ్ మల్హోత్రా నటించిన ‘షేర్షా’ రిలీజ్ కానుంది. ఆర్మీ కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. తమిళ దర్శకుడు విష్ణువర్ధన్ హిందీలో చేసిన తొలి చిత్రమిది. కరణ్ జోహార్ నిర్మించారు. మేజర్, షేర్షా.. రెండూ బయోగ్రఫీ జానర్ కావడం విశేషం. లైగర్ వర్సెస్ భూత్ పోలీస్ పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్లో వస్తున్న ప్యాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. కరణ్ జోహార్, చార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్ హీరోలుగా తెరకెక్కుతున్న హారర్ కామెడీ చిత్రం ‘భూత్ పోలీస్’. ఈ సినిమా సెప్టెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది. -
ఇవన్నీ సిద్ధం.. మీరు సిద్ధమా?
థియేటర్స్‌లో సినిమాలు లేక 2020 వెలవెలబోయింది. 2021 కొత్త చిత్రాల రిలీజులతో జోరుగా హుషారుగా ఉండబోతోంది. గత ఏడాది మిస్సయిన మజాని రెండింతలు ఈ ఏడాది ఇవ్వబోతోంది. స్టార్స్ అందరూ తమ చిత్రాలను థియేటర్స్‌కు తీసుకొచ్చే డేట్స్ ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాల విడుదల తేదీలు వచ్చాయి. తాజాగా మరిన్ని అప్ డేట్స్ వచ్చాయి. వేసవి నుంచి దసరా వరకూ ఒక్కో డేట్‌ను ఒక్కో సినిమా తీసుకుంది. ఆ విశేషాలు. ట్రిపుల్ ఫన్ ‘ఎఫ్2’తో డబుల్ ఫన్ ఇచ్చాం. ఇప్పుడు ట్రిపుల్ ఫన్ ఇవ్వడానికి రెడీ అయ్యాం అంటోంది ‘ఎఫ్ 3’ చిత్రబృందం. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎఫ్ 3’. ‘ఎఫ్ 2’ (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) చిత్రానికి ఇది సీక్వెల్. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ సీక్వెల్లో కో బ్రదర్స్ వెంకీ, వరుణ్ డబ్బు సంపాదించడం మీద ఎక్కవ దృష్టి పెడతారట. ఈ సినిమాను ఆగస్ట్ 27న విడుదల చేస్తున్నట్టు తెలిపారు. పుష్పరాజ్ వేట త్వరలో.. అల్లు అర్జున్, సుకుమార్‌ది స్పెషల్ కాంబినేషన్. వీరిద్దరూ గతంలో ‘ఆర్య, ఆర్య 2’ సినిమాలు చేశారు. తాజాగా ‘పుష్ప’ సినిమా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. రష్మికా మందన్నా కథానాయిక. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు. ఈ సినిమాను ఆగస్ట్ 13న విడుదల చేస్తున్నారు. ‘పుష్పరాజ్ వేట త్వరలోనే ఆరంభం’ అంటూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. కూత మొదలు ‘సీటీమార్’ కోసం కబడ్డీ కోచ్‌గా మారారు గోపీచంద్. ఏప్రిల్ 2నుంచి థియేటర్స్‌లో కూత మొదలవుతుందట. సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్, తమన్నా జంటగా తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘సీటీమార్’. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 2న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ‘‘గోపీచంద్ కెరీర్లోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. రెండు పాటల మినహా చిత్రీకరణ పూర్తయింది’’ అని చిత్రబృందం పేర్కొంది. కపటధారి రెడీ? క్రైమ్‌ని పరిష్కరించేందుకు ట్రాఫిక్ పోలీస్ సుమంత్ సిద్ధమయ్యారు. సుమంత్, నందితా శ్వేత జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కపటధారి’. ఇందులో సుమంత్ ట్రాఫిక్ పోలీస్‌గా కనిపించనున్నారు. నాజర్, ‘వెన్నెల’ కిశోర్ ముఖ్య పాత్రల్లో నటించారు. కన్నడ చిత్రం ‘కవులుదారి’కి ఇది తెలుగు రీమేక్. ఫిబ్రవరి 26న ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు తెలిపారు. గని రెడీ బాక్సర్ గని తన పంచ్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతున్నారు. జూలైలో తన పంచ్ పవర్ చూపించనున్నారు. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్‌తేజ్ నటిస్తున్న చిత్రం ‘గని’. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్‌గా కనిపించనున్నారు. అల్లు బాబీ, సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ భామ సయీ మంజ్రేకర్ కథానాయిక. ఉపేంద్ర, సునీల్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. జూలై 30న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. రాధాకృష్ణ ‘ఢమరుకం’ ఫేమ్ శ్రీనివాసరెడ్డి స్క్రీన్ ప్లే, దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘రాధాకృష్ణ’. అనురాగ్, ముస్కాన్ సేథీ జంటగా టి.డి. ప్రసాద్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ పార్వతి ఓ కీలక పాత్రలో నటించారు. పుష్పాల సాగరిక నిర్మించారు. నిర్మల్ బొమ్మలు తయారు చేసే కళాకారుల సమస్యల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఫిబ్రవరి 5న ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కామ్రేడ్ రవన్న వస్తున్నాడు ప్రజల సమస్యలపై పోరాడటానికి కామ్రేడ్ రవన్న అయ్యారు రానా దగ్గుబాటి. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా చేస్తున్న చిత్రం ‘విరాట పర్వం’. నక్సలిజమ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి పల్లవి కథానాయిక. ప్రియమణి, నందితా దాస్, ఈశ్వరీరావ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. నివేదా పేతురాజ్ అతిథి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో నక్సలైట్ పాత్రలో కనిపిస్తారు రానా. సుధాకర్ చెరుకూరి నిర్మాత. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. -
సినిమాల విడుదల తేదీలన్నీ తారుమారు
హాలీవుడ్లో భారీ బడ్జెట్ సినిమాలన్నింటికీ షూటింగ్ ప్రారంభించక ముందే దాదాపు విడుదల తేదీ ప్రకటిస్తుంటారు. సీజన్లు, మార్కెట్లు అన్నీ లెక్క చూసుకుని తేదీ ఫిక్స్ చేస్తారు.. పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు తమ సినిమాల విడుదల తేదీలను క్యాలెండర్లో బ్లాక్ చేసుకుంటాయి... ఇక ఏ మార్పు ఉండదన్నట్టుగా. కానీ కరోనా వల్ల హాలీవుడ్ చిత్రాల విడుదల తేదీలన్నీ తారుమారయ్యాయి. ఈ అనిశ్చితి ఎందాకో తెలియక ఒక్కొక్కటిగా సినిమాలు వెనక్కి వెళ్తున్నాయి. విడుదల తేదీలకు వీలైనంత దూరం పాటిస్తున్నాయి. కొత్త సినిమాలు తెరల్ని తాకడానికి సంకోచిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. తాజాగా మరికొన్ని సినిమాల విడుదల తేదీల్ని మార్చారు. ఆ కబుర్లు. కరోనా ఉన్నప్పటికీ థియేటర్స్‌ను తెరిచి ప్రేక్షకులను రప్పించాలనుకున్నాయి హాలీవుడ్ నిర్మాణ సంస్థలు. ఈ నేపథ్యంలో క్రిస్టోఫర్ నోలన్ తీసిన భారీ చిత్రం ‘టెనెట్’ను విడుదల చేశారు. కానీ ఈ సినిమా కలెక్షన్లు ఆశించినంత లేకపోవడం, పూర్తి స్థాయిగా థియేటర్స్ తెరుచుకోకపోవడంతో నిర్మాతలు వెనక్కి తగ్గారు. విడుదల తేదీలను మార్చేసుకుంటున్నాయి నిర్మాణ సంస్థలు. బ్లాక్ విడో మార్వెల్ సూపర్ హీరో సినిమాలను చూసేవాళ్లకు బ్లాక్ విడో పరిచయం అక్కర్లేదు. ‘అవెంజర్స్’ బృందంలో ఒక కీలక పాత్రధారి. తాజాగా ఈ బ్లాక్విడోకు సంబంధించిన కథతో సోలో సూపర్‌హీరో మూవీతో వస్తున్నారు హాలీవుడ్ బ్యూటీ స్కార్లెట్ జాన్సన్. ఈ సినిమా ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కావాలి. కానీ బ్లాక్‌విడో ఆ రోజు రావడంలేదు. వచ్చే ఏడాది మే7న విడుదల కానుంది. వెస్ట్ సైడ్ స్టోరీ హాలీవుడ్ దర్శకధీరుడు స్టీవెన్ స్పీల్బర్గ్ మ్యూజికల్ బ్యాక్‌డ్రాప్ తప్ప దాదాపుగా అన్ని జానర్లలో సినిమాలు తెరకెక్కించారు. మొదటిసారిగా ‘వెస్ట్ సైడ్ స్టోరీ’ టైటిల్‌తో ఓ మ్యూజికల్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కావాలి. అయితే ఏకంగా ఏడాదికి వాయిదా వేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ 10న థియేటర్స్‌లోకి రానుంది. డెత్ ఆన్ ది నైల్ ‘ది డెత్ ఆన్ ది నైల్’ నవల ఆధారంగా అదే పేరుతో ఓ హాలీవుడ్ చిత్రం తెరకెక్కింది. మార్గట్ రాబీ, గాల్ గాడోట్ ముఖ్య పాత్రల్లో నటించారు. హిందీ నటుడు అలీ ఫాజల్ ఓ కీలక పాత్ర చేశారు. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 23న విడుదల కావాలి. ఇప్పుడు డిసెంబర్ 18కి వాయిదా పడింది. ఎటర్నల్స్ – షాంగ్ చీ మార్వెల్ నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ‘ఎటర్నల్స్, షాంగ్ చీ’ చిత్రాలు కూడా కొన్ని నెలల పాటు వాయిదా పడ్డాయి. ఏంజెలినా జోలీ, రిచర్డ్ మాడన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘ఎటర్నల్స్’ వచ్చే ఏడాది ఫి్ర» వరి12న విడుదల కావాలి. ఇప్పుడు నవంబర్ 5కి వాయిదా వేశారు. అలాగే ‘షాంగ్ చీ’ చిత్రం 2021 మే 7 నుంచి 2021 జూలై 2కి వాయిదా పడింది. మరి కొత్తగా ప్రకటించిన తేదీల్లో అయినా సినిమాలు థియేటర్లకు వస్తాయా? పరిస్థితి ఇంతే ఉంటే మళ్లీ తేదీలు అటూ ఇటూ అవుతాయా? వేచి చూడాలి. -
తేదీలు తారుమారు
కరోనా వల్ల ఏర్పడ్డ అయోమయం ఇంకా కొనసాగుతూనే ఉంది. థియేటర్ల తాళం ఎప్పుడు తీస్తారో తెలియదు. రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేకొద్దీ సినిమాలు మరింత దూరం జరుగుతున్నాయి. ఈ ఏడాది రెండో భాగం కళకళలాడుతుంది అనుకున్న హాలీవుడ్ వెలవెలబోయింది. భారీ సినిమాలన్నీ మరోసారి విడుదల తేదీలు తారుమారు అయ్యాయి. అంతరాయాల అవతార్ 2009లో వచ్చిన ప్రపంచ బ్లాక్ బస్టర్‘అవతార్’కి ఒకటి కాదు నాలుగు సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు జేమ్స్ కేమరూన్. 2020, 2021, 2022.. ఇలా ఒక్కో సీక్వెల్‌ని ఒక్కో ఏడాది విడుదల చేయాలనుకున్నారు. సీక్వెల్స్ చిత్రీకరణ ప్రారంభించినప్పటి నుంచి విడుదల ఏదో ఒక కారణంగా వాయిదా పడుతూనే ఉంది. లాక్ డౌన్ తర్వాత షూటింగ్ మొదలుపెట్టిన మొదటి భారీ చిత్రం కూడా ఇదే. అనుకున్న సమయానికే వస్తాం అని నమ్మకం కూడా వ్యక్తం చేశారు. అయితే లాస్ ఏంజెల్స్‌లో పోస్ట్ ప్రొడక్షన్ పని కుదిరేలా లేదని, వాయిదా అనివార్యం అయిందని చిత్రబృందం తెలిపింది. దీంతో ముందుగా అనుకున్న సీక్వెల్స్ విడుదల తేదీలన్నీ ఓ ఏడాదికి వాయిదా పడ్డాయి. స్టార్‌వార్స్ ఇప్పట్లో లేనట్టే బ్లాక్‌బస్టర్ హిట్ సిరీస్ స్టార్ వార్స్ ఫ్రాంచైజీలో మరో మూడు సినిమాలను ప్రకటించింది నిర్మాణ సంస్థ డిస్నీ. అయితే ఈ చిత్రాలు కుడా అనుకున్న తేదీ కంటే ఓ ఏడాది వెనక్కి వెళ్లాయి. స్టార్ వార్స్ కొత్త సిరీస్ చిత్రాలకు పేర్లు ఇంకా ప్రకటించలేదు. వాయిదాల జాబితాలో... ఈ ఏడాది వేసవిలో టామ్ క్రూజ్ నటించిన ‘టాప్ గన్ – మావరిక్’ విడుదల కావాల్సింది. కానీ కాలేదు. ఇంకా ‘ఏ క్వైట్ ప్లేస్’ సీక్వెల్ కూడా విడుదల కావాల్సి ఉంది. ఇది కూడా వాయిదా పడింది. యాక్షన్ చిత్రం ‘మూలాన్’, క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ‘టెనెట్’, వెస్ యాండర్ సన్ తెరకెక్కించిన ‘ఫ్రెంచ్ డిస్పాచ్’ చిత్రాలు వాయిదా పడ్డాయి. చెప్పిన తేదీకి రావడం లేదంటున్న ఈ చిత్రాల నిర్మాతలు వాయిదా వేసిన తేదీని మాత్రం చెప్పలేదు. మరి.. థియేటర్లు ఎప్పుడు రీ ఓపెన్ అవుతాయో తెలియదు.. తెరిచాక ప్రేక్షకులు వస్తారా? లేదా అనే విషయంలో స్పష్టత లేదు. ఇక విడుదల తేదీ విషయంలో ఏం క్లారిటీ ఇవ్వగలం అంటున్నారు. జేమ్స్ బాండ్ ‘నో టైమ్ టు డై’ని గత ఏడాది నవంబర్‌లో విడుదల చేయాలనుకున్నారు. వాయిదా పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుకున్నారు టైమ్ కి రాలేదు. ఫిబ్రవరిలోనే ఏప్రిల్ కి వచ్చేస్తాం అన్నారు.. అప్పటికి థియేటర్లు మూతపడ్డాయి. ఈ ఏడాది నవంబర్‌కి వస్తాం అంటున్నారు. కానీ పరిస్థితులను చూస్తుంటే మళ్లీ టైమ్ తప్పేట్లు ఉంది. -
సంక్రాంతి వార్: మారిన రిలీజ్ డేట్స్
హైదరాబాద్ : స్టార్ హీరోల సినిమాలను సంక్రాంతి సీజన్లో రిలీజ్ చేసి వీలైనంత సొమ్ము చేసుకోవాలని అగ్ర నిర్మాతలు పోటీ పడుతుంటారు. సంక్రాంతికి రెండు, మూడు సినిమాలు పోటాపోటీగా రిలీజైనా అన్ని సినిమాలు మెరుగైన వసూళ్లు సాధించే స్పేస్ ఉంటుందని చెబుతారు. అయితే ఒకే రోజు ఇద్దరు అగ్రహీరోలు నటించిన సినిమాలు విడుదలైతే మాత్రం అది ఓపెనింగ్స్‌పై ప్రభావం చూపుతుందని, లాంగ్‌రన్‌లోనూ వసూళ్లు ఎఫెక్ట్ అవుతాయనే ఆందోళనా వ్యక్తమవుతుంది. రానున్న సంక్రాంతికి ప్రిన్స్ మహేష్ సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో జనవరి 12న రిలీజ్ డేట్‌ను లాక్ చేశాయి. బన్నీ, ప్రిన్స్‌ల బాక్సాఫీస్ క్లాష్‌పై బయ్యర్లతో పాటు ఫ్యాన్స్‌లోనూ ఆందోళన రేకెత్తడంతో విడుదల తేదీలపై నిర్మాతలు పునరాలోచనలో పడ్డారు. ఈ రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే ఓపెనింగ్స్‌తో పాటు నెగెటివ్, మిక్స్డ్ టాక్ వచ్చిన సినిమా వసూళ్లు దెబ్బతింటాయనే భయం వెంటాడుతోంది. భారీ మొత్తాలు వెచ్చించి సినిమాలను కొనుగోలు చేసే బయ్యర్లకు అంత భారీ మొత్తం రికవర్ కావాలంటే రెండు సినిమాల మధ్య గ్యాప్ ఉండాలని భావిస్తున్నారు. విడుదల తేదీ వివాదంపై ఇటీవల సమావేశమైన ఇరువురు నిర్మాతలు చర్చించి రిలీజ్ డేట్స్‌ను మార్చినట్టు చెబుతున్నారు. తాజా సమాచారం ప్రకారం అల వైకుంఠపురములో, సరిలేరునీకెవ్వరూ చిత్రాలు వరుసగా జనవరి 11, 13 తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. విడుదల తేదీలపై ఆయా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. రెండు భారీ చిత్రాలు ఒకేరోజు తలపడకుండా రెండు రోజుల గ్యాప్‌తో రానుండటంతో ఇరు సినిమాలు భారీ వసూళ్లను కొల్లగొడతాయని మేకర్లు భావిస్తున్నారు. -
డబుల్ ధమాకా
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు నవీన్ ఎర్నేని, చెరుకూరి మోహన్, వై. రవి శంకర్ సినీ లవర్స్‌కు ఒకే రోజు డబుల్ ధమాకా ఇచ్చారు. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, నాగచైతన్య ’సవ్యసాచి’ సినిమాల విడుదల తేదీలను ఒకే రోజున అధికారికంగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశారు. ‘‘ఈ ఏడాది తొలి అర్ధభాగంలో మా బ్యానర్లో విడుదలైన ‘రంగస్థలం’ చిత్రం మంచి హిట్ సాధించింది. మా సక్సెస్ఫుల్ జర్నీలో భాగస్వాములైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. మీరు ఇచ్చిన ఈ విజయాలు మా బాధ్యతను మరింత పెంచుతున్నాయి. అలాగే మా సంస్థ నుంచి వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’, ‘సవ్యసాచి’ సినిమాల రిలీజ్ డేట్స్‌ను ప్రకటించడం చాలా ఆనందంగా ఉంది. రవితేజ, ఇలియానా జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతోన్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాను అక్టోబర్ 5న, నాగచైతన్య, నిధి అగర్వాల్ జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సవ్యసాచి’ సినిమాను నవంబర్ 2న విడుదల చేయబోతున్నాం’’ అని పేర్కొన్నారు మైత్రీమూవీ మేకర్స్ ప్రతినిధులు. -
రైతన్నకు తీపి కబురు
సాక్షి, న్యూఢిల్లీ: దేశానికి వెన్నెముకైన రైతన్నలకు సంతోషాన్నిచ్చే కబురును భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం చెప్పింది. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణ వర్షపాతాన్ని తెస్తాయని వెల్లడించింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజే రమేశ్ వాతావరణ విభాగం తొలివిడత అంచనాలను విడుదల చేశారు. రెండో అంచనాలను జూన్ ప్రారంభంలో, రుతుపవనాల ప్రారంభాన్ని మే మాసంలో వెల్లడిస్తారు. సాధారణంగా జూన్ 1కి నాలుగు రోజులు అటుఇటుగా రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయి. రమేశ్ మాట్లాడుతూ ‘2018 నైరుతి రుతుపవనాల కాలంలో జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య వర్షపాతం సాధారణంగా ఉంటుంది. 2016, 2017 సీజన్లలాగే విస్తృతంగా వర్షాలు పడి రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాం. దీర్ఘకాలిక సగటు వర్షపాతంతో పోలిస్తే ఈ ఏడాది 97 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. ఈ అంచనా వాస్తవంలో ఐదు శాతం తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. 1951 నుంచి 2000 వరకు చూస్తే దీర్ఘకాలిక సగటు వర్షపాతం 890 మి.మీ.’ అని చెప్పారు. వాన రోజులు తగ్గుతున్నాయి జాగ్రత్త! గ్లోబల్ వార్మింగ్ కారణంగా గత కొన్నేళ్లుగా వర్షాలు పడే రోజులు తగ్గుతున్నాయనీ, నీటి సంరక్షణ, నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని రమేశ్ సూచించారు. ‘ఒక ఏడాదిలో వర్షం కురిసే రోజుల సంఖ్య గతంలో కంటే తగ్గుతోంది. ఈ పరిస్థితుల్లో వాననీటిని ఒడిసిపట్టుకునేందుకు నీటి సంరక్షణ పద్ధతులను మెరుగ్గా పాటించాలి. నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీర్ఘకాల సగటులో 96% వర్షం కురుస్తుందని గతేడాది మేం అంచనా వేసినా మధ్య భారతంలో కొన్ని రోజులు వర్షాలు పడలేదు. సెప్టెంబరు ఆఖరు వరకు చూస్తే 95% వర్షపాతమే నమోదైంది. అయితే అక్టోబరు మొదటి వారంలో మరికొంత వర్షం పడటంతో మా అంచనాలు నిజమయ్యాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది ఒక శాతం ఎక్కువగానే మా అంచనాలు ఉన్నాయి’ అని రమేశ్ వివరించారు. పరిస్థితులు అనుకూలం: గత ఏడాది ఓ మోస్తరుగా ఉన్న లా నినా పరిస్థితులు ఈ ఏడాది ప్రారంభంలో బలహీనపడ్డాయనీ, రుతుపవనాల సీజన్ ప్రారంభమయ్యే నాటికి తటస్థ పరిస్థితికి వచ్చే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలిపారు. ‘ఈ ఏడాది రుతుపవనాలు ప్రారంభమయ్యేనాటికి లా నినా తటస్థంగా ఉండే అవకాశం ఉంది. ఎల్‌నినో పరిస్థితులకు అవకాశం లేదు’ అని చెప్పారు. ఈ అంచనాలు నిజమైతే దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుందనీ, జీడీపీ వృద్ధిరేటు కూడా పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 27.75 కోట్ల టన్నుల ధాన్యాల దిగుబడి జరగ్గా.. వర్షాలు బాగా కురిస్తే వచ్చే ఏడాది ఉత్పత్తి అంతకు దాటి పోవచ్చని వ్యవసాయ శాఖ కార్యదర్శి పట్నాయక్ చెప్పారు. 50 శాతానికిపైగా రైతులు వర్షాధారిత సాగు చేస్తుండటంతో వారి దిగుబడి పెరిగి తద్వారా కొనుగోలు శక్తి కూడా పెరిగి ఆర్థిక వ్యవస్థకు మేలు జరుగుతుందని అంటున్నారు. -
సంక్రాంతి బరిలో పద్మావతి
సాక్షి,ముంబయి: వివాదాలు చుట్టుముట్టి వాయిదా పడిన సంజయ్ లీలా భన్సాలి చారిత్రక దృశ్యకావ్యం పద్మావతి విడుదలపై త్వరలో స్పష్టత రానుంది. దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్, షాహిద్ కపూర్లు నటించిన పద్మావతి డిసెంబర్ 1న విడుదల కావాల్సి ఉండగా నిరసనకారుల ఆందోళనలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు మూవీపై నిషేధం విధించడంతో సినిమా రిలీజ్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అయితే జనవరి మొదటి వారం లేదా రెండోవారంలో పద్మావతి విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. గుజరాత్ ఎన్నికలు ముగిసిన వెంటనే విడుదల తేదీని ప్రకటించాలని నిర్మాతలు భావిస్తున్నట్టు సమాచారం.ఈలోగా సీబీఎఫ్సీ స్పందన వెల్లడయ్యే అవకాశం ఉంది. ఎన్నికలు పూర్తయి, సీబీఎఫ్సీ సర్టిఫికేషన్ రాగానే ప్రపంచవ్యాప్తంగా పద్మావతిని అత్యధిక స్క్రీన్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.జనవరి మొదటి, రెండవ వారంలో భారీ సినిమాలు లేకపోవడంతో ఆ వ్యవధిలో పద్మావతిని థియేటర్లలోకి దింపేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. -
డేట్స్ క్లాష్ వద్దు గురూ!
సినిమా విడుదలైందా? వారంలోపే వసూళ్లు రాబట్టేశామా? అన్న చందంగా ప్రస్తుతం సినిమా మార్కెట్ ఉంది. వారం, పది రోజుల్లోనే వసూళ్లు రాబట్టేయాలంటే అత్యధిక థియేటర్లలో సినిమాను విడుదల చేయాలి. ఫలితంగా వేరే సినిమాకు థియేటర్లు అంతగా దక్కవు. మరి, ఒకేరోజు రెండు, మూడు పెద్ద సినిమాలంటే థియేటర్లు కష్టమే. అదేగనక నిర్మాతలందరూ ఒక అవగాహనతో ఉంటే... కలిసి మాట్లాడుకుంటే... ఏ సినిమాకీ నష్టం కలగని రీతిలో రిలీజ్లు ప్లాన్ చేయొచ్చు. ‘బాహుబలి’ కోసం ‘శ్రీమంతుడు’ విడుదలను వాయిదా వేసుకొన్న విషయం తెలిసిందే. రానున్న ఇరవై రోజుల్లో విడుదల కావాల్సిన మూడు సినిమాల విడుదల తేదీల విషయంలో ఇప్పుడిదే జరిగింది. ఆ చిత్ర నిర్మాతలు మాట్లాడుకొని, తమలో తాము పోటీ పడకుండా... తమ చిత్రాల రిలీజ్ డేట్స్ మార్చుకున్నారు. ఆ విశేషాల్లోకి వస్తే... ఈ 27నే... ‘సైజ్ జీరో’ ఈ మధ్యకాలంలో భారీ ఎత్తున అంచనాలు నెలకొన్న చిత్రాల్లో ‘సైజ్ జీరో’ ఒకటి. ఈ చిత్రం కోసం అనుష్క బరువు పెరగడం ప్రధాన ఆకర్షణ. ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఆర్య, అనుష్క కాంబినేషన్లో ప్రసాద్ వి. పొట్లూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. వాస్తవానికి అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నారు. కానీ, అనుష్క నటించిన ‘రుద్రమదేవి’ని కూడా చిత్ర దర్శక-నిర్మాత గుణశేఖర్ అదే సమయంలో విడుదల చేయాలనుకోవడంతో ‘సైజ్ జీరో’ను వాయిదా వేశారు ప్రసాద్ వి. పొట్లూరి. ఆ వెనువెంటనే రావడానికి రామ్‌చరణ్ ‘బ్రూస్లీ’, అక్కినేని అఖిల్ పరిచయ చిత్రం ‘అఖిల్’ ఇవన్నీ ఉండడంతో ‘సైజ్ జీరో’ ఆగాల్సి వచ్చింది. దాంతో, నవంబర్ 27న విడుదల చేస్తున్నట్లు అప్పుడే పీవీపీ ప్రకటించారు. ఇప్పుడు ఆ రిలీజ్ డేటే సినిమాకు ఖాయమైంది. డిసెంబర్ 10కి మారిన ‘బెంగాల్ టైగర్’ వాస్తవానికి ఈ నెల 26, 27తేదీల్లో ఒక రోజున ‘బెంగాల్ టైగర్’ను విడుదల చేయాలని ఆ చిత్ర నిర్మాత కేకే రాధామోహన్ అనుకున్నారు. కానీ, సరిగ్గా అప్పుడే ‘సైజ్ జీరో’ ఉంది. ‘బెంగాల్ టైగర్’ను దర్శకుడు సంపత్ నంది రవితేజ మార్క్ భారీ కమర్షి యల్ చిత్రంగా తీర్చిదిద్దారు. ఈ రెండు చిత్రాలూ ఒకేరోజు విడుదలైతే వసూళ్లు డివైడ్ అవుతాయి. ఫలితంగా సినిమాలు పూర్తిస్థాయి బాక్సాఫీస్ సత్తా చాటుకొనే వీలుండదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఉభయతారకంగా ఉండేలా, రాధామోహన్ ‘బెంగాల్ టైగర్’ను వాయిదా వేసుకున్నారు. డిసెంబర్ 10వ తేదీని రిలీజ్ డేట్‌గా ఖరారు చేశారు. మధ్యలో డిసెంబర్ 4 శుక్రవారమైనా, ‘శంకరాభరణం’ రిలీజ్‌కు ఉండడంతో 10వ తేదీకి వస్తున్నారు. ప్రకటించిన డిసెంబర్ 4కే... ‘శంకరాభరణం’ నిఖిల్, నందిత జంటగా కోన వెంకట్ సమర్పణలో ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. టైటిల్ ప్రకటన నుంచే ఈ చిత్రం అందరి దృష్టినీ ఆకట్టుకోగలిగింది. మంచి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఈ సినిమాకు న్యాయం జరుగుతుందన్నది కోన వెంకట్ అభిప్రాయం. ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ ఒకే రోజు రిలీజై, ఒకదానికి మరొకటి పోటీ కావడం కరెక్ట్ కాదని నిర్మాతలు ఒక అంగీకారానికి వచ్చారు. ‘సైజ్ జీర్’ డేట్‌తో క్లాష్ కాకుండా చూసుకున్న నిర్మాత రాధామోహన్ ‘శంకరాభరణం’తో కూడా డేట్స్ క్లాష్ లేకుండా సహాయపడ్డారు. ఫలితంగా, ముందుగా ప్రకటించిన డిసెంబర్ 4నే ‘శంకరాభరణం’ వస్తుంది. ఆ వెంటనే 10న ‘బెంగాల్ టైగర్’ పలకరిస్తుంది. మొత్తం మీద ఇరవై రోజుల గ్యాప్‌లో ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’, ‘శంకరాభరణం’ తెర మీదకొచ్చేస్తాయ్. ఒకే తేదీకి ఒకదానిపై మరొకటి పోటీ పడకుండా జాగ్రత్త పడ్డాయి. వసూళ్ళు డివైడ్ కాకుండా, ఒక వారం పాటు ఏ సినిమాకు ఆ సినిమాకు పూర్తి ఎడ్వాంటేజ్ ఉండేలా ఈ మూడు చిత్రాల నిర్మాతలూ కలసి ఒక నిర్ణయానికి రావడం విశేషమే. సోమవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరీ పీవీపీ, రాధామోహన్, కోన వెంకట్లు తమ చిత్రాల విడుదల తేదీలను ప్రకటించారు. అవగాహనతో ఉంటే... అందరికీ లాభం! ప్రస్తుతం ఏ సినిమా స్పాన్ అయినా వారం రోజులు మాత్రమే ఉంటోంది. అందుకే మేము ముగ్గురం కలిసి, మాట్లాడుకున్నాం. రాధామోహన్ రియల్ హీరో అనాలి. ఎందుకంటే, ‘అఖిల్’ చిత్రం కోసం ఆయన ‘బెంగాల్ టైగర్’ విడుదలను వాయిదా వేశారు. నవంబర్ 27న విడుదల చేయాలనుకున్నారు కానీ, అప్పటికే మేం విడుదల తేదీ ప్రకటించేశాం. దాంతో మళ్లీ వాయిదా వేశారు. ‘శంకరాభరణం’ కోసం ఏకంగా డిసెంబర్ 10ని విడుదల తేదీగా ఫిక్స్ చేశారు. నిర్మాతలందరూ ఇలా మంచి అవగాహనతో ముందుకెళితే అందరికీ మంచి జరుగుతుంది - పొట్లూరి వి. ప్రసాద్ నిర్మాతలందరూ బాగుండాలి! అసలు ఈ నెల 5న ‘బెంగాల్ టైగర్’ని విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘అఖిల్’ సినిమా పోస్ట్‌పోన్ అయింది. మా సినిమాకూ, ‘అఖిల్’కూ డిస్ట్రిబ్యూటర్స్ ఒకరే కావడంతో మా చిత్రాన్ని అనివార్యంగా 27కి వాయిదా వేశాం. ఆ డేట్ అనుకు న్నాక ‘సైజ్ జీరో’ గురించి తెలిసింది. పీవీపీగారు కలిసి, మాట్లాడిన తర్వాత ఓ అవగాహనకు వచ్చాం. మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని మా ‘బెంగాల్ టైగర్’ని డిసెంబర్ 10న రిలీజ్ చేస్తున్నాం. నిర్మాతలందరూ బాగుండాలన్నది నా ఆకాంక్ష. - కేకే రాధామోహన్ ఆ అపోహ వద్దు! ఒకేరోజు రెండు, మూడు సినిమాలు విడుదలైతే థియేటర్ల విషయంలో కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. అందుకే క్లారిటీగా మేం నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 20న ‘శంకరాభరణం’ను విడుదల చేద్దామనుకున్నాం. కానీ, ‘సైజ్ జీరో’, ‘బెంగాల్ టైగర్’ చిత్రాల విడుదల ఉండటంతో డిసెంబర్ 4కి వాయిదా వేశాం. రాధామోహన్‌గారు పెద్ద మనసు చేసుకుని ‘బెంగాల్ టైగర్’ని వాయిదా వేశారు. ఒక సినిమా వాయిదా పడిందంటే.. కచ్చితంగా రీషూట్ చేయడం కోసమే అని అపోహపడే అవకాశం ఉంది. కానీ, అలాంటిదేమీ లేదు. కేవలం మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకునే మేం ముగ్గురం కలసి ఈ నిర్ణయం తీసుకున్నాం. - కోన వెంకట్