Acharya and Bheemla Nayak Movies New Release Dates Announced - Sakshi
Sakshi News home page

Acharya Movie: ‘ఆచార్య, భీమ్లా నాయక్’ రిలీజ్‌ డేట్స్‌ కూడా వచ్చేశాయి

Published Mon, Jan 31 2022 6:55 PM | Last Updated on Mon, Jan 31 2022 7:16 PM

Acharya And Bheemla Nayak Movies New Release Dates Announced - Sakshi

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రావాల్సిన పాన్‌ ఇండియా చిత్రాలు, భారీ బడ్జెట్‌, పెద్ద సినిమాలు కరోనా కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దీంతో ప్రేక్షకులు ఈ సంక్రాంతికి చిన్న సినిమాలతో సరిపెట్టుకున్నారు. ఇక కరోనా కేసులు తగ్గుముఖం పడ్డనుండటంతో వాయిదా పడ్డ పాన్‌ ఇండియా, భారీ బడ్జెట్‌ చిత్రాల విడుదల తేదీలను వరసగా ప్రకటిస్తున్నారు మేకర్స్‌. ఇప్పటికే ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ రిలీజ్‌ డేట్‌ను జక్కన ప్రకటించగా.. తాజాగా మెగాస్టార్‌ చిరంజీవి ఆచార్య మూవీ రిలీజ్‌ డేట్‌ను కూడా వెల్లడించింది ఆ చిత్ర బృందం.

'ఆర్ఆర్ఆర్' మార్చి 25న వస్తుండగా.. చిరు, చరణ్‌ల 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుందని తాజాగా మేకర్స్‌ అధికారిక ప్రకటన ఇచ్చారు. తొలుత ఫిబ్రవరి 4న రిలీజ్ డేట్‌ను ఖరారు చేసిన ఆచార్య దర్శక-నిర్మాతలు కరోనా కారణంగా ఏప్రిల్ 1 అని నిర్మాతలు లోగడ ఎనౌన్స్ చేశారు. ఇక పలు చర్చల అనంతరం చివరకు విడుదల తేదీని ఏప్రిల్ 29కి నిర్ణయించి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణంలో చర్చలు జరిగిన పిమ్మట, పరస్పర అవగాహన, అంగీకారంతో ఓ నిర్ణయానికి వచ్చినట్టు చిత్ర నిర్మాణ సంస్థ వివరించింది.

చిరంజీవి, రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే నటించిన 'ఆచార్య' చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహించగా.. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై తెరకెక్కించారు. ఇదిలా ఉంటే పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ భీమ్లా నాయక్‌ మూవీ రిలీజ్‌పై కూడా తాజాగా మేకర్స్‌ ఓ క్లారిటీ ఇచ్చారు. అంతా బాగుంటే ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని, లేదా ఏప్రిల్‌ 1వ తేదీకి విడుదల చేస్తామంటూ కొద్ది సేపటి క్రితం భీమ్లా నాయక్‌ మేకర్స్‌ ట్వీట్‌ చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement