
Nani Ante Sundaraniki Release Date: గత కొద్దికాలంగా సరైన హిట్టు లేక అల్లాడిపోయిన నాని 'శ్యామ్ సింగరాయ్' మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అతడి చేతిలో 'అంటే సుందరానికీ' మూవీ ఉంది. ఇందులో నాని పాత్ర పేరు ‘కస్తూరి పూర్ణ వెంకట శేషసాయి పవన రామసుందర ప్రసాద్’. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో 'రాజారాణి' ఫేమ్ నజ్రియా నజీమ్ ఫాహద్ హీరోయిన్. నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఇదిలా ఉంటే 'ఆర్‌ఆర్‌ఆర్', 'భీమ్లా నాయక్' వంటి చిత్రాలు రెండేసి రిలీజ్ డేట్లను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే కదా! ఈ నేపథ్యంలో తామేం తక్కువ కాదంటూ 'అంటే సుందరానికీ' చిత్రం కోసం ఒకటీరెండు కాదు, ఏకంగా ఏడు రిలీజ్ డేట్లు ప్రకటించాడు నాని. ఏప్రిల్ 22, ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10.. వీటిలో ఏదో ఒక తేదీలో థియేటర్లలో అడుగుపెడతాం అంటూ స్పెషల్ పోస్టర్ వదిలాడు. 'మీరంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా? ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్‌డ్.. మెల్లగ డిసైడ్ చేస్తాం..' అని సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment