
కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్ ఏంటో చూద్దామా !
Upcoming Telugu Movies 2022: New Films Coming In 3 Months Theater: థియేటర్లలో మళ్లీ సినిమా సందడి మొదలైంది. పుష్పతో ప్రారంభమైన ఈ మూవీ ఫెస్టివల్ మే 27న విడుదలైన ఎఫ్3 (F3) కొనసాగుతోంది. పుష్ప, శ్యామ్‌సింగరాయ్, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ 2, సర్కారు వారి పాట థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. మే రెండోవారంలో సర్కారు వారి పాట ఘనంగా విడుదల కాగా చివరి వారంలో ఎఫ్3 రిలీజైంది. సర్కారు వారి పాటకు సూపర్బ్ రెస్పాన్స్ రాగా అదే తరహాలో నవ్వులు పంచే సినిమాగా ఎఫ్3 విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. మే నెల ఎఫ్3తో శుభం కార్డు పడగా.. తర్వాతి నెలల్లో వచ్చే సినిమాలకు ఆహ్వానం పలికేందుకు మరింత ఆసక్తితో ఉన్నారు ప్రేక్షకులు.
కేవలం వచ్చే జూన్ నెల మాత్రమే కాకుండా 3 నెలల్లో అనేక సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. జూన్, జూలై, ఆగస్టు నెలల్లో అలరించేందుకు రెడీ అయినా ఆ మూవీస్ ఏంటో చూద్దామా !
జూన్:
విక్రమ్- జూన్ 3
మేజర్- జూన్ 3
అంటే.. సుందరానికి- జూన్ 10
రామారావు ఆన్ డ్యూటీ-జూన్ 17 (ప్రస్తుతానికి వాయిదా పడింది)
గాడ్సే- జూన్ 17
సమ్మతమే- జూన్ 24
జూలై:
పక్కా కమర్షియల్- జూలై 1
విరాటపర్వం- జూలై 1
రంగ రంగ వైభవంగా- జూలై 1
థ్యాంక్ యూ- జూలై 8
ది వారియర్- జూలై 14
కార్తికేయ 2- జూలై 22
విక్రాంత్ రోణ- జూలై 28
హిట్ 2- జూలై 29
ఆగస్టు:
బింబిసార- ఆగస్టు 5
యశోద- ఆగస్టు 12
ఏజెంట్- ఆగస్టు 12
మాచర్ల నియోజకవర్గం- ఆగస్టు 12
లైగర్- ఆగస్టు 25
వచ్చే మూడు నెలల్లో మొత్తంగా 19 సినిమాలు సందడి చేయనున్నాయి. అయితే జూన్ 17న రావాల్సిన రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' ఇప్పటికే వాయిదా పడింది. రిలీజ్ డేట్‌ను త్వరలో ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. ఒక వేళ ఈ సినిమా ఈ మూడు నెలల్లోనే రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాతో కలిపి వచ్చే 3 నెలల్లో మొత్తంగా 20 సినిమాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. అలాగే పైన ఉన్న సినిమా విడుదల తేదీల్లో మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు.
చదండి: చిన్నతనంలోనే వేశ్యగా మారిన యువతి బయోపిక్.. త్వరలో ఓటీటీలోకి..